అప్పటిదాకా నిజం చెప్పాలంటే ఇండియా కు కీపర్ కోసమే ఒక ఆటగాడి స్థానం కోల్పోతున్న అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉండేది.. అలాంటి సమయంలోనే జులపాల జుట్టు ఎగరేసుకుంటూ నేనున్నానంటూ వచ్చాడు...
క్రికెట్‌పరంగా అంతగా గుర్తింపులేని రాంచీ నుంచి వచ్చి భారత క్రికెట్‌కే కొత్త గుర్తింపు తీసుకువచ్చాడు.
సొగసైన బ్యాటింగ్‌కు మైమరచిపోవడం అలవాటైన మాకు...
దుమ్ముదులిపే బ్యాటింగ్ మజాతో కిక్కెంచావ్...
ఏ బాల్‌ను ఎలా కొట్టాలి అనే క్రికెట్ పాఠాలకు విరుద్ధంగా
ఎలాంటి బాల్‌నైనా ఎడాపెడా కొట్టేయడం ఎలాగో చూపించాడు...
షోయబ్ అక్తర్ లాంటి ప్రపంచ మేటి ఫాస్ట్ బౌలర్ ధోని గురించి చెప్పిన మాటలు...
ఒక మ్యాచ్ లో నేను ఫుల్ ఫార్మ్ తో బౌల్ చేస్తున్న...పిచ్ కూడా చాలా ఫ్లాట్ గా ఉంది..అప్పుడే సచిన్ ను ఔట్ చేసి మంచి ఉపుమీదున్న ...అప్పుడే ఒక కొత్త కుర్రాడు బరిలోకి వచ్చాడు..
" అతను నా బాల్స్ ను ఏమాత్రం లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు..విధ్వంసం సృష్టించాడు...బౌలర్ ఎలా బౌల్ చేస్తున్నాడు, అసలు అక్కడ బౌలింగ్ చేస్తోంది ఎవరు...ఇలాంటివేమి పట్టించుకోకుండా బాట్ తో బాల్ ను కొట్టడమే పనిగా ఆడుతుంటాడు.. ఇలాంటి బాట్స్మెన్ ను నేనిప్పటికి దాకా చూళ్ళేదు.
ఇలా బౌలింగ్ చేస్తోంది ఫాస్ట్ బౌలరా, స్పిన్ బౌలరా అని ఇలాంటివేమి తన మదిలో ఉండవు..తన బాట్ కు తెలిసింది వచ్చిన బాల్ ను గ్రౌండ్ నలువైపులా ఎలా కొట్టాలి అంతే.
ద్రవిడ్, కుంబ్లే సంప్రదాయ కెప్టెన్సీతో కాస్త నిస్పృహలో ఉన్నప్పుడు కెప్టెన్‌గా చార్జ్ తీసుకున్నావ్...
ఇండియన్ క్రికెట్ టీమ్‌ను రీచార్జ్ చేసి టాప్‌గేర్‌లోకి తీసుకువెళ్లావ్...
2007లో ట్వటీ 20 క్రికెట్ వరల్డ్ కప్ లో ఏమాత్రం తొణకకుండా కొత్త కుర్రాళ్లలో సౌత్ ఆఫ్రికా బయలుదేరాడు. దూకుడు, తెలివి కలగలిపి జట్టును నడిపించి టీ 20 వరల్డ్ కప్‌ను దేశానికి అందించావ్, మమ్మల్ని అబ్బురపరచావు, జులపాల జుట్టు కత్తిరించుకుని మిస్టర్ కూల్‌గా మారావు
ఆటగాళ్లకు దూకుడు నేర్పించింది బహుశా గంగూలీ నే కావచ్చు...కానీ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి వారి ఆటను వారు అడనిచ్చేలా చేసింది మాత్రం ధోనీనే. అసలు చెప్పాలంటే ధోని నాయకత్వంలోనే ఆటగాళ్లు పూర్తి స్వేచ్ఛతో ఆడడం మొదలెట్టారు..
మీ ఆట మీరు ఆడండి, జట్టులో మీ ప్లేస్ గురించి ఆలోచన నాకు వదిలేయండి అని ఆటగాడికి అంత భరోసా ఇచ్చిన నాయకుడు ధోని ఒక్కడే...
2011 వన్డే వరల్డ్ కప్‌కు గురిపెట్టావ్.. 28ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ వరల్డ్‌కప్‌ను సగర్వంగా పైకెత్తాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని తీసుకు వచ్చావ్. మూడు ఫార్మట్ల క్రికెట్‌లో ఇండియాను నంబర్‌వన్‌గా నిలిపాడు...
ఎందరో మెరికల్లాంటి యువక్రికెటర్లను వెలుగులోకి తీసుకొచ్చాడు...
నీ బ్యాటింగ్‌కు దాసోహమయ్యాం...
నీ చురుకైన కీపింగ్‌కు అచ్చెరువొందాం...
నీ తెలివైన కెప్టెన్సీకి ఫిదా అయ్యాం....
రిక్వైర్డ్ రన్‌రేట్ ఎంత పెరుగుతున్నా కూల్‌గా ఉండటం...
అంతే కూల్‌గా మ్యాచ్‌ను సక్సెస్‌ఫుల్‌గా ఫినిష్ చేయడం నీ స్టైల్...
ఫేర్‌వెర్ మ్యాచ్‌ల జంఘాటం ఏమీ లేదని సీనియర్లకు ఇంటిదారి చూపించిన వైనం నీది...
అదే సూత్రాన్ని నీకూ వర్తింపజేసుకుని ఆదర్శంగా నిలిచాడు...
మ్యాచ్‌లలో పరుగుల వరద పారించడమే కాదు...
కెరీర్‌లో పరుగు ఆపడం కూడా ఎలాగో చేసి చూపించాడు...
కొత్తతరం నాయకత్వం చేపట్టే సమయం వచ్చిందని గుర్తించి స్వచ్ఛందంగానే కెప్టెన్సీని వదులుకున్నా...
ఆ వెనువెంటనే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై కొట్టడం ధోనికే చెల్లుతుంది.....
2019 వరల్డ్ కప్ ముగిసనప్పటి నుంచి ధోని రిటైర్మెంట్‌పై సాగుతున్న చర్చపై తాను చెవి వేసి ఉంచి...
కాస్త ల్యాగ్ అయిందనిపించినా సరే అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా గౌరవప్రదంగా వీడ్కోలు పలికాడు....
ధోనీ నాయకత్వం అంటే నాకు అభిమానం, గౌరవం అన్నింటికీ మించి నాకు ఆ నాయకత్వ లక్షణం అన్నా, ఆ నాయకత్వంలో తాను తీస్కునే నిర్ణయాలు ఒక్క క్రికెట్ లోనే కాదు,
ఇతర ఏ ఏ రంగాల్లో ఉన్న టీమ్ లీడర్ కైనా టీమ్ ను మేనేజ్ చేసేవాళ్లకు ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు...అదే వైనాన్ని పాటిస్తే ప్రతి టీమ్ కూడా తమ టార్గెట్ ను ఈజీగా రీచ్ అవ్వచ్చు.
2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో అలా నిలబడి విన్నింగ్ షాట్‌గా సిక్స్ కొట్టి ఆ బాల్ వైపు నువ్వు చూసిన చూపు.. నీ పెదవులపై విరిసిన చిరునవ్వు భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి..ఎందుకంటే ఆ క్షణాలు ఎంతో అపురూపం... మధురాతి మధురం...
నేను ధోనీని ఒక ఆటగాడిగా కంటే ఒక నాయకుడిగానే ఇష్టపడతా...
LOVE YOU DHONI
💐💐💐💚💚💚💚💙💙💙💙❤️❤️❤️❤️
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది
👉వూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా #పోలేరమ్మ అయింది.
'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే '#ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
👉ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, #పోచమ్మ పోషణ కలిగిస్తుంది.
👉ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసెయమ్మ కాలక్రమములో #కట్టమైసమ్మ అయింది.
👉స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని)సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి #అచ్చమ్మగా అయ్యింది.
కాశీ క్షేత్రం లో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు : శ్రీ చక్రం లో ఎలా అయితే 9 ఆవరణలు ఉంటుందో కాశీలో విశ్వప్రాణ శక్తి కేంద్రాలు 7 ఆవరణలు ఉన్నాయి,వివిధ కోణాలు యంత్రం లో ఉన్నట్టు వివిధ ప్రాంతాల్లో ఒక ఆవరణలో ఒక కోణం ఈ క్రమం ప్రకారం మొత్తం 56
7 ఆవరణలో 56 కేంద్రాలలో కాస్మిక్ ఎనర్జీ అయస్కాంత శక్తి లాగా ఆకర్షిస్తుంది, క్రమంగా ఆ ప్రాంతంలో ఎక్కడ కూర్చుని ధ్యానం, మంత్ర జపం చేస్తే ఊహించని విధంగా మంత్ర ప్రయోజనం తెలుస్తుంది సిక్స్త్ సెన్స్ త్వరగా ప్రచోదనం అవుతుంది.మంత్ర త్వరగా సిద్ధిస్తుంది ఆ స్థలంలో ఉన్న శక్తి అటువంటిది
మీరు ఆ ప్రాంత్రాలలో నిరంతరం క్రమంగా కొద్దీ రోజులు ధ్యానం చేస్తే మీకు త్వరగా ధ్యానంలో మనసు నిలకడ లభిస్తుంది ఏకాగ్రత కుదరడం వల్ల మంత్రం శ్వాసతో లీనమై సిద్ది పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది..
వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు.
సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు విశ్వకర్మ అంశ అయిన సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి సంభోగించుట మూలంగా వీరు జన్మించారు.
మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. .
April 30, 2023 - ఆదివారం సందర్భముగా పల్నాడు జిల్లా చామర్రు గ్రామ నవ గ్రహ దేవాలయములో ఆదిత్య పారాయణ , నవగ్రహ పూజలు , విశేష అభిషేకములు, అలంకారములు #chamarrutemples