*శివుడికి జలుబు చేసింది*
నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా. కనీసం మాతో మాట్లాడే టైమ్ కూడా లేదు నెల నుంచి. అంతలో ఏమైంది? అడుగు తూనే చెయ్యి పట్టుకుని చూసింది పార్వతీ దేవి. కొంచెం ఒళ్ళు వెచ్చగా ఉంది. జలుబు తో వణికి పోతున్నాడు శివుడు.😖😞😤
పాపం భక్తులు.... ప్రేమతో పోస్తున్నారు కదా అని........ఏమీ అనలేకపోయాను.😌
"కనీసం కన్నెర్ర చేయొచ్చు కదా."
'ఆ పని కూడా చేశా. కళ్ళల్లోకి పోయి ఇంకాస్త మండుతున్నాయి.' ఇంకా వణుకుతూనే అన్నాడు శివుడు.
ఇదంతా చూస్తున్న నారదుల వారు, వెళ్లి వైకుంఠంలో చెప్పాడు.
వెంటనే TV ఆన్ చేసిన అమ్మవారికి...షాక్ తగిలింది. విశాఖ, కనక మహాలక్ష్మి గుడి చూపిస్తున్నారు. పాలప్యాకెట్లు, కుంకుమ పొట్లాలు అమ్మవారి మీద కు *భక్తి* తో విసిరేస్తున్నారు.
అది చూసి, విష్ణువు పకపకా నవ్వసాగాడు.
" మరీ సంబర పడిపోకండి. ధనుర్మాసం కూడా వస్తుంది. మాకూ నవ్వే అవకాశం వస్తుంది"అంటూ, ఎందుకైనా మంచిది ఆ కషాయం కొంచెం మనకు కూడా ఉంచమని చెప్పు నారదా అంది మహాలక్ష్మమ్మ.
భక్తి తో....VLN