సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో, తులతూగిన #నేను చుట్టూచేరిన, బంధుమిత్ర సపరివారపు జాలిచూపులకు కేంద్రబిందువుగా మారుతుంది.
కడసారి చూపులకోసం,
కొన్ని ఘడియల పాటు ఆపిఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.
మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.
మొలకు చుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి, బూడిద అవుతుంది. 1. #నేనే శాసనకర్తను, 2. #నేనే ఈ భూమండలానికి అధిపతిని, 3. #నేనే జగజ్జేతను..
అని మహోన్నతంగా భావించిన #నేను లేకుండానే,
మళ్ళీ తెల్లవారుతుంది.
రోజు మారుతుంది.
ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన #నేను కథ
అలా సమాప్తమవుతుంది.
అందుకే ఊపిరి ఆగక ముందే #నేను
గురించి తెలుసుకో అంటుంది #భగవద్గీత.
చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది,
శ్మశాన వైరాగ్యం మాత్రమే.
అది శాశ్వతం కానే కాదు.
#నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే,
పరిపూర్ణమైన 'వైరాగ్యస్థితి' సాధ్యమవుతుంది.
వైరాగ్యం = (అంటే) అన్నీ వదిలేసుకోవడం కానేకాదు.
దేని మీదా మోహాన్ని కలిగిఉండకపోవడం.
తామరాకు మీద నీటిబొట్టులా జీవించగలగడం.
స్వర్గనరకాలు ఎక్కడోలేవు.
మనలోనే ఉన్నాయి.
మనిషికి, ఆత్మదృష్టి నశించి, బాహ్యదృష్టితో జీవించడమే (అంటే) = నరకం
ఈ జీవనసత్యాన్ని తెలియచేసేదే వేదాంతం. 1. నిజాయతీగా, 2. నిస్వార్థంగా, 3. సద్వర్తనతో, 4. సచ్ఛీలతతో 5. భగవత్ ధ్యానంతో జీవించమనేదే #వేదాంతసారం. #అహం_బ్రహ్మాస్మి (అంటే) =
అన్నీ #నేనే.
అనే స్థితి నుంచి
‘తెలుగు, తమిళ భాషల్ని ఉత్తర దేశీయులకి కూడా నేర్పించాలి’ అని, భారత ప్రధాని సెలవిచ్చారు. ‘పెద్ద దానికి పెళ్లి లేదు, కడదానికి కల్యాణం’ అన్నట్టుంది. తెలుగు వాళ్లే తెలుగును పట్టించుకోకుండా వుంటే, ఇతర భాషల వాళ్లు నేర్చుకుంటారా? తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ
తెలుగుకి ఎంత గౌరవం ఇస్తున్నాయో చూస్తున్నాం. గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమం కొనసాగించాలంటున్నారు గానీ, తెలుగు గురించి కాదు. తమిళ రాష్ట్రం తమ భాషకి ఇచ్చే ప్రాధాన్యాన్ని చూసి మనం తలదించుకోవాలి. ఇంగ్లీషు దినపత్రికల్లో కూడా, ప్రభుత్వ ప్రకటనలు – పూర్తి పేజీ – తమిళంలోనే వుంటాయి.
ఎక్కడ చూసినా తమిళం ప్రముఖంగా వుంటుంది. ఆంగ్లం రెండోది. విదేశీయులు కూడా వచ్చి చదువుకుంటున్న #మధురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో బోర్డులన్నీ తమిళంలోనే వుంటాయి. కింద ఇంగ్లీషు! #తెలుగు వారికి ఆంగ్లం మీద మోజు. తెలుగు అక్కర్లేదు ఏ ఇంట చూసినా, చక్కని తెలుగు పదాలున్నా – ఇంగ్లీషే పలుకుతారు.
కృత్తికా నక్షత్రంపై #చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు. కార్తీకమాసంలో సూర్యుడు తులాసంక్రమణలో ప్రవేశించగానే గంగానదితో సరి సమానంగా సమస్త జలాలు విష్ణుమయం కావడంతో కార్తిక స్నానం చేసినవారు పుణ్యప్రదులు కావడమే కాకుండా, వాపీ కూప,
నదీ స్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన అశ్వమేధ ఫలాన్ని పొందుతారని #వసిష్ఠ మహర్షి వివరణ. చంద్రుని వారమైన #సోమవారం#శివునికి ఎంతో ప్రీతికరమైనది. కార్తిక మాసములో వచ్చే ప్రతి దినము అత్యంత పుణ్య ప్రదముగా చెప్పవచ్చు, ఈ మాసములో ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి తల మీద నుంచి స్నానం చేసి
శుభ సంప్రదాయకరమైన దుస్తులు ధరించి శివ దర్శనము కావించి ధూప దీప నైవేద్యములు సమర్పించి స్వామికి రుద్రాభిషేకం జరిపించిన, చేసిన పాపాలు పోయి మోక్ష ప్రాప్తి కలుగును అని కార్తీక పురాణాది ఇతిహాసములు తెలుపుతున్నవి. ఈ మాసంలో వస్త్రదానం, హిరణ్యదానం, కన్యాదానం, భూదానం చేస్తే విశేష ఫలితాలు
ఒక యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది.
ఆయన ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆయన భార్య చెప్పింది. “నిన్న పొరపాటున యజ్ఞ కుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది.”
ఇంటి యజమాని పరీక్షించేందుకు తానూ యజ్ఞ కుండంలో
తాంబూలాన్ని ఉమ్మేశాడు. మరుసటి రోజు మరో బంగారు ముద్ద దొరికింది. ఈ వార్త ఆనోటా ఈ నోటా పాకింది. అంతే యజ్ఞాలు చేసే బ్రాహ్మణులంతా యజ్ఞ కుండంలో ఊసేశారు. బంగారు ముద్దలు పొందారు. ఒక్క అర్క సోమయాజి తప్ప.
యజ్ఞం పవిత్రమైనది. యజ్ఞ కుండం పవిత్రమైనది. యజ్ఞం చేయడం నా ధర్మం. నా కర్తవ్యం.
బంగారు ముద్దలు వచ్చినా బ్రహ్మాండమే బద్దలైనా నేను అందులో ఉమ్మేసే ప్రసక్తే లేదు అన్నాడాయన. ఊరు ఊరంతా ధనవంతులయ్యారు. ఒక్క అర్క సోమయాజి తప్ప. ఆయన భార్యకు ఇది నచ్చలేదు. “మనమూ ఉమ్మేద్దాం. బంగారం పొందేద్దాం” అని నచ్చచెప్పింది.