1981-82 మధ్య #JVSomayajulu, #JVRamana గార్ల నాటక బృందం హైదరాబాద్ 'రైల్ కళారంగ్' లో ఓ నాటకం వేస్తే మా నాన్నగారు తీసుకెళ్లారు. చిన్నవాడిని కనుక నాకేమి అర్థంకాలేదు. సోమయాజులు గారు మంచం మీద నుంచి లేచి ఎదో అనే దృశ్యం ఒకటి లీలగా గుర్తుంది. కానీ చూట్టూ పక్కల జనం నాటకం ఆసాంతం పగలబడి 1/n
నవ్వటం బాగా గుర్తుంది. ఆ తర్వాత ఎప్పటికో గాని తెలియలేదు. ఆ నాటకం #Kanyasulkam అని. అది వ్రాసింది ఒక గొప్ప కవి అని, ఆయన పేరు #gurajadaapparao అని.
ఓ సందేశం పంపారు. గురజాడకి జోహార్లర్పిస్తూ, తాను కన్యాశుల్కం చిత్రం చాలా సార్లు చూసినా, నాటకం చూసే అవకాశం కలగలేదని. ఆ సందేశం చదివిన తర్వాత పైన చెప్పిన నా చిన్ననాటి అనుభవం గుర్తొచ్చింది. రాజా గారు నాకన్నా చాలా పెద్దవారు. ఇపుడు మళ్ళీ ఎవరన్నా కన్యాశుల్కం నాటకం వేస్తే తప్ప, 3/n
నా వయసు వారిలో కన్యాశుల్కం నాటకం చూసిన బహుకొద్ది మందిలో నేను ఒకడినయ్యుంటాను.
ఫోటో గురించి:
మా నాన్నగారు, అప్పటి ఆం. ప్ర. సాంస్కృతిక శాఖ లో పన్జేసినపుడు, సోమయాజులు గారు ఆ శాఖ సంచాలకులు. ఓ సారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో ఇది. ఎందుకో దీనంగా కూర్చున్నాను. 4/4