శరదృతువు,ఆశ్వీయుజ మాసం మొదటి తొమ్మిది రోజులని "దేవీ నవరాత్రులు"గా జరుపుకుంటాం.
ఇది వర్షాకాలం,చలికాలంకి మధ్యలో వచ్చే సంధికాలం.వాతావరణంలో మార్పులు చోటుచేసుకునే రోజులు.
యమధర్మరాజు దంష్ట్రలు(కోరలు) సంవత్సరంలో రెండు సార్లు బైట పెడతాడట!అందువల్ల
ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉంటాయి.కానీ ఆ బాధలు లేకుండా చెయ్యడానికి ప్రకృతిలో దొరికే ఆహారాన్నే ఔషధంగా ఉపయోగించవచ్చు.
ఉగాది సమయంలో,ఎండాకాలం మొదలయ్యే ముందు ఒకసారి,మళ్ళీ దసరా సమయంలో రెండో సారి ఇలా జరుగుతుంది.
వాటికి నివారణగా ప్రకృతి ఇచ్చిన ఓషధాలే -వేపపువ్వు &ఉసిరికాయలు.వీటిని ఆయా
సమయాల్లో ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఉంటాము.
నవదుర్గ పూజ
అమ్మవారిని తొమ్మిది రూపాలుగా అలంకరణ చేసి, పూజిస్తాము. ఆ తల్లి బ్రహ్మ, విష్ణు, శివ అంశలతో మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళిగా అవతరించినదని, ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని కథనం.
ఇలా 3 + 6 = 9 స్వరూపిణులుగా, అనగా నవ దుర్గలుగా, పూజిస్తారు.
అన్ని ప్రముఖ దేవాలయాల్లో, ముఖ్యంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారి గుళ్లో చాలా ఘనంగా చేస్తారు దేవీ నవరాత్రులు.
ధనం,ధాన్యం,ధైర్యం,విద్య,సంతానం,ఆయుష్షు,ఐశ్వర్యం,విజయం అన్నీ ప్రసాదించేది అమ్మ.
ఈ తొమ్మిది రోజులు లలితా సహస్రనామం,దేవీ ఖడ్గమాల,లలితా త్రిశతి, మొదలగు స్తోత్రాలు,అష్టోత్తరాలు చదివి పూజ చెయ్యాలి.
కుదరని వారు కనీసం "శ్రీ మాత్రే నమః" అని జపం చేసినా పుణ్యమే.
#బొమ్మలకొలువు
దసరా ఉత్సవాలలో భాగంగా బొమ్మలకొలువు పెడతారు కొన్ని ప్రాంతాలలో.
బేసి సంఖ్య వరుసల్లో రకరకాల
బొమ్మలు అందంగా అలంకరించి,పేరంటాళ్లను పిలిచి తాంబూలాలు పంచిపెడతారు.ఒకప్పుడు బొమ్మలు ఏదైనా పెద్ద దేవాలయాల దెగ్గర కానీ,తిరునాళ్ళ అంగడిలో కానీ దొరికెవి.సాధారణంగా రకరకాల భంగిమల్లో ఉన్న దేవతామూర్తులు,పురాణాల్లో ఉన్న ఘట్టాలు తెలియచేసే బొమ్మలు పెట్టేవాళ్ళు బొమ్మలకొలువులో.ఆయా దేవాలయాల
విశేషాలు,రామాయణ భాగవతాల్లోని వ్యక్తుల వివరాలు,మొదలైనవన్ని తెలిసేవి పిల్లలూ పెద్దలకు ఆ బొమ్మలు చూడటం ద్వారా.
ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మల్ని గుమ్మడిపువ్వులతో(ఈ కాలం లో బాగా దొరుకుతాయి)పసుపు కుంకుమలతో అలంకరించి,చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ, కోలాటాలు ఆడుతూ దైవ సంబంధమైన పాటలు పాడతారు.తర్వాత వాటిని నీళ్ళల్లో కలపడం ద్వారా వర్షాకాలం లో అపరిశుభ్రంగా మారిన నీళ్లు
శుభ్రపడేవి వినాయక చవితి పూజ పత్రితో చేస్తే,దసరా ఉత్సవాలలో పువ్వులకి ప్రాధాన్యత ఎక్కువ.
#జమ్మి_చెట్టు
దసరా రోజు సాయంత్రం జమ్మి/శమీ వృక్షానికి పూజ చేస్తారు.వైదిక భాషలో శమీ వృక్షాన్ని 'అరణీ'అని పేరు.అగ్నిని ఉద్భవించేందుకు కాష్టాంతరంచే మధింప యోగ్యమైన దారువని "ఆరణి' అని అర్ధం.
పాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళి తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి
వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాధించి రాజ్యాధికారం సాధిస్తారు.
త్రేతాయుగంలో ఆశ్వయుజ శుద్ధ దశమినాడు శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది.
అదే విధముగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు.
విజయదశమిరోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం వద్ద గల "అపరాజితాదేవి"ని పూజించి,
ఈ క్రింద ఇచ్చిన శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షణలు చేస్తారు.
"శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా, ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ, కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే."
పైశ్లోకం వ్రాసుకున్న చీటీలు అందరూ ఆ చెట్టు కొమ్మలకు
తగిలిస్తారు.
ఇలా చేయడం వల్ల అమ్మవారి కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి , తెలంగాణా ప్రాంతంలో శమీపూజ అనంతరం 'పాలపిట్ట'ను చూచే ఆచారం కూడా ఉన్నది.
కాకతీయుల కాలం నుంచే బతుకమ్మను జరుపుకుంటున్నట్లు ఆధారాలున్నాయి.
ఒక పళ్లెంలో గుమ్మడి ఆకులు పరిచి,వాటిని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. ముందుగా గుమ్మడి పువ్వుల్ని అమర్చి తంగేడుబీర,గన్నేరు,నిత్యమల్లె, బంతిపూలను ఒక్కో వరుసలో ఉంచుతారు.
అలా ప్రకృతి నుంచీ ప్రత్యక్షమయ్యే పూలమాత బతుకమ్మ.
బతుకమ్మ పూలు,పత్రిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. అవి చెరువుల్లోని నీటిలో కలుస్తాయి.అలా కలిసిన నీరు పొలాలకు వెళ్తుంది. ఆ నీటిలో ఔషధ గుణాల వల్ల క్రిములు నశించి,పంట పొలాలు చక్కగా పెరుగుతాయి.తద్వారా ప్రతి ఇల్లు ఆరోగ్యవంతంగా ఉంటుంది.
ఇదే బతుకమ్మ పండుగలో ఔన్నత్యం.
అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు💐💐
అందరికీ అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా🙏🏻(అ ల సు)
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
ఇది ద్వాపరయుగంలో ప్రారంభమైన పూజ. అంతకు ముందు ఈ పూజను #ఇంద్రయాగం అనేవారు. కార్తీకమాస ఆరంభంలో ఈపూజ నిర్వహిస్తారు. ఈ పూజకు ఆరాధ్యదైవం ఇంద్రుడు. ఇంద్రుడు తూర్పు దిక్పాలకుడు.వర్షకారకుడు.వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి.అందుకే ఈ పండుగ రోజు
ఇంద్రుని పూజిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల,గోపాలకుల పండుగ. ఈ పండుగనాడు పలురకాలైన తీపి పదార్థాలు, రుచిగల వంటకాలు, అన్నపురాశులు.. గుట్టలు గుట్టలుగా వండి ఇంద్రునకు నివేదనగా సమర్పించే వారు. అందుకే ఈపూజకు #అన్నకూటం అని మరొక పేరు కూడా ఉంది.
#కార్తీక_మాసం #Dos_Donts.
ఈ సంవత్సరం 26-10-2022 నుంచి 23-11-2022 వరకూ కార్తీక మాసం.
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు;
గంగానది వంటి ఇతర నదేదీ లేదు.
🕉అయ్యప్ప దీక్ష ఈ నెలలో ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది.
#భాగవతం_అష్టమ_స్కంధంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది అండీ.(అందుకే పురాణాలు చదవాలి, అది మన కర్తవ్యం. ఋషి ఋణం అని ఒకటి ఉంటుంది అది తీరాలి అంటే వారు రాసినవి చదివి అర్థం చేసుకుంటేనే తీరుతుంది..రామాయణం భారతం,భాగవతం,భగవద్గీత లో లేని విషయం ఇంకేం లేదు ఈ ప్రపంచంలో..మీరు
కూడా ఆ పుస్తకాలు చదివితే అన్ని సందేహాలకీ సమాధానం లభిస్తుంది 🙏🙏)
నవమ స్కంధంలో వైవస్వత మనువు వంశవృత్తాంతం ఉంది.ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరము అయిన "వైవస్వత మన్వంతరము"లో27 మహాయుగాలు ఐపోయి,28వ మహాయుగంలో కృత,త్రేతా,ద్వాపరయుగాలు ఐపోయి,కలియుగములో ఉన్నాము.ప్రతి మన్వంతరంలోను సప్తర్షులు
కలియుగం 5,123 సంవత్సరాల క్రిందట ప్రారంభమైంది. ప్రస్తుతం 2022 (ఇది క్రీస్తుశకం లెక్కల ప్రకారం!!) సంవత్సరానికి ఇంకా 4,26,877 సంవత్సరాలు మిగిలివుంది.428,899లో అంతమవుతుంది.
3101 +present year =కలియుగం ప్రారంభం అయ్యింది.ఇదే శ్రీకృష్ణ నిర్యాణం చెందిన సంవత్సరం కూడా!!
ఆయన అవతారం చాలించిన మర్నాటి నుంచి కలియుగం ప్రారంభం అయ్యింది.(ఇది NASA వారు కూడా ధృవీకరించారు.)
కలియుగం కిdouble/రెట్టింపు ద్వాపర యుగం (432000×2=864000)
కలియుగం కి మూడు రెట్లు =త్రేతాయుగం.(432000×3=1296000)
కలియుగం కి నాలుగురెట్లు=కృతయుగం (432000×4=1728000)