రాయలసీమ ~ Rayalaseema Profile picture
FB: https://t.co/zAsZHzy9kc Insta : https://t.co/g07orhyHKs RTs and Likes≠ Endorsement Strictly Personal Opinions

Jun 16, 2020, 8 tweets

పాపవినాశనం

శ్రీవారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో ప్రతీ రాయి, రప్ప, వాగు - వంక, కొండ - కోన పవిత్రమే. తిరుమలలో ఉన్న అనేక దివ్య తీర్థాలలో ఒకటి పాపవినాశనం తీర్థం. ఈ తీర్థంలో స్నానామాచరిస్తే సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ తీర్థానికి 'పాపవినాశనం' అన్న పేరు వచ్చింది.

ఒకప్పుడు స్వామివారి కైంకర్యాలకు పాపవినాశనం జలాన్నే వాడేవారట.

సంకీర్తనాచార్యుడు అన్నమయ్య 'పావినాశనం' తీర్థాన్ని తన కీర్తనలలో ఈ విధంగా వర్ణించాడు

ప్రఖ్యాతి చెందిన పాపవినాశనం తీర్థంలో పాపాలు పగిలి పరుతున్నాయని ఒక చోట, పామరులను అమరులు చేయు పాపవినాశనం అని మరో చోట రాశారు.

“అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము” అన్న కీర్తనలో ( అధ్యాత్మ సంకీర్తన - రేకు: 37-1 సంపుటము: 1-227) అన్నమయ్య 'పావినాశనం' ఈ విధంగా వర్ణించాడు

ప్రాకటంబైన పాపవినాశనములోని
భరితమగు దురితములు పగిలి పారుచునుండ
ఆకాశగంగ తోయములు సోఁకిన భవము
లంతంత వీఁడి పారఁగను

#Ravishing_Rayalaseema

కొండా చూతము రారో కొండుక తిరుమల కొండా
అన్న కీర్తనలో (అధ్యాత్మ సంకీర్తన - శ్రీరంగం రేకు: 9-1 సంపుటము: 15-460) ఈ విధంగా వర్ణించాడు

స్వామితీర్థములకును స్వామిపుష్కరణియునూ
పామరులా యమరులఁ జేయును పాపవినాశనమూ
తా మహిఁ గోరిక లిచ్చుఁ గుమారధారయు పాండవసరసీ
కామితఫలదాయిని ఆకాశగంగయుఁ గల మా కొండా

స్థల చరిత్ర

పాపవినాశనం తీర్థం గురించి శ్రీ వేంకటాచల పురాణము, స్కంద పురాణాలలో ఉన్నదట. ఇక్కడ స్నానమాచరించిన సకల పాపాలు తొలగి, సకల కోరికలు సిద్ధిస్తాయట. స్వామివారి నిత్యకైంకర్యాలకు ఒకప్పుడు ఈ పాపవినాశనం తీర్థ జలాలనే వాడేవారట
#TTD #Tirumala #Rayalaseema #chittoor #Chittoor_Temples

తీర్థ విశేష దినం

అశ్వియుజ మాసం శుక్లపక్ష సప్తమి,ఉత్తరాషాఢ నక్షత్ర యుక్త ఆదివారం కానీ ఉత్తరాభద్ర నక్షత్రముతో కూడిన ద్వాదశి కానీ పాపవినాశనం తీర్థ విశేష దినం

డ్యాం

ఈ తీర్థం సమీపంలో పాపవినాశనం డ్యాంను కూడా చూడవచ్చు. గోగర్భం వంటి ఇతర డ్యాంలతో పాటు ఈ డ్యాం తిరుమల ప్రధాన నీటి వనరు

గంగాదేవి, అంజనేయుడి ఆలయం

ఇక్కడి క్షేత్ర దేవతలు గంగమ్మ మరియు ఆంజనేయ స్వామి. పాపవినాశనం వద్ద భక్తులు స్నానమాచరించే స్థలం వద్ద గంగాదేవికి, ఆంజనేయ స్వామికి ఇక్కడ ఆలయం ఉన్నది. భక్తులు తీర్థంలో స్నానమాచరించి గంగమ్మ, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు.
#Rayalaseema_Temples

ఈ సారి తిరుమల వెళ్లినపుడు పాపవినాశనం తీర్థం, గంగాదేవి, అంజనేయుడి ఆలయం ఖచ్చితంగా దర్శించండి.

#

కీర్తనల కర్టెసీ : andhrabharati.com

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling