విజయనగరం జిల్లా పుణ్యగిరి లోని శ్రీ ధారగంగమ్మ ఈశ్వరాలయము
పచ్చటి ప్రకృతి కొండలపై పుణ్యగిరి పరమ పవిత్రమైన క్షేత్రం. పచ్చటి ప్రకృతి మధ్య కొండలపై పరమేశ్వరుడు ఉమా కోటిలింగేశ్వర స్వామిగా వెలసి భక్తుల నీరాజనాలందుకుంటున్న అద్భుత పుణ్యక్షేత్రం.
ముఖ్యంగా కార్తీక మాసంలో ఈ క్షేత్ర పరిసరాలన్నీ వనభోజనాలకు వచ్చే వారితోనూ, పర్యాటకుల శివనామస్మరణతో మారు మోగిపోతాయి. పరమేశ్వరుని దర్శనంతో జన్మ పునీతం చేసుకోవాలన్న తలంపుతో వచ్చే భక్త జనులతో పుణ్య గిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతం కిక్కిరిసిపోతుంది.
ఈ ఆలయం పర్వత పంక్తి నుండి వచ్చే జలధారపై నిర్మింపబడినది కనుక ధారగంగమ్మ ఈశ్వరాలయముగా పేరుగాంచినది.
ఇది తొలుత ధారగంగమ్మ ఆలయం, ఆ తరువాత ఇచట ఈశ్వరుడు గూడ ప్రతిష్టింపబడ్డాడు.
అందుచే ఈ ఆలయాలు ధారగంగమ్మ, ఈశ్వరాలయముగా ప్రసిద్ధమైనది
ఇక్కడ కోటిలింగాలు, గొడుగుల దార అనే ఎండు స్నానఘట్టాలున్నాయి. అతి పురాతనమైన శివాలయంలోని లింగం క్రింద భూమిలో నీరు ఊరుతూ ఉంటుందని లింగం ఎల్లప్పుడు అభిషిక్తమైనట్లు కనపడుతూ ఉంటుంది. త్రిమూర్తి గుహల వద్ద మూడు లింగములు ప్రతిష్ఠింపబడినాయి. అవి నీటిలో మునిగి ఉంటాయి.
ఉత్తరాంధ్రలో పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఉమాకోటిలింగేశ్వరస్వామి ఆలయం ఒకటి.
ఇక్కడ ఋషులు తపస్సు చేసి పరమేశ్వరుని సాక్షాత్కారం పొందారు. అనంతరం ఇక్కడ శివుడు లింగరూపంలో ఆవిర్భవించాడని పూర్వీకుల కథనం.
ఇక్కడ విరాట్‌రాజు కొలువు ఉండేదని, ఆ కొలువులోనే పాండవులు అజ్ఞాతవాసం గడిపారని పౌరాణిక గాథల వల్ల తెలుస్తుంది.
ఆ సమయంలో పాండవులు ప్రతి రోజూ ఇక్కడ జలధారలలో స్నానమాచరించి, పరమేశ్వరుని ఆరాధించేవారని భక్తుల విశ్వాసం.
ఇక్కడ తలస్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.
మహా శివరాత్రి రోజున జలధారల కింద స్నానాలు చేసి పరమేశ్వరుని దర్శించుకొని జాగరణ చేసినట్టయితే సర్వపాపాలు తొలగిపోవడమేగాకుండా కైలాస ప్రాప్తి లభిస్తుందన్నది భక్తుల నమ్మకం.
ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు మూడు రోజుల పాటు ఉత్సవాలకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు ఎక్కువగా శ్రీ ఉమాకోటి లింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు.
దాదాపుగా ఈ మూడు రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు వస్తారని అంచనా.
ఈ పుణ్యగిరి క్షేత్రంలో వెలసిన కోటిలింగాలు, త్రినాథ గుహ, ధారగంగమ్మ జలపాతం అతి ముఖ్యమైన దర్శనీయ స్థలాలు. పుణ్యగిరిలో ప్రముఖంగా దర్శించాల్సిన పుణ్యస్థలం ధార గంగమ్మలోవ, పుణ్యగిరికి కొండపై గల శ్రీ ఉమా కోటిలింగేశ్వర దేవాలయానికి 5 కిమీ దూరంలో విరాటరాజు నిర్మించినట్టు చెప్తున్న మట్టి కోట
ఆ కొండ మీద నుంచి ధారగా వచ్చే జలాన్ని దేవతగా పూజించేవారట. ఆ జలధారే నేడు ధారగంగమ్మగా భక్తుల పూజలందుకుంటోంది.
భక్తుల కోర్కెలు నెరవేర్చే తల్లిగా శృంగవరపుకోట గ్రామ దేవతగా ఈ ప్రాంత ప్రజల నీరాజనాలందుకుంటోంది.
ఇక్కడ మరొక విశిష్టత అస్థిక మంటపం. సహజసిద్ధంగా వెలిచి కోటి లింగాలుగా పిలవబడుతున్న ఇక్కడ శివలింగాలు ఊర్ధ్వ దిశలో ఉంటాయి. పై నుంచి నీరు నిరంతరం పడుతూ ఉంటుంది. ఆ నీటిలోనే చనిపోయిన వారి అస్తికలను నిమజ్జనం చేసి పితృకార్యాలు చేస్తుంటారు. అందుకనే దీనికి అస్థిక మంటపంగా పేరు స్థిరపడింది.
పుణ్యగిరి ఆలయం.. విజయనగరానికి 35 కిమీ, శృంగవరపు కోటకు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. #మనదేవాలయాలు
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
విజయనగరం జిల్లా రామతీర్ధం శ్రీ రామచంద్రమూర్తి ఆలయం. సాధారణంగా శ్రీరామ కళ్యాణం ఏడాదికి ఒకసారి శ్రీరామనవమి రోజు అభిజిత్ లగ్నం అందు దేశంలోని వివిధ రామాలయాలలో కళ్యాణ మహోత్సవం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఏడాదికి రెండుసార్లు కళ్యాణం జరిగే రామాలయం ఇది #మనదేవాలయాలు
రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు.
సీతారాముల విగ్రహాలను మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు రామతీర్థంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించడం వల్ల ఏటా భీష్మ ఏకాదశి రోజు సీతారాముల వారికి ఎంతో అంగ రంగ వైభవంగా తిరుకళ్యాణ మహోత్సవాన్ని జరిపించడం ఆనవాయితీగా వస్తోంది
పల్నాడు జిల్లా చామర్రు గ్రామములో ఫలు దేవాలయాలను జీర్ణోద్ధరణ సాగించి నిత్య దీప ధూప నైవేద్యాలతో నిర్వహిస్తున్నాము.ఇక్కడే రాజా వేంకటాద్రి నాయుడు ప్రతిష్ఠ చేసిన,ప్రస్తుతము శిధిలం అయిన ప్రాచీన లక్ష్మణేశ్వర ఆలయము మీద పరిశోధన నిర్వహిస్తున్నగ్రామస్థులు,చామర్రు రూరల్ డెవలప్మెంట్ సభ్యులు
దేవాలయం పూర్తిగా దెబ్బతిన్నది.శిధిలం కాలేదు. ఇంకా క్లీనింగ్ జరగాలి. అది 80 సెంట్స్ అని రెవెన్యూ రికార్డ్స్ తెలియబరుస్తున్నాయి;
ఈ పరిశోధనలో ప్రాచీన కాలము లో వున్నాయి అని చెప్పపడుతున్న వీర శిలలు బయట పడ్డాయి.
ఆంజనేయస్వామి గురించి కొన్ని విశేషాలు 🚩🙏
🚩 ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు శనివారం, మంగళవారం మరియు గురువారం
🚩 స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు 1. తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు.
2. మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం. 3. పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు. 4. తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికికూడా ఇష్టమైనది
అన్ని జన్మలలోను - ఏది ఉత్తమమైనది
అన్ని జన్మలలోను మానవజన్మ మాత్రమే ఉత్తమమైనది, దుర్లభమైనది.
అసలు జన్మలు 3 రకాలు..! 1) దేవజన్మ 2) మానవజన్మ 3) జంతుజన్మ.
మానవుడు తన జీవితకాలంలో అనేక కర్మలను చేస్తుంటాడు. ఆ కర్మలకు ఫలితాలను అనుభవించాలి.
వాటినే కర్మఫలాలు అంటారు...
అనేక జన్మలలో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తుంటాయి. పుణ్యపాపకర్మలఫలాలు మిశ్రమంగా పక్వానికి వచ్చినప్పుడు ఆ జీవుడు మానవ జన్మనెత్తటం జరుగుతుంది.
ఈ జన్మలలో పుణ్య కర్మఫలాల కారణంగా సుఖాలు, భోగాలు, ఆనందం అనుభవిస్తాడు.
పాపకర్మఫలాలకారణంగా దుఃఖాలు, బాధలు అనుభవిస్తాడు
కర్మఫలాలనుభవించటం మాత్రమే గాక, కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా ఈ మానవజన్మలోనే ఉన్నది.
ఎందుకంటే స్వతంత్రంగా బుద్ధితో ఆలోచించి శరీరంతో కర్మలు చేయటానికి వీలుగా శరీరం, మనస్సు, బుద్ధి అనే 3 సాధనాలు ఉన్న జన్మ ఇది.
మనలో చాలామంది స్వీట్సు తింటే డయాబెటిస్ వస్తుంది.. కావున స్వీట్లు తినకూడదు అని అనడం గమనిస్తాము.. మరికొందరు ఇక షుగర్ జబ్బు వచ్చింది స్వీట్లు తినరాదు అనడం గమనిస్తాము.. కాని స్వీట్లు తినడం వలన షుగర్ జబ్బు రావడం అనేది ఒక అపోహ మాత్రమే,..
అలాగే షుగర్ పేషెంట్లు స్వీట్లు తినకపోవడం మంచిదే అయినా మరీ నోరుకట్టుకొని తినకపోవడం సాధ్యము కాకపోవచ్చు...
షుగర్ జబ్బు అనేది మనలో ఇన్సులిన్ ఉత్పత్తి సామర్ధ్యం తగ్గినపుడు షుగర్ యొక్క వినియోగం శరీరం సెల్సులో తగ్గడం వలన రక్తంలో చక్కెర మోతాదు పెరగడం ను డయాబెటిస్ అంటారు,.. కాని ఇది ఓ లక్షణం మాత్రమే,. ఇది మెల్లిగా పెద్ద ఎండోక్రైనల్ మరియు బయొలాజికల్ సమస్య అయి కూర్చుంటుంది,..