సిన్నప్పుడు రోజూ పొద్దుగాల ఇంట్లో సద్దిబువ్వే. సద్దిబువ్వ బాగుండదని కాదు గానీ (సద్దెన్నంలోకి మజ్జిగ ఏసుకుని నిమ్మకాయ ఊరగాయో, చింతకాయ ఊరిమిండో ఏసుకుని తింటే సర్గం కనిపిచ్చాది) ఏందీ రోజూ పొద్దునే సద్దన్నం? టిఫిన్లు ఉడుకుడుకు అన్నం ల్యాకుండా అని కోపం ఒచ్చాన్యాది
అది మిగిలిపోయి పొద్దుగాల్నే మాకు సద్దన్నం పెట్టేది. ఇంట్లో ఎంత మంది ఉండారో తెల్సినప్పుడు సూసి సెయ్యొచ్చు గదా అని మా గలాటా. మా ఇల్లనే గాదు పల్లెలో శానా మటుకు అంతే
ఇప్పటాల అప్పట్లో ఫోన్లు ల్యా
ఇప్పుడు ఆర్డరిచ్చే రకరకాలు ఇంటికి తెచ్చే స్విగ్గీలు ఒచ్చినాయి గానీ ఇంటికొచ్చిన సుట్టాన్ని మనసారా ‘తినిపోన్నా’ అని సెప్పే ప్రేమలు పోయినాయి.
ఇప్పటికీ సద్దిబువ్వ సూచ్చే ఒచ్చినోళ్లకు లేదనకుండా పెట్టే అప్పటి ప్రేమలే గుర్తుకొచ్చాయి.