మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది.*_
పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి,
కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.*_
నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు.
కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.*_
ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !*_
పలకరింపుకు అంత శక్తి వుంది. పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు
విపరీతంగా ఎదుర్కొంటున్నారు. తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు. వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ అని మరిచి పోతున్నారు. అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి.*_
ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్ళను కదిపి చూడండి. బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీలా పని చేస్తాయి.
పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి. దాంతో స్నేహం, బంధం, ప్రేమ,
అనుబంధం పెరుగుతూ వుంటుంది. ఇవి కేవలం మనుషులు సాధించేవి.*_
ప్రముఖ కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవిగారు తీయని పలకరింపు అని ఒక కథను రాశారు. అందులో ఒక రిటైర్డు పెద్దాయన, పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రించారు.
''నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోం చేస్తున్నపుడు నన్ను చాలా మందే పలకరించేవాళ్ళు. ఉద్యోగ విరమణ చేసి, ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరాను'' అని పాత్రలో వివరిస్తుంది.*_
డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య
సంబంధాలు అప్రధానమై పోయి ఈ పరిస్థితులు దాపురించాయి. ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం. దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం.*_
లాక్డౌన్ మూలానా ఇంట్లోనే అందురున్నప్పటికీ వారి మధ్య దూరాలేవీ తగ్గలేదు.
మరింత పెరుగుతూనే వున్నాయి. ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్ఫోన్లతో యియర్ ఫోన్లతో తమలో తామే, తమకు తామే గడిపేస్తున్నారు. కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి.*_
మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి. తెలిసినపుడే వాటిని సరిచేయడమో, చర్చించి మనం
సరికావడమో చేయవచ్చు. కొన్ని అపోహలూ తొలిగిపోవచ్చు. కుటుంబంలోనే కాదు ఇంటి పక్కన వాళ్ళను, దూరానవున్న మిత్రులను ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించండి.*_
*కరోనా బాధితులను, దాని వల్ల భయపడుతున్న వాళ్ళను పలకరించాలి. పది మందితో గల సంబంధమే జీవితం.*
*నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్ని హంగులు ఉండి కూడా, తాను, తన భార్యాబిడ్డలు, సన్నిహితులతో ఏసి లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ, వృద్ధురాలు తన తల్లిని మాత్రం ఔట్ హౌస్ కొట్టుగదిలో ఉంచాడు. తనని పలకరించితేనే భార్య అనుగ్రహానికి దూరమైపోతానేమో అని భావించి, దూరంగానే ఉంచిన ప్రబుద్ధుడు.*
_
*నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమీ అడగటమూ లేదు. రోజు ఏం చేస్తున్నావమ్మా, ఏం తిన్నావు, బాగున్నావా'' అని నన్ను అడిగితే చాలని ఎనభై యేండ్ల తల్లి నాతో చెబుతూ దు:ఖించింది. అంటే పలకరింపుల విలువేమిటో అర్థం చేసుకోవచ్చు.
చివరికి ఆమె పోయిన తరువాత అతను కార్చిన మొసలికన్నీరుకి ఏ అవార్డు ఇవ్వొచ్చో అర్థం కాలేదు !*_
_*✅ అందుకే.. పలకరించండి. పలుకులేమీ బంగారం కాదు. మనిషి మంచి తనానికి ఆనవాళ్ళు ! 👏👏
వాట్సాప్ సేకరణ.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
*కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని.
ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది.*
*తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడి కి వెళ్లాను. మూడేళ్ళ క్రితం కార్తీక మాసం లో అనుకుంట, ఖాళీ గా ఉన్న రోజుల్లో
గుడి కి వెళ్లి రా అంది అమ్మ. అప్పట్నుంచి ఆఫీస్ లేనపుడు దగ్గర్లో ఉన్న గుడి కి వస్తూ ఉంటాను.*
*ఎప్పటిలాగే దణ్ణం పెట్టుకుని కొంచెం సేపు గర్భ గుడి కి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పాడిన విష్ణు సహస్ర నామం వినిపిస్తోంది. కొంత మంది
ఒక కోటీశ్వరుడు నడుచు కుంటూ వస్తూఉండగా ఒక ఇంటి ముందుకు రాగానే తన కాలి చెప్పులు తెగిపోయాయి !
ఆ ఇంటిలోని యజమానిని పిలిచి
నా చెప్పులు తెగిపోయాయి ఇక్కడ వదిలి వెళ్తానండి
పారేయొచ్చు కానీ కొత్తవి !
అందుకే మనసు రావట్లేదు
రేపు పనివారిని పంపించి తీసుకువెళతాను అని అడిగాడు !
అందుకు ఆ ఇంటి యజమాని
అయ్యా మీరు ఎంత పెద్ద కోటీశ్వరులు మీ చెప్పులు మా ఇంటి ఆవరణలో ఉంటె మాకే గౌరవం అని చెప్పాడు !
ధనవంతుడు తన పనిలో పడి ఆ విషయాన్నీ మరిచిపోయాడు !!
ఒకరోజు హఠాత్తుగా ఆ ధనవంతుడు చనిపోయాడు !
అయన శవం ఊరేగింపు జరుగుతున్నది భారీ వర్షం మొదలయింది !
ఎవరూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి !
అయన ఆరోజు చెప్పులు వదిలిన ఇంటి ముందు శవాన్ని తీసుకొచ్చి ఆపి ఆ ఇంటి యజమానిని పిలిచారు !!
వర్షం ఎక్కువగా ఉందండి !
వర్షం ఆగే వరకు శవాన్ని
మీ ఇంటి ముంగిట కాసేపు ఉంచుకుంటాం అని అడిగారు!
భళిభళిభళిరా దేవా
బాగున్నదయా నీ మాయ..
బహుబాగున్నదయా
నీ మాయ!
ఆ మాయే మాయాబజార్..
ప్రపంచ సినిమా చరిత్రలో పారాహుషార్..
మహాభారతంలో
శశిరేఖ పరిణయ ఘట్టం
హాస్యానికి పట్టం..
సావిత్రి అనే మొండిఘటం..
కెవిరెడ్డి చేతివాటం..
ఇంతకీ అది సినిమానా..
మన కళ్ళెదుటే జరుగుతున్న మహాభారతమా..
అపురూప దృశ్య కావ్యమా..?
అద్భుతమట స్క్రీన్ ప్లే..
ఘటోత్కచుడిగా
ఎస్వీఆర్ పవర్ ప్లే..
అంతటి మహానటుడి
అభినయానికి సావిత్రి రీప్లే..
కృష్ణుడిగా ఎన్టీఆర్
నట విశ్వరూపం..
అభిమన్యుడు అక్కినేని సమ్మోహన రూపం..
సుపుత్రా నీకిది తగదురా
అంటూ హిడింబిగా సూర్యకాంతం సరికొత్త రూపం..
ఓ చిన్నమయ..లంబు జంబు..
రేలంగి హాస్య విన్యాసం..
పక్కన శాస్త్రి,శర్మ కోరసం..
అంజిగాడి బాబాయిల పద్యం
చెప్పుల నాట్యాలు..
తివాచీ అల్లర్లు..
ఘటోత్కచుడి పదఘట్టనకు
విరిగి పడిన కొండ ముక్క..
పేరు చెప్పి
శరణు కోరమనే వైనం..
సుభద్ర రౌద్రం..