ఆకాశవాణి కడప కేంద్రం వార్తలు చదువుతున్నది
మీ H. పరమేశ్వర రావు 😉 📻🎙️#RadioDay
కాంతి వేగ పౌనఃపున్యాల (Frequency)తో విద్యుత్ అయస్కాంత (Electro Magnetic) తరంగాలను మాడ్యులేషన్ చేయటం ద్వారా తీగల ఆధారము లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రసారం చేయు ప్రక్రియను #WorldRadioDay#Radio
దూర శ్రవణ ప్రక్రియ (Radio Transmission) అంటారు. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్ని రేడియో అంటారు. మొదటిరోజులలో వాల్వులను ఉపయోగించి, రేడియోలను తయారు చేసేవారు. అవి ఎక్కువ విద్యుత్‌ను వాడేవి, పరిమాణంలో కూడా చాలా పెద్దవిగా ఉండేవి. ఒక చోట మాత్రమే ఉంచి వినవలసి వచ్చేది.
1960లు వచ్చేటప్పటికి, ట్రాన్సిస్టరు కనిపెట్టబడి, ఆ ట్రాన్సిస్టర్ లను వాడిన రేడియోలు వాడకంలోకి వచ్చాయి. వీటిని ట్రాన్‌సిస్టర్ రేడియోలు అని పిలవటం మొదలు పెట్టారు. ఇవి విద్యుత్‌ను చాలా తక్కువగా వాడుకుని పనిచేయగలవు. పైగా, ఘటము (బ్యాటరీ-Battery)తో కూడా పనిచేయగలవు.
సాంకేతిక పరిజ్ఞానం పెరిగి, ఈ ట్రాన్సిస్టర్ సాంకేతిక నైపుణ్యం అభివృద్ధి చెంది, రేడియోలు పరిమాణంలో చిన్నవి, అతి చిన్నవిగా మారిపోయాయి. జేబులో పట్టే రేడియోలు (Pocket Radios) వచ్చినాయి.
ఇప్పుడు విడుదలవుతున్న ప్రతీ కంపెనీ మొబైల్స్ లోనూ రేడియో అప్లికేషను తప్పనిసరి అయిపోయింది. #WorldRadioDay📻
ఆలిండియా రేడియో ప్రభుత్వ ఆధికారిక రేడియో ప్రసార సంస్థ. ఇది భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార యంత్రాంగ ఆధ్వర్యములో స్వయంప్రతిపత్తి కలిగిన ప్రసార భారతి యొక్క విభాగము.
దూరదర్శన్ కూడా ప్రసార భారతిలో భాగమే. ఆకాశవాణి ప్రపంచములోని అతిపెద్ద రేడియో ప్రసార వ్యవస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయము కొత్త ఢిల్లీ లోని పార్లమెంటు వీధిలో భారత పార్లమెంటు ప్రక్కనే ఉన్న ఆకాశవాణి భవన్ లో ఉంది. ఆకాశవాణి భవన్ లో నాటక విభాగం,
ఎఫ్.ఎం రేడియో విభాగం మరియు జాతీయ ప్రసార విభాగాలు ఉన్నాయి.
రేడియో స్టేషన్ల యొక్క అధికారిక వెబ్సైట్లు మరియు ప్రైవేటు పోర్టల్స్పై ఇంటర్నెట్ ద్వారా రేడియోకు వినడానికి నేడు ప్రముఖంగా ఉంది, ఇక్కడ వివిధ రకాలైన రేడియో స్టేషన్లు సేకరించబడ్డాయి.
ఈ పోర్టల్లో ఒకటి భారతదేశంలో ఐదువందల వందల రేడియో స్టేషన్ల సమాచారాన్ని కలిగి ఉంది.
మీ
H. పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా..
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#InnovationDay ఇన్నోవేషన్ అంటే ఆవిష్కరణ, నవకల్పన.మారుతున్న పరిస్థితులకు సాంకేతికతను అన్వయిస్తూ ఎన్నో ఆవిష్కరణలు చేయొచ్చు.. స్వీయ అనుభవంలోంచి కావచ్చు, ఏదైనా సంఘటన నుంచి ప్రేరేపితమై కావచ్చు. మంచి మంచి ఆవిష్కరణలు చేయొచ్చు..
ఆవిష్కరణ అనగా ఎవరైనా చేసిన ఒక కొత్త విషయం.
కంప్యూటర్ ఒక ఆవిష్కరణ, ఆ సమయంలో అది మొదట చేశారు. అప్పుడు మనం అది "ఆవిష్కరింపబడినది" అని చెప్తాము. చేసిన లేదా సృష్టించబడిన కొత్త విషయాలను ఆవిష్కరణలు అంటారు. కారు ఒక ఆవిష్కరణ అది అందరికీ తెలుసు. అలాగే ఆలోచనలను కూడా ఆవిష్కరణలు అంటారు. రచయిత పాత్రదారులను ఆవిష్కరింపజేసి ఆపై వారికి
ఒక కథను ఆవిష్కరిస్తాడు. ఆవిష్కరణలు ఆవిష్కర్తలు చేస్తారు.
ఆవిష్కర్త అనగా ఒక వ్యక్తి, అతను కొత్త ఆవిష్కరణలను, పరికరాలను చేస్తాడు, అవి ఫంక్షన్ యొక్క ఒక రకాన్ని నిర్వహిస్తాయి. ఇవి చాలావరకు విద్యుత్ లేదా యాంత్రిక పరికరాలు. కొత్త ఆలోచనలను లేదా విధానాలను కనిపెట్టిన వ్యక్తిని కూడా
బాదం (ఆంగ్లం #AlmondDay) చెట్టులను విత్తనాలలోని పిక్కలకోసం పెంచుతారు.ఇది మిడిల్ ఈస్ట్ లో పుట్టి ప్రపంచమతా వ్యాపించింది.బాదం గింజలు బలవర్థకమైన ఆహారం.జలుబు,జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి.బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో
వైరల్ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది. #AlmondDay 🌰
బాదం చెట్టురోసేసి (Rosaceae) కుటుంబానికిచెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామం: పునస్ డల్సిస్ (Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి.
వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి. తినుబండారాల తయారిలో తీపి బాదంను వాడెదరు. బాదం పుట్టుక మధ్య, మరియు దక్షిణ ఆసియా దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది. బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును.
#GalileoGalilei గెలీలియో గెలీల ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త. టెలీస్కోపు (దూరదర్శిని) ను వాడుకలోకి తెచ్చాడు.గెలీలియో ఇటలీలోని పీసా నగరంలో జన్మించాడు. చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. #Galileo#Telescope
తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు. #GalileoGalilie 🔭 #Telescope
గెలీలియో కాలం అనగా 16 వ శతాబ్దం వరకు క్రీ..పూ. 4వ శతాబ్దంలో గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే ప్ర్రాచుర్యంలో ఉండేవి. సృష్టిలోని సత్యాలనన్నిటినీ స్వచ్ఛమైన ఆలోచనల ద్వారా మాత్రమే వివరించవచ్చును.
1. హిప్పోపొటామస్ ఆఫ్రికాకు చెందిన జంతువుగా పేరున్నా,సుమారు 9,000 ఏళ్ల క్రితం హిప్పోపొటామస్‌లు భారతదేశంలో అవి ఉండేవని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత అవి ఆఫ్రికావైపు వెళ్లాయని పరిశోధకుల అభిప్రాయం.మధ్యప్రదేశ్‌లోని హిప్పోపొటామస్‌లు దంతాలు బయటపడటంతో వాటిగురించి తెలిసింది.#WorldHippoDay 🦛
నీటిగుర్రం (హిప్పోపోటామస్ దినోత్సవం)
2. హిప్పోపొటామస్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద జంతువు. హిప్పోపొటామస్‌ను నీటి గుర్రం, నీటి ఏనుగు అని కూడా పిలుస్తారు. సెమీ-ఆక్వాటిక్ అంటే నీటిలో, భూమి మీద జీవించే జంతువుగా హిప్పోపొటామస్‌కు పేరు.
3. నీటిలో నివసించే జంతువుగా పేరున్నా హిప్పోపొటామస్‌కు ఈత పూర్తిగారాదు. నీటిలోపల నిద్రపోయే అలవాటున్న హిప్పో నిద్రలేవకుండానే ప్రతీ 3 నుంచి 5 నిమిషాలకోసారి శ్వాస పీల్చుకోవడానికి నీటిపైకి వస్తాయంటే ఆశ్చర్యమే.
మన తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు!!వారి కోసం ఈ కవిత!! అంకితం
జన్మ ఎత్తుతారు,జన్మనిస్తారు
ఇరువురు చేసే ప్రయాణములొో
కుటుంబాలనే ఏర్పరుస్తారు!!
పిల్లలను మెరుగుపరిచే సమయంలో
సగం జీవితాన్ని కోల్పోతారు!!
వాళ్లకో తోడును కల్పించి
ఆ జన్మాంతం వారికి తోడుగా నిలుస్తారు!! #ParentsWorshipDay
అందరూ ఉండి ఎవ్వరు లేని
అనాథలా జీవితాంతమున ఒంటరిగా జీవిస్తారు !!
ఒంటరిగా ఉండి,ఒంటరిగానే వెళ్లిపోతారు!!
మీ శరీరాలకు మృత్యువు ఉందేమో కానీ నాకు తెలిసి "అమ్మా" ,"అయ్యా" అమ్మయ్య,అనే పిలుపుకు మాత్రం అంతమె లేదు!!ఓ తల్లి తండ్రి మీకు ఇదే నా పాదాభి వందనాలు. #ParentsWorship
"మాతృదేవోభవ" పితృదేవోభవ "ఆచార్య దేవోభవ" అనే ఈ మాటలను మనం గుర్తు చేసుకుందాం!!అందరి తల్లిదండ్రులకు ఇవే నా వందనాలు!!🙏💐🙏
మాతృపితృ పూజన దినోత్సవ శుభాకాంక్షలు !!
కవి: గుణ శ్రీ.
Happy Parents Worship Day
మీ
H. పరమేశ్వర రావు, ప్రొద్దుటూరు, కడప జిల్లా...
#DonorDay 🙏
దానం ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. దానం చేసిన వ్యక్తిని దాత అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని యాచకులు అంటారు. దానం ఇచ్చేవి ధనం, వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది.
అలాగే వైద్యంలో ఒక వ్యక్తికి అవసరమైన రక్తం, వివిధ అవయవాలను #Donor
కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర, చర్మం , గుండె, మూత్రపిండం, రక్తం, వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని
దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.
రక్త దానం (Blood donation) అనేది ప్రాణ దానంతో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు.