🚩 🚩సారీ ! ఏమనుకోవద్దు !!

#భర్తల ఆలోచనలను కూడా గమనించండి .
భర్తల తరఫున ధైర్యం చేసి రాస్తున్నా !
ఇన్నాళ్ళూ మీ వైపునుంచి వచ్చేవి వింటున్నాము .
మా మాటలు కూడా కొంచెం వినండి.
ఇవీ మా రూల్స్ !
#Please note..
అన్నీ ప్రధానమైనవే . అందుకే అన్నిటికీ "1" మాత్రమె ఇచ్చాను !
1. భర్తలు మీ మనస్సును చదవలేరు .
.
1. షాపింగ్ అంటే ఆట కాదు . మేము దాన్ని ఆటలా ఆడలేము
.
1. ఏడ్చి బ్లాక్ మెయిల్ చెయ్యొద్దు .
.
1. మీ మనసులో ఏముందో సూటిగా చెప్పండి .
.గుంభన గా చెప్తే మేము అర్ధం చేసుకోలేము . హింట్ ఇస్తే అర్ధం చేసుకోలేము తలాతోకాలేకుండా చెప్తే అర్ధం చేసుకోలేము !
1. మీరడిగే ప్రశ్నలకి "అవును" "కాదు " అని జవాబులు మాత్రమె చెప్పగలము
.
1. మీసమస్య పరిష్కారం కోసం మా దగ్గరకు రండి . అది చెయ్యగలము.
అంతే గానీ సానుభూతి చూపడం మాకు రాదు. ( అందుకు మీరు తోటి ఆడవాళ్ళకు చెప్పుకోండి )
.
1. మీకు మాతో తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గర చూపించుకోవాలి . అంతే గానీ సతాయించకూడదు.
.
1. ఆరునెలల క్రితం ఎప్పుడో మేము అన్న మాటలు పట్టుకుని ఇప్పుడు సాధించకూడదు .
ఒక వారం తర్వాత అన్ని మాటలూ రద్దు అయిపోతాయి . అంతకంటే ఎక్కువ కాలం గుర్తు పెట్టుకోకండి !
.
1. మీరు లావుగా ఉన్నారు అనిపిస్తే అది నిజమే కావచ్చు. మా అభిప్రాయం అడక్కండి .
.
1. మేము అన్నమాట మీకు రెండు విధాలుగా అనిపించి అందులో ఒకటి మీకు బాధ కలిగిస్తే మేము రెండో విధంగా అన్నాము అని అనుకోండి.
అంతే గానీ మేము మీకు బాధను కలిగించాము అనుకోకండి.
.
1. ఏదైనా పని చెప్పండి. మాకువచ్చినట్టు చేస్తాము.
మీరు ఎలా అనుకున్నారో అలా మేము చెయ్యాలి అనుకోకండి.
1. మీరు చెప్పాలి అనుకున్న విషయం టి . వి లో యాడ్స్ వస్తున్నప్పుడు చెప్పండి .
సీరియస్ గా క్రికెట్ చూస్తున్నప్పుడూ , న్యూస్ చూస్తున్నప్పుడూ చెప్పకండి.
.
1. కొలంబస్ కి డైరెక్షన్స్ అక్కరలేదు. మాక్కూడా అక్కరలేదు
.
1. మగవాళ్ళకి Windows default settings లా కొన్ని రంగులే తెల్సు Peach, అంటే మా దృష్టిలో పండు , కలర్ కాదు . Pumpkin ( గుమ్మడి కాయ ) మా దృష్టిలో ఒక పండు . mauve అంటే ఏమిటో మాకు తెలియదు
..
1. నేనేమి తప్పు చేశాను అని మే ము అడిగితే " ఏమీ లేదు " అంటే ఓహో ఏమీ లేదు అనే అనుకుంటాము . ఏ దో ఉంది అని మాకు తెలిసినా బుర్రలు పాడుచేసేసుకోలేము . అవుసరమా ?
.
1. జవాబు అక్కరలేని ప్రశ్నలు వేస్తే ఆశించని జవాబులు రావచ్చు . గుర్తు పెట్టుకోండి.
.
1. football, cars, bikes or games ఇలాంటి విషయాలమీద మీరు ప్రశ్నలు వేసి మా అభిప్రాయాలు తెలుసుకోవాలి అనుకుంటే వాటి గురించి కొంచెం తెలుసుకొని అడగండి .
.
1. మీకు చాలా బట్టలు ఉన్నాయి .
1. మీకు చాలా చెప్పుల జతలు ఉన్నాయి .
1. మీరు షేపు గానే ఉన్నారు .
Round IS a shape!
1. చదివినందుకు ధన్యవాదాలు .
.
నాకు తెలుసు !
తను ఇది చదివిన రోజు నాకు ఉంది అని .
అయినా పర్లేదు !!.
మా ఆవేదన వెళ్లగక్కుకోవాలి
.
అందరు భర్తల తో కలసి వింజమూరి.😁😊

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with వింజమూరి -V.V. Apparao

వింజమూరి -V.V. Apparao Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @appa_v

22 Oct
🚩🚩దేశమంటే మట్టి కాదోయ్!🚩🚩
.
*ఒక సారి ఒక బెంగాలి , ఒక పంజాబి " మేమే గొప్ప దేశ భక్తులం అంటే, కాదూ మేమే అంటూ " వాదించుకుంటున్నారు
. ఇద్దరూ ఒక ఒప్పొందానికి వచ్చారు .
బెంగాలి " నువ్వు
మీ వాళ్ళల్లో ఒకడి పేరు చెప్పి నా నెత్తి మీద ఒక వెంట్రుక పీకేయ్ , నేనూ మా వాళ్ళల్లో ఒకడి పేరు చెప్పి నీ తల వెంట్రుక పీకేస్తా.
..దేశ సేవ చేసిన వాళ్ళెవరైనా , దేశం కోసం చని పోయిన వారైనా " .సరే అంటె సరే అనుకొన్నారు.
#బెంగాలి " బకీంచంద్ర" అంటు ఒకటి#
#పంజాబి " లాలా లజ్ పత్ రాయ్ " అంటూ ఒకటి
బెంగాలీ " బిపించంద్ర పాల్ " ఒకటి
పంజాబి " భగత్ సింఘ్ " ఒకటి.
.......................
.......................
.........................
Read 4 tweets
22 Oct
🌹🌺 శుభోదయం . 🌺🌹

👉🏿రామ' అన్న శబ్దం లోనే ఒక రకమైన తద్యాత్మత,

భక్తీ, అనుభూతి ఉన్నాయి.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

భక్త రామదాసు రచించిన దాశరదీ శతకం నుంచి కొన్ని శ్లోకాలు

ఇక్కడ మననం చేసుకుందాము:-

🌺
.

శ్రీ రఘురామ! చారు తులసీ దళ దామ! శమక్షమాది శృం

గార గుణాభిరామ! త్రిజన్నుత శౌర్యర మాలలామ! దు

ర్వార కబంధ రాక్షస విరామ! జగజ్జన కల్మష్రాణ వో

త్తరతనామ! భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధి!

🌺🌺
చిక్కని పాలపై మిసిమిన్ జెందిన మీగడ పంచదార తో

మెక్కిన భంగి మీ విమల మేచక రూప సుధారసంబు నా

మక్కువ పళ్ళెరంబున సమాహిత దాస్య మనేటదో యిటన్

దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధి!

🌺🌺🌺
Read 4 tweets
21 Oct
🚩.-గజేంద్ర మోక్షము.-కథ .🚩
❤️
🚩త్రికూట పర్వతారణ్యములో ఒక గజరా జుండెను.

అతనికి దశలక్ష భార్యలు గలరు .అతడొకనాడు భార్యలతో

అడవిలో దిరుగుచు దాహమువేసి, ఒక చెరువులో దిగి

నీళ్ళు ద్రావి, కరిణులతో జలక్రీడలకు దిగి, చెరువు నంతయు

కలచివేసెను.
ఆ చెరువులో పెద్దమొసలి యున్నది.

అది వచ్చి గజరాజు కాలుపట్టుకొనేను.

ఏనుగు విదిల్చి కొట్టెను. మొసలి మరల పట్టుకొని విడువలేదు.

లోపలికి లాగుచుండెను. గజము ఒడ్డునకు లాగుచుండెను.

పోరు ఘోరమయ్యెను. వేయి యేండ్లు గడిచేను.

స్థానబలముచేత నీటిలోని మొసలి మరింత విజ్రు౦భి౦చెను.
గజరాజునకు బలము సన్నగిల్లెను.

మొసలిని గెలువగలనా లేదా యని సందేహము కలిగెను.

రక్షించువా రెవ్వ రను కొనెను.

పూర్వసుకృతము వలన భగవంతుడు తప్ప మరొకడు

రక్షకుడు లేడను స్థిరబుద్ధి కలిగెను.
Read 11 tweets
21 Oct
🚩పోతనగారి గజేంద్ర మోక్షం పద్యాలు!!

👉🏿

కరి దిగుచు మకరి సరసికి

కరి దరికిని మకరి దిగుచు కరకరి బెరయన్

కరికి మకరి మకరికి కరి

భరమనుచును నతల కుతల భటులరుదు పడన్ !!
👉🏿

నానానేకప యూధముల్ వనము లోనన్ పెద్ద కాలంబు స

న్మానింపన్ దశ లక్ష కోటి కరిణీ నాధుండ నై యుండి మ

ద్దానాంభః పరిపుష్ట చందన లతాంతచ్చాయ లందుండ లే

కీ నీరాశ ఇటేల వచ్చితి భయం బెట్లో గదే ఈశ్వరా !!
👉🏿

కలడందురు దీనుల యెడ

కలడందురు భక్త యోగి గణముల పాలం

గలడందురన్ని దిశలను

కలడు కలండనెడు వాడు కలడో లేడో !!

👉🏿

లోకంబులు లోకేశులు

లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం

జీకటి కవ్వల నెవ్వడు

ఏకాకృతి వెల్గు నతని నే భజియింతున్ !!
Read 8 tweets
21 Oct
🚩🚩శుభోదయం .🚩🚩

❤️'ప్రేమనుతొలగిస్తే ఈ భూగోళం ఒక సమాధి'' ❤️

#ప్రేమ అనేరెండక్షరాలకు సంతోషం, ఇష్టం, స్నేహం,
చెలిమి అనే అర్థాలున్నాయి-

ప్రేమ ప్రాధమికంగా ప్రకృతి పురుషులకు సంబంధించింది.

ప్రేమ పలువిధాలుగా ఉంటుంది. మాతృప్రేమ, పితృప్రేమ, భాతృప్రేమ,
సోదరీ ప్రేమ, మిత్రప్రేమ, బంధుప్రేమ మొదలైన రీతిలో ఉంటుంది.

అన్నిటి కంటే మించిందిగా మాతృప్రేమను చెబుతారు. తనబిడ్డ

ఎంతపెద్ద వాడైనా, పెద్దదైనా మాతృమూర్తికి చిన్నగానే కనిపించటం,

ఈ ప్రేమలోని మహత్త్యం.

ఇప్పుడు ప్రేమకు అర్థాలు మారిపోయాయి. మారిపోతున్నాయి.
ఎదుటివారి పట్ల మనం ప్రేమను ప్రకటిస్తే ఎదుటి వారు మనల్ని

ప్రేమిస్తారు. ద్వేషం ద్వారా దేన్నీ సాధించలేము''

పరస్పర ప్రేమను మించిన స్వర్గం లేదని పెద్దలంటారు.

. ప్రేమించి విఫలమవ్వటమూ మంచిదే నంటూ బసవరాజు అప్పారావు

''ప్రేమ వైఫల్యమూ ఒక మధుర అనుభవాన్ని ప్రసాదిస్తుం దని కవిభావం.
Read 4 tweets
19 Oct
🙏 🙏🙏 హాలాహల భక్షణ!🙏🙏 🙏

👉పిల్లలకి తెలుగు పట్ల ఉత్సాహం, మక్కువ, ఆసక్తి,

కలగాలంటే ఇలాంటి పద్యాలు వారి ఎదురుగా

పెద్దలు పైకి బిగ్గరగా చదవాలి.

క.

కంటే జగముల దుఃఖము;

వింటే జలజనిత విషము వేఁడిమి; ప్రభువై

యుంటకు నార్తుల యాపద

గెంటింపఁగ ఫలము గాదె కీర్తి మృగాక్షీ!

🏵️🏵️
క.

ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన

ప్రాణుల రక్షింపవలయుఁ బ్రభువుల కెల్లం

బ్రాణుల కిత్తురు సాధులు

బ్రాణంబులు నిమిష భంగురము లని మగువా!

🏵️🏵️🏵️

క.

పరహితము జేయు నెవ్వఁడు

పరమ హితుం డగును భూత పంచకమునకుం

బరహితమె పరమ ధర్మము

పరహితునకు నెదురులేదు పర్వేందుముఖీ!

🏵️🏵️.🏵️🏵️

.
.క
హరి మది నానందించిన

హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్

హరియును జగములు మెచ్చఁగ

గరళము వారించు టొప్పుఁ గమలదళాక్షీ!

క.

శిక్షింతు హాలహలమును

భక్షింతును మధురసూక్ష్మ ఫలరసము క్రియన్

రక్షింతుఁ బ్రాణి కోట్లను

వీక్షింపుము నీవు నేఁడు వికచాబ్జముఖీ!
Read 7 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!