🚩🚩పద్మనాభం!!🚩🚩
😁😃😁
హాస్యనటుడిగా ప్రసిద్ధిపొందిన బి.పద్మనాభం
( ఆగస్టు 20, 1931 - ఫిబ్రవరి 20, 2010) (Padmanabham)
ప్రముఖ తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు.
ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు.
ఈయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.
. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. "ద్రౌపదీ వస్త్రాపహరణం", "వందేమాతరం", "సుమంగళి", శోభనావారి "భక్త ప్రహ్లాద" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.
రంగస్థలానుభవం:
ఐదేళ్ళ వయసులో (1936లో) "చింతామణి" నాటకంలో కృష్ణుడివేషం వేసి వన్స్ మోరులతోబాటు ఒక వెండికప్పు బహుమతిగా పొందాడు. స్త్రీపాత్రలకు ప్రసిద్ధిపొందిన కొండపేట కమాల్ ఈ నాటకంలో చింతామణి కాగా పద్మనాభం తండ్రి శ్రీహరి పాత్రధారి.
థియేటర్ మేనేజర్ ను మంచిచేసుకుని వచ్చిన సినిమాలన్నీ చూసేవాళ్ళు. అప్పుడే సైకిల్ తొక్కడం నేర్చుకున్న పద్మనాభం తమ్ముడితో కలిసి సైకిల్ కొనడానికి డబ్బు సంపాదించడానికి ఎవరికీ చెప్పకుండా రైల్లో టికెట్ లేకుండా ముందు బెంగుళూరు వెళ్ళి అక్కడేం చెయ్యాలో తోచక మద్రాసు వెళ్ళారు.
అక్కడ నటి కన్నాంబ ఇంటికి వెళ్ళి ఆమెతో విషయం మొత్తం చెప్పేశారు. తమ గానకళతో ఆమెను మెప్పించి రాజరాజేశ్వరీ వారి కంపెనీలో కుదురుకున్నారు.
ఆ తర్వాత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకొకవైపు సి.ఎస్.ఆర్. లాంటివాళ్లతో కలిసి భక్త తుకారాం లాంటి నాటకాల్లో 50, 60 ప్రదర్శనల్లో పాల్గొన్నాడు.
ఋష్యేంద్రమణి వాళ్ళ ట్రూపులో పాదుకాపట్టాభిషేకం, సతీ సక్కుబాయి, హరిశ్చంద్ర, రంగూన్ రౌడీ, శ్రీకృష్ణలీలలు, మొదలైన నాటకాల్లో నటించాడు.
వాళ్ళు తీసిన "పాదుకాపట్టాభిషేకం" సినిమాలో కోరస్ లో పాడే అవకాశం వచ్చింది. పద్మనాభం సినిమాల్లో చేరగానే తమ్ముడు ఇంటికి తిరిగివచ్చేశాడు.
తర్వాత పద్మనాభం మాయలోకంసినిమాలో కోరస్ లో పాడడమేగాక ఒక పాత్ర కూడా వేశాడు. ఇది నటుడిగా ఆయన తొలి సినిమా. రెండవ సినిమా త్యాగయ్య. మూడవ సినిమా ముగ్గురు మరాఠీలు. ఇక ఆ తర్వాత నారద నారది, యోగి వేమన,...ఇలా అవకాశాలు వరసగా వచ్చాయి.
రాధిక(1947)లో కృష్ణ పాత్ర వెయ్యడమే గాక ఒక గోపబాలునికి ప్లేబ్యాక్ పాడాడు. తర్వాత భక్త శిరియాళలో చిన్న చిరుతొండడి పాత్ర, వింధ్యరాణిలో ఇటు నటన-అటు గానం.
1948లో జెమిని వారి వీరకుమార్ చిత్రానికి ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకున్నాడు.
ఈలోగా యోగివేమన తీసిన కె.వి.రెడ్డి గుణసుందరి కథ తీస్తూండడంతో ఆయన్ను వాహినీ స్టుడియో లో కలవగా ఆయన పాట పాడించుకుని విని, గొంతు బాగాలేకపోయేసరికి చికాకు పడ్డాడు: "బాగా పాడేవాడివే! ఏమైంది? గొంతు ఇలా ఉంటే కప్పులు కడగడానికి కూడా పనికిరావు" అన్నాడు.
దాంతో నిరాశపడ్డ పద్మనాభం సింహాద్రిపురం వెళ్ళిపోయాడు.
గుంతకల్ దగ్గరున్న కొనకొండ్లలో చిన్నాన్న శ్రీనివాసరావు దగ్గర కరణీకం నేర్చుకుంటూ ఉండగా వీరకుమార్ షూటింగుకు రమ్మని కబురు వచ్చింది. ఆ షూటింగు జరుగుతున్నరోజుల్లో విజయాసంస్థతో ఏర్పడిన పరిచయం ఆయన కెరీర్ ను మలుపుతిప్పింది.
షావుకారులో నౌకరు పోలయ్య వేషానికి ముందు బాలకృష్ణను అనుకున్నారు. ఐతే చక్రపాణి "వీడు ముదురుగా ఉన్నాడు. ఇంకెవరూ లేరా?" అని అడగడంతో దర్శకుడు ఎల్.వి.ప్రసాద్వెంటనే "రాధికలో కృష్ణుడిగా వేసిన పద్మనాభం ఉన్నాడు." అని పిలిపించి వేషం ఇప్పించారు.
పాతాళభైరవి చేస్తున్నప్పుడు కె.వి.రెడ్డి తోటరాముడిగా రాజారెడ్డి, మాంత్రికుడిగా ముక్కామల అనుకున్నాడు. షావుకారు రషెస్ చూసిన వెంటనే మనసు మార్చుకుని హీరోగా ఎన్.టి.ఆర్., మాంత్రికుడిగా ఎస్.వి.ఆర్., అంజిగా బాలకృష్ణ ( సదాజపుడిగా పద్మనాభం లను ఖరారు చేసుకుని
విజయావారి పర్మనెంటు ఆర్టిస్టులుగా మూడేళ్ళ అగ్రిమెంటు తీసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పాతాళభైరవితో బాటు విజయావారి తర్వాతి చిత్రాలైన పెళ్లిచేసిచూడు, చంద్రహారం లలో నటించాడు. అదే సమయంలో గుబ్బి ప్రొడక్షన్స్ శ్రీకాళహస్తి మహాత్మ్యం లో కాశి వేషం వేశాడు.
1954లో వచ్చిన సతి అనసూయతో మొదలుపెట్టి కృష్ణప్రేమ,సతీ సుకన్య, కృష్ణలీలలు, శ్రీరామకథ, సతీ తులసి, ప్రమీలార్జునీయం లలో నారదుడిగా వేశాడు.
:
1964 సంవత్సరంలో రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి దేవత, పొట్టి ప్లీడర్, శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న నిర్మించారు.
మర్యాద రామన్నతోనే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం గాయకుడిగా తొలిసారి పరిచయం చేశారు. 1968లో శ్రీరామకథ నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. 1970లో కథానాయిక మొల్ల తీసి బంగారు నంది అవార్డు పొందారు.
చెన్నై లో ఫిబ్రవరి 20, 2010 ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు.
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
🚩🚩లటక్కన పెగ్గేసి -చటుక్కున మూతి తుడుచుకుంటాం!🚩🚩
- #పెగ్-1
మందు విషయంలో మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వంట చేస్తూంటుంది.
వంటింట్లోంచి పాత్రల శబ్దం వినిపిస్తూ ఉంటుంది.
మనం పిల్లిలా ఇంట్లో దూరుతాం.
చెక్కబీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం.
ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
ఎవరూ వాడని బాత్రూం అటక మీంచి గ్లాసందుకుంటాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
.
గ్లాసు కడిగేసి అటక మీద పెట్టేస్తాం.
తాతగారు బోసినవ్వుతో చూస్తారు.
వంటింట్లోకి తొంగి చూస్తాను.
మా ఆవిడ చపాతీపిండి కలుపుతూంటుంది.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
మా ఆవిడకూ నాకూ మధ్య సంభాషణ మొదలవుతుంది.
నేను: శర్మగారమ్మాయి పెళ్లి సంగతేమైంది?
మా ఆవిడ: తిన్నగా ఉంటే కదా, మంచి సంబంధాలు రావడానికి!
.
– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?
*కాదు*
అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే *భగవద్గీత ‘డైనమిక్ ప్రిస్కిప్షన్ ఫర్ లైఫ్’*
సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి
*☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. గీత చెప్పేదీ నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.*
*☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.*
🚩🚩కనిపించిన అమ్మాయి .🚩🚩 #ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన.
పరమాచార్య స్వామివారి దర్శనం కోసం నిలుచున్న వరుసలో ఒక ముదుసలి దంపతులు కూడా ఉన్నారు. వారి వంతు రాగానే నేలపై పడి స్వామివారికి సాష్టాంగం చేశారు.
ఆ పెద్దాయన స్వామితో, “పెరియవ! నేను ఉద్యోగ విరమణ చేసాను.
నాకు పిల్లలు లేరు. కనుక నాకు కంచి మఠంలో సేవ చెయ్యాలని ఉంది. దయచేసి నన్ను ఆశిర్వదించండి” అని వేడుకున్నాడు. అతని ప్రార్థనలో వినయము, విధేయత కనబడుతున్నాయి. తని పక్కనే అతని భార్య కూడా నిలబడిఉంది.
”నిన్ను చూస్తోంటే జీవితంలో ఇక ఆనందం పొందటానికి ఏమి లేదని చాలా బాధపడుతున్నట్టు ఉన్నావుకదా?
అని అడిగారు. ”అవును పెరియవ”
“నీకు ఒక పని చెప్తాను చెయ్యగలవా?”
“దయచేసి ఆజ్ఞాపించండి పెరియవ. అందుకోసమే వేచియున్నాను. . . ”
ఇప్పుడు పరమాచార్య స్వామివారు వారికి సాష్టాంగం చేస్తున్న ఇంకొక దంపతులవైపు చూశారు. వారి కుటుంబము, పూర్వీకుల గురించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.
🚩🚩రామాయణం లో వాల్మీకి !🚩🚩 #శ్రీరామ ప్రవాస తన కాలంలో వాల్మీకిని కలుసుకున్నారు. #వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి ఈ కవలలుకు రామాయణం బోధించాడు.
-
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ, అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . అతను తన కుటుంబంను పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు.
-
🌹చివరికి మిగిలేది.🌹
👉
చివరికి మిగిలేది సిన్మా అంటే నాకు ఒక గొప్ప క్లాసిక్ అనే భావం పూర్తిగా ఉంది కదా బెంగాలీదైనా ,ట్రీట్మెంట్ మాత్రమచ్చ తెనుగు లో సాగింది .గుత్తా రామినీడు దర్శకత్వం గుడి మెట్ల అశ్వథామ స్వర మాధుర్యం ఘంట సాల ఏం ఎస్.రామా రావు మొదలైన వారి దివ్య గాత్రం ,
హరనాద్ సావిత్రి ల నటనా వైదుష్యం ఇందులో రాశీ భూత మైనాయి .ప్రభాకర రెడ్డి ని ,జయంతిని మొదటి సారిగా సినిమాలకు పరిచయం చేసిన సినిమా 1960లో విడుదల అయింది
.‘’ చెంగూన అలమీద మిడిసి పోతది మీను –చినవాడు ఎదరైతే మరచీ పోతవు మేనూ –కాదంటావా కాదంటావా – చిన్న దానా నువ్వు కాదంటావా?
వల్లా మాలిన మమత కమ్మా తెమ్మర లాగ –కమ్మకున్నది-నిన్నూ చిన్నదానా-చినదానా — కమ్మా నైన వాడు సరసనే ఉన్నాడు వల్లకుం టావే –నీవు చిన్న దాన -నీవు వల్లకుం టావే-
చినికిన చినుకెల్లా -మంచి ముత్యము కాదు -మెరసిన మెరుపులో లేత వెన్నెల లేదు-అందని చందమామా కోసమని
మన అప్పారావు అమెరికా వెళ్లి బిల్ గేట్స్ తో
మీటింగ్ లోపాల్గొన్నాడు
.
మా దేశం ఎంత అభివృద్ధి చెందిందో నీకు
చూపిస్తా రా అంటూ ఒక అడవికి తీసుకెళ్ళాడు
.
"ఇక్కడ గొయ్యి తవ్వు", అప్పారావు అలాగే తవ్వాడు...
"
ఇంకా లోతుకి తవ్వు" అంటూ వంద
అడుగులు గొయ్యి తీయించాడు. "ఇప్పుడు
.
వెతుకు ఏదైనా దొరుకుతుందేమో" అన్నాడు
అప్పారావు వెతికితే ఒక వైరు దొరికింది
"చూసావా వంద ఏళ్ల క్రితమే మేము టెలిఫోన్
వాడాము అన్నదానికి ఇది రుజువు"
.
అప్పారావు కి వళ్ళు మండింది,
తమాయించుకున్నాడు
.
ఆ తరువాత బిల్ గేట్స్ మన ఇండియా కి వచ్చాడు,
అప్పుడు మన అప్పారావుబిల్ గేట్స్ ని కలిసి మా దేశం
గొప్పతనం కూడా చూపిస్తా రమ్మని అడవికి
తీసుకెళ్ళాడు
.
"అక్కడ గొయ్యి తీయమన్నాడు.. గేట్స్ అలాగే గొయ్యి
తీసాడు, "ఇంకా లోతు ఇంకా లోతు" అంటూ
అయిదు వందల అడుగులు లోతు తీయించాడు.
.