శ్రీవారి కృపాకటాక్షాలకు ప్రాంతీయత లేక మతం ప్రతిబంధకాలు కావని, అదే విధంగా సర్వాంతర్యామి ఏ రూపంలోనైనా తనను శరణు కోరిన వారు ఎవరైనా ఎక్కడ ఉన్నా కరుణించి కష్టాల కడలి నుండి తీరం చేరుస్తారు అన్నదానికి నిదర్శనంగా నిలిచే క్షేత్రం శ్రీ బల్లిగిరి వెంకటేశ్వర స్వామి ఆలయం.
💠 విశాఖ నగర మధ్యలో ఉన్న డాభా గార్డెన్స్ ప్రాంతంలో చిన్న కొండ (స్థానికంగా వెంకటేశ్వర గుట్ట అని పిలుస్తారు)బల్లిగిరి అనే పేరు రావడానికి, ఇక్కడ బ్రహ్మాండ నాయకుడు కొలువు తీరడానికి వెనుక నాలుగు శతాబ్దాల చరిత్ర ఉన్నది అని తెలియవస్తోంది.
💠 మధ్య పర్వత శిఖరాన ప్రధాన ఆలయంతో పాటు శ్రీ అమ్మవారి ఆలయం, శ్రీ ఆంజనేయ ఆలయం ఉంటాయి.
ఈ రెండు ఆలయాలు ఉత్తర ముఖంగా ఉంటాయి.
అమ్మవారి ఆలయంలో శ్రీ వినాయక, శ్రీ దాసాంజనేయ మరియు శ్రీ సూర్యనారాయణ సన్నిదులుంటాయి
💠 ప్రధాన ఆలయంలో చాలాకాలం బల్లి రూపానికే పూజాదులు నిర్వర్తించేవారు. తరువాత శ్రీ వెంకట రమణుని దివ్య రూపాన్ని ప్రతిష్టించారు. మూల విరాట్టు పక్కనే బల్లి రూపంలో ఉన్న స్వయంభూమూర్తిని వీక్షించవచ్చును. సర్వాంతర్యామి అయిన శ్రీ హరి బల్లి రూపంలో వెలసిన క్షేత్రం ఇదొక్కటే !
ఆలయ గుమ్మం వద్ద భక్తుల సౌలభ్యం కొరకు పంచ లోహ బల్లి రూపాన్ని ఉంచారు.
💠ప్రతి నిత్యం ఎన్నో నిర్ణయించిన పూజలు జరుగుతాయి.చైత్ర మాసంలో మూడు రోజుల పాటు ఆలయ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
💠 ఈ ప్రత్యేక విశేష క్షేత్రం విశాఖ నగర డాబా గార్డెన్స్ లో ఉంటుంది. రైల్వే స్టేషన్ లేదా బస్సు స్టాండ్ నుండి సులభంగా చేరుకొనవచ్చును.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
పంచభూత లింగాలలో వాయులింగం శ్రీకాళహస్తి లో ఉన్నది.ఇక్కడి పరమేశ్వరుడు వాయువుకు ప్రతీక.వాయువు కంటికి కనిపించదు కనుక వాయువుకు సంకేతంగా గర్భ గుడిలో శివ జ్యోతి కదలడం ద్వారా శివుడు వాయువు రూపంలో వ్యక్తమవుతున్నాడని విశ్వసిస్తాం, గర్భ గుడిలోకి వేరే ఏ మార్గము ద్వారా గాలి ప్రవేశించదు
అయితే బ్రిటిషు వాళ్ళు మనలను పాలించే రోజుల్లో మన విశ్వాసాన్ని మూఢ నమ్మకంగా ఋజువు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆలయం తలుపులన్నీ ముసివేస్తే గాలి ( ఆక్సిజన్ ) అందక శివ జ్యోతి ఆరిపోతుందని చెప్పారు.అలా చేయడం ధర్మం కాదని ఎంతగా వారించినా అధికార మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసివేసారు.
24 గంటలు గడచినా గర్భ గుడిలోని శివ జ్యోతి దేదీప్యమానంగా కదులుతూ ప్రజ్వలిస్తూనే ఉన్నది.అలా పరీక్షించిన బ్రిటీషు అధికారి శరీర భాగాలు ఒక్కొకటిగా చచ్చుబడిపోతు వొంట్లోని వేడి తగ్గిపోతూ ఊపిరి అందడం కష్టమయ్యింది.
వినాయకుని అలంకారాలు. గణపతి నవరాత్రుల్లో ఈ వరసని పాటిస్తారు.
- స్వర్ణాభరణాలంకృత గణపతి
- విశ్వరూప గణపతి
- సింధూరాలంకృత గణపతి
- హరిద్రా (పసుపు) గణపతి
- రక్తవర్ణ గణపతి
- పుష్పాలంకృత గణపతి
- చందనాలంకృత గణపతి
- రజతాలంకృత గణపతి
- భస్మాలంకృత గణపతి
- మూల గణపతి.
వినాయకుని నామాలు
1. తెలుగు భారతం ప్రకారం : హేరంబ, గణనాయక, గణేశ 2. పద్మపురాణం ప్రకారం : ద్వైమాతుర, లంబోదర, గణాధిపతి, వక్రతుండ, కపిల, చింతామణి, డుంఠి 3. వేదాల ప్రకారం : బ్రహ్మణస్పతి, కవి, జ్యేష్ఠరాజు, కవీనాం కవి.
4. సంగీత శాస్త్రం ప్రకారం : పిళ్ళారి, శ్రీ గణనాథ, కరివదన, లకుమికర (లక్ష్మీకరుజడు), అంబాసుత, సిద్ధి వినాయక.
ఆత్మ నిత్యమైనది,సత్యమైనది,పవిత్రమైనది.నిత్యంగా, సత్యంగా,సమర్చనంగా ప్రకాశించే పరమాత్మ స్వరూపం. జీవితంలో ప్రతి అడుగునూ నియమానుసారంగా దైవంవైపు చేరే విధంగా వేయడమే గొప్ప ఆత్మసాధన.
ఆ ‘నేను’ అనే అహాన్ని వదిలించుకుంటే, మనని మనం ఆ పంజరం నుంచి విడుదల చేసుకుంటే ఆత్మ స్వేచ్ఛా విహంగమై అనుభవ ఆకాశంలో హాయిగా విహరించగలదు. అలా కాకుండా.. ‘నేను’పై మమకారంతో ప్రాపంచిక విషయాల మీద ఆసక్తిని, అనురక్తిని కనబరుస్తూ దైహిక సుఖాలు తీర్చుకోవడంలోనే తన్మయం చెందడం అల్పత్వం.
తనలో కలిగే కామం తాత్కాలిక సుఖాన్నిచ్చేదేగానీ శాశ్వత సుఖాలను మార్గదర్శనం చేయించేది కాదని మానవుడు గ్రహించాలి.ప్రతివారి జీవితంలో ఏదో ఒక రూపంలో,ఏదో ఒక సమయంలో విషాదం తప్పదు. మన బాధను భగవంతుడికి మొరపెట్టుకుని కష్టాల నుంచి రక్షించమని కోరడం ఆత్మఘోష.లోపలి కల్మషాలను కడిగివేసేది ఆత్మధ్యానం.
🙏🌹 శాస్త్ర వేత్తలకే అర్థంకాని శివాలయాలు 🙏🌹
🌷మహానంది🌷
🌿శివలింగ అడుగునుండి వచ్చే నీటితో కొన్నివేల ఎకరాలు పంట భూమి పండుతున్నది. బయట ఉండే కొనేరులో గుండుసూది వేసినా కనపడుతుంది. ఎంత చలికాలంలో కూడా కొనేరులో నీరు గోరు వెచ్చగా ఉంటుంది.
🌷ప్రకాశం జిల్లా🌷
🌸 పొన్నలూరు మండలం (కందుకూరు కనిగిరి మధ్య) నోటికె. అగ్రహారంలో ని కాశివిశ్వేశ్వర దేవాలయం లోని శివలింగం క్రిందనుండి నీరు ఊరుతూ ఉంటుంది. ఈ నీరు 14గ్రామాలకు తాగునీరుగా వాడుతున్నారు.
🌷ఆదిలాబాద్ జిల్లాలోని🌷
🌿 శ్రీ బుగ్గా రామేశ్వరాలయం ఈ అలయంలో శివలింగంనుండి నీరు ఊరుతూ ఉంటుంది.
🌷కరీంనగర్ జిల్లాలో కాళేశ్వర ము దేవాలయంలో నంద🌷
🌸 ఉత్తరాయణంలో ఉత్తరముఖంగాను దక్షిణాయణంలో దక్షిణ వైపు తిరుగుతారు.ఇది వండర్