అనగనగా ఒక రాజు... ఆ రాజుకి ఏడుగుకొడుకులు...కథ:
(ఈ కధ (పరమా)అర్ధం విశ్లేషణ శ్రీ గరికిపాటి ).
**అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారు. ఏడు చేపలు తెచ్చారు. ఏడు చేపల్ని ఎండ పెట్టారు.
.
*రాజుగారు అంటే మనిషి.
ఏడుగురు కొడుకులు అంటే మనలోని సప్త థాతువులు.
వేటకు వెళ్ళటము అంటే జీవనము సాగించటము. జీవితము అనే వేట.
(కామము, వేట, జూదము, మద్యపానము, వాక్పారుష్యము (కఠినంగా, పరుషంగా మాట్లాడటం), దండపారుష్యము (కఠినముగా దండించుట), అర్థదూషణము (థనమును దూబారాగా ఖర్చుచేయుట)).
ఎండగట్టాటానికి వీలైనది కనుక చేప అని చెప్పబడినది.
ఒకచేప ఎండలేదు. అంటే సప్తవ్యసనాలలో ఒక్క కామాన్ని తప్ప మిగిలినవాటిని జయించవచ్చును అని చెప్పుటకు ఒక చేప ఎండలేదు అని చెప్పబడినది.
కామాన్ని జయించటము చాలా కష్టము. అది ఎప్పటికి ఎండదు.
చేప ఎండకపోవటానికి కారణము గడ్డిమేటు.
మన అజ్ఞానము ఎంత అంటే గడ్డిమేటంత. ఎన్ని గడ్డిపరకలు లాగినా గడ్డిమేటు తరగదు. అలాగే అజ్ఞానము తరగదు. ఎన్ని విన్నా, ఎంత తెలిసినా అజ్ఞానము పీడిస్తూనే ఉంటుంది. చెప్పలేనంత అజ్ఞానము అని చెప్పుటకు గడ్డిమేటును చెప్పారు.
గడ్డిమేటు అడ్డుతగలటానికి కారణము ఆవు మేయక పోవటము.
వేదములలో ఆవును జ్ఞానమునకు ప్రతీకగా చెప్పారు. ఇక్కడ ఆవు అనగా జ్ఞానము. జ్ఞానము కలిగినచో అజ్ఞానము తొలగును.
ఆవు ఎందుకు మేయలేదు అంటే గొల్లవాడు మేపలేదు. గొల్లవాడు అనగా సద్గురువు.
"కృష్ణం వందే జగద్గురుం". జగద్గురువు శ్రీకృష్ణుడే. అతడు గొల్లవాడు కనుక ఇక్కడ గొల్లవాడు అని చెప్పబడినది.
అమ్మ ఎందుకు అన్నం పెట్టలేదు అంటే పిల్లవాడు ఏడ్చాడు.
పిల్లవాడు ఏడవటం అంటే జగన్మాత అనుగ్రహము కోసము ఆర్తితో పరితపించటము. అటువంటి వారికి తల్లి మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. అవసరము కోసము ఏడవటము వేరు,
పిల్లవాడు ఎందుకు ఏడ్చాడు అంటే చీమ కుట్టింది.
చీమ అంటే సంసారము.
చీమ కుట్టటానికి కారణము తన బంగారు పుట్టలో వేలు పెట్టుట వలన కుట్టింది. నిజమునకు చీమల పుట్టలన్నీ కూడా మట్టి పుట్టలే.
కథ సారాంశము:
@threadreaderapp"unroll "