స్థానిక చరిత్రలు ఒంటిమిట్ట కోదండ రామాలయం బుక్కరాయల సోదరుడు / కుమారుడు కంపరాయలు కట్టించినట్టు చెబుతాయి. అయితే ఒంటిమిట్ట కైఫీయత్తు మాత్రం ఒంటిమిట్ట ఆలయాన్ని సంపెట నల'కంపరాయలు' కట్టించినట్టు చెబుతుంది. శాసన, కైఫీయత్తుల ప్రకారం సంపెట నలకంపరాయలు
కృష్ణదేవరాయలు - అచ్యుతదేవరాయల కాలం నాటి సామంత రాజు (పైన పేర్కొన్న బుక్కరాయల కంపరాయలకు సుమారు 200 సంవత్సరాల తరువాత వాడు).
ఆలయం కట్టించినది సంగమ వంశ కంపరాయలా (14వ శతాబ్దం) లేక సంపెట వంశ కంపరాయలా (16వ శతాబ్దం) అన్నది తేల్చడానికి ఎటువంటి శాసన ఆధారాలు లేవు.
ఒంటిమిట్ట ఆలయం గురించి పేర్కొన్న మొదటి శాసనం సదాశివరాయల కాలంలో శక 1472/ప్ర.శ 1550 పులపత్తూరు శాసనం. సంగమ కంపరాయలు ఈ ఆలయం కట్టించినట్లైతే సుమారు 200 సంవత్సరాల వరకు ఎందుకని ఈ ఆలయానికి సంబంధించిన శాసనాధారాలు లేవన్న ప్రశ్నకు సమాధానం లేదు. 16వ శతాబ్దంలో సంపెట కంపరాయలు కట్టించినట్లయితే
కృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకరైన అయ్యలరాజు రామభద్రుడి ముత్తాత అయ్యలరాజు తిప్పకవి (15వ శతాబ్దం) (ఒంటిమిట్ట రఘువీర శతకకర్త) రచనలు మరియు అన్నమయ్య కీర్తనల (15వ శతాబ్దం) ద్వారా 15వ శతాబ్దం నాటికే ఒంటిమిట్ట ఆలయం ప్రఖ్యాతిగాంచిన ఆలయంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ పరస్పర విరుద్ధ ఆధారాల వలన ఒంటిమిట్ట ఆలయాన్ని ఎవరు నిర్మించారని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే అన్నమయ్య కీర్తనలలో ఒంటిమిట్ట కోదండరాముని ప్రస్తావన ఉంది కనుక 14వ శతాబ్దంలో సంగమ కంపరాయలే ఆలయం నిర్మించాడని భావించాల్సి ఉంటుంది. అయితే మనం ప్రస్తుతం
చూస్తున్న ఆలయ గోపురాలు, ప్రాకారాలు నిర్మించింది ఆరవీటి వారి కాలంలో (17వ శతాబ్దం) మట్ల రాజులు కాగా, ఆలయాన్ని 20వ శతాబ్దంలో పునరుద్ధరించినది మాత్రం వావికొలను సుబ్బారావు గారు.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).
తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)
తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి ప్రకారం ప్రపంచ సాహిత్యంలో ఏ భాషలో నైనా సరే ఉపయోగించబడ్డ అతిపెద్ద పదం కృష్ణదేవరాయల సోదరుడు అచ్యుతదేవరాయల భార్య తిరుమలాంబ రచించిన సంస్కృత చంపూ కావ్యం 'వరదాంబికా పరిణయం'లోనిది.
అచ్యుతదేవరాయలతో సలకం వారి ఆడపడుచు వరదాంబిక వివాహం ఇతివృత్తంగా రాయబడిన ఆ కావ్యంలో తుళువ నరస నాయకుడి (కృష్ణదేవరాయలు, అచ్యుతదేవరాయల తండ్రి) దండయాత్రలో భాగంగా 'తుండీర దేశం'(కంచి రాజధానిగా కలిగిన తొండమండలం) వర్ణించే క్రమంలో 195 సంస్కృత అక్షరాలతో (428 రోమన్ అక్షరాలు)ఒకే పదం వాడబడింది.
ఇప్పటివరకు ఏ భాషలోనైనా వచ్చిన సాహిత్యంలో ఇన్ని అక్షరాలతో వాడబడిన పదం మరొకటి లేదు.. ఈ వరదాంబిక కడప జిల్లా చెన్నూరు సీమను, ప్రకాశం జిల్లా కొచ్చర్లకోట సీమను ఏలిన సలకం వారి ఆడపడుచు.
కర్నూలు రాజ్య రక్షణకై రణరంగాన వీరమరణం పొందిన కడప రాజు - మట్ల తిరువెంగళనాథ రాజు
మట్ల తిరువెంగలనాథుడు తండ్రికి మట్ల అనంతరజుకు తగ్గ మానధనుడు. ఒకనాడు కందనూరి (కర్నూలు) రాజు ఆరవీటి గోపాలరాజు తిరువెంగళనాథుడితో - మీ తాత(మట్ల ఎల్లమరాజు), తండ్రి(మట్ల అనంతరాజు)
గొప్ప పరాక్రమవంతులు. నీవు చిన్నవాడివి. అనవసరపు శౌర్య ప్రదర్శనకు యత్నించకుండా సమయోచితానుసారము కాలము గడిపితే మంచిది అని హితువు చెప్పగా ఆ మాటలగొకు నొచ్చుకున్న తిరువెంగళ హనాథరాజు కందనూరు గోపాలరాజుతో మీరు మమ్మల్ని బాలురుగా అనుకున్నప్పటికీ మీ వంటి వారికి శత్రువుల నుండి ప్రమాదం
పొంచి ఉన్నప్పుడు మీ వైపున నిలవడానికి మేము వెనుకాడము అని చెప్పినాడట. వెంకటపతిరాయల నిర్యాణం అనంతరం శక 1541 సిద్ధార్థి సంవత్సరంలో బీజాపూరు సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్ షా తరపున అబ్దుల్ హుస్సేన్, అబ్దుల్ మహమ్మద్, అబ్దుల్ వహాబ్ ఖాన్ అనే 3 సర్దార్లు సైన్యంతో కర్నూలు కోటను చుట్టుముట్టగా,
ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్ద బండను తలయేరు గుండు అంటారు అలిపిరి నుంచి తిరుమల వెళ్లే కాలినడక మార్గంలో ప్రథమ గోపురం దాటిన తరువాత ఈ తలయేరు గుండును చూడవచ్చు. తలయేరు అంటే తలనొప్పి అని అర్థం. ఏడుకొండలు ఎంతో శ్రమతో ఎక్కి, దిగే భక్తులకు తలనొప్పి, ఒంటినొప్పులు మోకాళ్ల నొప్పులు
వంటివి రాకుండా ఉండడానికి తమ తలను మోకాళ్ళను ఆ గుండుకు తాకించి చిన్నగా రుద్దుతారు అలా చేస్తే ఒంటినొప్పులు రావని ఉన్న నొప్పులు పోతాయని భక్తుల నమ్మకం. అలా అనేక శతాబ్దాలుగా భక్తులు తమ తల, మోకాళ్లు ఆ గుండుకు ఆనించి ఆనించి ఏర్పడిన గుంతలను మనం నేటికీ చూడవచ్చు. దీనికే మరొక కథ కూడా ఉంది
మాదిగ రామయ్య అనే శ్రీవారి భక్తుడు స్వామివారికి ముత్యాలు గవ్వలు వంటివి జోడించి ఎంతో అందంగా చెప్పులు కుట్టించేవాడు. ఏదో కారణం వలన ఆ చెప్పులు కుట్టే పనికి ఆటంకం ఏర్పడింది. ఆ బాధతో ఆ వృత్తి వారు అక్కడున్న రాతిబండకు తలలు బాదుకోవడం వలన ఆ బండకి గుంతలు ఏర్పడి అదే తలయేరు బండ అయ్యింది
ప్రతీ రోజూ రాత్రి తిరుమల శ్రీవారు పవళింపు సేవ అయిపోయాక, ఆనందనిలయానికి బీగం (తాళం ) వేసి కిందకి నడక మార్గాన వస్తూ అవ్వాచారికోన అక్కగార్లకు బీగించెవులు(తాళం చెవి) ఇచ్చి అలా కిందకి నడుచుకుంటూ వచ్చి అలిపిరి దగ్గర ఉన్న పాదాల మండపంలో ఉన్న తన మెట్లు(చెప్పులు)
వేసుకుని అలా నేరుగా తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వద్దకు వెళ్లి, రాత్రి అమ్మవారితో ఉండి తిరిగి ఉదయాన పాదాల మండపంలో చెప్పులు వదిలి నడుచుకుంటూ పైకి ఎక్కి అక్కగార్ల వద్ద బీగించెవి తీసుకుని సుప్రభాత వేళకు ఆనంద నిలయం చేరుకుంటాడట. అలా స్వామి కూడా కొండను చెప్పులు లేకుండానే ఎక్కుతాడని
స్వామి వారి ఆలయ బీగించెవులకి అవ్వాచారి కోన అక్కగార్లు కాపలాగా ఉంటారని భక్తుల నమ్మకం. ఈసారి మీరు తిరుమల కాలినడక మార్గాన వెళ్ళినప్పుడు మోకాళ్ళ పర్వతానికి ముందు ఘాట్ రోడ్లో వచ్చే అక్కగార్లను దర్శించి వారి ఆశీస్సులు తీసుకోండి
మూలం: తిరుపతి కథలు - ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి