శేషాచల అడవుల్లో ఉన్న తుంబుర తీర్థం భక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు.
ట్రెక్కింగ్ వంటి సాహస యాత్రలకు స్వర్గధామం. కొండలు, కోనలు, రాళ్లు రప్పలు దాటుకుని.. తుంబుర క్షేత్రం సందర్శించడం నిజంగా థ్రిల్లింగే.
శేషాచలం అటవీ ప్రాంతంలోని తిరుమల కొండల్లో దాగి ఉన్న ప్రకృతి ప్రసాదించిన సుందరదృశ్యం తుంబుర తీర్థం.
ఆదిమ మానవులు సంచరించినట్టు, నివాసమున్నట్టు ఆధారాలున్న ప్రాంతం ఇది. ట్రెక్కర్లు, సాహసికులు, అన్వేషకులు ఇక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. జలనిక్షేపాలకు ఆలవాలం ఈ ప్రాంత పరిసరాలు. మండు వేసవిలో పరవళ్లుతొక్కే నీటి అందాలను ఆస్వాదించాలంటే ఈ ప్రాంతాన్ని తప్పక దర్శించాలి .
తిరుమల తుంబుర తీర్థ యాత్ర ఓ రకంగా సాహసయాత్ర. చిన్నాపెద్దా బేధం లేకుండా 12 కిలోమీటర్ల దూరాన్ని (రాను, పోను) అధిగమించి, జలపాతం వద్ద స్నానం చేసి వస్తుంటారు. అత్యంత కష్టమైన సన్నని రహదారి పల్లానికి ఉంటుంది.
అంతేకాదు, దగ్గరకు వెళ్లేకొలదీ పెద్దపెద్ద బండరాళ్లను, లోతైన సనందన తీర్థాన్ని దాటుకుంటూ వెళ్లాల్సిందే.
వర్షం పడిందంటే ఈ రహదారి 'యమ'డేంజర్. జారిపడితే ఎక్కడ ఉంటామో తెలియదు. అయితే జలపాతం కిందకు వెళ్లి స్నానం చేస్తుంటే అలసట అంతా ఏమవుతుందో తెలియదు.
మనస్సు పరవళ్లు తొక్కుతూ, ఎంతసేపైనా ఆ జలపాతం వద్ద కేరింతలు కొట్టాలనిపిస్తుంది. జలపాతం నుంచి పైకి చూస్తే రెండుగా చీలిన కొండల్లోనుంచి కనిపించే ఆకాశం అద్భుత సన్నివేశం.
ఈ ఏడాది మార్చి నెలలో తిరుమల పాపవినాశం నుంచి టిటిడి అధికారులు తుంబుర తీర్థ ప్రాంత సందర్శనకు అనుమతినిచ్చారు. దారి పొడవునా చెట్లు, కొండలు, సెలయేళ్లు, నీటిమడుగులు, పెద్దలోయలు తారసపడ్డాయి. అడవి పులులు, ఎలుగుబంట్లు, రేసుకుక్కలు, అడవిపందులు, కణుజులు, కొండగొర్రెలు,
ఎర్రచందనం, జాలరి బిల్లు, కరక, అడవి మామిడి, బూరుగు, ఉసిరి, మోగు, వెదురు, దేవదారు చెట్లు, మిన్నాగు, నీలిరంగు సాలెపురుగు, మచ్చంగి, పెద్దపులి వంటి వణ్యప్రాణులకు ఆవాసం ఈ ప్రాంతం .
ప్రాంత విశేషాలు!
శేషాచలం అడవుల్లో 108 తీర్థాలున్నట్లుగా చెబుతారు. వీటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది తుంబుర తీర్థంగా చెప్పబడే ఘోణతీర్థం.
తూర్పు కనుమలు, దక్కను పీఠభూమికి చెందిన శేషాచలం అటవీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, కడప జిల్లాల పరిధిలో ఉంది. తిరుపతి - కడప రాష్ట్ర హైవే మీద గల మామండూరు, కుక్కలదొడ్డి గ్రామాలనుంచి ప్రయాణిస్తే తుంబుర తీర్థం చేరుకోవచ్చు.
కుక్కలదొడ్డి నుంచి తుంబుర తీర్థానికి 14 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో ప్రయాణం చేయాలి. కుక్కలదొడ్డికి పశ్చిమంగా పందిగుంట, బండి ఇరుసులు, చాకిరేవు బాన, పగడమాను గుండం, కరువుకోనమొత్తం, చెంచమ్మలపేట, సన్యాసోడివిగవిల మీదుగా తుంబుర కోన చేరుకొనే మార్గం.
అలాగే, తిరుమల కొండ చేరుకుని పాపనాశనం డ్యాం నుంచి సనకసనందన తీర్థం, సలీంద్ర బండ, పింగదీసిన మడుగు మీదుగా ఏడుకిలోమీటర్లు ఓ లోయలోకి దిగుతూ ప్రయాణం చేసి తుంబుర తీర్థం చేరుకోవచ్చు.
చారిత్రక ఆనవాళ్లు!
కోట్లాది సంవత్సరాల క్రితం భూమి పరిణామ క్రమంలో భాగంగా ఓ పెద్ద కొండ అమాంతం రెండుగా విచ్చుకుని దోవ విడిచినట్టు ఓ మార్గం ఉంటుంది. ఆ దారిగుండా సుమారు ముప్పావు కిలోమీటరు ముందుకెళితే సుందర తీర్థ జలపాతం దర్శనమిస్తుంది.
కొబ్బరికాయ రెండు చెక్కలైనట్టుగా నారికేళ జలం చిప్పిల్లినట్లు కొండలమధ్య దృశ్యం కనపడుతుంది.
తుంబుర కోన చేరుకోవటం ఒక ఎత్తయితే, కోన నుంచి తీర్థస్థలికి వెళ్లటం మరో ఎత్తు. ఎన్నో అమూల్యమైన మూలికల సారాన్ని ఇముడ్చుకుని ప్రవహిస్తుంది ఈ జలపాతం. జీవజాలం, మనిషి పుట్టుకే ఆశ్చర్యమనుకుంటే..
ఆ ఆవిర్భావానికి కారణమైన మూల ప్రకృతి మరింతటి నిబిడాశ్చర్యకరం.
అలాంటి కుతూహలం రేకెత్తించే ప్రాకృతిక చమత్కృత శిలాశిల్పాలయం తుంబుర తీర్థం. సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం నాటి చిత్రాలు తుంబుర కోన సన్యాసోడి గవికి నడుమ, బూచోళ్ల పేటకు దిగువగల సేలయేటి పాయకు అవతలిగట్టున
ఓ రాతి బండలకు బొమ్మలు కనిపిస్తాయి.
ఆదిమానవులు చిత్రాల రూపంలో చరిత్రను శిల్పించారు. రాతిరేఖలు తెలుపు, ఎరుపురంగుల్లో ఉంటాయి. ఏనుగుపై సవారీ, పిట్టలు, చారలపులి, ఆటపాటల సన్నివేశాలు చిత్రించారు. ఇప్పటికీ చెక్కుచెదరని ఈ కుడ్య చిత్రాలు తయారీకి మూలికారసాలు,
ఖనిజద్రవ్యాలు కలగలపి వర్ణాలుగా వాడారు. రాతిగోడనే కాన్వాసుగా మలచుకుని తమ భావాలకు రూపం పోశారు. ఈ ఆరుబయలు ఆర్ట్‌గ్యాలరీ నిజానికి నాటి మనుషుల మతారాధానా నిలయంగా భావించొచ్చు. ఇలాంటివి శేషాచలం అడవుల్లో మరెన్నో ఉన్నాయి.
మడపతీగ
మడపమాను తీగలు ఈ ప్రాంతంలో చుట్టలు, చుట్టుకుని అడవిలో విస్తరించి కనిపిస్తుంటాయి. చుట్ట చుట్టుకుని పడుకున్న అనకొండలు లాగా భ్రమిస్తాము. కొన్నికిలో మీటర్ల దూరం వరకు విస్తరించి ఉన్న మడపతీగెలు చాలా దృఢంగా ఉండి స్ప్రింగుల్లాంటి స్థితి స్థాపకత్వం కలిగి ఉంటాయి.
వీటి కాయల్లోని పప్పును కీళ్లనొప్పుల నివారిణిగా మందుల్లో వాడుతారు.
ఈ లోయలో ఉదయపు నీరెండ బంగారు రంగు, క్రమంగా నారింజ, పసుపుపచ్చ, ఊదా, ముదురు గోధుమ రంగులతో వర్ణశోభను సంతరించుకుంటూ ఎంతగానో ఆకర్షిస్తుంది .
సూర్యకాంతి నిట్టనిలువుగా పడేటప్పుడు ఒకలా, ఏటవాలుగా పడేటప్పుడు మరోలా కాంతి తరంగ దైర్ఘ్యాన్ని అనుసరించి వర్ణసయ్యాట సాగుతుంది. సముద్రమట్టానికి 1200 నుంచి మూడు వేల అడుగుల ఎత్తుదాకా ఈ కొండల శ్రేణి ఉంది. ఉష్ణోగ్రత 18 డిగ్రీల నుంచి 46 డిగ్రీల వరకు మార్పులకు చేర్పులకు లోనవుతూ ఉంటుంది.
ఇటీవలే శేషాచలం ప్రాంతాన్ని 'జీవ వైవిధ్య వాటిక'గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక్కడ అరుదైన ఎర్రచందనం విస్తారంగా దొరుకుతుంది. 'ఉక్కుకొయ్య'గా పేరొందిన ఎర్రచందనానికి ప్రపంచంలో అత్యంత విలువైన కొయ్యగా పేరుంది.
వందేళ్లకిందట అంతరించి పోయిందనుకున్న బంగారు బల్లి ఈ ప్రాంతంలో తిరిగి కన్పించింది. అమెరికాలోని ఉటా దగ్గర గల గ్రాండ్‌కెన్సాన్, అరిజోనా రాష్ట్రంలోని ఏంటిలోప్ కెన్సాన్‌కు వారసురాలుగా తుంబుర కెన్సాన్‌ను గుర్తించారు.
తిరుమల శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్ధంగా పేరొందిన తుంబురు తీర్థ ముక్కోటికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. కొవిడ్ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత అనుమతించడంతో ఉత్సాహంగా వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు ఈ తీర్థంలో స్నానం చేస్తే దేవుని మీద భక్తి పెరగడంతోపాటు గతంలో చేసిన సకలపాపాలన్నీ దూరమవుతాయి
తిరుమల శ్రీవారి వివాహ భోజనంబు
• స్వామి వారి పెళ్ళికి మొత్తం 33కోట్ల మంది దేవతలు వచ్చారట అని వెంకటాచలం మహత్యం చెప్తుంది.
• భోజనానికి వీరంతా కూర్చుంటే తిరుమల నించి శ్రీశైలం వరకు సరిపోయారు అని పురాణ గాధ.
• శ్రీవారి పుష్కరిణి లో అన్నం
• దేవతీర్థం లో కూర
• పాపవినాశనం లో పప్పు
•* కుమారధార లో భక్ష్యాలు*
• ఆకాశగంగ లో పరమాన్నం
• తుంబుర తీర్థం లో చిత్రాణం
• ఇతర తీర్థాలులో మిగిలిన వంటకాలు చేశారట
#FatherOfIndianCinema#DadasahebPhalke
ఒక అంకిత స్వభావుడి అరుదైన కృషి, జిజ్ఞాసల ఫలితంగా ఎనిమిది దశాబ్దాల క్రితం భారతదేశంలో చలన చిత్ర రంగం ఆవిష్కారమైనది. వెండి తెరపై భారతీయ దేవుళ్ళను చూడాలనే స్వప్నం కళ్లకెదురుగా కదలాడింది. ఆనాడు బైస్కోపులు అమెరికా, ఇతర నాగరిక పాశ్చాత్య దేశాల
నుండి దిగుమతి అయ్యేవి. చెక్కబొమ్మలు చెక్కేవారు. సంగీతం, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ, మాజిక్, మౌల్డింగ్ వంటి అనేక రంగాలలో ఆరితేరినవాడై స్వాప్నికుడిగా మారిన ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే భారతీయ చలనచిత్ర పితామహుడు కాగలిగారు. దాదా సాహెబ్ ఫాల్కేగా గణుతికెక్కారు.
ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే (ఆంగ్లం : Dhundiraj Govind Phalke), జనపరిచయ నామం దాదాసాహెబ్ ఫాల్కే (మరాఠీ భాష : दादासाहेब फाळके) (ఏప్రిల్ 30, 1870 - ఫిబ్రవరి 16, 1944) ఒక భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే-రచయిత, భారతీయ సినిమా పితామహుడు అని కూడా ప్రసిద్ధి.
#vasavijayanthi
మిత్రులకు, శ్రేయోభిలాషులకూ, అందరికీ శ్రీ వాసవీ మాతా జయంతి శుభాకాంక్షలు ✨💐🌹🌹🙏 జై మాతా!! జై జై మాతా!!!
ఆమె- మేరు నగ ధీర. స్థైర్య, ధైర్యాల నిండైన కలగలుపు. నిలువెల్లా ఆత్మాభిమానం ఆమె సొత్తు. ఆత్మాభిమానాన్ని కాపాడుకోడానికి తృణప్రాయంగా ఆత్మ బలిదానం చేయడానికి
వెనుకాడలేదు. అంతకు మించి ఆమెది విశాల హృదయం. సమాజ హితమే తన హితమనుకుంది. రక్తపాతాన్ని నిరసించింది. శాంతిని అణువణువునా కోరుకుంది. ఆమె ఎవరో కాదు, వాసవీ దేవి. ఆర్యవైశ్యుల నుంచి కులదేవతగా నీరాజనాలందుకుంటున్న తల్లి. ఇప్పటి పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ ఆమె పుట్టిన ఊరు.
తండ్రి కుసుమ శ్రేష్టి. వైశ్యగణానికి రాజు. 11వ శతాబ్దం నాటి కథ ఇది. సంగీత, సాహిత్యాల వంటి కళల్లో ఆరితేరిన వాసవీ దేవి అపురూప సౌందర్య రాశి. అప్పట్లో పెనుగొండ రాజ్యం వేంగీ చాళుక్య సామ్రాజ్యంలో అంతర్భాగం. విష్ణువర్ధనుడనే మహారాజు రాజమహేంద్ర వరం రాజధానిగా వేంగీ దేశాన్ని పాలించేవారు.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ( 1608 - 1693) 17వ శతాబ్దములో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త. సాక్షాత్ దైవ స్వరూపుడు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. తీర్థ యాత్రలు చేస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ పుణ్యదంపతులు
పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబలకు కాశీ పట్టణంలో జన్మించి, కర్ణాటక రాష్ట్రం, స్కందగిరి పర్వతసానువులో స్థితమైన పాపాగ్ని మఠ (ప్రస్తుతం ఇది చిక్‌బళ్లాపూర్ జిల్లా లోని కళవారహళ్లిలో ఉన్నది) అధిపతులు వీరభోజయాచార్య, వీరపాపమాంబలవద్ద పెరిగిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి,
వైఎస్ఆర్ కడప జిల్లా లోని కందిమల్లాయపల్లిలో చాలాకాలం నివసించి సజీవ సమాధి నిష్ఠనొందాడు. వీరబ్రహ్మము వలన ప్రసిధ్ది పొందుట చేత కందిమల్లాయపల్లె తర్వాతి కాలములో బ్రహ్మంగారిమఠంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో ఏ వింత జరిగిన ఇది బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ
#WorldDanceDay 💃🕺 #InternationalDanceDay
ప్రతి సంవత్సరము ఏప్రిల్ 29 న అంతర్జాతీయ నృత్య దినోత్సవం యునెస్కో (UNESCO) లో భాగమైన అంతర్జాతీయ డాన్స్ కౌన్సిల్ (CID) ఆద్వర్యములో 1982 నుండి జరుపు కుంటున్నారు .
నాట్యము (ఆంగ్లం : #Dance) (ఫ్రెంచి పదము డాన్సెర్ నుండి ఉద్భవించింది):
సాధారణంగా సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలు, లేదా "లయబద్ధ సంగీతానికి, శరీరం లయబద్ధంగా కదలడం" అని చెప్పుకోవచ్చు
నాట్య శబ్దము నృత్యమునకు పర్యాయపదము. భరతుని నాట్య శాస్త్రంలో నృత్యం అనే పదం లేదు. నృత్తము, నాట్యము అను పదములే కలవు. నృత్తము నాట్యముకంటే చాలా ప్రాచీనమైనది.
ఈ రెండు కళలు వేర్వేరుగ జన్మించి, వేర్వేరుగ అభివృద్ధి చెందాయి. భరతుడే ప్రధమంగా నృత్తమును నాట్యంలో చేర్చాడు. కరణ-అంగహార సంపన్నమైనది నృత్తము. ఇది అర్ధాన్ని బోధించదు. కేవలం అవయవ విన్యాసములతో కూడి ఉండును. నాట్యం 4 విధాలైన అభినయాలతో కూడి ఉండును. నృత్తమందలి అంగ విన్యాసమును, నాట్యమందలి
#GoBirdingDay#birdwatching
మన చుట్టూ ఉన్న జీవవైవిధ్యంలో పక్షులు చాలా ఆకర్షణీయమైనవి. పక్షుల గురించి మనకి ఏమి తెలుసు? మనల్ని ఇంతగా ఎలా ఆకర్షిస్తాయి ? రండి.... పక్షుల ప్రపంచంలోకి చూద్దాం, మన చుట్టూ ఉన్న పక్షుల గురించి తెలుసుకుందాం.
మనుషులకు ఎన్నో పండుగలు ఉండగా,పక్షులకు ఒక పండుగ ఎందుకు ఉండకూడదు..
నేడే #GoBirdingDay
పక్షులు మరియు పక్షి వీక్షణ దినోత్సవం
ఎండలు మండుతున్నాయి. నీటి వనరులు అడుగంటుతున్నాయి. ఉష్ణతీవ్రతకు ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. తరచూ దప్పిక తీర్చుకోవాల్సి వస్తోంది.
జనాలకైతే ఎక్కడికెళ్లినా తాగు నీరు అందుబాటులో ఉంటుంది. పశుపక్షాదులకు ఈ కాలంలో ఇబ్బందిగానే ఉంటుంది. మన ఇళ్ల చుట్టూ తిరిగే పక్షులు నల్లాల వద్ద రాలే నీటి చుక్కలతో గొంతు తడుపుకొనే ప్రయత్నం చేస్తుంటాయి. ఎండాకాలంలో అవి పడే అవస్థలు చూసి కొందరు చిన్న పాత్రలు,
#InternationalAstronomyDay
ఖగోళ శాస్త్రము (#Astronomy) అంటే నభోమండలం గురించిన అధ్యయనం. అంటే అంతరిక్షశాస్త్రం. అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర గ్రహ, నక్షత్రాదులతోపాటు విశ్వంలో ఉన్న అనేక ఖగోళ వస్తువులు/ పదార్థాల ఉత్పత్తి, ఉనికి, లక్షణాలు, నాశనములను శాస్త్రబద్ధంగా వివరిస్తుంది.
ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. దూరదర్శిని (టెలిస్కోపు) కనుగొన్న తరువాత ఖగోళశాస్త్ర్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం రెండు ఉపశాస్త్రాలుగా విభజించబడింది. అవి:
పరశీలక ఖగోళశాస్త్రం (Observational Astronomy):
టెలిస్కోపులు, కంప్యూటర్లు వగైరా పరికరాలతో ఖగోళ వస్తువులను పరిశోధించి సంగ్రహించిన విషయాలను ప్రాథమిక భౌతికశాస్త్ర సూత్రాలతో వివరించడం, వాటి ఫలితాలను విశ్లేషించడము.
సైద్ధాంతిక ఖగోళభౌతిక శాస్త్రం (Theoretical astrophysics): విశ్వ రహస్యాలను వివరించడానికి గణిత సంభూతమైన