#GeetaJayanti#BhagavadGita
గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు. #GeetaDay#GeetaJayanti 📖🚩
ఈ రోజు కౌరవ రాజు దృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో
శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు. ఈ ఉద్గ్రంథం మానవులకు లభించిన వరంగా భావించాలి. సుమారు 6,000 సంవత్సరాల పుర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గం లో నడిపిస్తుంది.
కాని వాస్తవంగా ఆ రోజున భగవద్గీత పుట్టలేదు, ఆవిర్భవించినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేసినాడని ఈనాడు అనగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పినాడు. కౌరవపాండవ యుద్ధం ప్రారంభమైన తరువాత పదియవనాడు ధృతరాష్ట్రుడు సంజయునితో
యుద్ధమునకు తలపడిన నావాళ్ళు అయిన కౌరవులు పాండవులు యేమి చేసిరి అని ప్రశ్న. ఆ సందర్భమున వ్యాసభగవానుడు సంజయునకిచ్చిన, ‘యుద్ధరంగమును ప్రత్యక్షముగా చూచుట’ అను వరము వలన జరిగినదంతా చూచి
#GitaJayanti
ధృతరాష్ట్రునకు వివరించినాడు. ఆ సంరద్భముననే భగవానుడు చేసిన గీతోపదేశమును కూడా సంజయుడు వివరించినాడు. ఇట్లు ఆరోజు గీతలోకమునకు వెలువడినది. అందువలన గీతాజయన్తిగా మనం జరుపుకుంటున్నాము.భగవద్గీత భగవానుడు స్వయముగా చెప్పినది.
‘గీతా సుగీతాకర్తవ్యా కిమన్యై: శాస్త్రసంగ్రహై: యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్వినిర్గతా’ అనునది గీతా ప్రశస్తి.
ఒక భగవద్గీత అధ్యయనం చేస్తే చాలు, ఇతర శాస్త్రాభ్యాసాలెందుకు, ఆ గీత పద్మనాభుని ముఖ పద్మము నుండి వెలువడినది అని భావము. అసలు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశమును
ఎందుకు చేశాడు అంటే ఇలా చె ప్తున్నారు.ఆస్థాన స్నేహకారుణ్య ధర్మాధర్మధియాకులం పార్ధం
ప్రపన్న ముద్ధిశ్య గీతా శాస్త్రం ప్రవర్తితమ్ అని అనగా ఉండకూడని చోట చూపకూడని చోట స్నేహమును కరుణ చూపుచున్నాడు అర్జునుడు. ధర్మాన్ని అధర్మముగా, అధర్మాన్ని ధర్మముగా భావించి అన్యదా జ్ఞానముతో
విపరీత జ్ఞానముతో అనగా ఒక దాన్ని ఇంకోదానిగా భావించి కలత చెందిన బుద్ధితో నున్న అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని ”శిష్యస్తేహం శాధిమాల త్వాం ప్రపన్నం” అని శరణు వేడ గా
గీతాశాస్త్రమును ప్రవర్తింపచేసినాడు.గీతా శాస్త్రమును ప్రధానముగా బోధించు తత్త్వము శరీరాత్మ విజ్ఞానము అనగా శరీరము చేసే పనితో ఆత్మకు సంబంధము లేదు. శరీరము చేసేదాన్ని ఆత్మ చేసినది అనుకోవటమే అహంకారము. శరీరమునకు కావలసిన వారిని ఆత్మకు కావలసి నవారిగా భావించుట మమకారము.
సంసారమనే సర్పాన్నికి అహంకారమమకారములు రెండు కోరలు. రెండు కోరలు తీసేస్తే పాము కాటు వేయజాలదు. అహంకారమమకారములను వదిలివేస్తే సంసారమును చేయజాలము. చేయుచున్నది నేను కాదు, భగవానుడు చేయించుచున్నాడు.
ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దాణే అర్జున తిష్ఠతి|
భ్రామయన్సర్వ భూతాని యంత్రారూఢాని మాయయా|| అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ప్రతిప్రాణి హృదయమున పరమాత్మ ఉన్నాడు. తన సంకల్పముతో సకల భూతములను యంత్రములపై ఉన్నవానిని త్రిప్పుచున్నాడు. ఇట్లు అందరి చేత అన్ని పనులను చేయించువాడతడే అన్ని ఫలితములను పొందువాడు అతడే.
అందుకే స్వామి నాకు కర్మ చేయుటలోనే అధికారము, ఫలముల యందు కాదు అన్నాడు. అన్ని పనులు చేయుచున్నది శరీరము కదా. శరీరమునకే ఫలము ఉండదు తృప్తి, సంతోషము, అనుభూతి, మనస్సునకు బుద్ధికి ఇంకా చెప్పాలంటే భావనతో ఆత్మకు అవేమీ పని చేయుట లేదే.
పని చేస్తున్నదానికి ఫలితం రావటం లేదు. ఫలితం పొందుచున్నవి పని చేయుట లేదు, ఇది యదార్ధజ్ఞానము. ఇది కలిగిన నాడు శోకము, దు:ఖము, సంతోషము కలుగవు.
అన్ని ఫలితాలు పరమాత్మవే అన్ని కర్మలు చేయించేవాడే పరమాత్మ. అతను చేయిస్తున్నాడు, దీనికి మన శరీరము సాధనము. స్పూన్ గరిటెలాగా. గరిట పాయసంలో తిప్పినా పప్పులో తిప్పినా కూరగాయితో తిప్పినా తిరగటమే దాని పని కాని ఇది తియ్యగా ఉంది ఇది కారంగా ఉన్నది అనదే.
పాయసంలో గరిటలా సంసారంలో జీవుడు తిరుగుచున్నాడు, అతనికి కష్టము లేదు సుఖము లేదని తెలియాలి. నిత్యము కార్యశీలివి కావాలి ఫలశీలికాదు. పని నీవు చేయాలి ఫలమును నాకర్పించాలి. ఫలము నాకర్పించిన నాడు పుణ్యము పాపము నీది కాదు. స్వర్గము, నరకము నీకు రాదు. నాలోకమే పరమపదమే
లభిస్తుంది. స్వార్థాన్ని వదిలిపట్టి పరార్థాన్ని, పరమార్థాన్ని భావించిన నాడు సుఖదు:ఖాలు, రాగద్వేషాలు, ఆశాపాశాలు, లాభనష్టాలు యేమీ ఉండవు. ఇవేమీకానపుడు సంతోషం యెందుకు ? విచారం యెందుకు? స్థిర చిత్తముతో, స్థిర ప్రజ్ఞుడవై వ్యవహరించుము నన్ను శరణువేడుము.
ఫలాన్ని ఇచ్చేవాణ్ణి, పనిచేయించేవాణ్ణి నేనే నీ యోగక్షేమములను నేను వహిస్తాను. ఇది గీతాసారము.గీతము సరియైన గురువుల వద్ద అధ్యయనం చేస్తే ఇది చక్కని వ్యక్తిత్వ వికాసమును కలిగిస్తుంది అందరిలోను పరమాత్మ ఉన్నాడు అని తెలిసిననాడు ఎవరినీ ద్వేషించజాలవు. అందరినీ ప్రేమిస్తావు.
ఇదియే విశ్వప్రేమ, లోకకళ్యాణము. గీతను అర్థముతో చదువువారు. వీలుకాకుంటే ఒక మూలమే చదవండి. ,గాంధీజీ విజయానికి అహింసా మార్గానికి ఆధారం గీతే. వివేకానందుని విశ్వ విజయానికి మూలము గీతయే. వల్లభాయ్ పటేల్‌ను ఉక్కు మనిషిని చేసింది, లాల్ బహుదూర్ శాస్త్రిని జైజవాన్ జైకిసాన్ అనిపించినది
గీతయే. అహింసామార్గం శాంతి మార్గానికి నిర్వచనం చెపునది గీతయే. రాజేంద్రప్రసాద్ భారత ప్రథమ రాష్ట్రపతి జేబులో గీతయే ఉండేది. జేబులో ఉండాలి మనలో ఉండాలి బుద్ధిలో ఉండాలి రోజూ ఒక శ్లోకమైనా చదువుతాము.
గీత చెప్పిన వాటిలో ఒక్కటైనా ఆచరిస్తాము అని ప్రతిజ్ఞ చేసి ఈనాటి నుండి ఆచరించాలి. ఇదే భారతీయ గీతకు చేయు నిజమైన నిస్వార్థమైన ఆరాధన. అలా చేద్దాం చేయిద్దాం.
స్ఫురత్ సహస్రార శిఖా తితీవ్రం
సుదర్శనం భాస్కర కోటి తుల్యమ్|
సురద్విషాం ప్రాణవినాశి విష్ణో:
చక్రం సదాహం శరణం ప్రపద్యే||తాత్పర్యము : రంపమునకు చివర సూదిగ ముళ్ళవలె నుండు పదునైన భాగమును ‘ఆకు’ లేక ‘అర’ అంటారు. వేలాది అరలతో ఘోరమైన అగ్రిశిఖలను క్రక్కుచూమిరుమిట్లు గొలుపు కాంతులీను
ఓ ”సుదర్శన చక్రమా!” ఎంత చూచినా తృప్తి తీరని సుందర మంగళవిగ్రహము కల్గి, దివ్య సౌందర్య రాశియగు స్వామిని దర్శింపజేయుచున్నావు, కోట్ల సూర్యులుదయించినపుడు ఉండెడి కాంతితో సాటియగు ప్రకాశము నీకున్నది. భగవదాజ్ఞానువర్తులగు దేవతలను హింసించు
పాపుల ప్రాణములను సమూలంగ పెకలించి నశింపజేయుచున్నావు. సర్వవ్యాపియగు శ్రీమహావిష్ణువు యొక్క దక్షిణ హస్తతలము నలంకరించిన నిన్ను నేనెల్లప్పుడూ శరణువేడుచున్నాను.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#DiceDay#Dice 🎲
పాచికలు🎲 చిన్నవి, విసిరివేయగల వస్తువులు, ప్రత్యేకంగా గుర్తించబడిన భుజాలతో బహుళ స్థానాల్లో విశ్రాంతి తీసుకోబడతాయి. అవి యాదృచ్ఛిక సంఖ్యలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడతాయి మరియు సాధారణంగా వైకుంఠపాలిళి ఆటలలో ఉపయోగిస్తారు.
సాంప్రదాయిక డై అనేది ఒక క్యూబ్ , దాని ఆరు ముఖాలలో ఒకటి నుండి ఆరు వరకు వేరే సంఖ్యలో చుక్కలు ( పిప్స్ ) తో గుర్తించబడతాయి.
విసిరినప్పుడు లేదా చుట్టబడినప్పుడు, డై దాని ఎగువ ఉపరితలంపై ఒకటి నుండి ఆరు వరకు యాదృచ్ఛిక పూర్ణాంకాన్ని చూపిస్తుంది, ప్రతి విలువ సమానంగా ఉంటుంది. పాచికలు పాలిహెడ్రల్ లేదా సక్రమంగా లేని ఆకృతులను కలిగి ఉండవచ్చు మరియు పిప్‌లకు బదులుగా సంఖ్యలు లేదా చిహ్నాలతో గుర్తించబడిన
వన్యప్రాణి అంటే మానవుడు మచ్చిక చేసుకోని జంతువులను వన్య ప్రాణులుగా అభివర్ణిస్తారు. నేడు ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా #WorldwildlifeConservationDay
మృగాల వల్లే మానవ మనుగడ....
క్రూర మృగాలు లేకపోతే మానవ మనుగడే లేదనడం అతిశయోక్తి కాదు. #Wildlife
వన్యప్రాణులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవనం కొనసాగిస్తాయి. వన్య ప్రాణుల సంఖ్య భూమి మీద విపరీతంగా పెరిగి వినాశనం చోటు చేసుకోకుండా క్రూర మృగాలు వన్య ప్రాణులను వేటాడుతూ పర్యావరణాన్ని సమతూకంలో ఉంచుతాయి. క్రూరమృగాలు తమ జాతి సంతతి పెరగకుండా కూడా తమవంతుగా ముందస్తు చర్యలు తీసుకుంటాయి.
తమ చుట్టు ఉన్నవాటితో సంపర్కం కొనసాగించకుండా సుదీర్ఘ ప్రాంతంలోనున్న క్రూర మృగాలతో సంపర్కం కొనసాగించి మళ్లీ తమ యథాస్థానానికి వచ్చేస్తాయి. ఒక పులి సంవత్సరానికి 52 నుంచి 60 వన్య ప్రాణులను చంపి ఆహారంగా తీసుకుంటుంది. రోజుకు పులి 7 నుంచి 8 కిలోల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటుంది.
"చీతా" (చిరుత) అనే పదాన్ని హిందీలో चीता cītā పదం మీదగా, citrakāyaḥ అనే సంస్కృత పదం నుంచి సేకరించారు, దీనికి "రంగురంగుల శరీరం" అనే అర్థం వస్తుంది.
ఏసినోనైక్స్ అనే ప్రజాతి పేరుకు గ్రీకు భాషలో "వెనక్కుతీసుకోలేని పంజా" అనే అర్థం ఉంది, #InternationalCheetahDay #Cheetah#Chita
జాతి పేరు జుబాటస్‌కు లాటిన్‌లో "జూలు కలిగిన" అనే అర్థం వస్తుంది, చీతా పిల్లలకు కనిపించే జూలుకు ఇది ఒక సూచన. #InternationalCheetahDay 🐆🐅
చీతా ను (ఏసినోనైక్స్ జుబాటస్ ) పిల్లి కుటుంబంలో (ఫెలిడే) ఒక విలక్షణమైన వర్గంగా పరిగణిస్తారు, వేగంతో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగివున్న ఈ జాతికి,
చెట్లు ఎక్కే సామర్థ్యం ఉండదు. ఏసినోనైక్స్ ప్రజాతిలో ఇప్పటికీ ఉనికిపట్టు కలిగివున్న జీవజాతి ఇదొక్కటే కావడం గమనార్హం. భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుగా చీతా గుర్తింపు పొందింది, దీని యొక్క గరిష్ఠ వేగాలు 112 and 120 km/h (70 and 75 mph) మధ్య ఉంటాయి, అయితే
#Ghantasala దేశభక్తిని రగిలించాలన్నా.. జానపదాలతో ఉర్రూతలు ఊగించాలన్నా..ప్రేమగా పాడుకోవాలన్నా..దేవుడిని భక్తిగా ఆరాధించాలన్నా... తెలుగు పద్యాలను అలవోకగా ఆలపించాలన్నా ఆయన గొంతే కేరాఫ్. గానగాంధర్వుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఆయనే ఘంటశాల వెంకటేశ్వరరావు.. ఈయన మన వాసి కావడం మనకే
గర్వకారణం.. ఈ రోజు ఆయన జయంతి ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుదాం....🎵🎶👨🎤📻🎙️
ఘంటశాల వెంకటేశ్వరరావు 1922 డిశంబర్ 4న గుడివాడ మండలం చౌటపల్లిలో ఘంటశాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుండే భజనలు, కీర్తనలు తండ్రి వెంట పాడుతూ ఉండేవారు.
తండ్రి ఆశయం నెరవేర్చాలనే లక్ష్యంతో సంగీత గురుకులంలో చేరారు. అక్కడి కట్టుబాట్లను తట్టుకోలేక తిరిగి సొంత ఊరికి వచ్చేశారు. తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళలో పని చేస్తూ సంగీతం అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పని ఒత్తిడి పెరగడంతో ఆయన సంగీత కళాశాలలో చేరాలని అనుకున్నారు.
భారత దేశములో నౌకాదళ దినోత్సవం(అంగ్లం: Navy Day) ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 వ తేదీన జరుపుతారు.దేశానికి నౌకా దళాల విజయాలు మరియు దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి జరుపుకుంటారు. భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం మరియు భారతదేశ రాష్ట్రపతి #IndianNavyDay
నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు.
17 వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి , ఛత్రపతి శివాజీ భోంస్లే
"భారత నావికా పితామహుడి" గా భావిస్తారు.
భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్రపరచుటలో మరియు ఓడరేవు సందర్శనల ద్వారా, భారతదేశం యొక్క అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటలో
ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఉమ్మడి వ్యాయామాలు, మానవతావాద మిషన్లు, విపత్తు ఉపశమనం మొదలైనవి వారి కర్తవ్యాలు.ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగుపరిచేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది.ఈ నివేదిక ప్రకారం 58,000 మంది సిబ్బంది,
ఈ రోజు జాతీయ న్యాయవాదుల దినోత్సవం, భారత ప్రప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ జన్మదినం కాబట్టి ఈ రోజున న్యాయవాద దినోత్సవం గా జరుపుకోవడం ఆనవాయితి, మొన్న నవంబర్ 26 రోజు జరిగింది న్యాయ దినోత్సవం (జాతీయ న్యాయ దినోత్సవం), రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును జాతీయ న్యాయ దినోత్సవం గా,
ప్రథమ రాష్టప్రతి బాబు రాజేంద్రప్రసాద్ జన్మ దినోత్సవాన్ని జాతీయ న్యాయవాదుల దినోత్సవంగా జరుపుతారు. #AdvocatesDay#BabuRajendraPrasad
దేశ్ అనే హిందీ పత్రిక 1924 ప్రాంతంలో నడిపిన మాజీ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్.. జర్నలిస్ట్ గా జీవించారు. న్యాయవాది (Advocate) గా జడ్జి లే
ఆయనకు సలహాలు అడిగేవారు. పేదలకు ఉచితంగా కోర్టులో వాదించేవారు.. పేదలు ఆయనను బాబు అని పిలిచేవారు. పేదవాడు కూడా ఉన్నత చదువులు చదువుకోవచ్చు ఉన్నత స్థానానికి ఎదగవచ్చు అని నిరూపించి స్వతంత్ర భారతావని కి మొదటి రాష్ట్రపతి అయ్యారు.. ఆయన జన్మదినం నేడు.