పవన్ సంతోష్ (Pavan Santhosh) Profile picture
అన్నిటికన్నా ముందు తెలుగువాడిని! @Wikipedian, Bookworm, Movie buff and a lot of such qualifiers. Tweets are personal.
Jun 18, 2023 25 tweets 6 min read
ఎస్వీఆర్ మెథడ్ యాక్టర్ అని అంటూ ఉంటారు మనవాళ్ళు. అదే కాదు, ఎవరినైనా మెచ్చుకోవాలంటే "మెథడ్ యాక్టర్" అనడం అలవాటైంది కూడాను. మెథడ్ యాక్టింగ్ నటనలో ఆఖరి మెట్టా? దీన్ని మించిన ధోరణి లేదా? ఎస్వీఆర్ నిజంగానే మెథడ్ యాక్టర్‌ఆ? కాకుంటే ఇంకెవరైనా ఉన్నారా? వంటి ప్రశ్నలకు సమాధానం ఈ తీగ. ImageImageImageImage బిచ్చగాడిలా నటించాల్సి వస్తే బిచ్చగాళ్ళతో కొన్నాళ్ళు స్నేహం చేసి రావడం, మానసిక రోగిగా నటించాల్సి వస్తే కొన్నాళ్ళు పిచ్చాసుపత్రిలో నివాసం ఉండడం, అడవి మనిషి వేషం వేయాలంటే పచ్చి మాంసాన్ని తినడం - ఇలాంటి పద్ధతులను మెథడ్ యాక్టింగ్ అని భావిస్తోందట హాలీవుడ్ ఈనాడు.
Jun 16, 2023 10 tweets 2 min read
ఆదిపురుష్ లో పురాణ పాత్రల్ని చూపిన విధానంపై విమర్శలను "కొత్తదనం", "కొత్తతరానికి రామాయణాన్ని పరిచయం" వంటివాటితో కొట్టాలని కొందరు చూస్తున్నారు. ఈ సందర్భంలో ఏనాడో తిలక్ రాసిన ఒక కవిత గుర్తొచ్చింది. ఆ కవిత ఈ సందర్భానికి చక్కగా సరిపోతుంది. ImageImage కవితలోని ఈ పదాలను ఇలా మార్చుకుని చదివి చూడండి:

కవిత -->> సినిమా,
రాయడం -->> తీయడం
కవి -->> దర్శకుడు
పాఠకుడు -->> ప్రేక్షకుడు
----------------------------------------
"కవిత - నవత"

"మిత్రమా!
కవిత ఉన్నప్పుడే నవత రాణిస్తుంది
అసలు కవితలోనే నవతకూడా ఉంది
కాని,
Jan 12, 2023 23 tweets 10 min read
#నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. చాలమందిమి ఎంతో సంతోషించాం. ఐతే, కొందరు ఈ పాట అంత గొప్ప పాటా?ఈ అవార్డు వచ్చే అర్హత ఉందా అన్న ప్రశ్న వేశారు. సంతోషించిన కొందరి మనసుల్లో ఎక్కడో ఉండి ఉండొచ్చునని నా గమనిక. అందుకే ఈ థ్రెడ్.
@ssrajamouli @mmkeeravaani @kanchi5497 సినిమా పాటల గురించి, వాటి గొప్పదనం మనకు ఏళ్ళ తరబడి ఉన్న ఆలోచనలను ఈ పాటకు పురస్కారం రావడం సవాలు చేస్తుంది. కాబట్టి దీనిని అర్థం చేసుకోవడానికి కొత్త చూపు అవసరం.
మొదట - ఈ పాట ప్రత్యేకత ఏమిటో చెప్పుకుందాం.
తర్వాత - ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం ఎంతవరకూ సబబు అన్నదీ చూద్దాం.
Jan 9, 2023 22 tweets 5 min read
1929 అక్టోబరు 24. గురువారం. న్యూయార్క్. వాల్ స్ట్రీట్.
అక్కడ పుట్టి మునిగింది. కోటీ అరవై లక్షల షేర్లను స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు అమ్మిపారేశారు. హఠాత్తుగా స్టాక్ మార్కెట్ పతనం అయిపోయింది.
ఎక్కడో ఏదో అయితే ఏమైంది?
మహాప్రస్థానానికి ఒక విధంగా అక్కడే పునాది పడింది. అదేంటదీ? దానికీ దీనికి ఏమిటి సంబంధం?
అంటే -
ప్రపంచం అంతటినీ ఆర్థికంగా దుస్థితిలోకి నెట్టేసి, ఆకలితో మలమల మాడ్చి "హంగ్రీ థర్టీస్" అన్న చెడ్డపేరు మూటగట్టుకున్న దశకానికి అదే నాంది. ఆ రోజును "బ్లాక్ థర్స్‌డే" అంటారు అందుకే. 1929 స్టాక్ మార్కెట్ క్రాష్...
Jan 5, 2023 4 tweets 2 min read
జీవితంలో కొన్ని విషాదాలు శాశ్వతం. కానీ ఆనందాలు ఎప్పటికీ తాత్కాలికమే.

- స్వరూప్ తోటాడ
సినిమా మ్యుజింగ్స్ పుస్తకం
సత్యమే శివమ్ వ్యాసం Image "నగరాల చరిత్రల్లో మన కథలు కనీసం ఒక ప్రస్తావనగానైనా ధ్వనించకపోవచ్చు, కానీ ఆ చరిత్రలకు రక్తమాంసాల్ని, కాలం కరిగిపోయినా చెరిగిపోని గురుతుల్ని, నీడల్ని, రంగునీ, వాసనని ఇచ్చేవి మన జీవితాలే"

- స్వరూప్ తోటాడ,
సినిమా మ్యూజింగ్స్,
Hiroshima Mon Amour వ్యాసం Image
Dec 31, 2022 12 tweets 2 min read
"ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షించగా
తక్కినవి భాండారాన దాచి ఉంచనీ"
అన్నమయ్య "దాచుకో నీ పాదాలకు" అంటూ రాసిన కీర్తనలో పాదం ఇది. నాకెంతో ఇష్టమైన కీర్తన. 32 వేల కీర్తనలు రాసి ఒక్కటి చాలు నన్ను రక్షించేందుకు అంటున్నాడు మహానుభావుడు. Image సంకీర్తనాచార్యత్వం ఒక పదవిగా అన్నమయ్య జీవితకాలంలో ఏర్పడి పెద తిరుమలాచార్యులకు అది సంక్రమించిందని వెల్చేరు నారాయణరావు భావించారు. తాళ్ళపాక వారి సంకీర్తనలు రాగిరేకులపై రాయించి తిరుమల ఆలయంలోని తాళ్ళపాక వారి అర అన్న సంకీర్తన భాండాగారంలో భద్రపరిచడానికి పెద తిరుమలయ్య ఆధ్వర్యం వహించారు.
Oct 24, 2022 6 tweets 3 min read
"కించిత్ భోగే భవిష్యతి" అని డాక్టర్ వేమూరి వెంకటేశ్వరరావు గారు ఒక అరవై ఏళ్ల క్రితం రాసిన కథను వి.బి.సౌమ్య గారు ఇంగ్లీష్ లోకి అనువదించారు.
సైన్స్ ఫిక్షన్ + హాస్యం కలగలిసి ఉండడమే కాదు కథలో ఉండే మలువు కోవిడ్ చూసొచ్చిన మనకు గొప్ప ఆశ్చర్యం కలిగిస్తుంది. Dr. వేమూరి వెంకటేశ్వరరావు గారు తెలుగులో పాపులర్ సైన్స్ విషయంలో చేస్తున్న కృషి అనన్య సామాన్యం. 1960ల్లోనే ఈయన కంప్యూటర్ల గురించి తెలుగులో రాశారంటే నమ్ముతారా? తెలుగులో తెలుగువారు సైన్స్ గురించి చదువుకోవాలి అన్న ఆశయంతో ఎంతో చక్కని ఆసక్తికరమైన పుస్తకాలు రాశారు.
Oct 21, 2022 25 tweets 9 min read
చందమామ పత్రిక ఎలాగైతే నా చిన్నతనంలో తెలుగు వైపుకు మళ్ళించి, ఊహకు రెక్కలు తొడిగిందో, అలానే కౌమారానికి, యౌవనానికి మధ్య కాలంలో నన్ను తీర్చిదిద్దడంలో ఎంతో పనికివచ్చినది ఈ హాసం పత్రిక. ఈ అక్టోబరుకు హాసం పత్రిక ప్రారంభమై 20 ఏళ్ళు నిండి 21 ఏడు ప్రారంభమైంది.
#అభిరుచి #తెలుగు #పత్రిక Image ఇది ప్రారంభమైన ఏడాదికి కానీ నాకు పరిచయం కాలేదు. అప్పటికి నేను తొమ్మిదో క్లాసు చదువుతున్నాను. మా తాడేపల్లిగూడంలోని సత్యసాయి సేవాసమితిలో ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూంటే పాల్గొనడానికి వెళ్ళినప్పుడు, అక్కడ మా సీనియర్ ఒక అబ్బాయి (పదో తరగతి అన్నమాట అతను చదివేది) ఎదురుపడ్డాడు.
Oct 18, 2022 19 tweets 0 min read
Oct 9, 2022 26 tweets 7 min read
సినిమా రంగంలో అవసరం తీరగానే మరచిపోతారని, విలువలు ఉండవని ఎందరో చెప్తారు. అయితే, కృతజ్ఞత అన్న పదం తలుచుకున్నప్పుడు నాకు గుర్తుకువచ్చే సంఘటన సినిమా రంగంలోనే జరిగింది. ఎన్టీ రామారావుకు, కె.వి.రెడ్డికి మధ్య జరిగిన ఈ సంఘటన కృతజ్ఞత అన్న పదానికే నిర్వచనంగా నిలిచిపోతుంది.
#NTR కె.వి.రెడ్డి - అలనాటి సినిమాలు ఇష్టపడేవారికే కాక, మాయాబజార్ దర్శకునిగా చాలామందికి, మహానటి, కథానాయకుడు సినిమాల ద్వారా ఈమధ్య ఇంకొందరికీ ఈయన పేరు, తీరు కొంత తెలుసు.
Oct 7, 2022 9 tweets 2 min read
మాయాబజార్ సినిమా అంతటా "CGI లేకుండా ఇదెలా చేశారబ్బా!" అనిపించే వర్క్ కోకొల్లలు. మనకే కాదు, ఆ సినిమాకు అప్రెంటిస్‌గా పనిచేసి, తర్వాత ప్రసిద్ధ దర్శకుడైన సింగీతం శ్రీనివాసరావు గారికి కూడా ఒకటీ అరా సందేహాలు అలానే ఉండిపోయాయట.
అందులో ఒకటి -
కంబళి గింబళి ఎలా అయింది? 2000 మొదట్లో ఈ సందేహం వచ్చిందట సింగీతం గారికి. ఆ సీన్ తీసిన రోజు తనకు వేరే పని అప్పగించి ఉంటారనీ, పోనీ తర్వాత అయినా ఎవరినీ అడిగి తెలుసుకోలేదనీ చాలా గుంజాటన పడిపోయారు. సినిమా దర్శకుడు కె.వి.రెడ్డి గారు, సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్‌లే, కళాదర్శకుల్లో ఒకరైన మా.గోఖలే మరణించారు.
May 27, 2021 6 tweets 1 min read
@yarlagaddavrao @kkmohan73 @kkmohan73 గారూ, ఆక్సిజన్ ప్లాంట్ ఒక్కొక్కటి కనీసం రూ.40 లక్షల నుంచి కోటిన్నర వరకూ ఖరీదు ఉంటుంది. నెలకొల్పాలంటే దాదాపు నెల, నెలన్నర పడుతుంది. చంద్రబాబు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆఘమేఘాల మీద పనులు చేయిస్తుంటేనే కనీసం నెల. నెల అంటే ఏముంది అనిపించవచ్చు.
1/n
@yarlagaddavrao @kkmohan73 కానీ, ఈరోజు అధికారిక లెక్కల ప్రకారమే ఆంప్రలో దాదాపు లక్షా 92 వేల యాక్టివ్ కేసులున్నాయి. గత మూడు నాలుగు వారాల్లో కేసుల సంఖ్య ఏడు రోజుల సగటు ఎప్పుడూ 20 వేలకు తక్కువ లేదు. ఎక్కడ చూసినా SoS Requests. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు చేయగల సాయం ఏమిటో @KChiruTweets చేస్తున్నాడు 2/n
Aug 6, 2019 11 tweets 2 min read
కాశ్మీర్ మీద మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు? ఈనాడు కాశ్మీర్ ఒక ఉగ్రవాద సమస్యగా మారడానికి కారణం నెహ్రూ కాదు, షేక్ అబ్దుల్లా అంతకన్నా కాదు.
ఉత్తరాన మంచు కొండలు మండిపోవడానికి, కాశ్మీరీ పండిట్లు జీవితాలు కోల్పోవడానికి, అంతా జటిలం కావడానికి కారణం..
రాజీవ్ గాంధీ
1/n
1986లో జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం నడిచేది. 1982లో కాశ్మీర్ నాయకుడు షేక్ అబ్దుల్లా చనిపోయాక కొడుకు ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యాడు. రెండేళ్లకు ఫరూక్ బావమరిది (షేక్ అబ్దుల్లా అల్లుడు) గులాం మహమ్మద్ షా దెబ్బవేసి దించి తానే ముఖ్యమంత్రి అయ్యాడు. 2/n