కర్నూలు రాజ్య రక్షణకై రణరంగాన వీరమరణం పొందిన కడప రాజు - మట్ల తిరువెంగళనాథ రాజు
మట్ల తిరువెంగలనాథుడు తండ్రికి మట్ల అనంతరజుకు తగ్గ మానధనుడు. ఒకనాడు కందనూరి (కర్నూలు) రాజు ఆరవీటి గోపాలరాజు తిరువెంగళనాథుడితో - మీ తాత(మట్ల ఎల్లమరాజు), తండ్రి(మట్ల అనంతరాజు)
గొప్ప పరాక్రమవంతులు. నీవు చిన్నవాడివి. అనవసరపు శౌర్య ప్రదర్శనకు యత్నించకుండా సమయోచితానుసారము కాలము గడిపితే మంచిది అని హితువు చెప్పగా ఆ మాటలగొకు నొచ్చుకున్న తిరువెంగళ హనాథరాజు కందనూరు గోపాలరాజుతో మీరు మమ్మల్ని బాలురుగా అనుకున్నప్పటికీ మీ వంటి వారికి శత్రువుల నుండి ప్రమాదం
పొంచి ఉన్నప్పుడు మీ వైపున నిలవడానికి మేము వెనుకాడము అని చెప్పినాడట. వెంకటపతిరాయల నిర్యాణం అనంతరం శక 1541 సిద్ధార్థి సంవత్సరంలో బీజాపూరు సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా తరపున అబ్దుల్ హుస్సేన్, అబ్దుల్ మహమ్మద్, అబ్దుల్ వహాబ్ ఖాన్ అనే 3 సర్దార్లు సైన్యంతో కర్నూలు కోటను చుట్టుముట్టగా,
కర్నూలు కోట అధిపతి అయిన గోపాలరాజు మట్ల తిరువెంగళనాథరాజు సహాయం, కోరగా మట్ల తిరువెంగళనాథ దేవచోడ మహారాజు తన కుమారుడు కుమార అనంతరాజుకి రాజ్య భారం అప్పగించి సైన్యముతో కర్నూలు రాజ్యాన్ని బీజాపూరు సైన్యము నుండి కాపాడటానికి గోపాలరాజు సైన్యానికి సహాయముగా వెళ్లినాడు.
బీజాపూరు సైన్యం దాటికి తాళలేక యుద్ధరంగం నుండి హండేవారు (అనంతపురం ప్రభువులు) మరియు ఇతర రాజ్యాల సైన్యం నుంచి నిష్క్రమించినా మట్ల తిరువెంగళనాథరాజు అలియ రామరాజు మాదిరి యుద్దరంగమందే వీరమరణం పొందుతాను కానీ శత్రువులకు వెన్ను చూపడం అంటూ ఉండదని చివరి వరకు పోరాడి
సిద్ధార్థి నామ సంవత్సరం మాఘ బహుళ ఏకాదశి నాడు (02.02.1620?) బహమనీ సుల్తానుల చేతిలో వీర స్వర్గం పొందినాడు.
ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్ద బండను తలయేరు గుండు అంటారు అలిపిరి నుంచి తిరుమల వెళ్లే కాలినడక మార్గంలో ప్రథమ గోపురం దాటిన తరువాత ఈ తలయేరు గుండును చూడవచ్చు. తలయేరు అంటే తలనొప్పి అని అర్థం. ఏడుకొండలు ఎంతో శ్రమతో ఎక్కి, దిగే భక్తులకు తలనొప్పి, ఒంటినొప్పులు మోకాళ్ల నొప్పులు
వంటివి రాకుండా ఉండడానికి తమ తలను మోకాళ్ళను ఆ గుండుకు తాకించి చిన్నగా రుద్దుతారు అలా చేస్తే ఒంటినొప్పులు రావని ఉన్న నొప్పులు పోతాయని భక్తుల నమ్మకం. అలా అనేక శతాబ్దాలుగా భక్తులు తమ తల, మోకాళ్లు ఆ గుండుకు ఆనించి ఆనించి ఏర్పడిన గుంతలను మనం నేటికీ చూడవచ్చు. దీనికే మరొక కథ కూడా ఉంది
మాదిగ రామయ్య అనే శ్రీవారి భక్తుడు స్వామివారికి ముత్యాలు గవ్వలు వంటివి జోడించి ఎంతో అందంగా చెప్పులు కుట్టించేవాడు. ఏదో కారణం వలన ఆ చెప్పులు కుట్టే పనికి ఆటంకం ఏర్పడింది. ఆ బాధతో ఆ వృత్తి వారు అక్కడున్న రాతిబండకు తలలు బాదుకోవడం వలన ఆ బండకి గుంతలు ఏర్పడి అదే తలయేరు బండ అయ్యింది
ప్రతీ రోజూ రాత్రి తిరుమల శ్రీవారు పవళింపు సేవ అయిపోయాక, ఆనందనిలయానికి బీగం (తాళం ) వేసి కిందకి నడక మార్గాన వస్తూ అవ్వాచారికోన అక్కగార్లకు బీగించెవులు(తాళం చెవి) ఇచ్చి అలా కిందకి నడుచుకుంటూ వచ్చి అలిపిరి దగ్గర ఉన్న పాదాల మండపంలో ఉన్న తన మెట్లు(చెప్పులు)
వేసుకుని అలా నేరుగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వద్దకు వెళ్లి, రాత్రి అమ్మవారితో ఉండి తిరిగి ఉదయాన పాదాల మండపంలో చెప్పులు వదిలి నడుచుకుంటూ పైకి ఎక్కి అక్కగార్ల వద్ద బీగించెవి తీసుకుని సుప్రభాత వేళకు ఆనంద నిలయం చేరుకుంటాడట. అలా స్వామి కూడా కొండను చెప్పులు లేకుండానే ఎక్కుతాడని
స్వామి వారి ఆలయ బీగించెవులకి అవ్వాచారి కోన అక్కగార్లు కాపలాగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈసారి మీరు తిరుమల కాలినడక మార్గాన వెళ్ళినప్పుడు మోకాళ్ళ పర్వతానికి ముందు ఘాట్ రోడ్లో వచ్చే అక్కగార్లను దర్శించి వారి ఆశీస్సులు తీసుకోండి
మూలం: తిరుపతి కథలు - ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి
కడప జిల్లాలోని కమలాపురం మరియు కమలాపురం చుట్టుపక్కల చాలా ప్రధాన గ్రామాలు బ్రాహ్మణులకు, కవులకు లేదా ఆలయాలకు సర్వమాన్యాలుగా / అగ్రహారాలుగా ఇవ్వబడిన గ్రామాలు. వీటిల్లో అనేక గ్రామాలకు ఇప్పుడున్న పేరు కాకుండా దానసమయంలో ఇవ్వబడిన పేర్లు ఉండేవి -a 🧵
1. కమలాపురం-మండల/తాలూకా కేంద్రం
పుష్పగిరి క్షేత్రం ఉన్న కుసుమాచల పర్వతానికి పశ్చిమాన పాపాగ్ని పాగేరు అనే నదుల మధ్య ఉండే కమలాపురం గ్రామం పుష్పగిరిలో ఉన్న బ్రహ్మదేవ ప్రతిష్ట కమలేశ్వర స్వామికి పడితరానకు నడిచేది. పుష్పగిరిలోని కమలేశ్వర స్వామి పేరిటే ఈ ఊరికి కమలాపురం అనే పేరొచ్చింది
2. కోగటం / కోకటం
ఇతర పేర్లు : కమలాజీపురం, శఠగోపపురం
విజయ సింగ్ మహారాజు వకీలు కమలాజీ అనే అతను ఈ గ్రామాన్ని అగ్రహారంగా చేయించాడని అక్కడ స్థలీకులు చెప్పుకుంటున్నారు. కృష్ణదేవరాయల కాలంలో ఈ కూకటం గ్రామాన్ని అల్లసాని పెద్దనకి సర్వమాన్ని అగ్రహారంగా ధారపోసి ఇచ్చినాడు
This set of copper plate is recovered recently during the course of renovation work in Ghanṭā-maṭhaṁ at Śrīśailam, Kurnool district, Andhra Pradesh.
It is dated Śōbhakṛt, Vaiśākha, śu. 15, written in Sanskrit language and Nāgarī characters of the 15th-16th century C.E.
It records the gift of a village Yaḍadapura situated in Yalabarga for providing food offerings, burning perpetual lamp and conducting festivities to the god
Siddhēśvara in the village by the king Chāḷukya Kōpaṇāśraya, son of Satyapratāpa, grandson of Kōpaṇa, on the occasion of Vaiśākha Pūrnima. The villages Sōḍapalli, Balagere and Būdiguppa are mentioned as the boundaries of the gifted village.