How to get URL link on X (Twitter) App
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ శ్రీ శేషాద్రి అధ్యక్షతన, సీఎం సెక్రటరీ శ్రీమతి స్మితా సభర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ లోకేశ్ కుమార్, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ శ్రీమతి దివ్య సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
గత సంవత్సర కాలంలో వ్యవసాయ రంగంలో జరిగిన పురోగతి, ధాన్యం దిగుబడి, సాగు విస్తీర్ణం పెంపు, తదితర విషయాలను వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి, అధికారులు కేబినెట్ కు సమగ్రంగా వివరించారు. వానాకాలం సాగు నేపథ్యంలో, విత్తనాలు, ఎరువుల లభ్యత, వర్షపాతం తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది.
➧ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిపై కేబినెట్ చర్చించింద. ఈ సందర్భంగా పంచాయితీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖలు కేబినెట్ కు నివేదికలు సమర్పించాయి. వచ్చే నెల రోజుల లోపు, రాష్ట్రంలో నూటికి నూరుశాతం వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రులను, అధికారులను సీఎం ఆదేశించారు.



మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 11,900 ఎంపిక చేయబడిన అర్హులైన దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం అందుతుంది. ఇందుకు 1200 కోట్లతో "సీఎం దళిత సాధికారత పథకం" ప్రారంభం చేయాలని సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన అఖిలపక్షం నిర్ణయించింది.

జులై 1 నుంచి పదిరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను మరింతగా చైతన్యపరిచి నిర్దేశిత లక్ష్యాలన్నీటినీ చేరుకోవాలి. పదిరోజుల కార్యక్రమం ముగిసిన తర్వాత ఏ పనికూడా అపరిష్కృతంగా ఉండటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు.
దళిత ప్రజాప్రతినిధులతో కూడిన ఈ అఖిలపక్ష సమావేశంలో, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వారితో పాటు ప్రతిపక్ష ఎం.ఐ.ఎం, కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు కూడా పాల్గొంటారు. వీరికి అధికారికంగా ఆహ్వానాలు అందుతాయి.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకానికి చెందిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం తెలిపారు.

వ్యవసాయేతర ఆస్తులు - వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం ఆర్ అండ్ బి, గృహ నిర్మాణ శాఖల మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని సీఎం నియమించారు.
ఇవాళ ప్రగతిభవన్ లో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘‘ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతున్నది.
వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లలో నివసిస్తున్నవారు ఎంతో నష్టపోయారని, ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలోని వరద ముంపుకు గురైన ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తామని సీఎం ప్రకటించారు.


హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.