లక్ష్మి Profile picture
13-07-1971

Sep 25, 2022, 20 tweets

#దసరా_దేవీ_నవరాత్రులు_శరన్నవరాత్రులు

శరదృతువు,ఆశ్వీయుజ మాసం మొదటి తొమ్మిది రోజులని "దేవీ నవరాత్రులు"గా జరుపుకుంటాం.

ఇది వర్షాకాలం,చలికాలంకి మధ్యలో వచ్చే సంధికాలం.వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే రోజులు.
యమధర్మరాజు దంష్ట్రలు(కోరలు) సంవత్సరంలో రెండు సార్లు బైట పెడతాడట!అందువల్ల

ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉంటాయి.కానీ ఆ బాధలు లేకుండా చెయ్యడానికి ప్రకృతిలో దొరికే ఆహారాన్నే ఔషధంగా ఉపయోగించవచ్చు.

ఉగాది సమయంలో,ఎండాకాలం మొదలయ్యే ముందు ఒకసారి,మళ్ళీ దసరా సమయంలో రెండో సారి ఇలా జరుగుతుంది.
వాటికి  నివారణగా ప్రకృతి ఇచ్చిన  ఓషధాలే -వేపపువ్వు &ఉసిరికాయలు.వీటిని ఆయా

సమయాల్లో ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటాము.
నవదుర్గ పూజ
అమ్మవారిని తొమ్మిది రూపాలుగా అలంకరణ చేసి, పూజిస్తాము. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం.

ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, పూజిస్తారు.

నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం నవరూప ధరాంశక్తిం, నవదుర్గాముపాశ్రయే.
ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ | తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకమ్ || పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ | సప్తమం కాలరాత్రీతి

మహాగౌరీతి చాష్టమమ్ ||
నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః

అన్ని ప్రముఖ దేవాలయాల్లో, ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుళ్లో చాలా ఘనంగా చేస్తారు దేవీ నవరాత్రులు.
ధనం,ధాన్యం,ధైర్యం,విద్య,సంతానం,ఆయుష్షు,ఐశ్వర్యం,విజయం అన్నీ ప్రసాదించేది అమ్మ.

ఈ తొమ్మిది రోజులు లలితా సహస్రనామం,దేవీ ఖడ్గమాల,లలితా త్రిశతి, మొదలగు స్తోత్రాలు,అష్టోత్తరాలు చదివి పూజ చెయ్యాలి.
కుదరని వారు కనీసం "శ్రీ మాత్రే నమః" అని జపం చేసినా పుణ్యమే.

#బొమ్మలకొలువు
దసరా ఉత్సవాలలో భాగంగా బొమ్మలకొలువు పెడతారు కొన్ని ప్రాంతాలలో.
బేసి సంఖ్య వరుసల్లో రకరకాల

బొమ్మలు అందంగా అలంకరించి,పేరంటాళ్లను పిలిచి తాంబూలాలు పంచిపెడతారు.ఒకప్పుడు బొమ్మలు ఏదైనా పెద్ద దేవాలయాల దెగ్గర కానీ,తిరునాళ్ళ అంగడిలో కానీ దొరికెవి.సాధారణంగా రకరకాల భంగిమల్లో ఉన్న దేవతామూర్తులు,పురాణాల్లో ఉన్న ఘట్టాలు తెలియచేసే బొమ్మలు పెట్టేవాళ్ళు బొమ్మలకొలువులో.ఆయా దేవాలయాల

విశేషాలు,రామాయణ భాగవతాల్లోని వ్యక్తుల వివరాలు,మొదలైనవన్ని తెలిసేవి పిల్లలూ పెద్దలకు ఆ బొమ్మలు చూడటం ద్వారా.

#గొబ్బెమ్మల_పేరంటం

ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మల్ని గుమ్మడిపువ్వులతో(ఈ కాలం లో బాగా దొరుకుతాయి)పసుపు కుంకుమలతో అలంకరించి,చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, కోలాటాలు ఆడుతూ దైవ సంబంధమైన పాటలు పాడతారు.తర్వాత వాటిని నీళ్ళల్లో కలపడం ద్వారా వర్షాకాలం లో అపరిశుభ్రంగా మారిన నీళ్లు

శుభ్రపడేవి వినాయక చవితి పూజ పత్రితో చేస్తే,దసరా ఉత్సవాలలో పువ్వులకి ప్రాధాన్యత ఎక్కువ.

#జమ్మి_చెట్టు
దసరా రోజు సాయంత్రం జమ్మి/శమీ వృక్షానికి పూజ చేస్తారు.వైదిక భాషలో శమీ వృక్షాన్ని 'అరణీ'అని పేరు.అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని "ఆరణి' అని అర్ధం.

పాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళి తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి

వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు.
త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది.

అదే విధముగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు.

విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం వద్ద గల "అపరాజితాదేవి"ని పూజించి,

ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేస్తారు.
"శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా, ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ, కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే."
పైశ్లోకం వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు

తగిలిస్తారు.
ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి , తెలంగాణా ప్రాంతంలో శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.

#ఆయుధపూజ

వాహనదారులు, ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను, సంబంధిత వస్తువులను శుభ్రపరచి, వాటికి పూజలు చేయడం ఆనవాయితీ.

#వాహన_పూజ
దశమి రోజు తాము వాడే వాహనాలను శుభ్రపరిచి,యథాశక్తి పూజించి, పూలమాలతో అలంకరిస్తారు.ఇలా చెయ్యటం వల్ల వాహన ప్రమాదాలు నివారించవచ్చు.

#బతుకమ్మ

కాకతీయుల కాలం నుంచే బతుకమ్మను జరుపుకుంటున్నట్లు ఆధారాలున్నాయి.
ఒక పళ్లెంలో గుమ్మడి ఆకులు పరిచి,వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి తంగేడుబీర,గన్నేరు,నిత్యమల్లె, బంతిపూలను ఒక్కో వరుసలో ఉంచుతారు.

అలా ప్రకృతి నుంచీ ప్రత్యక్షమయ్యే పూలమాత బతుకమ్మ.
బతుకమ్మ పూలు,పత్రిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అవి చెరువుల్లోని నీటిలో కలుస్తాయి.అలా కలిసిన నీరు పొలాలకు వెళ్తుంది. ఆ నీటిలో ఔషధ గుణాల వల్ల క్రిములు నశించి,పంట పొలాలు చక్కగా పెరుగుతాయి.తద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యవంతంగా ఉంటుంది.

ఇదే బతుకమ్మ పండుగలో ఔన్నత్యం.

అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు💐💐

అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🙏🏻(అ ల సు)

Share this Scrolly Tale with your friends.

A Scrolly Tale is a new way to read Twitter threads with a more visually immersive experience.
Discover more beautiful Scrolly Tales like this.

Keep scrolling