కేసీఆర్ విచిత్రమైన వ్యవహారశైలి చూస్తుంటే తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది.నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు ఏం నష్టం జరుగుతుందో చెప్పలేని కేసీఆర్ అకారణంగా వ్యతిరేకించడం సిగ్గుచేటు.
రైతులను పండించిన పంటకు స్వయంగా ధరను నిర్ణయించుకోవడంలో తప్పేముంది..?
పంటను దేశంలో ఏ ప్రాంతంలో అయినా గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకాశం కల్పించడాన్ని వ్యతిరేకిస్తారా..?
రైతులకు అన్యాయం జరిగితే మూడు రోజుల్లో సమస్య పరిష్కరించడాన్ని వ్యతిరేకిస్తారా..?
రైతుల సంక్షేమం కోసం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికైనా స్పష్టం చేయాలి. సన్నవడ్లు పండించే విషయంలో కేసీఆర్ తెలంగాణ రైతుల పొట్టగొట్టిండు
గత ఆరేళ్ల టీఆర్ఎస్ సర్కారు పాలనలో అకాలవర్షాలు,వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకున్న దాఖలాలు లేవు.
కనీసం ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న పంటలను అంచనా కూడా వేయలేదు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన సంఘటను రైతులెవ్వరూ మర్చిపోలేదు.
సన్నవడ్లు వేయాలని రైతులను ఆదేశించి, తన ఫాంహౌస్ లో దొడ్డువడ్లు పండించిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి కేసీఆర్.
రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకంతో రైతులు 30 లక్షల ఎకరాల్లో సన్నవడ్లు పండిస్తే, మొన్నటి వరకు ప్రారంభించలేదు.కేంద్రమే కొంటుందంటూ సీఎం మరో నాటకం ఆడుతున్నాడు.తెలంగాణలో భూసార పరీక్షల కోసం కేంద్రం రూ.125 కోట్లు ఇస్తే కేవలం కేసీఆర్ ఫాంహౌస్ లో భూసార పరీక్షలు చేయించుకొని దొడ్డువడ్లు పండించాడు.
కేసీఆర్ ఫాంహౌస్ లో పండించిన పంటను గిట్టుబాటు ధరకు ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ రైతులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలా..? ఇదేం న్యాయం..?
రైతులకు మేలు చేసేందుకే మోదీ సర్కారు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది.
కేంద్ర వ్యవసాయ సంస్కరణలకు మద్దతుగా,టీఆర్ఎస్ సర్కారు తీరుకు వ్యతిరేకంగా 3లక్షల మంది రైతులు ముఖ్యమంత్రికి లేఖలు రాస్తే ఇంతవరకు నోరుమెదపలేదు.రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న తెరాస సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం.సన్నవడ్లు పండించి నష్టపోయిన రైతులకు రూ.2,500 బోనస్ ఇవ్వాల్పిందే.
రేపు జరిగే బంద్ కేవలం టీఆర్ఎస్ పార్టీ బంద్ మాత్రమే. రైతులెవ్వరూ మోసపోవద్దు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ప్రజల తీర్పుతో మైండ్ బ్లాక్ అయి ఆ ఫలితాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్ ఈ బంద్ కు పిలుపునిచ్చిండు. రైతులెవ్వరూ ఈ కృత్రిమ బంద్ కు మద్దతు తెలపవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
దేశంలో ఏనాడు రైతుల పట్ల కనీసం కనికరం చూపించని కాంగ్రెస్, నేడు కృత్రిమ ఉద్యమాలకు మద్దతివ్వడం సిగ్గుమాలిన చర్యే.

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @bandisanjay_bjp

6 Dec
ఈనెల 8వ తేదీన కొన్ని రైతుసంఘాలు, ముఖ్యంగా పంజాబ్ కు చెందిన రైతు సంఘాలు, కాంగ్రెస్ అనుబంధ రైతు సంఘాలు ప్రకటించిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు.
గత ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో రైతులకు ఒరగబెట్టింది ఏంటో స్పష్టం చేయాలి. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రైతుల పంటరుణాలు మాఫీ పేరుతో హామీలు గుప్పించి గద్దెనెక్కాక పూర్తిస్థాయిలో నెరవేర్చకుండా రైతులను మోసం చేసింది.
ముందు తెలంగాణ రైతులకు టీఆర్ఎస్ సర్కారు రుణమాఫీ చేసి,ఆతర్వాత రైతు సమస్యలపై స్పందిస్తే బాగుండేది. రుణమాఫీ ఆలస్యం చేసినందుకు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. రూ.లక్ష లోపు వడ్డీలేని రుణాలు ఇవ్వాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వని కారణంగా రైతులు 13% వడ్డీలు చెల్లిస్తున్నారు.
Read 9 tweets
5 Dec
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నేషనల్ హైవే రోడ్ల పనుల పురోగతిపై నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తెలంగాణ రీజనల్ అధికారి శ్రీ కృష్ణ ప్రసాద్ గారితో హైదరాబాద్ లో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. Image
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని NH 563 ఎల్కతుర్తి నుండి కరీంనగర్ వరకు నాలుగు లైన్ల రహదారి రోడ్డు భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రజల సౌకర్యార్థం అతి తొందరలో నూతన రహదారిని అందుబాటులోకి తెచ్చే విధంగా హైవే రోడ్ల పనులను వేగవంతం చేయాలని కోరాను.
కరీంనగర్ నుండి జగిత్యాల వరకు కూడా ఈ రహదారి నిర్మాణం అతి త్వరలో పూర్తి చేయాలని ఆదేశించాను. రాజకీయ పనులు ఎన్ని ఉన్నా అభివృద్ధి విషయంలో నాకు పట్టం కట్టిన కరీంనగర్ ప్రజల సౌకర్యార్థం నావంతు కృషి చేస్తాను.
Read 4 tweets
5 Dec
48 మంది గ్రేటర్ ఎన్నికల విజేతల్లో 38 మంది గ్రాడ్యుయేట్స్ ఉండగా, అందులో యువతే ఎక్కువగా ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఎస్ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే 25 సీట్లు అదనంగా గెలిచేవాళ్లం. ప్రచార సమయం ఇంకా ఉంటే 100కు పైగా స్థానాల్లో విజయం సాధించేవాళ్లం. Image
2023 లో తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం.
రాష్ట్రంలో కుటుంబ పాలన, గడీల పాలనను ఎదుర్కొనే ఏకైక పార్టీ బిజెపియే అని ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీర్వాదంతోనే గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాం.
రెండు మూడు రోజుల్లో గెలిచిన అభ్యర్థులందరితో కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటాం. ప్రజాసమస్యలపై పోరాడే బాధ్యతను ప్రజలు మాకు అప్పజెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి విషయంలో మీనమేషాలు లెక్కపెట్టకుండా కేంద్రప్రభుత్వంతో సమన్వయంతో ముందుకెళ్లాలి.
Read 5 tweets
5 Dec
భారతీయ జనతా పార్టీ విజయం సాధించినందుకు అందరికీ అభినందనలు. గ్రేటర్ ఎన్నికల్లో బిజెపికి సీట్లతోపాటు ఓటింగ్ శాతం కూడా పెరిగింది. కేసీఆర్ జిమ్మిక్కుల ముఖ్యమంత్రి. తెలంగాణ ఉద్యమంలో, అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ జిమ్మిక్కులతో ప్రజలను మోసం చేశాడు. Image
గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో అంటకాగి డీజీపీ, ఎస్ఈసీ సాయంతో ఎన్నికల్లో అక్రమంగా గెలవాలనుకున్నారు. దుబ్బాక ఫలితంతో ఉలిక్కిపడ్డ కేసీఆర్, ప్రజా వ్యతిరేకత మరింత పెరగకముందే ముందస్తుగా గ్రేటర్ ఎన్నికలకు వెళ్లి అక్రమ దారిలో గెలవాలనుకున్నారు.
దుబ్బాకలో మాదిరిగానే బిజెపి కార్యకర్తలు కేసులు, బెదిరింపులు, ఎంఐఎం గూడాయిజానికి వెరవకుండా పార్టీ విజయం కోసం శ్రమించారు. రాష్ట్ర ప్రభుత్వం వదరలతో అతలాకుతలమైన భాగ్యనగరం గురించి ఆలోచించకుండా ఎన్నికలకు వెళ్లింది.
Read 7 tweets
4 Dec
గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్..,బిజెపిపై అవాస్తవాలు ప్రచారం చేసింది. ప్రజల్లో భయానక వాతావరణం, మత విధ్వేషాలు సృష్టిస్తారంటూ దుష్ప్రచారం చేసింది. ఎంఐఎం పార్టీతో అంటకాగిన టీఆర్ఎస్ కుట్రలను ప్రజలు గ్రహించారు.టీఆర్ఎస్ మద్యం ప్రవాహం,డబ్బుల పంపిణీతో అడ్డదారిలో గెలిచేందుకు ప్రయత్నించింది.
తప్పుడు సర్క్యలుర్ జారీ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్ర చేశారు.బిజెపి కార్యకర్తలపై దాడులు చేసి దౌర్జన్యంగా వ్యవహరించారు.దుబ్బాకలో కేసీఆర్ అల్లుడికి,గ్రేటర్ లో కుమారుడికి ప్రజలు తగిన బుద్ధిచెప్పారు.టీఆర్ఎస్ గడీల పాలనను బద్దలుకొట్టేందుకు ప్రజలు బిజెపికి అండగా నిలిచారు.
టీఆర్ఎస్ పతనం ప్రారంభమైంది...
కౌంట్ డౌన్ మొదలైంది.
కారు.. సారు.. ఇకరారు..అని జీహెచ్ఎంసీ ఫలితాలతో నిరూపితమైంది. టీఆర్ఎస్ ఫేక్ లెటర్లు సృష్టించి ఫోర్జరీ సంతకం చేసి వరద బాధితులకు రూ.10వేల సాయాన్ని ఆపింది.
Read 5 tweets
21 Nov
కేసీఆర్ కు బిజెపి అంటే భయం పట్టుకుంది. ఊపర్ షేర్వానీ..అందర్ పరేషానీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. బిజెపిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న కేసీఆర్ ను ప్రమాణం చేసేందుకు భాగ్యలక్ష్మీ ఆలయానికి రమ్మని సవాల్ చేస్తే తోకముడిచాడు.
కేసీఆర్, ఓ వర్గం ఓట్ల కోసం తాపత్రయపడి దారుస్సలాం, మక్కామసీద్ కు వెళ్తాడు. కానీ, హిందూ దేవాలయాలకు రావడానికి మాత్రం సంకోచిస్తారా..?
చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ ఆలయానికి నేను ఎందుకు వెళ్లకూడదు..? అసలు భాగ్యనగర్ అని పేరు వచ్చిందే భాగ్యలక్ష్మి దేవాలయం పేరు మీద.
అలాంటి భాగ్యలక్ష్మి గుడి దగ్గరకి ఎందుకు పోకూడదు. అది ఏమన్నా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లలో ఉందా ?
టీఆర్ఎస్ నేతలకి సవాల్ విసురుతున్నా, ఏ గుడికి రమ్మంటారో చెప్పండి.
ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారో, ఎవరు తప్పు చేశారో అందరికీ తెలుసు. వరద సాయంపై ఈసీకి మేం లేఖ రాయలేదు.
Read 10 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!