#DiceDay#Dice 🎲
పాచికలు🎲 చిన్నవి, విసిరివేయగల వస్తువులు, ప్రత్యేకంగా గుర్తించబడిన భుజాలతో బహుళ స్థానాల్లో విశ్రాంతి తీసుకోబడతాయి. అవి యాదృచ్ఛిక సంఖ్యలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించబడతాయి మరియు సాధారణంగా వైకుంఠపాలిళి ఆటలలో ఉపయోగిస్తారు.
సాంప్రదాయిక డై అనేది ఒక క్యూబ్ , దాని ఆరు ముఖాలలో ఒకటి నుండి ఆరు వరకు వేరే సంఖ్యలో చుక్కలు ( పిప్స్ ) తో గుర్తించబడతాయి.
విసిరినప్పుడు లేదా చుట్టబడినప్పుడు, డై దాని ఎగువ ఉపరితలంపై ఒకటి నుండి ఆరు వరకు యాదృచ్ఛిక పూర్ణాంకాన్ని చూపిస్తుంది, ప్రతి విలువ సమానంగా ఉంటుంది. పాచికలు పాలిహెడ్రల్ లేదా సక్రమంగా లేని ఆకృతులను కలిగి ఉండవచ్చు మరియు పిప్లకు బదులుగా సంఖ్యలు లేదా చిహ్నాలతో గుర్తించబడిన
ముఖాలను కలిగి ఉండవచ్చు. మోసం లేదా వినోదం కోసం లోడ్ చేసిన పాచికలు ఇతరులపై కొన్ని ఫలితాలకు అనుకూలంగా రూపొందించబడతాయి.
పురాణాలలో పాచికలు🎲🎲 :-
పాండవుల దాసత్వానికి కారణమైనది ద్యూతక్రీడ.దీనినే అక్షవిద్య అని కూడా అంటారు. అక్షాలు అంటే పాచికలు.
దీనివలన కష్టాల పాలైన నలుడి కధ అప్పటికే ప్రచారంలో ఉన్నది.కురు పాండవుల మధ్యన రెండుసార్లు జరిగింది - విదురుడూ శ్రీకృష్ణుడూ మాత్రమే వ్యతిరేకించారు,అందులో ధర్మాధర్మవిచక్షణని కోల్పోయి మత్తెక్కించేలా చేసే లక్షణం ఉంది గనక వూహించరాని విపరీతాలు జరగవచ్చును అనే భావంతో!
కానీ మిగులిన వారికి మాత్రం అట్లా అనిపించలేదు - కేవలం క్రీడయే కదా అని కొట్టిపారేశారు.అదీగాక అప్పటి కాలంలో ద్యూతార్జితం కూడా రాజులకు యుద్ధార్జితం లాంటిదే.మనం ఇవ్వాళ సినిమాల్లోనూ నాటకాల్లోనూ చూస్తున్నటు నాలుగు పాచికలతో ఆడే తేలికపాటి ఆట కాదు - పాచికలు,గవ్వలు,శంఖాలు వంటివాటిని
ఉపయోగించి ఆటగాడి గణితశాస్త్ర పాండిత్యానికి ప్రాధాన్యత ఉన్న సంక్లిష్టమైన ఆట.అది - తేలికపాటి ఆట అయితే చతురంగ బలాలను సమకూర్చుకుని చేసే యుధానికి సమానం యెట్లా అవుతుంది?
శ్రీవేంకటేశ్వర స్వామితో కలిసి హథీరామ్ బాబా పాచికలు అడినట్లు అనేక కథలు ఉన్నాయి.
(ఉత్తరహరివంశము. అ. 3 వ. 120-121, ఈ సందర్బములో 109 నుండి 129 వరకు ఈ పాచికల ఆటను వర్ణించినది చదువుట అవసరము.
ఈ పద్యాలలో పెక్కుపదాలు అర్థముకాని వై పోయినవి.)
ఈ యాట మన తెనుగు వారిలో విశిష్టతతో నిలిచిన దనవచ్చును. నేటికిని ఈ యాటను రెండు పాచికలతో వైదిక బ్రాహ్మణ స్త్రీ పురుషులు పలువురాడుచున్నారు. తక్కిన వర్ణములవారు పాచికలకు మారుగా 6 కాని 7 కాని గవ్వలను లొడివేయుచు ఆడుదురు.
ఆయాటను పచ్చీస్ అందురు. అనగా మన "నెత్తపు" ఆటను ముసల్మానులు స్వీకరించిరనియు, మరల వారి నుండి వారి మాటలతో మనవారు దానిని స్వీకరించి రనియు గ్రహింపవలెను. దస్, బారా, పచ్చీస్, తీస్ అను పదాలను తెనుగువారును వాడుచున్నారు. మొద లీ పద్యాలలోని వర్ణనమును తెలుసుకొందము.
ఆట ప్రారంభించు వారు "జోగిణి" దేవతకు మ్రొక్కుకొందురు. ఒక కట్టెపలకపై కోపుబలముతో ఇండ్లను గీయుదురు. ఆటగాండ్లు "స్వరము" (సూర్యచంద్రనాడులను నాసికాశ్వాసముల శాస్త్రమును) చూచుకొని ప్రారంభమందే ఎంతెంత పందెము అని నిర్ణయించుకొందురు. ఈ విధముగా రుక్మిణీకృష్ణులు నెత్తము నారంభించిరట.
ఈ యాటకు గల సంకేతములు గమనింపదగినవి. దుగ, తుగ, సత్తా, బద్రలు మున్నగు పేరులు పెట్టుకొనిరి. బద్ర అను పదమువద్ద శబ్దరత్నాకరమం దీ వివరణ నిచ్చినారు. బద్ర అన పన్నెండు. 'సొగటాలాటయందు పాచికలు రెండు. ఆ పాచిక లొక్కక్కటికి నాలుగు ప్రక్కలు,
ఒక్కొక్క ప్రక్కకు అరు నారును, నాల్గు నాల్గును, మూడు మూడును, ఒకటొకటి యనగా జతలు ఎనిమిదింటికి బొట్లు ఇరువది యెనిమిదియై యుండును.
ఆ పాచికలు రెంటిని తూనించి వేయునప్పుడు వాని పొర్లిక భేదముచేత 12, 10, 9, 8, 7, 6, 5, 4, 2 గా పందెములు తొమ్మిది పడును. కాన ఆ పందెములు తొమ్మిదియు 'అత్తీవంచిత్తిగ' అను పద్యములో చెప్పబడియున్నవి.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
వన్యప్రాణి అంటే మానవుడు మచ్చిక చేసుకోని జంతువులను వన్య ప్రాణులుగా అభివర్ణిస్తారు. నేడు ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా #WorldwildlifeConservationDay
మృగాల వల్లే మానవ మనుగడ....
క్రూర మృగాలు లేకపోతే మానవ మనుగడే లేదనడం అతిశయోక్తి కాదు. #Wildlife
వన్యప్రాణులు ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవనం కొనసాగిస్తాయి. వన్య ప్రాణుల సంఖ్య భూమి మీద విపరీతంగా పెరిగి వినాశనం చోటు చేసుకోకుండా క్రూర మృగాలు వన్య ప్రాణులను వేటాడుతూ పర్యావరణాన్ని సమతూకంలో ఉంచుతాయి. క్రూరమృగాలు తమ జాతి సంతతి పెరగకుండా కూడా తమవంతుగా ముందస్తు చర్యలు తీసుకుంటాయి.
తమ చుట్టు ఉన్నవాటితో సంపర్కం కొనసాగించకుండా సుదీర్ఘ ప్రాంతంలోనున్న క్రూర మృగాలతో సంపర్కం కొనసాగించి మళ్లీ తమ యథాస్థానానికి వచ్చేస్తాయి. ఒక పులి సంవత్సరానికి 52 నుంచి 60 వన్య ప్రాణులను చంపి ఆహారంగా తీసుకుంటుంది. రోజుకు పులి 7 నుంచి 8 కిలోల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటుంది.
"చీతా" (చిరుత) అనే పదాన్ని హిందీలో चीता cītā పదం మీదగా, citrakāyaḥ అనే సంస్కృత పదం నుంచి సేకరించారు, దీనికి "రంగురంగుల శరీరం" అనే అర్థం వస్తుంది.
ఏసినోనైక్స్ అనే ప్రజాతి పేరుకు గ్రీకు భాషలో "వెనక్కుతీసుకోలేని పంజా" అనే అర్థం ఉంది, #InternationalCheetahDay #Cheetah#Chita
జాతి పేరు జుబాటస్కు లాటిన్లో "జూలు కలిగిన" అనే అర్థం వస్తుంది, చీతా పిల్లలకు కనిపించే జూలుకు ఇది ఒక సూచన. #InternationalCheetahDay 🐆🐅
చీతా ను (ఏసినోనైక్స్ జుబాటస్ ) పిల్లి కుటుంబంలో (ఫెలిడే) ఒక విలక్షణమైన వర్గంగా పరిగణిస్తారు, వేగంతో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగివున్న ఈ జాతికి,
చెట్లు ఎక్కే సామర్థ్యం ఉండదు. ఏసినోనైక్స్ ప్రజాతిలో ఇప్పటికీ ఉనికిపట్టు కలిగివున్న జీవజాతి ఇదొక్కటే కావడం గమనార్హం. భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుగా చీతా గుర్తింపు పొందింది, దీని యొక్క గరిష్ఠ వేగాలు 112 and 120 km/h (70 and 75 mph) మధ్య ఉంటాయి, అయితే
#Ghantasala దేశభక్తిని రగిలించాలన్నా.. జానపదాలతో ఉర్రూతలు ఊగించాలన్నా..ప్రేమగా పాడుకోవాలన్నా..దేవుడిని భక్తిగా ఆరాధించాలన్నా... తెలుగు పద్యాలను అలవోకగా ఆలపించాలన్నా ఆయన గొంతే కేరాఫ్. గానగాంధర్వుడిగా చరిత్రలో నిలిచిపోయిన ఆయనే ఘంటశాల వెంకటేశ్వరరావు.. ఈయన మన వాసి కావడం మనకే
గర్వకారణం.. ఈ రోజు ఆయన జయంతి ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుదాం....🎵🎶👨🎤📻🎙️
ఘంటశాల వెంకటేశ్వరరావు 1922 డిశంబర్ 4న గుడివాడ మండలం చౌటపల్లిలో ఘంటశాల సూర్యనారాయణ, రత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుండే భజనలు, కీర్తనలు తండ్రి వెంట పాడుతూ ఉండేవారు.
తండ్రి ఆశయం నెరవేర్చాలనే లక్ష్యంతో సంగీత గురుకులంలో చేరారు. అక్కడి కట్టుబాట్లను తట్టుకోలేక తిరిగి సొంత ఊరికి వచ్చేశారు. తెలిసిన కొందరు సంగీత విద్వాంసుల ఇళ్ళలో పని చేస్తూ సంగీతం అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పని ఒత్తిడి పెరగడంతో ఆయన సంగీత కళాశాలలో చేరాలని అనుకున్నారు.
భారత దేశములో నౌకాదళ దినోత్సవం(అంగ్లం: Navy Day) ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 వ తేదీన జరుపుతారు.దేశానికి నౌకా దళాల విజయాలు మరియు దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి జరుపుకుంటారు. భారతదేశ నావికా దళం భారత సైనిక దళాల యొక్క సముద్ర విభాగం మరియు భారతదేశ రాష్ట్రపతి #IndianNavyDay
నౌకాదళానికి సర్వ సైన్యాధ్యక్షుడు.
17 వ శతాబ్దపు మరాఠా చక్రవర్తి , ఛత్రపతి శివాజీ భోంస్లే
"భారత నావికా పితామహుడి" గా భావిస్తారు.
భారత నావికాదళం దేశం యొక్క సముద్ర సరిహద్దులను భద్రపరచుటలో మరియు ఓడరేవు సందర్శనల ద్వారా, భారతదేశం యొక్క అంతర్జాతీయ సంబంధాలను విస్తరించుటలో
ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఉమ్మడి వ్యాయామాలు, మానవతావాద మిషన్లు, విపత్తు ఉపశమనం మొదలైనవి వారి కర్తవ్యాలు.ఆధునిక భారతీయ నౌకాదళం హిందూ మహాసముద్ర ప్రాంతంలో తన స్థానాన్ని మెరుగుపరిచేందుకు వేగవంతమైన పునర్నిర్మాణంలో భాగంగా ఉంది.ఈ నివేదిక ప్రకారం 58,000 మంది సిబ్బంది,
#GeetaJayanti#BhagavadGita
గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంథం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు. #GeetaDay#GeetaJayanti 📖🚩
ఈ రోజు కౌరవ రాజు దృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో
శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు. ఈ ఉద్గ్రంథం మానవులకు లభించిన వరంగా భావించాలి. సుమారు 6,000 సంవత్సరాల పుర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గం లో నడిపిస్తుంది.
కాని వాస్తవంగా ఆ రోజున భగవద్గీత పుట్టలేదు, ఆవిర్భవించినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేసినాడని ఈనాడు అనగా మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పినాడు. కౌరవపాండవ యుద్ధం ప్రారంభమైన తరువాత పదియవనాడు ధృతరాష్ట్రుడు సంజయునితో
ఈ రోజు జాతీయ న్యాయవాదుల దినోత్సవం, భారత ప్రప్రథమ రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ జన్మదినం కాబట్టి ఈ రోజున న్యాయవాద దినోత్సవం గా జరుపుకోవడం ఆనవాయితి, మొన్న నవంబర్ 26 రోజు జరిగింది న్యాయ దినోత్సవం (జాతీయ న్యాయ దినోత్సవం), రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును జాతీయ న్యాయ దినోత్సవం గా,
ప్రథమ రాష్టప్రతి బాబు రాజేంద్రప్రసాద్ జన్మ దినోత్సవాన్ని జాతీయ న్యాయవాదుల దినోత్సవంగా జరుపుతారు. #AdvocatesDay#BabuRajendraPrasad
దేశ్ అనే హిందీ పత్రిక 1924 ప్రాంతంలో నడిపిన మాజీ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్.. జర్నలిస్ట్ గా జీవించారు. న్యాయవాది (Advocate) గా జడ్జి లే
ఆయనకు సలహాలు అడిగేవారు. పేదలకు ఉచితంగా కోర్టులో వాదించేవారు.. పేదలు ఆయనను బాబు అని పిలిచేవారు. పేదవాడు కూడా ఉన్నత చదువులు చదువుకోవచ్చు ఉన్నత స్థానానికి ఎదగవచ్చు అని నిరూపించి స్వతంత్ర భారతావని కి మొదటి రాష్ట్రపతి అయ్యారు.. ఆయన జన్మదినం నేడు.