నాలుగు వేదాలు,
పంచభూతాలు,
అంతరాత్మ,
ధర్మం,
యముడు,
ఉభయ సంధ్యలు,
సూర్య చంద్రులు,
పగలు,
రాత్రి .
వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు . ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .