దాసు కిరణ్ Profile picture
Co-founder & CEO @Dasubhashitam. #తెలుగు పిపాసి. #దాసుభాషితం ప్రకాశి. #బెంగళూరు నివాసి. ఆసక్తులు: అద్వైతం, బిహేవియరల్ సైన్స్, సంగీతం, సాహిత్యం, హాస్యం.
May 28, 2023 15 tweets 4 min read
*#NTR నాకు డ్రైవర్ అయిన వేళ.*

నేను #ఎన్టీఆర్ గారిని రెండు సార్లు చూశాను.
మొదటి సారి, తనే స్వయంగా బండి నడుపుతూ, నాతో విహార యాత్ర చేశారు.
ఇది ఎలా జరిగిందంటే... + Image అవి మేము హైదరాబాద్ శివార్లలో వనస్థలిపురం కు మారిన కొత్త రోజులు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి పై, హైదరాబాద్ కు చాలా దూరంలో ఉండడంతో, "విజయవాడ నుంచి ఎప్పుడొచ్చారు?" అని, "అవస్థల పురం" అని గేలి చేసేవారు.
+
Aug 29, 2021 8 tweets 1 min read
తెలుగు భాషా దినోత్సవాన తెలుగు వారందరికీ శుభాభినందనలు.

తెలుగు చదవగలిగి ఉండి, ఇంకా బాగా మాట్లాడాలి అనుకునేవారికి ముందు జోహార్లు.
ఇక్కడ (నేను పాటించిన) కొన్ని చిట్కాలు ఇస్తున్నాను. మీకూ ఉపయోగ పడతాయేమో చూడండి. 1/8 1.
మీ వాక్యాలలో తెలుగు ఎంతుందని కొన్ని రోజుల పరిశీలన తర్వాత నిర్ధారించుకోండి.
అంటే ప్రస్తుతం "వెజిటబుల్స్ ను ఇలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసుకోండి" అంటున్నారంటే, తెలుగు రమారమి 30 శాతం అన్నమాట.
2/8
Oct 3, 2020 8 tweets 2 min read
కష్టాలు కనీసం మూడు రకాలు. అవి

- ఒకరికి ఒక కష్టం రావడం
- అందరికి ఎదో ఒక కష్టం రావడం
- ఒకే కష్టం అందరికీ రావడం

ఈ సంవత్సరం సెప్టెంబర్ 25, మూడో రకం కష్టం వచ్చిన రోజు.
భారతదేశానికి, ముఖ్యంగా దక్షిణ భారతీయులకు అత్యంత ప్రియమైన శ్రీ SP బాలసుబ్రమణ్యం అకాలంగా మరణించిన రోజు. 1/n Image విషాదాన్ని ఒక్కక్కరు ఒకో విధంగా భరిస్తారు. కొందరు పోయిన వారి జ్ఞాపకాలను తలచుకుంటారు. నలుగురితో పంచుకుంటారు. ఇంకొందరు మౌనంగా, ఏకాంతంగా భరిస్తారు.

తల్లితండ్రులు, తోబుట్టువులు, సంతానం పోయినప్పుడు వైరాగ్యం వస్తుందని, లేకపోతే కర్మకాండలు చేయలేరని అంటారు. 2/n
Sep 21, 2020 5 tweets 3 min read
1981-82 మధ్య #JVSomayajulu, #JVRamana గార్ల నాటక బృందం హైదరాబాద్ 'రైల్ కళారంగ్' లో ఓ నాటకం వేస్తే మా నాన్నగారు తీసుకెళ్లారు. చిన్నవాడిని కనుక నాకేమి అర్థంకాలేదు. సోమయాజులు గారు మంచం మీద నుంచి లేచి ఎదో అనే దృశ్యం ఒకటి లీలగా గుర్తుంది. కానీ చూట్టూ పక్కల జనం నాటకం ఆసాంతం పగలబడి 1/n Image నవ్వటం బాగా గుర్తుంది. ఆ తర్వాత ఎప్పటికో గాని తెలియలేదు. ఆ నాటకం #Kanyasulkam అని. అది వ్రాసింది ఒక గొప్ప కవి అని, ఆయన పేరు #gurajadaapparao అని.

నేడు శ్రీ #గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా #దాసుభాషితం అభిమాని, @dasubhashitam కు *మహారాజ పోషకులు* అయిన శ్రీ @gksraja గారు 2/n