ఎవరినో అనుకుని ఏఁ ప్రయోజనం? స్వయంకృతం. ముచ్చట పడి కొడుకును డాక్టరీ చదివిస్తే వాడే కొరకరాని కొయ్యాలాగా అయ్యాడు.
'అది తినొద్దు, ఇది తినొద్దు' అంటూ ఆంక్షలు.
అసలు గుత్తొంకాయ పొడి పెట్టి చెయ్యి తిరిగిన వాడు చేస్తేనా .... ఆ మాటకొస్తే మా భ్రమరాంబ వండినట్లు గుత్తొంకాయ మరెవరూ వండలేరు ....
ఆ కాశీ విశ్వేశ్వరుడు నాయందు దయ తలచి రెండు సార్లు టికెట్లు రద్దు చేయించేసాడు కాబట్టి సరిపోయింది ....
పైగా మా కుంక అంటాడూ .... ఎవరితోనైనా గుత్తొంకాయను కాశీ పంపించెయ్యనా? అని.
పొద్దున లేవగానే కోడలు పిల్ల ఒక 'పేద్ద గ్లాసు'లో ఫిల్టర్ కాఫీ ఇస్తుంది.
ఆ గ్లాసు లోపలకు తొంగి చూడాలి .... కాఫీ ఎక్కడుందా? అని.
'కాకి ఒకటి నీటికి కావు కావుమనుచునూ ...
'హర్రీ, వర్రీ' అన్నారు .... 'కర్రీ అనేది ఈ మజ్జ చేర్చారని నా అనుమానం.
నా కాఫీ బాధ చూడలేక
ఇంకొంచెం ఇస్తుంది ఆ పిల్ల ..
'అకాల మృత్యు హరణం, సర్వ వ్యాధి నివారణం' అనుకుంటూ తీర్ధంలాగా పుచ్చుకోడఁవే ....
వాడైతే ఇంకు పిల్లరుతో పొయ్యమంటాడేఁవో?
ఇదివరకంటే స్నానం అయ్యి పూజ్జేసుకున్నాక గానీ టిఫినీ జోలికి వెళ్ళే వాడిని కాదు ....
ఏదో నాలుగిడ్లీలు తింటే కొంపలంటుకు పోయినట్లు హడావిడి .... భోజనానికి ఒకటిన్నర దాకా ఆగాలా? మరి అప్పటి లోపల ఆకలేస్తే? అని ఘఠ్ఠిగా నిలదీస్తే ఇదుగో ఈమధ్యనే వేరుశనగ
అసలు వీటన్నిటికి మూల కారణం అదుగో ....
ఒంటి నిండా చెమటలు పట్టి, ఎడం చెయ్యి లాగేస్తుంటే గుండెపోటని ఆసుపత్రికి పట్టుకుపోయారు.
వాళ్ళు ఓ వారం అట్టే పెట్టుకుని 'హెల్తు కార్డు' లేదని తెలిసి ఆపరేషన్ అవసరం లేదని చెప్పి డిశ్చార్జ్ చేసారు .... మందులతో నయమౌతుందని.
ఇంకో గంటలో బైటకొస్తాననగా కాస్త కాలు సాగినట్లుంటుందని రూమ్ బైటకొచ్చా.
ఎదురుగా ఓ బల్లేసుకుని ఓ అమ్మాయి
కూర్చునుంది .... బల్ల మీద కాదు .... బల్లకెదురుగా కుర్చీలో ....
నన్ను చూడగానే
'సరే కదా'ని వెళ్ళా.
"ఎవరమ్మా నువ్వు?" అని అడిగా.
"నేనిక్కడ డైటీషియన్ అండి" అన్నది.
నాకు మరోలా వినపడింది.
"బ్యూటీషియన్ కు ఆసుపత్రిలో ఏం పని?" అన్నా.
"హయ్యో, బాబాయ్ గారు, బ్యూటిషియన్ కాదు, డైటీషియన్ .... అంటే ఆహారం ఎలా తీసుకోవాలి,
నాకు మండదూ? "మా అమ్మ నా చిన్నప్పుడే నేర్పింది ఎలా తినాలో నాకు .... నువ్వేం చెప్పనవసరం లేదు" అన్నా.
ఇంతలో మా ఆఁవిడొచ్చి నన్ను రూమ్ లోపలకు తీసుకెళ్ళి మళ్ళీ బైటకొచ్చి ఆ డైటీషియన్ తో కాసేపు ముచ్చట్లాడి
ఆ పిల్ల ఏం చెప్పిందో గానీ ఆ నాటి నుండి నా కష్టాలు మొదలయ్యాయ్
అరే ఓ గుత్తొంకాయ లేదు, ఓ కందా బచ్చలి లేదు, ఓ దోసావకాయ లేదు నెయ్యైతే దాచేసారు.ఏఁవి తిండది?
అసలు నా చిన్నప్పుడైతే మా సత్యవతత్తయ్య రోట్లో వేసి
అంతా తినేసి ఉప్పు 'సరిపోయిందత్తయ్యా, కారం సరి పోయిందో లేదో చూళ్ళేదు' అంటూ మళ్ళీ చెయ్యి చాపే వాణ్ణి.
అలా కాపాడుకుంటూ వస్తున్న దాన్ని ఇవాళ ఇలా ఎండ బెట్టేస్తే నా తెలివి తేటలన్నీ ఏఁవై పోవాలి?
ఇహ భోజనాల దగ్గరకొస్తే ఆఁవిడా, కోడలు
వంద గ్రాములకంటే ఎక్కువ తినకూడదట.
'వంద గ్రాముల బియ్యఁవేఁవోనే?' అంటే
'కాదు వండిందే వంద గ్రాములం'టుందాఁవిడ.
"ఐటమ్ కు వంద గ్రాములేఁవో? సరిగ్గా కనుక్కున్నావా ఆ పిల్లను?" అంటే 'అన్నిటికీ కలిపి వంద గ్రాముల'ట.
ఆ లెఖ్ఖన కూర, పప్పు, పులుసు, పచ్చడి, పెరుగు ....
అసలలా తింటే మందులు వేసుకోడానికైనా నేనుండాలిగా? అంటే వినిపించుకోరు.
బరువు అరవై దాటకూడదట. కొత్త రూలొహటి. అప్పటికీ నమకం, చమకం వింటూ వాకింగ్ చేస్తా. మృత్యుంజయ మంత్రం
"బతికినంత కాలం బతకనురా. కమ్మగా తిననివ్వండర్రా" అంటే ....
"ఒక్కగానొక్క నాన్నవు ...." అలా అన్నాడో లేదో
"అదేం మాటరా అప్రాచ్యుడా .... ఎంతమంది నాన్నలుంటారేఁవిటి?" అంటూ ఆఁవిడ కోప్పడేసింది వాణ్ణి ....
"వాణ్ణి అపార్ధం చేసుకోకు రాజ్జం. వాడేదో తాపత్రయంలో అనేసాడు" అని సర్ది చెప్పాల్సొచ్చింది.
దంపుడు బియ్యం తిన్న శరీరఁవాయె .... ఏదో పని వత్తిడి వల్ల అలా ఆసుపత్రి వాడి పూర్వ జన్మ బాకీ చెల్లించా గానీ లేకుంటే ఇవాళ ఇంతమంది కాపలాలో
60 దాటాక అన్నీ బాధలే 😩
Through watsup