శ్రీవారు కొలువై ఉన్న తిరుమల క్షేత్రంలో ప్రతీ రాయి, రప్ప, వాగు - వంక, కొండ - కోన పవిత్రమే. తిరుమలలో ఉన్న అనేక దివ్య తీర్థాలలో ఒకటి పాపవినాశనం తీర్థం. ఈ తీర్థంలో స్నానామాచరిస్తే సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ తీర్థానికి 'పాపవినాశనం' అన్న పేరు వచ్చింది.
ఒకప్పుడు స్వామివారి కైంకర్యాలకు పాపవినాశనం జలాన్నే వాడేవారట.
సంకీర్తనాచార్యుడు అన్నమయ్య 'పావినాశనం' తీర్థాన్ని తన కీర్తనలలో ఈ విధంగా వర్ణించాడు
ప్రఖ్యాతి చెందిన పాపవినాశనం తీర్థంలో పాపాలు పగిలి పరుతున్నాయని ఒక చోట, పామరులను అమరులు చేయు పాపవినాశనం అని మరో చోట రాశారు.
“అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము” అన్న కీర్తనలో ( అధ్యాత్మ సంకీర్తన - రేకు: 37-1 సంపుటము: 1-227) అన్నమయ్య 'పావినాశనం' ఈ విధంగా వర్ణించాడు
కొండా చూతము రారో కొండుక తిరుమల కొండా
అన్న కీర్తనలో (అధ్యాత్మ సంకీర్తన - శ్రీరంగం రేకు: 9-1 సంపుటము: 15-460) ఈ విధంగా వర్ణించాడు
స్వామితీర్థములకును స్వామిపుష్కరణియునూ
పామరులా యమరులఁ జేయును పాపవినాశనమూ
తా మహిఁ గోరిక లిచ్చుఁ గుమారధారయు పాండవసరసీ
కామితఫలదాయిని ఆకాశగంగయుఁ గల మా కొండా
స్థల చరిత్ర
పాపవినాశనం తీర్థం గురించి శ్రీ వేంకటాచల పురాణము, స్కంద పురాణాలలో ఉన్నదట. ఇక్కడ స్నానమాచరించిన సకల పాపాలు తొలగి, సకల కోరికలు సిద్ధిస్తాయట. స్వామివారి నిత్యకైంకర్యాలకు ఒకప్పుడు ఈ పాపవినాశనం తీర్థ జలాలనే వాడేవారట #TTD#Tirumala#Rayalaseema#chittoor#Chittoor_Temples
తీర్థ విశేష దినం
అశ్వియుజ మాసం శుక్లపక్ష సప్తమి,ఉత్తరాషాఢ నక్షత్ర యుక్త ఆదివారం కానీ ఉత్తరాభద్ర నక్షత్రముతో కూడిన ద్వాదశి కానీ పాపవినాశనం తీర్థ విశేష దినం
డ్యాం
ఈ తీర్థం సమీపంలో పాపవినాశనం డ్యాంను కూడా చూడవచ్చు. గోగర్భం వంటి ఇతర డ్యాంలతో పాటు ఈ డ్యాం తిరుమల ప్రధాన నీటి వనరు
గంగాదేవి, అంజనేయుడి ఆలయం
ఇక్కడి క్షేత్ర దేవతలు గంగమ్మ మరియు ఆంజనేయ స్వామి. పాపవినాశనం వద్ద భక్తులు స్నానమాచరించే స్థలం వద్ద గంగాదేవికి, ఆంజనేయ స్వామికి ఇక్కడ ఆలయం ఉన్నది. భక్తులు తీర్థంలో స్నానమాచరించి గంగమ్మ, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటారు. #Rayalaseema_Temples
ఈ సారి తిరుమల వెళ్లినపుడు పాపవినాశనం తీర్థం, గంగాదేవి, అంజనేయుడి ఆలయం ఖచ్చితంగా దర్శించండి.
1846 - అప్పటికే బ్రిటీషు వారిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, అతని సైన్యంతో లెఫ్టినెంట్ వాట్సన్ నేతృత్వంలోని కుంఫిణీ సైన్యం గిద్దలూరు వద్ద తలపడింది. రెండు పక్షాల మధ్య హోరాహోరీగా యుద్ధం జరిగింది. రెడ్డి అనుచరులు చాలా మంది చనిపోయారు.
అధిక సంఖ్యలో ఉన్న నరసింహా రెడ్డి సైన్యం ముందు నిలవలేక వాట్సాన్, వెనుకంజ వేసి తన సైన్యాన్ని తీసుకుని శెట్టివీడు (కృష్ణం శెట్టిపల్లె?) చేరుకున్నాడు. నరసింహారెడ్డి తన అనుచరులతో ముండ్లపాడు చేరుకున్నాడు.
మరుసటి రోజు, జులై 24 వ తేదీ వాట్సన్ కు సహాయంగా కర్నూలు నుండి కెప్టెన్ నాట్ కెప్టెన్ రాసెల్ సైన్యం కృష్ణం శెట్టిపల్లె చేరుకుంది. వారందరూ కలిసి ముండ్లపాడులో నరసింహారెడ్డి బలగం ఉందని తెలిసి అక్కడికి చేరుకొని అతడితో పోరాటానికి దిగారు.
కట్టమంచి.. ఒకప్పటి ఉత్తర ఆర్కాడు జిల్లా కేంద్రం అయిన చిత్తూరు పట్టణాన్ని ఆనుకొని ఉండే ఒక గ్రామం. ఆ చిన్న గ్రామం తెలుగు సాహిత్యానికి, విద్యారంగానికి ఎనలేని సేవ చేసింది.
ఆ గ్రామంలో కట్టమంచి కొళంద రెడ్డి కుటుంబం పేరెన్నికగన్నది.
ప్రముఖ విద్యావేత్త, రచయిత, విమర్శకుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయ మొట్టమొదటి ఉపకులపతి సర్ కట్టమంచి రామలింగారెడ్డి గారు కొళందరెడ్డి కుటుంబంలో 5వ తరము వారు. కట్టమంచి కుటుంబంలో కవితా ప్రవాహం కేవలం రామలింగారెడ్డి గారితో మొదలు కాలేదు. వీరికి రచనా వ్యాసంగం, సాహిత్యాభిలాష పారంపర్యంగా లభించాయి
కట్టమంచి రామలింగారెడ్డి గారి ముదబ్బ (ప్రపితామహుడు / Great Grandfather ) కట్టమంచి పెద్ద రామలింగారెడ్డి - భాస్కర శతకము మొదలగు రచనలు చేసినారు. అంతేకాక జ్యోతిష్యము, సంస్కృతము, మంత్రశాస్త్రము మొదలగువాటిలో నేర్పరి.
వారి పేరు మణిమేకల శివశంకర్. నాకు శాసనాల శంకర్ పేరుతో @tuxnani ద్వారా పరిచయం. చదువుకున్నది 5వ తరగతి. వృత్తి ముఠా కూలీ. ప్రవృత్తి: శాసనాల శోధన, చరిత్ర పరిశోధన. ఇటీవలే గుంటూరు జిల్లాల అదృశ్య గ్రామాల చరిత్ర అనే పుస్తకం రచించారు.
ఎంతో కష్టపడి రచించిన ఆ పుస్తకాన్ని నెలలు గడవక ముందే చరిత్రాభిమానులకు ఉచితంగా PDF రూపంలో పంపించారు. నాకు గురుతుల్యులు. రాయలసీమ చరిత్రపై పరిశోధన చేయాలని నన్ను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉంటారు. ఏదైనా రాయలసీమ గురించి మంచి పుస్తకం వారి దృష్టికి వస్తే
ఆ పుస్తకం గురించి చెప్పి రచయిత నం / ప్రచురణ కర్త నం ఇస్తారు (కొనడానికి వీలుగా). నీవు రాసేది ఎప్పుడు పుస్తకంలా వస్తుంది అని అడుగుతూ ఉంటారు. ఇంగ్లీషు అర్థం కాదు. చరిత్రపై ఉన్న అవగాహన, పట్టు అసాధారణం. ఎవరైనా వీరి సహాయం కోరితే వారికి తగిన మూల గ్రంథాలు దొరకడంలోనూ,
గుడిమల్లం అసలు పేరు తిరువిప్పిరంబేడు (శాసనాల ప్రకారం).
తిరు అంటే శ్రీ / గొప్ప / పుణ్యమైన అని అర్థాలు ఉన్నాయి
విప్పిర అన్నది సంస్కృత ' విప్ర ' నుండి వచ్చింది. అంటే బ్రాహ్మణుడు అని అర్థం
పేడు అన్న పదం గ్రామ సూచి (ఉదా: ఏర్పేడు)
తిరువిప్పిరంబేడు అంటే గొప్ప బ్రాహ్మణుడి ఊరు అని అర్థం
స్థలపురాణం ప్రకారం ఈ ప్రాంతం పరశురాముడు శివుడిని కొలిచిన ప్రాంతం. బహుశా శ్రీమహావిష్ణువు అవతారమైన పరశురాముడే ఊరి పేరులో ఉన్న గొప్ప బ్రాహ్మణుడు అయ్యుండాలి.
అని గుడిమల్లాన్ని శాసనాలు పేర్కొంటున్నాయి. మరి గుడిమల్లం అన్న పేరు ఎలా వచ్చింది అన్నదానికి మరో కథ ఉంది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పూజించే విషయమై వేటగాడి రూపంలో ఉన్న పరశురాముడు / శ్రీమహావిష్ణువు కు, చిత్రసేనుడు అనే యక్షిణి రూపంలో ఉన్న బ్రహ్మకు ఘోర యుద్ధం జరిగింది అని