ఉధమ్ సింగ్!
ప్రాణాలకు తెగించి బ్రిటీష్ వారిని ఎదిరించిన వీరుడు ఉధమ్ సింగ్, జలియన్ వాలా భాగ్ లో కొన్నివేలమంది ప్రాణాలు తీసి 15000 మందికి తీవ్రగాయాలు కలిగించిన దుర్ఘటనతో ఉధమ్ సింగ్ మనసు కకావికలమైంది. #ShaheedUdhamSingh
#UdhamSingh Image
కళ్లముందు తుపాకీ తూటాల దెబ్బలకు గిలగిలా కొట్టుకుంటూ తల్లిదండ్రులతో పాటు వందలాది మంది కళ్ళ ముందే చనిపోతుంటే కన్నీళ్ళు కూడా రాని ఆ దుస్ధితిలో వరుసగా అక్కడున్న ఒక్కో శవాన్ని పేర్చుతూ తనలో తానే మాటాడుకుంటూ మనసులోనే శపధం చేసుకుంటున్న ఒక పధ్నాలుగేళ్ళ కుర్రాడి మానసిక స్ధితినీ,
దేశభక్తినీ, దీనికి కారణమైన జనరల్ మైకేల్ ఓ డయ్యర్ పై పెంచుకున్న పగను మరెవ్వరిలోనూ చూడలేం. డయ్యర్ పై పగబట్టి ఏకంగా 21 ఏళ్ళపాటు నీడలా వెంటాడి వెంటాడి అందరికీ తెలిసేలా పబ్లిగ్గా కాల్చి చంపాడంటే అర్ధం చేసుకోవచ్చు ఉధమ్ సింగ్ అనుక్షణం తన పగ కోసమే బ్రతుకుతూ తన లక్ష్యం కోసమే
జీవితాన్ని అంకితం ఇచ్చాడని. " నేను పారిపోవడమంటే తెలియని భారతదేశపు మట్టిలో పుట్టినవాడిని, మేము తూటాలకు చాతీని చూపించి ఎదురు వెళ్తామే కానీ వెన్ను చూపి తూటాలకు బలికావడం తెలియదు మాకు , మీరు ఏరోజైతే నన్ను ఉరికంబం ఎక్కిస్తారో ఆరోజు నాచావుని చూసి దేశాన్ని కాపాడేమరో పదివేలమంది Image
ఉధమ్ సింగ్ లు పుట్టుకొస్తారు. నేను పిరికివాడ్ని కాదు . నాదేశం కోసం అమరుడిగా మారడం నాకు ఎప్పుడూ సంతోషమే, నా చావుకి చింతించకండి. నన్ను నిరభ్యంతరంగా ఉరితీయండి. విప్లవం వర్ధిల్లాలి , భరతమాతకి జై....! " ...... ఇవి చివరిసారిగా ఉధమ్ సింగ్ న్యాయస్ధానంలో అవకాశం ఉన్నా Image
నీవెందుకు తప్పించుకుని పారిపోలేదు అని ప్రశ్నించిన న్యాయధిపతితో చెప్పిన మాటలు.
ఉధమ్ సింగ్ పూర్తి స్పృహలో , పూర్తి విచక్షణతో ఉన్నాడనీ, అతని పగ వ్యక్తిగతం కాదనీ, భారతీయులను క్రూరంగా చంపే బ్రిటీష్ వారికి తానొక హెచ్చరిక చేయాలనుకున్నాడనీ, డయ్యర్ లాంటి వారందరికీ మృత్యుభయం చూపించాలనుకున్నాడనీ, స్త్రీలపై డయ్యర్ చేసిన అత్యాచారాలకు స్వయంగా శిక్ష
విధించాలనుకున్నాడనీ అతని చివరి సందేశం చదివినవారికి అర్ధమౌతుంది. ఉధమ్ సింగ్ భరతమాత దాస్య విముక్తి కోసం తన జీవితంతో పాటు ప్రాణాలు సైతం అర్పించిన దేశభక్తుడు, అమాయక భారతీయుల మరణాలకు ప్రతీకారం తీర్చుకుని చిరునవ్వుతో ఉరికంబానికి వేలాడిన రియల్ హీరో....! Image
కానీ అతనికి సరైన గుర్తింపు లేదు , మనలో చాలామందికి అతని పేరు కూడా తెలియదు. చివరికి అతని చితాభస్మాన్ని మన దేశం తీసుకురావడానికి కూడా మనకి దాదాపు 34 ఏళ్ళ సమయం పట్టింది.

షహీద్ ఉధమ్ సింగ్ ను ఉరి తీసి నేటికి 81 ఏళ్ళు అవుతుంది. (31/7/1940). Image
నేడు ఆ రియల్ హీరో వర్ధంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనీ, ఏ పాఠ్యపుస్తకాలూ చెప్పని ఇలాంటి అమరవీరుల త్యాగాలనూ, నిజమైన దేశభక్తులు చరిత్రలనూ ఈతరం విద్యార్థులు తెలుసుకోవాలనీ మనస్పూర్తిగా కోరుకుంటూ.... జైహింద్...! Image

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO

H. PARAMESHWARA 🇮🇳 (H.పరమేశ్వర రావు) RAO Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @ParameswaraRaoH

Apr 30, 2023
#FatherOfIndianCinema #DadasahebPhalke
ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది. వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల Image
నుండి దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగారు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కారు.
ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే (ఆంగ్లం : Dhundiraj Govind Phalke), జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ భాష : दादासाहेब फाळके) (ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి.
Read 5 tweets
Apr 30, 2023
#vasavijayanthi
మిత్రులకు, శ్రేయోభిలాషులకూ, అందరికీ శ్రీ వాసవీ మాతా జయంతి శుభాకాంక్షలు ✨💐🌹🌹🙏 జై మాతా!! జై జై మాతా!!!

ఆమె- మేరు నగ ధీర. స్థైర్య, ధైర్యాల నిండైన కలగలుపు. నిలువెల్లా ఆత్మాభిమానం ఆమె సొత్తు. ఆత్మాభిమానాన్ని కాపాడుకోడానికి తృణప్రాయంగా ఆత్మ బలిదానం చేయడానికి Image
వెనుకాడలేదు. అంతకు మించి ఆమెది విశాల హృదయం. సమాజ హితమే తన హితమనుకుంది. రక్తపాతాన్ని నిరసించింది. శాంతిని అణువణువునా కోరుకుంది. ఆమె ఎవరో కాదు, వాసవీ దేవి. ఆర్యవైశ్యుల నుంచి కులదేవతగా నీరాజనాలందుకుంటున్న తల్లి. ఇప్పటి పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ ఆమె పుట్టిన ఊరు.
తండ్రి కుసుమ శ్రేష్టి. వైశ్యగణానికి రాజు. 11వ శతాబ్దం నాటి కథ ఇది. సంగీత, సాహిత్యాల వంటి కళల్లో ఆరితేరిన వాసవీ దేవి అపురూప సౌందర్య రాశి. అప్పట్లో పెనుగొండ రాజ్యం వేంగీ చాళుక్య సామ్రాజ్యంలో అంతర్భాగం. విష్ణువర్ధనుడనే మహారాజు రాజమహేంద్ర వరం రాజధానిగా వేంగీ దేశాన్ని పాలించేవారు. Image
Read 12 tweets
Apr 30, 2023
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1608 - 1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు Image
పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి,
వైఎస్ఆర్ కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ
Read 5 tweets
Apr 29, 2023
#WorldDanceDay 💃🕺 #InternationalDanceDay
ప్రతి సంవత్సరము ఏప్రిల్ 29 న అంతర్జాతీయ నృత్య దినోత్సవం యునెస్కో (UNESCO) లో భాగమైన అంతర్జాతీయ డాన్స్ కౌన్సిల్ (CID) ఆద్వర్యములో 1982 నుండి జరుపు కుంటున్నారు .

నాట్యము (ఆంగ్లం : #Dance) (ఫ్రెంచి పదము డాన్సెర్ నుండి ఉద్భవించింది): Image
సాధారణంగా సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలు, లేదా "లయబద్ధ సంగీతానికి, శరీరం లయబద్ధంగా కదలడం" అని చెప్పుకోవచ్చు

నాట్య శబ్దము నృత్యమునకు పర్యాయపదము. భరతుని నాట్య శాస్త్రంలో నృత్యం అనే పదం లేదు. నృత్తము, నాట్యము అను పదములే కలవు. నృత్తము నాట్యముకంటే చాలా ప్రాచీనమైనది.
ఈ రెండు కళలు వేర్వేరుగ జన్మించి, వేర్వేరుగ అభివృద్ధి చెందాయి. భరతుడే ప్రధమంగా నృత్తమును నాట్యంలో చేర్చాడు. కరణ-అంగహార సంపన్నమైనది నృత్తము. ఇది అర్ధాన్ని బోధించదు. కేవలం అవయవ విన్యాసములతో కూడి ఉండును. నాట్యం 4 విధాలైన అభినయాలతో కూడి ఉండును. నృత్తమందలి అంగ విన్యాసమును, నాట్యమందలి
Read 11 tweets
Apr 29, 2023
#GoBirdingDay #birdwatching
మన చుట్టూ ఉన్న జీవవైవిధ్యంలో పక్షులు చాలా ఆకర్షణీయమైనవి. పక్షుల గురించి మనకి ఏమి తెలుసు? మనల్ని ఇంతగా ఎలా ఆకర్షిస్తాయి ? రండి.... పక్షుల ప్రపంచంలోకి చూద్దాం, మన చుట్టూ ఉన్న పక్షుల గురించి తెలుసుకుందాం. Image
మనుషులకు ఎన్నో పండుగలు ఉండగా,పక్షులకు ఒక పండుగ ఎందుకు ఉండకూడదు..
నేడే #GoBirdingDay
పక్షులు మరియు పక్షి వీక్షణ దినోత్సవం

ఎండలు మండుతున్నాయి. నీటి వనరులు అడుగంటుతున్నాయి. ఉష్ణతీవ్రతకు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తరచూ దప్పిక తీర్చుకోవాల్సి వస్తోంది.
జనాలకైతే ఎక్కడికెళ్లినా తాగు నీరు అందుబాటులో ఉంటుంది. పశుపక్షాదులకు ఈ కాలంలో ఇబ్బందిగానే ఉంటుంది. మన ఇళ్ల చుట్టూ తిరిగే పక్షులు నల్లాల వద్ద రాలే నీటి చుక్కలతో గొంతు తడుపుకొనే ప్రయత్నం చేస్తుంటాయి. ఎండాకాలంలో అవి పడే అవస్థలు చూసి కొందరు చిన్న పాత్రలు,
Read 5 tweets
Apr 29, 2023
#InternationalAstronomyDay
ఖగోళ శాస్త్రము (#Astronomy) అంటే నభోమండలం గురించిన అధ్యయనం. అంటే అంతరిక్షశాస్త్రం. అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర గ్రహ, నక్షత్రాదులతోపాటు విశ్వంలో ఉన్న అనేక ఖగోళ వస్తువులు/ పదార్థాల ఉత్పత్తి, ఉనికి, లక్షణాలు, నాశనములను శాస్త్రబద్ధంగా వివరిస్తుంది. Image
ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. దూరదర్శిని (టెలిస్కోపు) కనుగొన్న తరువాత ఖగోళశాస్త్ర్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం రెండు ఉపశాస్త్రాలుగా విభజించబడింది. అవి:

పరశీలక ఖగోళశాస్త్రం (Observational Astronomy):
టెలిస్కోపులు, కంప్యూటర్లు వగైరా పరికరాలతో ఖగోళ వస్తువులను పరిశోధించి సంగ్రహించిన విషయాలను ప్రాథమిక భౌతికశాస్త్ర సూత్రాలతో వివరించడం, వాటి ఫలితాలను విశ్లేషించడము.
సైద్ధాంతిక ఖగోళభౌతిక శాస్త్రం (Theoretical astrophysics): విశ్వ రహస్యాలను వివరించడానికి గణిత సంభూతమైన
Read 12 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us!

:(