H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture
AndhraPradesh #AreKatika Sangh State Secretary #Khatik ఆంధ్రప్రదేశ్ #ఆరెకటిక సంఘం రాష్ట్రకార్యదర్శి.

Jul 31, 2021, 10 tweets

ఉధమ్ సింగ్!
ప్రాణాలకు తెగించి బ్రిటీష్ వారిని ఎదిరించిన వీరుడు ఉధమ్ సింగ్, జలియన్ వాలా భాగ్ లో కొన్నివేలమంది ప్రాణాలు తీసి 15000 మందికి తీవ్రగాయాలు కలిగించిన దుర్ఘటనతో ఉధమ్ సింగ్ మనసు కకావికలమైంది. #ShaheedUdhamSingh
#UdhamSingh

కళ్లముందు తుపాకీ తూటాల దెబ్బలకు గిలగిలా కొట్టుకుంటూ తల్లిదండ్రులతో పాటు వందలాది మంది కళ్ళ ముందే చనిపోతుంటే కన్నీళ్ళు కూడా రాని ఆ దుస్ధితిలో వరుసగా అక్కడున్న ఒక్కో శవాన్ని పేర్చుతూ తనలో తానే మాటాడుకుంటూ మనసులోనే శపధం చేసుకుంటున్న ఒక పధ్నాలుగేళ్ళ కుర్రాడి మానసిక స్ధితినీ,

దేశభక్తినీ, దీనికి కారణమైన జనరల్ మైకేల్ ఓ డయ్యర్ పై పెంచుకున్న పగను మరెవ్వరిలోనూ చూడలేం. డయ్యర్ పై పగబట్టి ఏకంగా 21 ఏళ్ళపాటు నీడలా వెంటాడి వెంటాడి అందరికీ తెలిసేలా పబ్లిగ్గా కాల్చి చంపాడంటే అర్ధం చేసుకోవచ్చు ఉధమ్ సింగ్ అనుక్షణం తన పగ కోసమే బ్రతుకుతూ తన లక్ష్యం కోసమే

జీవితాన్ని అంకితం ఇచ్చాడని. " నేను పారిపోవడమంటే తెలియని భారతదేశపు మట్టిలో పుట్టినవాడిని, మేము తూటాలకు చాతీని చూపించి ఎదురు వెళ్తామే కానీ వెన్ను చూపి తూటాలకు బలికావడం తెలియదు మాకు , మీరు ఏరోజైతే నన్ను ఉరికంబం ఎక్కిస్తారో ఆరోజు నాచావుని చూసి దేశాన్ని కాపాడేమరో పదివేలమంది

ఉధమ్ సింగ్ లు పుట్టుకొస్తారు. నేను పిరికివాడ్ని కాదు . నాదేశం కోసం అమరుడిగా మారడం నాకు ఎప్పుడూ సంతోషమే, నా చావుకి చింతించకండి. నన్ను నిరభ్యంతరంగా ఉరితీయండి. విప్లవం వర్ధిల్లాలి , భరతమాతకి జై....! " ...... ఇవి చివరిసారిగా ఉధమ్ సింగ్ న్యాయస్ధానంలో అవకాశం ఉన్నా

నీవెందుకు తప్పించుకుని పారిపోలేదు అని ప్రశ్నించిన న్యాయధిపతితో చెప్పిన మాటలు.

ఉధమ్ సింగ్ పూర్తి స్పృహలో , పూర్తి విచక్షణతో ఉన్నాడనీ, అతని పగ వ్యక్తిగతం కాదనీ, భారతీయులను క్రూరంగా చంపే బ్రిటీష్ వారికి తానొక హెచ్చరిక చేయాలనుకున్నాడనీ, డయ్యర్ లాంటి వారందరికీ మృత్యుభయం చూపించాలనుకున్నాడనీ, స్త్రీలపై డయ్యర్ చేసిన అత్యాచారాలకు స్వయంగా శిక్ష

విధించాలనుకున్నాడనీ అతని చివరి సందేశం చదివినవారికి అర్ధమౌతుంది. ఉధమ్ సింగ్ భరతమాత దాస్య విముక్తి కోసం తన జీవితంతో పాటు ప్రాణాలు సైతం అర్పించిన దేశభక్తుడు, అమాయక భారతీయుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుని చిరునవ్వుతో ఉరికంబానికి వేలాడిన రియల్ హీరో....!

కానీ అతనికి సరైన గుర్తింపు లేదు , మనలో చాలామందికి అతని పేరు కూడా తెలియదు. చివరికి అతని చితాభస్మాన్ని మన దేశం తీసుకురావడానికి కూడా మనకి దాదాపు 34 ఏళ్ళ సమయం పట్టింది.

షహీద్ ఉధమ్ సింగ్ ను ఉరి తీసి నేటికి 81 ఏళ్ళు అవుతుంది. (31/7/1940).

నేడు ఆ రియల్ హీరో వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనీ, ఏ పాఠ్యపుస్తకాలూ చెప్పని ఇలాంటి అమరవీరుల త్యాగాలనూ, నిజమైన దేశభక్తులు చరిత్రలనూ ఈతరం విద్యార్థులు తెలుసుకోవాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ.... జైహింద్...!

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling