@RayaIaseema #Tirumala #Tirupati
#TumburaTeertham ప్రకృతి ఒడిలో నిఘూడ వైవిద్యం.. తుంబర తీర్ధం....
#తిరుమలలో ఘనంగా కుమారధార తీర్థ ముక్కోటి
శేషాచల అడవుల్లో ఉన్న తుంబుర తీర్థం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.
ట్రెక్కింగ్ వంటి సాహస యాత్రలకు స్వర్గధామం. కొండలు, కోనలు, రాళ్లు రప్పలు దాటుకుని.. తుంబుర క్షేత్రం సందర్శించడం నిజంగా థ్రిల్లింగే.
శేషాచలం అటవీ ప్రాంతంలోని తిరుమల కొండల్లో దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన సుందరదృశ్యం తుంబుర తీర్థం.
ఆదిమ మానవులు సంచరించినట్టు, నివాసమున్నట్టు ఆధారాలున్న ప్రాంతం ఇది. ట్రెక్కర్లు, సాహసికులు, అన్వేషకులు ఇక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. జలనిక్షేపాలకు ఆలవాలం ఈ ప్రాంత పరిసరాలు. మండు వేసవిలో పరవళ్లుతొక్కే నీటి అందాలను ఆస్వాదించాలంటే ఈ ప్రాంతాన్ని తప్పక దర్శించాలి .
తిరుమల తుంబుర తీర్థ యాత్ర ఓ రకంగా సాహసయాత్ర. చిన్నాపెద్దా బేధం లేకుండా 12 కిలోమీటర్ల దూరాన్ని (రాను, పోను) అధిగమించి, జలపాతం వద్ద స్నానం చేసి వస్తుంటారు. అత్యంత కష్టమైన సన్నని రహదారి పల్లానికి ఉంటుంది.
అంతేకాదు, దగ్గరకు వెళ్లేకొలదీ పెద్దపెద్ద బండరాళ్లను, లోతైన సనందన తీర్థాన్ని దాటుకుంటూ వెళ్లాల్సిందే.
వర్షం పడిందంటే ఈ రహదారి 'యమ'డేంజర్. జారిపడితే ఎక్కడ ఉంటామో తెలియదు. అయితే జలపాతం కిందకు వెళ్లి స్నానం చేస్తుంటే అలసట అంతా ఏమవుతుందో తెలియదు.
మనస్సు పరవళ్లు తొక్కుతూ, ఎంతసేపైనా ఆ జలపాతం వద్ద కేరింతలు కొట్టాలనిపిస్తుంది. జలపాతం నుంచి పైకి చూస్తే రెండుగా చీలిన కొండల్లోనుంచి కనిపించే ఆకాశం అద్భుత సన్నివేశం.
ఈ ఏడాది మార్చి నెలలో తిరుమల పాపవినాశం నుంచి టిటిడి అధికారులు తుంబుర తీర్థ ప్రాంత సందర్శనకు అనుమతినిచ్చారు. దారి పొడవునా చెట్లు, కొండలు, సెలయేళ్లు, నీటిమడుగులు, పెద్దలోయలు తారసపడ్డాయి. అడవి పులులు, ఎలుగుబంట్లు, రేసుకుక్కలు, అడవిపందులు, కణుజులు, కొండగొర్రెలు,
ఆలవలు, మింటవలు, కొండచిలువలు, కట్లపాములు, కోతులు, కోడిపుంజులు, పచ్చపావురాళ్లు, పూరుడు పిట్టలు, పిల్లులు, దేవాంగ పిల్లులు, బెట్టుడతలు, సాలెపురుగులు, సీతాకోక చిలుకలు,
ఎర్రచందనం, జాలరి బిల్లు, కరక, అడవి మామిడి, బూరుగు, ఉసిరి, మోగు, వెదురు, దేవదారు చెట్లు, మిన్నాగు, నీలిరంగు సాలెపురుగు, మచ్చంగి, పెద్దపులి వంటి వణ్యప్రాణులకు ఆవాసం ఈ ప్రాంతం .
ప్రాంత విశేషాలు!
శేషాచలం అడవుల్లో 108 తీర్థాలున్నట్లుగా చెబుతారు. వీటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది తుంబుర తీర్థంగా చెప్పబడే ఘోణతీర్థం.
తూర్పు కనుమలు, దక్కను పీఠభూమికి చెందిన శేషాచలం అటవీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో ఉంది. తిరుపతి - కడప రాష్ట్ర హైవే మీద గల మామండూరు, కుక్కలదొడ్డి గ్రామాలనుంచి ప్రయాణిస్తే తుంబుర తీర్థం చేరుకోవచ్చు.
కుక్కలదొడ్డి నుంచి తుంబుర తీర్థానికి 14 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాలి. కుక్కలదొడ్డికి పశ్చిమంగా పందిగుంట, బండి ఇరుసులు, చాకిరేవు బాన, పగడమాను గుండం, కరువుకోనమొత్తం, చెంచమ్మలపేట, సన్యాసోడివిగవిల మీదుగా తుంబుర కోన చేరుకొనే మార్గం.
అలాగే, తిరుమల కొండ చేరుకుని పాపనాశనం డ్యాం నుంచి సనకసనందన తీర్థం, సలీంద్ర బండ, పింగదీసిన మడుగు మీదుగా ఏడుకిలోమీటర్లు ఓ లోయలోకి దిగుతూ ప్రయాణం చేసి తుంబుర తీర్థం చేరుకోవచ్చు.
చారిత్రక ఆనవాళ్లు!
కోట్లాది సంవత్సరాల క్రితం భూమి పరిణామ క్రమంలో భాగంగా ఓ పెద్ద కొండ అమాంతం రెండుగా విచ్చుకుని దోవ విడిచినట్టు ఓ మార్గం ఉంటుంది. ఆ దారిగుండా సుమారు ముప్పావు కిలోమీటరు ముందుకెళితే సుందర తీర్థ జలపాతం దర్శనమిస్తుంది.
కొబ్బరికాయ రెండు చెక్కలైనట్టుగా నారికేళ జలం చిప్పిల్లినట్లు కొండలమధ్య దృశ్యం కనపడుతుంది.
తుంబుర కోన చేరుకోవటం ఒక ఎత్తయితే, కోన నుంచి తీర్థస్థలికి వెళ్లటం మరో ఎత్తు. ఎన్నో అమూల్యమైన మూలికల సారాన్ని ఇముడ్చుకుని ప్రవహిస్తుంది ఈ జలపాతం. జీవజాలం, మనిషి పుట్టుకే ఆశ్చర్యమనుకుంటే..
ఆ ఆవిర్భావానికి కారణమైన మూల ప్రకృతి మరింతటి నిబిడాశ్చర్యకరం.
అలాంటి కుతూహలం రేకెత్తించే ప్రాకృతిక చమత్కృత శిలాశిల్పాలయం తుంబుర తీర్థం. సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం నాటి చిత్రాలు తుంబుర కోన సన్యాసోడి గవికి నడుమ, బూచోళ్ల పేటకు దిగువగల సేలయేటి పాయకు అవతలిగట్టున
ఓ రాతి బండలకు బొమ్మలు కనిపిస్తాయి.
ఆదిమానవులు చిత్రాల రూపంలో చరిత్రను శిల్పించారు. రాతిరేఖలు తెలుపు, ఎరుపురంగుల్లో ఉంటాయి. ఏనుగుపై సవారీ, పిట్టలు, చారలపులి, ఆటపాటల సన్నివేశాలు చిత్రించారు. ఇప్పటికీ చెక్కుచెదరని ఈ కుడ్య చిత్రాలు తయారీకి మూలికారసాలు,
ఖనిజద్రవ్యాలు కలగలపి వర్ణాలుగా వాడారు. రాతిగోడనే కాన్వాసుగా మలచుకుని తమ భావాలకు రూపం పోశారు. ఈ ఆరుబయలు ఆర్ట్‌గ్యాలరీ నిజానికి నాటి మనుషుల మతారాధానా నిలయంగా భావించొచ్చు. ఇలాంటివి శేషాచలం అడవుల్లో మరెన్నో ఉన్నాయి.
మడపతీగ
మడపమాను తీగలు ఈ ప్రాంతంలో చుట్టలు, చుట్టుకుని అడవిలో విస్తరించి కనిపిస్తుంటాయి. చుట్ట చుట్టుకుని పడుకున్న అనకొండలు లాగా భ్రమిస్తాము. కొన్నికిలో మీటర్ల దూరం వరకు విస్తరించి ఉన్న మడపతీగెలు చాలా దృఢంగా ఉండి స్ప్రింగుల్లాంటి స్థితి స్థాపకత్వం కలిగి ఉంటాయి.
వీటి కాయల్లోని పప్పును కీళ్లనొప్పుల నివారిణిగా మందుల్లో వాడుతారు.
ఈ లోయలో ఉదయపు నీరెండ బంగారు రంగు, క్రమంగా నారింజ, పసుపుపచ్చ, ఊదా, ముదురు గోధుమ రంగులతో వర్ణశోభను సంతరించుకుంటూ ఎంతగానో ఆకర్షిస్తుంది .
సూర్యకాంతి నిట్టనిలువుగా పడేటప్పుడు ఒకలా, ఏటవాలుగా పడేటప్పుడు మరోలా కాంతి తరంగ దైర్ఘ్యాన్ని అనుసరించి వర్ణసయ్యాట సాగుతుంది. సముద్రమట్టానికి 1200 నుంచి మూడు వేల అడుగుల ఎత్తుదాకా ఈ కొండల శ్రేణి ఉంది. ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు మార్పులకు చేర్పులకు లోనవుతూ ఉంటుంది.
ఇటీవలే శేషాచలం ప్రాంతాన్ని 'జీవ వైవిధ్య వాటిక'గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ అరుదైన ఎర్రచందనం విస్తారంగా దొరుకుతుంది. 'ఉక్కుకొయ్య'గా పేరొందిన ఎర్రచందనానికి ప్రపంచంలో అత్యంత విలువైన కొయ్యగా పేరుంది.
వందేళ్లకిందట అంతరించి పోయిందనుకున్న బంగారు బల్లి ఈ ప్రాంతంలో తిరిగి కన్పించింది. అమెరికాలోని ఉటా దగ్గర గల గ్రాండ్‌కెన్సాన్, అరిజోనా రాష్ట్రంలోని ఏంటిలోప్ కెన్సాన్‌కు వారసురాలుగా తుంబుర కెన్సాన్‌ను గుర్తించారు.
తిరుమల శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్ధంగా పేరొందిన తుంబురు తీర్థ ముక్కోటికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కొవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత అనుమతించడంతో ఉత్సాహంగా వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు ఈ తీర్థంలో స్నానం చేస్తే దేవుని మీద భక్తి పెరగడంతోపాటు గతంలో చేసిన సకలపాపాలన్నీ దూరమవుతాయి
తిరుమల శ్రీవారి వివాహ భోజనంబు
• స్వామి వారి పెళ్ళికి మొత్తం 33కోట్ల మంది దేవతలు వచ్చారట అని వెంకటాచలం మహత్యం చెప్తుంది.
• భోజనానికి వీరంతా కూర్చుంటే తిరుమల నించి శ్రీశైలం వరకు సరిపోయారు అని పురాణ గాధ.
• శ్రీవారి పుష్కరిణి లో అన్నం
• దేవతీర్థం లో కూర
• పాపవినాశనం లో పప్పు
•* కుమారధార లో భక్ష్యాలు*
• ఆకాశగంగ లో పరమాన్నం
• తుంబుర తీర్థం లో చిత్రాణం
• ఇతర తీర్థాలులో మిగిలిన వంటకాలు చేశారట
ఓం నమో వెంకటేశాయ...
తుంబర తీర్థ ముక్కోటి
Share this Scrolly Tale with your friends.
A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.