Thread on #Budget2023
ఇంకేముందీ, ఇది ఎన్నికల బడ్జెట్టు, మన నెత్తిన పాలేం ఖర్మ పంచామృతం పోస్తారని చాలా ఆశగా చూశారు చాలామంది.
చివరకు ఏమీ లేదు. ఈ తీగలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తాను.
1. జీతగాళ్ళకు ఎటువంటి కొత్త వెసులుబాటూ లేదు. 7 లక్షల వరకూ పన్ను మినహాయింపు కొత్త ఫైలింగ్ పద్ధతి ఎంచుకున్నవారికి మాత్రమే వర్తిస్తుంది. ఆ కొత్త పద్ధతి 20 లక్షల సంవత్సరాదాయం దాటిన వారికి మాత్రమే కొద్దో గొప్పో ఉపయోగం కానీ, మధ్యతరగతివారికి ఏమీ ఉపయోగం లేదు. అంతేగాక,
పాత ఫైలింగ్ పద్ధతిలో కూడా మినహాయింపులన్నీ లెక్కలోకి తీసుకుంటే 7 లక్షల కంటే ఇంకా ఎక్కువే ఆదాయం ఉన్నా కూడా పన్ను లేకుండా చూసుకోవచ్చు. మీరు రిటర్ను ఫైలింగ్ కోసం జాగ్రత్తగా సరైన పద్ధతిని ఎంచుకోండి. లేకుంటే నిండా మునుగుతారు.

2. గత రెండేళ్ళుగా చాలామంది విదేశీ ప్రయాణాలు చేయలేదు.
కారణం అందరికీ తెలిసిందే. అలాంటివారు పిల్లలకోసం, పిక్నిక్కుల కోసం విదేశీ ప్రయాణాలు రాబోయే కాలంలో కచ్చితంగా చేస్తారని ఊహించిన ప్రభుత్వం, విదేశీ టూర్ ప్యాకేజీలన్నింటిమీదా టీసీఎస్ పద్ధతిలో 20 శాతం పన్ను వసూలు చేయడానికి తెగబడింది. రిటర్ను ఫైలింగ్ వరకూ ఆ మొత్తం బ్లాక్ కావడం ఖాయం.
3. జీతగాళ్ళకు, పెన్షనర్లకు రెగ్యులర్ గా ఇచ్చే standard deduction ని 50000/- నుంచి 52500/- కి పెంచారు. ఆ 2500/- సాధారణ కుటుంబాల్లో నెలకు పెరిగే ఖర్చు. అమ్మగారు మినహాయింపుని సంవత్సరానికి పెంచారు.

4. ఎన్నో ఏళ్ళు కష్టపడి ప్రీమియం కట్టి దాచుకున్న బీమా సొమ్ము చేతికందే సమయానికి,
ఆ మెచ్యూరిటీ మొత్తం కానీ, బోనస్ కానీ, రెండూ కలిపి కానీ 5.00 లక్షలు దాటితే దాని మీద కూడా ఇకనుంచీ పన్ను వేస్తారు. మధ్యతరగతి జీవులు పొదుపు చేసుకుంటే ప్రభుత్వం వారిని ప్రోత్సహించే పద్ధతి ఇదీ. సన్మానించే మార్గం ఇదీ.

5. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పేరుతో ప్రారంభించబోయే స్కీమ్
చాలా ఉపయోగకరంగానూ, అందరూ తీసుకోదగినదిగానూ కనిపించింది.

6. చాలా వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. అది ఒకందుకు మంచిదే ఐనా, చాలా విషయాలలో అది దేశీయ ఉత్పత్తిదారులపై తీవ్రమైన చెడు ప్రభావం చూపుతుంది. వారిని నష్టాల్లోకి, నిరాశలోకి నెడుతుంది. ప్రభుత్వానికి చైనా లాంటి
దేశాలపై ఉన్నంత ప్రేమ, సానుభూతులలో దేశీయ ఉత్పత్తిదారులపై కూడా కాస్తంత ఉండి ఉంటే ఆ పని చేసేవారు కాదు. #MakeInIndia పాలసీకి ఈ నిర్ణయం పూర్తి విరుద్ధం.

7. గ్యాస్, పెట్రోల్ ధరలపై ఎటువంటి విధాన నిర్ణయమూ లేదు. ఆ రెండూ మధ్యతరగతి జీవులకు ఎలా గుదిబండలయ్యాయో కనీసం ఆయమ్మకు పట్టీ కూడా లేదు.
8. కోవిడ్ తో ప్రపంచమంతా కుదేలైపోయినా సరే, మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.00 గా అంచనా వేసుకోగలగడంలో, ఉత్పత్తిదారులు, అమ్మకందారులు, వినియోగదారులు, వీరిలో ఏ ఒక్కరికీ ప్రభుత్వం నుంచి అందిన సహాయం ఏమీ లేదు. కేవలం బ్రతుకుతెరువు కోసం పౌరులే తెగించి కష్టపడి వ్యవస్థను నిలబెట్టుకున్నారు.
9. వ్యవసాయ రంగానికి అప్పులివ్వడం (లక్ష్యం 20 లక్షల కోట్లు) పైన చూపించే శ్రద్ధ, వారి పెట్టుబడులపైన కనీస లాభం వచ్చేలా చేయడంలోనూ, ప్రభుత్వం, బ్రోకర్ల జోక్యం తగ్గించి, వారికి కనీస మద్దతు ధర వచ్చేలా చేయడంలోనూ చూపిస్తే బాగుంటుంది. వారికి అప్పులు ఎక్కువ ఇస్తే బాగుపడేది
వడ్డీల రూపంలో ఆదాయం పొందే ప్రభుత్వమే కానీ వ్యవసాయదారులు కాదు.

10. ప్రభుత్వ వెబ్ సైట్లు అన్నింటినీ కూడా, రోజులో ఏ సమయంలోనైనా కనీసం 10 శాతం చందాదారులను తట్టుకునే విధంగా బలోపేతం చేయాలి. Income Tax, Aadhaar, GST, EPF, ESI, MCA ఇలా ఏ వెబ్ సైట్ చూసినా ఎప్పుడూ ఏదో ఒక సమస్య,
ఫిర్యాదు ఉంటూనే ఉంటాయి. ప్రభుత్వం 39000 కంప్లయన్సులను తీసేసినా కూడా రాని సౌకర్యం, ప్రభుత్వ వెబ్ సైట్లన్నింటినీ సరిగ్గా నిర్వహిస్తే దానంతట అదే కలుగుతుంది. ప్రజలు అన్ని రిటర్నుల చివరి తేదీల్లోనూ ప్రశాంతంగా నిద్రపోతారు.

11. వివాద్ సే విశ్వాస్ మొదటి విడతలోనే ఘోరమైన అవినీతిని
ప్రత్యక్షంగా చూసినవాణ్ణి నేను. కనీసం ఈ రెండో విడతలోనైనా, సెటిల్మెంట్లకు అవినీతిపరులైన అధికారులను కాకుండా సరైన అధికారులను నియమిస్తే బాగుంటుంది. 95 శాతం PBG లను వెనక్కు ఇవ్వాలంటే కనీసం 10 శాతం లంచం సమర్పించుకునే నీచమైన పరిస్థితినుంచి వ్యాపారస్తులను కాపాడండి.
12. ఆరోగ్య బీమా పై, ఇన్సులిన్ వంటి జీవనాధార మందులపై GST ని పూర్తిగా మినహాయించాలి. విదేశాల్లో ఉండే హెల్త్ కేర్ సౌకర్యాలు మన దగ్గర ఎలాగూ లేవు. కాబట్టి లాబ్ టెస్టులు, మిగతా మందులన్నిటిపైన కూడా 5 శాతానికి మించి GST వసూలు చేయరాదు.
13. LED TV, మొబైల్ ఫోన్లు చౌక చేసి, అన్ని రకాల జవుళి ఉత్పత్తులు ధరలు పెంచడంలో ప్రభుత్వం ఉద్దేశ్యాలు, ప్రాధాన్యతలు ఏమిటో వాళ్ళకు భజన చేసే భక్తాగ్రేసరులకే తెలియాలి. ఏ దేశ ప్రజలకైనా ప్రాథమిక అవసరాలైన తిండి, గుడ్డ, నీడ, నీరు ఉచితంగానూ లేదా కనీస ధరలకు అందుబాటులో ఉంచలేని ప్రభుత్వం,
ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. ఆ ప్రభుత్వం మీద, ఆ పార్టీ మీద, వాటి అధినేతల మీద సామాన్య ప్రజలకు మర్యాద, మన్నన ఉండవు. హైదరాబాద్ లో మిల్లెట్ రీసెర్చి సంస్థ పెడతారట. మామూలు పప్పు ధాన్యాలే అన్నీ కిలో 100-200 మధ్యలో కొనలేనంత ధరల్లో ఉన్నాయి. ఇప్పుడు మిల్లెట్లకు ఏమి అవసరం వచ్చింది ??
14. తలసరి ఆదాయం రూ.1.97 లక్షలుగా నిర్థారించారు. అంటే నెలకు రూ.16416/- ఈ మొత్తం మధ్య తరగతి ప్రజల ఇంటి అద్దెకు కూడా సరిపోదు. ఆ సరాసరి ఆదాయానికీ, నిజంగా సంపాదించే ఆదాయాల అసమానతలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆ తేడాను తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్న, తీసుకునే చర్యలు
అసలు ఏమైనా ఉన్నాయా ? అసలు ఆ అసమానతల మీద దృష్టి సారించే ఉద్దేశ్యమైనా ఉందా కనీసం ?? సమసమాజ నిర్మాణమే ధ్యేయంగా ఏళ్ళతరబడి పోరాడి, వేలాదిమంది ప్రాణత్యాగం చేస్తే స్వాతంత్ర్యం వచ్చింది. 75 ఏళ్ళు గడిచిపోయాయి. సాధించింది ఎంత, సాధించాల్సింది ఎంత అని ఏనాడైనా, ఏ ప్రభుత్వమైనా, ఒక
నిర్మాణాత్మకమైన ఆలోచన చేశారా, ప్రణాళికలు రచించుకోవడానికీ, వాటి అమలుకూ ఉన్న తేడా ఎంతనో ఏనాడైనా తరచి చూసుకున్నారా ?? మేమేమీ ఉన్నపళంగా బిచ్చగాళ్ళను అంబానీ అదానీలుగా మార్చమని అడగడం లేదే ?? మా రోజువారీ ఖర్చు తగ్గించమంటున్నాం, మా జీవనాధారాలమీద పన్ను వేయొద్దంటున్నాం. అది కూడా చేయలేని,
అసలు ఆ దిశగా ఆలోచనే చేయలేని ప్రభుత్వం ఎందుకు ? ఎవర్ని ఉద్ధరించడానికి ??

15. గత కొన్నేళ్ళుగా ప్రతీ ఏటా MSME లకు తక్కువ వడ్డీకి అప్పులు మాత్రం ఇస్తూ ఏదో గొప్ప సహాయం చేస్తున్న బిల్డప్ ఇస్తున్నారు. ఏమిటి దానివల్ల ఉపయోగం ? ఏ ఉత్పత్తి అయినా ప్రజలకు చేరాలన్నా, అది కూడా తక్కువ ధరకు,
అందాలన్నా ముఖ్యంగా కావలసింది రవాణా ఖర్చు అందుబాటులో ఉండడం. పెట్రోలు, డీజిల్ ధరలు ఏనాడైనా అందుకు సహకరిస్తున్నాయా ?? ఆ భారం అల్టిమేట్‌గా మోస్తున్నది సామాన్య వినియోగదారుడు కాదా ? సాంకేతికంగా ఇంత అభివృద్ధి చెందాం కదా, కేవలం MSMEలకే ఫాస్ట్ ట్యాగ్ లాంటి గుర్తింపు కార్డులిచ్చి,
వారి వారి వాహనాలను కూడా ప్రత్యేకంగా గుర్తించి వారి వారి వస్తు రవాణాకు తక్కువ ధరలతో పెట్రోలు, డీజిల్ ఎందుకు అందివ్వకూడదు ? తద్వారా సామాన్య ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, ఉత్పత్తిదారుల సామర్థ్యం, టర్నోవర్ పెరుగుతాయి. ఇవన్నీ ఐఎఎస్ లు ఎవరూ ఆలోచన చేయరా ? వాళ్ళకు జీతాలు ఎందుకు మరి?
16. Unified Filing Process అనే ప్రతిపాదన చేశారు. దీన్ని నిజంగా ఎప్పటికి అమలు పరుస్తారో ఏమీ నిర్మాణాత్మకంగా చెప్పలేదు కానీ, చాలా మంచి ఉద్దేశ్యం. అతి త్వరగా అమల్లోకి తీసుకురండి.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with తెలుగు తీపి

తెలుగు తీపి Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(