H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture
AndhraPradesh #AreKatika Sangh State Secretary #Khatik ఆంధ్రప్రదేశ్ #ఆరెకటిక సంఘం రాష్ట్రకార్యదర్శి.

May 9, 2021, 7 tweets

#IndianOcean
హిందూ మహాసముద్రం ప్రపంచంలోని మహాసముద్ర విభాగాలలో మూడవ అతిపెద్దది, ఇది 70,560,000 కిమీ, భూమి ఉపరితలంపై 19.8% నీటిని కలిగి ఉంది. దీనికి ఉత్తరాన ఆసియా, పశ్చిమాన ఆఫ్రికా, తూర్పున ఆస్ట్రేలియా ఉన్నాయి.
#Ocean

ఉపయోగంలో ఉన్న నిర్వచనాన్ని బట్టి దక్షిణాన ఇది దక్షిణ మహాసముద్రం అంటార్కిటికాతో సరిహద్దులుగా ఉంది. హిందూ మహాసముద్రంలో అరేబియా సముద్రం,లాకాడివ్ సముద్రం,సోమాలి సముద్రం,బంగాళాఖాతం,అండమాన్ సముద్రం వంటి కొన్ని పెద్ద ఉపాంత ప్రాంతీయ సముద్రాలు ఉన్నాయి.దీన్నే అర్ధ మహాసముద్రం అని పిలుస్తారు

ఈ సముద్రం ఒడ్డునే ఉన్నాయి. తూర్పు ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా ఖంఢాలను వేరుచేస్తుంది. ఎండాకాలంలో ఈ సముద్రంలో తుఫాన్లు ఎక్కువగా వస్తాయి. అన్ని సమద్రాలకంటే వెచ్చని సముద్రమని పేరు.

ఒక దేశం పేరుతో ఉన్న ఏకైక మహాసముద్రం.
భారతదేశం (హిందూ దేశం) పేరుమీదుగా ఈ సముద్రానికి హిందూ మహాసముద్రం అని పేరు వచ్చింది. మడగాస్కర్ ఈ సముద్రంలోని పెద్ద దీవులలో ఒకటి. శ్రీలంక, షీచెల్లాస్. కొమోరోస్, మాల్దీవులు, మారిషస్ ఇతర దీవులు ఈ సముద్రంలో ఉన్నాయి.

ఈ సముద్రానికి ఉన్న వెచ్చదనం వలన చేపలు కూడా పరిమితంగా లభిస్తాయి. రొయ్యల, టూనా చేపలు లభిస్తాయి.అంతరించి పోతున్న జాతులలో తాబేళ్లు, తిమింగలాలు, డూగాంగ్ వంటివి ఉన్నాయి. హిందూ మహాసముద్రం మిగతా సముద్రాల కంటే చాలా ప్రశాంతమైన సముద్రం.

హిందూ మహాసముద్రం మిగతా సముద్రాల కంటే చాలా ప్రశాంతమైన సముద్రం. హిందూమహాసముద్రంలో ఉన్న ముఖ్యమైన నౌకాశ్రయాలు కోచి, కలకత్తా, విశాఖపట్నం, చెన్నై (భారతదేశానికి చెందినవి). యెమెన్ దేశంలోని అడెన్, ఆస్ట్రేలియాలోని పెర్త్, పాకిస్తాన్ లోని కరాచీ.

సముద్రంలో లభించే పెట్రోలియం ఉత్పత్తులలో 40 శాతం హిందూ మహా సముద్రం నుండే లభిస్తాయి.హిందూ మహాసముద్రానికి ఈశాన్య భాగంలో ఉండే సముద్రప్రాంతాన్ని బంగాళా ఖాతం అని పిలుస్తారు.

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling