పులగం - నెయ్యి
అదేదో సిన్మాలో సెప్పినట్టు ఈ లాక్డౌన్ ఒచ్చినాక దిన్నామూ సేస్కోడం, సించుకోడం, పండుకోడం మళ్లా లేసి సేస్కోడం, సించుకోడం, పండుకోడం అన్యట్టే ఉండాది. ఆ సేస్కోడం గునక అప్పసం మనకు తెల్సినేటియే సేస్కుంటాండాం. ఇంగేదో సిన్మాలో తాగితే గదా తెల్సేది నచ్చుతాదో లేదో అని అన్యట్టు
మిగతావోల్ల వంటలు గునక సేస్కోని తింటేనే గదా తెలిసేది వాళ్ళేం తింటాండారో.
పులగం రాయలసీమలో ఎక్కువ తూర్లే సేస్కుంటాంటాం. భోగి పండాగాపొద్దు, బోనాలప్పుడూ పులగం ఉండాల్సిందే. మాకు మట్టుకు బోనాలంటేనే పులగం. శానామట్టుకు సీమ వంటకాల మాదిరి పులగం గూడా ఒంటికి మంచిది.
#సీమరుచులు #సీమపదం
పెసర బ్యాళ్లల్లో ప్రోటీన్ దండిగా ఉంటాది. అందుకే ఈ సారి మా పులగం - సెనిక్కాయ పచ్చడి ట్రై చేయండి
పులగం మేము ఎక్కువ సేస్కున్యా, అందరూ సేస్కోకున్యా సంగటి మాదిరి పేరన్నా తెల్సింటాది, సూడనన్నా సూసింటారు అనుకున్యా. శానా మందికి పులగం అనే పేరు గునక ఈ మధ్యనే తెల్సిండాది.
అందుకే ఇయ్యాల మీకు పులగం -సెనిక్కాయ పచ్చడి - నెయ్యి గురించి సెప్తా.
పులగం - పులగం అంటే
బియ్యం, పొట్టుతీని పెసర బ్యాళ్లు (పెసర పప్పు), ఉప్పు యేసి చేసే అన్నమే. ఒక గ్లాసు బియ్యానికి అర గ్లాసు నుండి ఒక గ్లాసు వరకు పెసర బ్యాళ్లు ఏసుకుంటారు (మనకు నచ్చినట్టు).
ఎన్ని బియ్యం+పెసరబ్యాళ్లు ఉంటె దానికి రెండింతలు నీళ్లు. మీకు అన్నంలో ఉప్పేసుకునే అలవాటుంటే ఉప్పు. అంతే. మిగతాది అన్నం మాదిరే
అయితే పులగంలోకి సెనిక్కాయ పచ్చడి, కొబ్బరి పచ్చడి, పచ్చిపులుసు ఇట్టా కొన్ని కాంబినేషన్లు బాగుంటాయి. శానా మంది సెనిక్కాయ పచ్చడి ఎట్టా సేచ్చారు అని అడిగినారు
రాయచోటోళ్లు మాట్లాడినట్టు రాజంపేటోళ్లు మాట్లాడరు. రాజంపేటోళ్లు మాట్లాడినట్టు రాయదుర్గమోళ్ళు మాట్లాడరు. అట్నే సెనిక్కాయ పచ్చడి గునక ఒక్కో సాట ఒక్కో రకంగా సేచ్చారు. నేను మేమెట్లా సేసుకుంటామో సెప్తా
యాస ఒకటే అయినా ఆడాడా పదాలు మారినట్టు, వాడేటి అయ్యే అయినా ఆడాడా సేసే పద్దతి మార్తాది
కావల్సినేటివి-ఏంచి పొట్టు తీసిన సెనిక్కాయ పప్పులు, ఉప్పు, పసుపు, ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సింతపండు, కరేపాకు, నూనె.
స్టౌ పెట్టి ఇంత నూనె ఏస్కోని,ఎర్రగడ్డలు, టమాటాలు, మిరపకాయలు, జీలకర్ర, సింతపండు,కరేపాకు బేసి ఏంచి, రోన్ని నీళ్లుపోసి ఉడికిచ్చుకోని సల్లారబెట్టాల
ఏంచిన సెనిక్కాయ పప్పులు, ఉప్పు, పసుపు మిక్సీకి/రోటికి ఏస్కోని పొడిగా అయినాక ఉడకపెట్టుకొనింటి అన్నీ ఏసి, ఇన్ని నీళ్లు బేసి పచ్చడి జేస్కోడమే. ముందే సెప్పినట్టు ఒక్కొక్కరు ఒక్కోమాదిరి సేస్కుంటారు. కొందరు వట్టి మిరపకాయల్తో, కొందరు తెల్లవాయలు యేసుకుంటారు, కొందరు టమాటాలు ఏస్కోరు ఇట్టా
సెనిక్కాయ పచ్చడి, పులగం ఉంటె నెయ్యి ఉండాల్సిందే. ఆ కాంబినేషనుకు తిరుగులేదు. ఎంతలా అంటే పులగం-నెయ్యి అని ఒక ఫేమస్ జానపద కథ గునక ఉండాది. ఆ కథ ఈడ ఇనండి 👇
టిప్స్:
మిరపకాయలు, ఎర్రగడ్డలు ఎక్కువ పడ్తేనే పచ్చడి బాగుంటాది
పూర్ణం మాదిరి మెత్తగా నూరకుండా రోన్త కచ్చా కచ్చాగా నూరుకుంటే బాగుంటాది
ముందు పప్పులు మెదిగినాకనే మిగతాయి బెయ్యాల. ల్యాకుంటే పప్పులు సరిగ్గా మెదగవు
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.