IYRKRao , Retd IAS Profile picture
Retired CS AP: Books:whose Capital Amaravathi: Navyandhra : my journey . https://t.co/JP3c2euvBg. weekly reviews on current issues on you tube #IYRtalks.
Oct 1, 2022 15 tweets 2 min read
విశాఖ రైల్వే జోన్ -పూర్వాపరాలు

ఈమధ్య ఈనాడు పత్రికలో విశాఖ రైల్వే జోన్ కష్టతరమని, సాధ్యం కాదని, రైల్వే అధికారులు హోం శాఖ కార్యదర్శి సమావేశంలో పేర్కొన్నారని దానికి హోం శాఖ కార్యదర్శి నిర్ణయం వారి స్థాయిలో తీసుకొనకుండా క్యాబినెట్ కు పంపించవలసిందిగా సూచించారని పేర్కొన్నారు. క్యాబినెట్లో నిర్ణయించబడిన విషయం తిరిగి క్యాబినెట్ కు ఎట్లా వెళ్తుందో అర్థం కావటం లేదు.
25-3-22 న జివిఎల్ నరసింహారావు గారి ప్రశ్నకు రైల్వే మంత్రి గారి సమాధానం క్రింది విధంగా ఉంది.
Dec 9, 2020 4 tweets 2 min read
#Agriculturallaws - Apprehensions - Truth

5. Under contract farming big companies will enter and exploit farmers .

Should there be investments in warehousing , post harvest technologies,processing ,grading,blue addition?

If answer is yes where will it come from ? Governments have tried failed . Agro industries corps in all states gone bankrupt writing down public investment .cooperatives but for #amul there is no other success . Today biggest problem is storage losses ,and low value for agriculture commodities due to lack of processing .
Dec 9, 2020 4 tweets 1 min read
వ్యవసాయ చట్టాలు-అవాస్తవాలు-వాస్తవాలు

5. ఒప్పంద వ్యవసాయం (contract farming ) క్రింద పెద్ద కంపెనీలు వస్తాయి. వాటి ధాటికి రైతులు నష్ట పోతారు.

ప్రధానంగా పోస్ట్ హార్వెస్ట్ సౌకర్యాలలో, గిడ్డంగుల నిర్మాణాల్లో, వ్యవసాయ వస్తువుల ప్రాసెసింగ్ లో విలువ పెంచటంలో పెట్టుబడులు కావాలా వద్ద. కావాలి అంటే ఎక్కడ నుండి రావాలి? ప్రభుత్వ సంస్థలు పూర్వం చేసిన పెట్టుబడులన్నీ నిరర్థక ఆస్తులు అయినాయి. ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థలు మొత్తం ప్రభుత్వ పెట్టుబడి తుడిచిపెట్టుకుపోయి దివాలా తీశాయి. ఒక్క అమూల్ తప్ప సహకార రంగంలో విజయవంతంగా నడిచిన సంస్థ మరొకటి లేదు.
Dec 9, 2020 13 tweets 6 min read
Agricultural Acts - twisted facts Vs facts.

1. farmer can not sell his bag of rice in Assam from AP since it is one national market hence the act is not useful is twisting of fact.

Fact is with market yard check posts gone there will be freedom of movement of goods . With freedom to buy outside market yards and within market yards competition will be more benefitting the farmer with a better price .market yards also improve their performance since there is competition . #FarmersAct2020
#DelhiFarmersProtest
Dec 9, 2020 14 tweets 2 min read
వ్యవసాయ చట్టాలు- అపోహలు- నిజాలు

1. సవరించిన చట్టం క్రింద రైతు పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు.
రైతు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే బస్తా ధాన్యం తీసుకుపోయి అస్సాంలో అమ్మవచ్చు అనేది పెడార్థం.
సరైన అర్థం జాతీయ మార్కెట్ ఏర్పడుతుంది కాబట్టి కొనుగోలు ధర పెరుగుతుంది. కేవలం మార్కెట్ యార్డ్ లోనే కాక బయట కూడా అమ్ముకునే వెసులుబాటు లభిస్తుంది. మార్కెట్ యార్డ్ చెక్ పోస్ట్ లు ఉండవు కాబట్టి సరకు రవాణా నిరంతరంగా జరగటానికి, జాతీయ మార్కెట్ లాభాలు రైతుకు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి.
Mar 1, 2019 9 tweets 2 min read
గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి,
మీ లేఖలోని చాలా అంశాలపై నాకు అవగాహన ఉంది కాబట్టి మీకు బహిరంగ సమాధానమిచ్చే సాహసం చేస్తున్నాను. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలన్న విశాఖ వాసుల ఆకాంక్ష తీరే సమయం లో హేతుబద్ధంగాని ఆరోపణలు రాజకీయ లబ్దిదృష్టిలో పెట్టుకొని‌ చేయడం భావ్యం కాదు. రైల్వే లాభనష్టాలు ఆశాఖే భరిస్తుంది. ఇది తమరికి తెలియనిది కాదు. ఇచ్చిన జోనును స్వాగతించాల్సింది బదులు హేతుబద్ధంగాని ఆరోపణలు భావ్యం కాదు.
ప్రకృతి విపత్తుల సమయంలో ప్రధాని ప్రకటించిన సహాయం కొంత ప్రత్యేకంగా మరికొంత అమలయ్యే కార్యక్రమాల్లో భాగంగా వస్తుందనేది తమరికి తెలుసు.
Feb 19, 2019 5 tweets 2 min read
బుందేల్ఖండ్ ప్యాకేజీ -వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ
దీని కింద 24 వేల కోట్లు రావాలని అనే అబద్ధాన్ని నిజమని గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వారి అనుకూల మీడియా అనుకూల మేధావులు ప్రజలను నమ్మించారు. #bundelkhandpackage #backwardareaspackageAP బుందేల్ఖండ్ ప్యాకేజీ ఆ రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న అన్ని కేంద్ర పథకాలు ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ లాంటివన్నీ కలిపి 24 వేల కోట్లు చూపెట్టారు. మరి పోలిక చేసేటప్పుడు మనకిచ్చిన 2100 కోట్లకు ఆ పథకాలను కలిపిగానీ పోలిక చేయాలి లేదా రెండింటిలో తీసేసి అయినా పోలిక చేయాలి.