🚩🚩*భగవద్గీత అంటే ఏమిటి?*🚩🚩

– జీవితమంతా అయిపోయిన తర్వాత చదువుకోవాల్సిన పుస్తకమా?
– రిటైర్‌మెంట్‌ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?
– ఎవరైనా మరణించినప్పుడు ప్లే చేసే సీడీనా?
– అది కేవలం హిందువులదా?
– పనీపాటా వదిలేసి సన్యసించమని చెబుతుందా అది?

*కాదు*
అవన్నీ అపోహలు. ఒక్కముక్కలో చెప్పాలంటే *భగవద్గీత ‘డైనమిక్‌ ప్రిస్కిప్షన్‌ ఫర్‌ లైఫ్‌’*
సంతృప్తిసంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే గీతను అర్థం చేసుకోవాలి
*☆సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటాం. గీత చెప్పేదీ నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు అని.*

*☆ సన్యాసం అనేది కాషాయదుస్తులతో రాదు. అదొక మానసిక స్థితి. వందమంది మధ్యన ఉన్నా, వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టు మాదిరిగా ఉండటమే సన్యాసమంటే.*
*☆ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కానేకాదు. ప్రపంచ ం అందిస్తున్న అన్నిటినీ ఇంద్రియాల సాయంతో, తెలివిగా వాడుకోమని. అలా వాడుకుంటే ప్రశాంతత, తద్వారా విజయం లభిస్తాయి.*
ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. భగవద్గీత చెప్పేది అదే.*

*☆అసలు భగవద్గీత ఏం చెబుతుంది?*

👉-ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
👉-కర్తవ్యం గురించి చెబుతుంది.
👉-నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
👉సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
👉ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
👉ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
👉-జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
👉-ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
👉-ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
👉-మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
👉పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది. ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
👉కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
👉నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.

*
అందుకే భగవద్గీత సర్వమానవాళి కోసం.*
అర్థం చేసుకున్నవారు ధన్యులు.నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది.

గీత చదువుకో.....
నీ రాత మార్చుకో.....

🕉🌹🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with వింజమూరి -బాషా భారతి .V.V. Apparao

వింజమూరి -బాషా భారతి .V.V. Apparao Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @appa_v

8 Nov
🚩🚩లటక్కన పెగ్గేసి -చటుక్కున మూతి తుడుచుకుంటాం!🚩🚩
-
#పెగ్-1
మందు విషయంలో మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
సాయంత్రం ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వంట చేస్తూంటుంది.
వంటింట్లోంచి పాత్రల శబ్దం వినిపిస్తూ ఉంటుంది.
మనం పిల్లిలా ఇంట్లో దూరుతాం.
చెక్కబీరువాలోంచి మందు బాటిల్ తీస్తాం.
ఫొటోలో తాతగారు నవ్వుతూ చూస్తారు.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
ఎవరూ వాడని బాత్రూం అటక మీంచి గ్లాసందుకుంటాం.
లటక్కన పెగ్గేసి చటుక్కున మూతి తుడుచుకుంటాం.
.
గ్లాసు కడిగేసి అటక మీద పెట్టేస్తాం.
తాతగారు బోసినవ్వుతో చూస్తారు.
వంటింట్లోకి తొంగి చూస్తాను.
మా ఆవిడ చపాతీపిండి కలుపుతూంటుంది.
ఈ చెవిలో సద్దు ఆ చెవిలో పడనివ్వం.
ఎందుకంటే... మనం ఎప్పుడూ రిస్క్ తీసుకోం.
మా ఆవిడకూ నాకూ మధ్య సంభాషణ మొదలవుతుంది.
నేను: శర్మగారమ్మాయి పెళ్లి సంగతేమైంది?
మా ఆవిడ: తిన్నగా ఉంటే కదా, మంచి సంబంధాలు రావడానికి!
.
Read 11 tweets
7 Nov
🚩🚩కనిపించిన అమ్మాయి .🚩🚩
#ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన.
పరమాచార్య స్వామివారి దర్శనం కోసం నిలుచున్న వరుసలో ఒక ముదుసలి దంపతులు కూడా ఉన్నారు. వారి వంతు రాగానే నేలపై పడి స్వామివారికి సాష్టాంగం చేశారు.
ఆ పెద్దాయన స్వామితో, “పెరియవ! నేను ఉద్యోగ విరమణ చేసాను.
నాకు పిల్లలు లేరు. కనుక నాకు కంచి మఠంలో సేవ చెయ్యాలని ఉంది. దయచేసి నన్ను ఆశిర్వదించండి” అని వేడుకున్నాడు. అతని ప్రార్థనలో వినయము, విధేయత కనబడుతున్నాయి. తని పక్కనే అతని భార్య కూడా నిలబడిఉంది.
”నిన్ను చూస్తోంటే జీవితంలో ఇక ఆనందం పొందటానికి ఏమి లేదని చాలా బాధపడుతున్నట్టు ఉన్నావుకదా?
అని అడిగారు. ”అవును పెరియవ”
“నీకు ఒక పని చెప్తాను చెయ్యగలవా?”
“దయచేసి ఆజ్ఞాపించండి పెరియవ. అందుకోసమే వేచియున్నాను. . . ”
ఇప్పుడు పరమాచార్య స్వామివారు వారికి సాష్టాంగం చేస్తున్న ఇంకొక దంపతులవైపు చూశారు. వారి కుటుంబము, పూర్వీకుల గురించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు.
Read 10 tweets
7 Nov
🚩🚩రామాయణం లో వాల్మీకి !🚩🚩
#శ్రీరామ ప్రవాస తన కాలంలో వాల్మీకిని కలుసుకున్నారు.
#వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి ఈ కవలలుకు రామాయణం బోధించాడు.
-
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ, అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . అతను తన కుటుంబంను పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు.
-
Read 15 tweets
7 Nov
🚩🚩పద్మనాభం!!🚩🚩
😁😃😁
హాస్యనటుడిగా ప్రసిద్ధిపొందిన బి.పద్మనాభం
( ఆగస్టు 20, 1931 - ఫిబ్రవరి 20, 2010) (Padmanabham)
ప్రముఖ తెలుగు సినిమా మరియు రంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు.
ఇతని పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభ రావు.
ఈయన తొలి తెలుగు సినిమా విడుదలైన సంవత్సరం 1931లో ఆగస్టు 20వ తేదీన కడప జిల్లా (ఇప్పటి వై యస్సార్ జిల్లా) పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు. తల్లి శాంతమ్మ. తండ్రి బసవరాజు వెంకటశేషయ్య కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు.
. ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచి పద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. "ద్రౌపదీ వస్త్రాపహరణం", "వందేమాతరం", "సుమంగళి", శోభనావారి "భక్త ప్రహ్లాద" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్య సన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.
Read 16 tweets
5 Nov
🌹చివరికి మిగిలేది.🌹
👉
చివరికి మిగిలేది సిన్మా అంటే నాకు ఒక గొప్ప క్లాసిక్ అనే భావం పూర్తిగా ఉంది కదా బెంగాలీదైనా ,ట్రీట్మెంట్ మాత్రమచ్చ తెనుగు లో సాగింది .గుత్తా రామినీడు దర్శకత్వం గుడి మెట్ల అశ్వథామ స్వర మాధుర్యం ఘంట సాల ఏం ఎస్.రామా రావు మొదలైన వారి దివ్య గాత్రం ,
హరనాద్ సావిత్రి ల నటనా వైదుష్యం ఇందులో రాశీ భూత మైనాయి .ప్రభాకర రెడ్డి ని ,జయంతిని మొదటి సారిగా సినిమాలకు పరిచయం చేసిన సినిమా 1960లో విడుదల అయింది
.‘’ చెంగూన అలమీద మిడిసి పోతది మీను –చినవాడు ఎదరైతే మరచీ పోతవు మేనూ –కాదంటావా కాదంటావా – చిన్న దానా నువ్వు కాదంటావా?
వల్లా మాలిన మమత కమ్మా తెమ్మర లాగ –కమ్మకున్నది-నిన్నూ చిన్నదానా-చినదానా — కమ్మా నైన వాడు సరసనే ఉన్నాడు వల్లకుం టావే –నీవు చిన్న దాన -నీవు వల్లకుం టావే-
చినికిన చినుకెల్లా -మంచి ముత్యము కాదు -మెరసిన మెరుపులో లేత వెన్నెల లేదు-అందని చందమామా కోసమని
Read 12 tweets
5 Nov
😁బిల్ గేట్స్ కి అప్పారావు ఇచ్చిన షాక్ 😁

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మన అప్పారావు అమెరికా వెళ్లి బిల్ గేట్స్ తో
మీటింగ్ లోపాల్గొన్నాడు
.
మా దేశం ఎంత అభివృద్ధి చెందిందో నీకు
చూపిస్తా రా అంటూ ఒక అడవికి తీసుకెళ్ళాడు
.
"ఇక్కడ గొయ్యి తవ్వు", అప్పారావు అలాగే తవ్వాడు...
"
ఇంకా లోతుకి తవ్వు" అంటూ వంద
అడుగులు గొయ్యి తీయించాడు. "ఇప్పుడు
.
వెతుకు ఏదైనా దొరుకుతుందేమో" అన్నాడు
అప్పారావు వెతికితే ఒక వైరు దొరికింది
"చూసావా వంద ఏళ్ల క్రితమే మేము టెలిఫోన్
వాడాము అన్నదానికి ఇది రుజువు"
.
అప్పారావు కి వళ్ళు మండింది,
తమాయించుకున్నాడు
.
ఆ తరువాత బిల్ గేట్స్ మన ఇండియా కి వచ్చాడు,
అప్పుడు మన అప్పారావుబిల్ గేట్స్ ని కలిసి మా దేశం
గొప్పతనం కూడా చూపిస్తా రమ్మని అడవికి
తీసుకెళ్ళాడు
.
"అక్కడ గొయ్యి తీయమన్నాడు.. గేట్స్ అలాగే గొయ్యి
తీసాడు, "ఇంకా లోతు ఇంకా లోతు" అంటూ
అయిదు వందల అడుగులు లోతు తీయించాడు.
.
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!