My Authors
Read all threads
అవి మాయమైనందునే విపత్తు
నగరంలో 52 చెరువుల ఆనవాళ్లు లేవు
‘ఈనాడు’తో #NITW విశ్రాంత ఆచార్యుడు పాండురంగారావు
కాకతీయుల నినాదం "#3T"
#ట్యాంక్‌, #టెంపుల్‌, #టౌన్‌’... అంటే ఒక పెద్ద చెరువును అభివృద్ధి చేసి అక్కడ బ్రహ్మాండమైన ఆలయం నిర్మించి, దాని చుట్టూ పట్టణాన్ని తీర్చిదిద్దడం.
ఇప్పుడు కాకతీయులు కట్టిన ఆలయాలన్నీ అలాగే ఉన్నాయి. ప్రతి గుడి వద్ద భారీ చెరువులు దర్శనమిస్తాయి.ప్రస్తుతం వారు నిర్మించిన గుళ్లు శిథిలావస్థకు చేరడమే కాదు,కట్టిన చెరువులు ఆక్రమణకు గురై అసలు కనిపించకుండా పోయాయి. కాకతీయుల రాజధానిగా ఉన్న ఓరుగల్లు నగరంలో సహజంగా ఉన్న చెరువులు ఏకంగా 247.
ఇందులో ఒకటి రెండు కాదు ఏకంగా 52 కనుమరుగవ్వడం వల్లే నేడు నగరంలో వానలు కురవగానే చెరువుల్లోకి వెళ్లాల్సిన నీళ్లు ఇళ్లలోకి వెళ్లి, కాలనీలు నదులను తలపిస్తున్నాయి. ప్రజల కంట కన్నీరే మిగులుతోంది.
@arvindkumar_ias @warangal_nit @somnitwarangal
ఆ పటం చెబుతోంది:
గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 407.6 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర పటాన్ని ఉపగ్రహ డేటా ఆధారంగా ‘తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌’ వాళ్లు చేసిన పటంలో వివరాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న చెరువులు నీలి రంగులో కనిపిస్తుండగా,
పూర్తిగా ఆక్రమణలకు గురై కనుమరుగైన 52 చెరువులు నారింజ రంగులోని చుక్కలు,ఇక నగరంలో ప్రస్తుతం ఉన్న 2 నాలాలను కూడా ఇందులో పొందుపరిచారు.
హన్మకొండ విషయానికొస్తే వడ్డేపల్లి చెరువు నిండాక ఆ నీరు వరద కాలువల ద్వారా చౌటి చెరువు,బీరన్నకుంట,కొమార్లకుంట అనే గొలుసు కట్టు చెరువులకు వెళ్లేది.
ఇప్పుడు వడ్డేపల్లి కింద ఉండే మూడు చెరువులు ఆక్రమణకు గురై పూర్తిగా మాయమయ్యాయి. అందుకే వానలతో వరదలు వచ్చినపుడు ఈ చెరువల్లోకి వెళ్లాల్సిన నీరు కాలనీల్లోకి చేరి జల ప్రళయం వస్తోంది.అంటే కాకతీయుల చెరువుల సూత్రమైన గొలుసు కట్టును కబ్జాదారులు తెంచేయడంతో వరద కాలువలు లేక నగరం జలమయమవుతోంది.
WGL విషయానికొస్తే బొందివాగు నీరంతా ఒకప్పుడు భద్రకాళి చెరువులోకి వచ్చేది. దీన్ని 1992 నుంచి కాకతీయల కాలువ ద్వారా వచ్చే మంచి నీటిని నింపే జలాశయంగా వాడుతున్నారు.
తర్వాత బొంది వాగు నీరు వెళ్లేందుకు సరైన కాలువలు నిర్మించకపోవడంతో హంటర్‌ రోడ్డుతోపాటు, WGLలోని అనేక ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ప్రస్తుతం వరంగల్‌ డ్రైనేజీ నీరంతా ముచ్చర్ల నాగారం చెరువులోకి వెళ్తోంది.
కాకతీయులు కట్టిన చెరువుల కట్టలు, మత్తళ్లు ఎంతో దృఢంగా ఉన్నాయి. అందుకే పెద్ద వరదలొచ్చినా చెరువులకు గండ్లు పడడం లేదు. ఒకవేళ అవి నాసిరకంగా ఉంటే ఊహించనంత ప్రమాదం జరిగి నగరం మొత్తం నీట మునుగుతుంది.
#కాపాడుకోవాలి :
ఇప్పటికే పూర్తిగా కనుమరుగైన పాత చెరువులను ఎలాగూ రూపొందించలేము. భవిష్యత్తులో వరంగల్‌ జలమయం కావద్దంటే ఉన్న చెరువులను కాపాడుకోవాలి. వాటి ఎఫ్‌టీఎల్‌ (ఫుల్‌ ట్యాంక్‌ లెవెల్‌) గుర్తించి అక్కడ ఆక్రమణ కాకుండా చూడాలి. చెరువు కట్టలు దృఢంగా చేయాలి.
#Save #citylife
చెరువుల పరివాహక ప్రాంతాలను రక్షించి ఫీడర్‌ ఛానెల్స్‌ను కాపాడుకోవాలి. వాన నీటి వరద కాలువల డిజైన్లు సరిగా రూపొందించుకోవాలి. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలి. అసలు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఉంటేనే నగరం ‘స్మార్ట్‌ సిటీ’ కింద లెక్క.
ఈ మ్యాపును తయారుచేసింది మరెవరో కాదు, ఉపగ్రహ చిత్రాల ద్వారా సమాచారం సేకరించి ‘తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌’ వారు రూపొందించారు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే అనేక భయంకరమైన నిజాలు తెలుస్తాయి. ప్రస్తుత వరదలకు గల కారణాలు ఇందులో కళ్లకు కట్టేలా ఉన్నాయి.
అసలు వరంగల్‌ నగరంలో సహజంగా ఎన్ని చెరువులు ఉండేవి? ఆక్రమణల తర్వాత ఇప్పుడెన్ని మిగిలాయి? అనే కఠోర సత్యాలు ఇందులో కళ్లకు కడుతున్నాయి.
ఈ అంశాలపై కాకతీయుల గొలుసుకట్టు చెరువులపై ఎన్నో అధ్యయనాలు చేసి అపారం అనుభవం ఘడించిన ఎన్‌ఐటీ విశ్రాంత ఆచార్యుడు, జియో ఇంజినీర్‌ ఆచార్య పాండురంగారావుతో ‘ఈనాడు’ మాట్లాడింది. వివరాలు ఆయన మాటల్లోనే..
#WarangalFloods #Save #city #life #WGLMP2041
eenadu.net/districts/main… @eenadulivenews
Environmental & Socio-economic Studies A geospatial approach to #flash flood hazard mapping in the city of #Warangal , Telangana, India by Bandi Aneesha Satya & Meshapam Shashi & Deva Pratap, 2019.
PDF link : researchgate.net/publication/33…
1/4
Missing some Tweet in this thread? You can try to force a refresh.

Keep Current with @Hi Warangal

Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

Twitter may remove this content at anytime, convert it as a PDF, save and print for later use!

Try unrolling a thread yourself!

how to unroll video

1) Follow Thread Reader App on Twitter so you can easily mention us!

2) Go to a Twitter thread (series of Tweets by the same owner) and mention us with a keyword "unroll" @threadreaderapp unroll

You can practice here first or read more on our help page!

Follow Us on Twitter!

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3.00/month or $30.00/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!