రాష్ట్రంలో రైతులంతా ఒకే విధమైన పంటసాగు చేసే సంప్రదాయం ఉంది. అలా చేస్తే పండించిన పంటకు మంచి ధర రాదు. మార్కెట్ డిమాండును బట్టి పంట పండించాలి. రైతులకు చైతన్యం రావాలి. క్రమ పద్ధతి అలవాటు కావడం కోసం కొంత కఠినంగానే వ్యవహరించాలి.
రాష్ట్రంలో, దేశంలో, అంతర్జాతీయంగా మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి, మార్గదర్శకం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమించాలి.