*మూలాలకు తరలి వెళదాం*

"నాన్నగారు.! చదువుకున్న నేను ఉద్యోగం చెయ్యకూడదా.? అమ్మ కూడా పెద్ద చదువులు చదివింది, అయినా మీరు ఉద్యోగం చెయ్యనివ్వలేదు. పెద్దవదినని కూడా ఉద్యోగం మాన్పించారు ఎందుకని నాన్న" నిలదీస్తున్నట్లుగా ప్రశ్నించింది వైష్ణవి.

"బంగారూ..." కూతుర్ని ప్రేమగా అలానే
పిలుస్తారు చంద్రశేఖరం గారు.

"ఇప్పుడు నీకు వచ్చిన సందేహమే పాతికేళ్ల కిందట మీ అమ్మకు, నాలుగేళ్ళ కిందట మీ పెద్ద వదినకు వచ్చింది. కానీ నా పెద్దరికానికి విలువనిస్తూ, మీ అన్నయ్యతో సహా అందరూ ఎదురు ప్రశ్నించలేదు. ఇప్పుడు అందరికీ ఒకేసారి వివరంగా చెప్తాను... ఇలా వచ్చి కూర్చోండి." అన్నారు
విషయం గంభీరమైనదిగా అనిపించి కొడుకులు ఇద్దరూ గోపాల కృష్ణ, వంశీకృష్ణ చేస్తున్న పని అక్కడికి ఆపుజేసి వచ్చి తండ్రి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. భార్య శైలజ, పెద్దకోడలు సుహాసిని ఎదురుగా చాప పరుచుకుని కూర్చున్నారు. వైష్ణవి నాన్నను చూసి. తండ్రి వడిలో తలపెట్టి కూర్చున్నది.
కూతురి తల నిమురుతూ చెప్పడం ప్రారంభించారు చంద్రశేఖరం గారు.

"మా నాన్నగారు నాకు 16, మీ అమ్మకు 12 సంవత్సరాల వయసు రాగానే పెళ్లి చేశారు. అప్పటికి బాల్యవివాహాల నిషేధం ఉంది. అయినప్పటికీ వృద్ధులైన మా తాతా బామ్మల కోర్కె తీర్చడానికి మాకు పెళ్లి చేసేశారు. అయితే నా చదువు పూర్తయి, ఉద్యోగం
సంపాదించేవరకు , మీ అమ్మ వాళ్ళింట్లోనే ఉండటానికి, తనకు కూడా నచ్చినట్లు చదువుకోవడానికి , ఆ తర్వాతనే కాపురానికి పంపడానికి రెండువైపుల పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు. నా అదృష్టమో, దైవబలమో 23 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసింది. ఉన్న ఊళ్ళోనే ఉండే అవకాశం కలిగింది. అప్పటికి మీ అమ్మ ఇంకా
డిగ్రీ చదువులోనే ఉంది. ఇంకా చదువుకుంటానని ఆశ పడింది. సరే అన్నాను. ఒక పి.జి. పూర్తిచేసింది. ఈలోగా గోపాలకృష్ణ, వంశీకృష్ణ పుట్యారు. పిల్లల ఆలనపాలనలో చదువు సాగలేదు. ఇంతలో బంగారుతల్లి పుట్టింది. వీళ్ళు ముగ్గురు చదువుల్లో పడేసరికి మళ్ళీ మీ అమ్మకు చదువుపై ధ్యాస మళ్లింది.
వొద్దనలేదు నేను. మరొక పి.జి. చేసింది. అప్పుడు ఉద్యోగం చెయ్యాలనే ఆలోచన నాకు చెప్పింది. మన కుటుంబ పోషణకు నా జీతం సరిపోతోంది. నువ్వు ఉద్యోగం చేస్తే, ఇంట్లో నేను ఎంత సహాయం చేసినా కూడా ఒత్తిడితో సతమతమౌతావు. అంతే కాక నీవు చేసే ఉద్యోగం నీకు కాలక్షేపం మాత్రమే... మన చదువు విజ్ఞానాన్ని
ఇవ్వాలి కానీ మరొకరి భవిష్యత్తును కాలరాసేది గా ఉండకూడదు, మరొకరి జీవనోపాధిని మనం అడ్డుకోకూడదు అని చెప్పాను.

మీ అందరికి గుర్తుండే ఉంటుంది... మీ అమ్మ ఇంట్లో ఉండి, మీకు బోధించిన జ్ఞానం వలన మీ చదువుల్లో మీకు వచ్చిన బహుమతులు, స్కాలర్షిప్పులు ... మీరు ట్యూషన్ ఎక్కడ చదువుతున్నారని అందరూ
అడగడం... మా అమ్మ దగ్గర అని మీరందరు గర్వంగా చెప్పడం..."

కాసేపు చెప్పడం ఆపి పిల్లల వైపు చూసారు. అందరూ తల ఊచారు.

"చదువు జ్ఞాన సముపార్జనకే కానీ ఉద్యోగం చేయడానికి కాదు. మన ఇంట్లో ఉన్న అందరూ ఉద్యోగం చెయ్యవలసిన అవసరం లేదు కదా... ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అవసరానికి
మించి ధన సంపాదన చేయాల్సిన పని లేదు"

"నాన్నా! మీ మాటలకు అడ్డువస్తున్నాను అనుకోకండి. స్త్రీకి ఆర్ధిక స్వాతంత్య్రం, స్వేచ్ఛ లేకుండా కట్టడి చేయడం కాదా ఇది?" అని ప్రశ్నించింది వైష్ణవి.

"శైలజా, నీకు మీ పుట్టింటివారు ఇచ్చిన నగలు, ధనం, నాకు కట్నం పేరుతో ఇచ్చిన డబ్బు ఎక్కడ ఉన్నాయి?"
"నా దగ్గర బీరువాలో కొన్ని, లాకర్ లోకొన్ని నగలు, బ్యాంక్ లో డబ్బు, మీకు ఇచ్చిన కట్నం డబ్బులు కూడా నా పేరునే వేశారు కదా... మా నాన్న ఇచ్చిన భూమి కూడా నా పేరునే ఉంది" అన్నది శైలజ.

"అమ్మా సుహాసిని, నీ సంగతి?"

"నా డబ్బు, నగలు అన్ని నా దగ్గరే ఉన్నాయి మామగారు"

"వైష్ణవి, నీకు చేయించిన
నగలు, నీకు మీ అన్నలు, అమ్మ, నేను ఇస్తున్న డబ్బు ఎక్కడ ఉన్నాయి?"

"నా దగ్గరే, బ్యాంక్ లో డబ్బులు ఉన్నాయి"

"మీకెవరికైనా భావ వ్యక్తీకరణ లో కానీ, చదువు సంధ్యలలో కానీ, ఏ పని చేయడానికైనా కానీ షరతులు, కట్టుబాట్లు ఉన్నాయా?"

*"లేవు."*

"అంటే మనింటికి సంబంధించినంత వరకు స్త్రీ ధనం,
స్త్రీ స్వేచ్ఛకు భంగం లేనట్లే కదా" నవ్వుతూ అడిగారు చంద్రశేఖరం గారు.

"చూడమ్మా... మన ఇంట్లో పురుషాధిక్యత కానీ, స్త్రీ అణచివేత కానీ ఉండదు. స్త్రీ భావీ తరాలకు ఆరోగ్యమైన సంతానాన్ని అందించాలి. అది మగవారిగా మాకు చేతకాని పని. సాధ్యమైనంత వరకు శారీరకంగా, మానసికంగా ప్రశాంతంగా ఉండి, వేళకు
తింటూ, తగినంత విశ్రాంతి తీసుకుంటే చక్కని బిడ్డలు కలుగుతారు. ఇంట్లో పనులు చేసుకుంటూ, తనవాళ్ళు వచ్చేసరికి ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే, బయటనుంచి వచ్చేవారికి, ఇంట్లో ఉన్నవారికి కూడా సంతోషంగా ఉంటుంది. అప్పుడే బంధాలు బాగుంటాయి.

పగలంతా ఉద్యోగం పేరుతో ఇద్దరు అలసిపోయి వచ్చి, ఒకరి మీద
ఒకరు విసుక్కుంటు, ఏదో తప్పనిసరిగా ఇంత ఉడకేసుకుని తినగానే అలసిన శరీరాలు యాంత్రికంగా విశ్రాంతి కోరుకొని, మళ్ళీ ఉదయం నుండి ఉరుకులు పరుగులు, తీరా పిల్లల్ని కనే సమయానికి సెలవు దొరక్క వత్తిడి, తీరా పిల్లలు పుట్టాక వాళ్ళని సరిగ్గా పెంచే తీరిక లేక, ఆయాలకు, బేబీ కేర్ సెంటర్ కు అప్పగించడం,
కాస్త పెద్దవగానే హాస్టల్ లో వెయ్యడం, మేము ముసలి అవగానే వృద్ధాశ్రమానికి వెళ్లడం... అవసరం అంటావా?"

అందని దూరాలకు పరుగులెత్తి, అందే ఆనందాల్ని, అనుబంధాల్ని దూరం చేసుకోవడం ఎందుకు తల్లి? సమాజం మారాలంటే మార్పు మనతోనే మొదలు పెడదాం. ఆరోగ్యకరమైన జాతిని అందిద్దాం. ఇదే నా ఉద్దేశ్యం"
ముగించారు చంద్రశేఖరం గారు.

"మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తవం మామయ్యగారు. చదువుకుని, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే నన్ను ఉద్యోగం మాన్పించినందుకు మొదట్లో కోపం వచ్చినా, మీరు, అత్తయ్యగారు, మిగతా కుటుంబసభ్యులు నన్ను ఆదరించిన తీరు, నన్ను ఆలోచింపజేశాయి. ముఖ్యంగా మన కుటుంబాలలో ఇద్దరూ
ఉద్యోగస్టులవడం వలన బంధువులను పెళ్లిళ్లలో , అదికూడా మొక్కుబడిగా మాత్రమే కలవగలుగుతున్నాం. ఇప్పుడు ఇంట్లో ఉన్న మేము మన గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళు, మన కుటుంబాలలో ఉన్న మిగతా సభ్యులతో తరచుగా తీరిగ్గా మాట్లాడుకుంటున్నాం. ముక్కు మొహం తెలియని సామాజిక అనుసంధాన వేదికల కంటే మన కుటుంబ,
బంధువర్గమే పెద్దది, శ్రేయోదాయకమైనది అని అర్ధమైంది. వంటలు, సంస్కృతి, సంప్రదాయాలు, ఎన్నో కొత్తవిషయాలు గూగుల్ అవసరం లేకుండానే తెలుస్తున్నాయి. మీ విశాలమైన ఆలోచన నాకు చాలా నచ్చింది. ఇది నాకే కాదు మరో మూడునెలల్లో మన కుటుంబం లోకి రాబోయే నా బిడ్డకి కూడా నేను నేర్పుతాను" అంది సుహాసిని.
"చాలా సంతోషం సుహాసిని, పిల్లలూ.. మీరేమంటారు..."

"నాన్నగారు, నేను కూడా మీరు పదవీవిరమణ చేసేవరకు ఉద్యోగం మానేస్తాను" అన్నాడు వంశీకృష్ణ...

"చిన్నన్నా... నువ్వు చేసే ఉద్యోగం మానేసేది కాదు... పదిమందికి భుక్తి పెట్టే వ్యవసాయం... నీ పరిశోధనలు నువ్వు చేస్తూ, మరిన్ని ఎక్కువ పంటలు నిచ్చే
సేంద్రీయపద్దతులు కనిపెట్టు..." అన్నది వైష్ణవి

*"అంతేనంటావా."*

"నాన్నగారు మీ ఈ విలువైన ఉపన్యాసం మా వరకే పరిమితం కాకూడదు. మీరు అనుమతిస్తే మన కుటుంబాలలో అందరికి పంపిస్తాను. సాంకేతికత మేలును కూడా చేస్తుందిగా" అన్నాడు వంశీకృష్ణ...

ఆడవాళ్ళని ఉద్యోగం చెయ్యనివ్వడం లేదని నన్ను
ఆడిపోసుకునే మన కుటుంబంలోని ఇతరులకు కూడా నా ఉద్దేశ్యం అర్ధమవుతుంది. నావి కుత్సిత, సంకుచిత భావాలు కావని వాళ్ళు కూడా తెలుసుకుంటారు."

యూ ట్యూబ్ లో  వివిధ చదువులు కూడా రాని  స్త్రీలు చాలా  విషయాలలో నేర్పరులౌతూ సంపాదనా పరులౌతున్నారు. చివరికి చిన్న పిల్లలు, వృద్దులు
వారికి వచ్చిన వాటినే వైవిధ్యంగా చేస్తూ సంపాదనపరులౌతున్నారు. పైగా సమయాన్ని వారికి విధంగానే మలుచుకుంటున్నారే కానీ ఇంకొకరి నిబంధనలకు ధర పోయకుండానే సంపాదిస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది కానీ వుద్యోగం ఒక్కటే దారి కాదు.
*కుటుంబ జీవనానికి ఆద్యం మన భారతీయం. మూలాలకు తరలి వెళదాం👍*

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

31 Dec 20
😂😂
కరోనా వ్యాక్సిన్ వచ్చే వారం నుండి భారతీయలకు అందుబాటులో ఉంటుందని విని నాపేరు నమోదు చేసుకోడానికి టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసాను.

నేను: హలో
ఆవైపు నుండి: కాల్ చేసినందుకు కృతజ్ఞతలు. ఇంగ్లీషుకు 1 నొక్కండి. హిందీకి 2, తెలుగుకు 3 నొక్కండి.

నేను: 3 నొక్కా.
రష్యా వ్యాక్సినుకు 1 నొక్కండి, అమెరికా వ్యాక్సినుకు 2 నొక్కండి, ఇండియన్ వ్యాక్సినుకు 7 నొక్కండి.

నేను: మోడీ ఫ్యాన్ కదా పైగా ఆత్మనిర్బర్ కాన్సెప్ట్ ఫాలో అవుతాను అందుకే 7 నొక్కా.

మీరు పురుషులైతే 1 నొక్కండి, స్త్రీ అయితే 2 నొక్కండి, ట్రాన్స్ జెండర్ అయితే 6 నొక్కండి.
నేను: 1 నొక్కా

వ్యాక్సిన్ కొనడానికి 1 నొక్కండి, ఉచితంగా వేయించుకోడానికి 2 నొక్కండి.

నేను: మనది ఫ్రీ బ్యాచే కదా కాబట్టి 2 నొక్కా!

చేతిమీద వ్యాక్సిన్ పొడిపించుకోడానికి 1 నొక్కండి, తుంటిమీద వేయించుకోడానికి 2 నొక్కండి. ఇంకేదైనా ప్రదేశంలో వేయించుకోడానికి 5 నొక్కండి.
Read 6 tweets
28 Nov 20
ఒక బ్రిటిష్ కల్నల్ సాబ్ తన సిపాయిలతో ఎక్కడికో వెళ్తుండగా పొరపాటున చూసుకోకుండా ... నేలబారున ఉన్న నూతిలో పడిపోయారు .... వెంటనే ఎలర్టయిన సైనికులు ఒక తాడు తీసుకొచ్చి కల్నల్ ని పైకి లాగుతున్నారు .... సచ్చిచెడి కల్నల్ నూతి పై అంచుకొచ్చేసరికి .... నిబంధనలు ఖచ్చితంగా పాటించే సిపాయిలు ..
ఎటెన్షన్ లోకి వచ్చి ... తాడు వదిలేసి కల్నల్ కి సెల్యూట్ చేసేసరికి ... కల్నల్ మళ్ళా నూతిలో పడిపోయాడు ....
ఇలా .... మూణ్ణాలుగుసార్లు .... తాడట్టుకుని
కల్నల్ పైకి రావటం ... ఆయన్ని చూసిన జవాన్లు శాల్యూట్ చేసే పనిలోపడి తాడొదిలేయటం .... దొరగారు మళ్ళా నూతిలో పడిపోటం చూసిన
నాలాంటి పెద్దయనొకడు ..... అదికాదుగాని అబ్బాయిలు .... ఈయనకంటే పెద్దపీసర్ని పట్టుకురండయ్యా .... ఆయనయితే .... ఈనగారు బైటికొచ్చినప్పుడు శాల్యూట్ సెయ్యడు .... పని జరుగుద్ది ... అనేసరికి ... ఆ ఐడియా నచ్చిన సిపాయిలు ... బ్రిగేడియర్ ని తీసుకొచ్చారు ....
Read 7 tweets
28 Nov 20
చాలామంది తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు.. రూమ్ తీసుకోవటం..దర్శనం చేసుకోవడం.. ప్రసాదాలు తీసుకోవడం.. మొక్కులు తీర్చుకోవడం తిరుగు ప్రయాణం అంతే..

కానీ తిరుమల కొండమీద నంది సర్కిల్ దగ్గర లేపాక్షి ఎంపోరియం పక్కనే టిటిడి వారి వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య ఆసుపత్రి ఉంటుంది
ఇక్కడ చాలారకాలైన ధీర్ఘకాలిక రోగాలకు చక్కనిఆయుర్వేద మందులు ఉచితంగా లభిస్తాయి..ఇదే పేరుమీద బయట కూడా దొరుకుతాయి కానీ ఈ టిటీడి ఆయుర్వేద మందులక్వాలిటీ రాదు ఎందుకంటే వీరి మందులు తయారు చేసే ఫార్మసీ సొంతంగా ఉంది శ్రీనివాస మంగాపురం వెళ్లేదారిలో..అడవిలో మూలికలు సేకరించి ఇవి తయారు చేస్తారు.
అలిపిరి దగ్గర ఆయుర్వేద హాస్పిటల్ కూడా ఉన్నది.. ఇక్కడ రకరకాల దీర్ఘకాలిక రోగాలకు ఉచితంగా వైద్యం, మందులు కూడా ఉచితమే.. గతంలో శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు వర్షం వచ్చేముందు, ఎవరైనా సిగరెట్ తాగిన.. అగర్బత్తి, సాంబ్రాణి పొగాకు విపరీతమైన తుమ్ములు ఊపిరి పీల్చటం కష్టంగా గత 15 సంవత్సరాల
Read 6 tweets
28 Nov 20
మనవాళ్ళు బొత్తిగా వినపడని వారిని అబ్బ ఆయనకు బ్రహ్మ చెముడండీ అంటూ వుంటారు.ఆ కథా కమామిషూ ఏమిటో తెలుసుకుందాం?
బ్రహ్మదేవుడికి చెముడు రావట మేమిటని ఆశ్చర్య పోతాము.వాస్తవానికి యిది ఆయనకు వచ్చిన చెముడు కాదు.ఆ పదప్రయోగం రావటానికి కారణం మరో విధంగా వుంది
ఇది నాటక సమాజం వాళ్ళు పౌరాణిక నాటకాలు ప్రదర్శించే కాలం లో పుట్టింది.
ఎలాగంటే-

ఒకనాటకం లో తన ప్రియ భక్తునకు మెచ్చి అతను కోరిన వరాన్ని యివ్వటానికి
పైనుంచి క్రిందికి వచ్చి "భక్తా!నీ భక్తికి మెచ్చి వచ్చితిని,యే వరము కావాలో కోరుకో " అనే డైలాగ్ చెప్పాలి. ఆ వేషం వేసే వ్యక్తికీ అక్షర
జ్ఞానం లేదు.ఎవరైనా పక్కనుంచి అందిస్తే చెప్తాడు.అతను నాటకానికి ఎక్కువ విరాళము యిచ్చినందు వల్ల నాకు బ్రహ్మ వేషమే కావాలని పట్టుబట్టి నందువల్ల అతనికి ఆ వేషం తప్పనిసరిగా యివ్వ వలిసి వచ్చింది.

అతనికి బ్రహ్మ వేషం వేశారు..ఇంత కాలానికి మన కులపోడు బెమ్మ యేసికం యేత్తన్నాడు యెల్దామ్ రండహే
Read 8 tweets
28 Nov 20
*నేర్పు-ఓర్పు*
ఒక పనిని ‘సాధారణంగా’ పూర్తి చేసేవారు కొందరైతే, మధ్యమ స్థాయిలో చేసేవారు కొందరు. ఉన్నతస్థాయిలో చేసేవారు ఇంకొందరు! ఈ స్థాయులన్నీ వారివారి వృత్తి నైపుణ్యాలను ప్రతిబింబిస్తాయి. జీవిత ప్రమాణాలు సైతం వారి నేర్పరితనాన్ని అనుసరించి అలరారుతాయి.
ఒక కార్యాన్ని నాసిగా పూర్తిచేసేవారికి పారితోషికం అధమస్థాయిలో ఉంటుంది. మహోన్నత స్థాయి నైపుణ్యాన్ని కనబరచే వృత్తి నిపుణుడికి అందే పారితోషికం ఉన్నతస్థాయిలోనే ఉంటుంది.
నేర్పరితనానికి విద్య అవసరమా అన్నప్పుడు, తరగతి గదిలో నేర్చుకునేదే విద్యకాదని గ్రహించాలి. జీవిత పాఠశాలలో విద్య గడించి
అపార నైపుణ్యసంపత్తిని సొంతం చేసుకొనే ప్రతిభావంతులు కొందరుంటారు. ఏకలవ్యుడిది ఉన్నతస్థాయి విద్య! అతడి
నేర్పు-ఓర్పు
విద్యానైపుణ్యం గురువు ‘సమక్షంలో’ ఉండి నేర్పిన విద్య కన్నా మహోన్నతంగా అలరారింది. అందుకు అతడి కార్యదీక్ష, దక్షత తోడ్పడ్డాయి.
Read 10 tweets
27 Nov 20
Work_is_worship

ప్రతిరోజు టాటా_మోటార్స్ లో పనిచేసే పెద్దపెద్ద అధికారులందరూ కలిసి మధ్యాహ్న సమయంలో భోజనాలు చేస్తూ కంపెనీ విషయాలే కాక అనేక ఇతర రాజకీయ వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండేవారు.

కానీ, కొన్ని రోజులనుండి సుమంత్_మోలగోకర్ అనే ఆయన వీళ్ళతో కలవకుండా తన కారు తీసుకుని బయట భోజనం
చేయటానికి వెళ్ళటం చూసి, ఆ అధికారులు అతనిని ” ఈయన డీలర్లు ఎవరో పెద్ద ఖరీదైన హోటళ్ళలొ ఇచ్చే పార్టీలు మరిగాడు" అనే అపవాదు వెయ్యటం సాగించారు.

ఒకరోజు కొందరు అధికారులు ఆయనను రహస్యంగా వెంబడించి అసలు విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు.
ఆయన కారుతో వెళ్ళి , రోడ్డు వెంబడి ”ధాబా" దగ్గర కారు ఆపి, అక్కడ భోజనం చేస్తున్నాడు. అలా భోజనం చేస్తూ, టాటా మోటార్సు వారి తయారు చేసే ట్రక్ లు వాడే డ్రైవర్లతో సంభాషణ చేస్తూ, టాటా వాహనాలలోని బాగోగుల గురించి వారితో చర్చిస్తూ, ఆ విషయాలు తన నోట్బుక్ లో వ్రాసుకుంటూ, టాటా వాహనాల ఉత్పత్తి
Read 5 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!