గుడికెందుకెళ్ళాలి?

*కిటికీ లో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే పదకొండు అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మ తో కలిసి ఒంటిగంట లోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని.
ఉద్యోగం పేరుతో బెంగళూరు లో ఉండడం వలన భోజనం చేయాల్సిన సమయం లో టిఫిన్ , టీ తాగాల్సిన సమయం లో భోజనం అలవాటు అయిపోతోంది.*

*తొందరగా లేచి అరగంట లో స్నానం ముగించుకుని, ప్రతి వారం లాగే పక్కన వీధి లో ఉన్న గుడి కి వెళ్లాను. మూడేళ్ళ క్రితం కార్తీక మాసం లో అనుకుంట, ఖాళీ గా ఉన్న రోజుల్లో
గుడి కి వెళ్లి రా అంది అమ్మ. అప్పట్నుంచి ఆఫీస్ లేనపుడు దగ్గర్లో ఉన్న గుడి కి వస్తూ ఉంటాను.*

*ఎప్పటిలాగే దణ్ణం పెట్టుకుని కొంచెం సేపు గర్భ గుడి కి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య ఎంఎస్ సుబ్బులక్ష్మి గారు పాడిన విష్ణు సహస్ర నామం వినిపిస్తోంది. కొంత మంది
ప్రదక్షిణ చేస్తున్నారు.* *ఇంకొంతమంది అర్చన చేయిస్తున్నారు . కొంత మంది దేవుడికి పట్టు వస్త్రాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది తన్మయత్వం తో దేవుడిని చుస్తూ ఉండిపోయారు. దేవుడికి మధ్యాహ్నం సమర్పించే నైవేద్యంకి ఇంకొంచెం సమయమే ఉండడంతో,
ప్రతి వారం గుడిలో ఉండే పూజారిగారు క్షణం కూడా తీరిక లేకుండా కంగారుగా ఉన్నారు.*

*అమ్మ వెళ్ళమంది అని గుడి కి రావడం మొదలుపెట్టినా,గుడి కి వచ్చిన ప్రతిసారీ ఎందుకో చాలా ఆనందంగా ఉంటుంది.*

*కాని నా మెదడు లో మాత్రం ఎప్పటిలాగే ఎన్నో ప్రశ్నలు రాసాగాయి. దేవుడి గురించి, దేవాలయాల గురించి,
భక్తుల గురించి, ఎన్నో సందేహాలు, ఇంకెన్నో విశ్లేషణలు. ప్రతిసారి లాగే ఆ ప్రశ్నల ప్రవాహం లో, ఆలోచనల అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి.*

*ఇంతలో గుడి లో నేను ఎప్పుడు చూడని పూజారి గారు ఒకరు, నన్ను చూసి,నవ్వి,నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఈయన్ని ఎప్పుడు ఈ గుడి లో చూడలేదుకదా అన్న సందేహం
తో కూడిన ఒక నవ్వు నవ్వాను.*

*కొత్త పూజారి గారు: నిన్ను ఈ గుడి లో చాలా రోజులనుంచి చూస్తున్నాను బాబు. కాని ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు. ఏమన్నా ఉంటే చెప్పు పర్లేదు.*
*నేను ఎప్పుడూ చూడని వ్యక్తి నేను వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నారా అన్న ఆలోచన ఒకవైపు, నా ప్రశ్నలు, సందేహాలు నా మోహం
మీద కనిపించేస్తున్నాయా అని కంగారు ఇంకోవైపు కలిగి*

*నేను: అబ్బే అలాంటిది ఏమి లేదండి.*

*కొత్త పూజారి గారు: మధ్యాహ్నం నైవేద్యానికి, గుడి మూయడానికి ఇంకా సమయం ఉంది బాబు.* *పర్లేదు చెప్పు నీ సందేహాలు ఏంటో. నాకు తెలిసినంతలో నీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను.*
*ఎందుకో నాకున్న సందేహాలు అన్నీ అడిగేద్దామని ధైర్యం తెచ్చుకుని నేను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను.*
*నేను: పెద్దవాళ్ళు,గుడి కి వెళ్తే మంచిది అంటారు కదండీ. అసలు గుడి కి ఎందుకు రావాలి. నా ప్రశ్న లో అవివేకం ఉంటే క్షమించండి.*

*కొత్త పూజారి గారు: (గట్టిగా నవ్వుతూ) నువ్వు ఉద్యోగం
చేయడానికి బెంగళూరు లో ఉన్నావు. కాని ప్రతి నెలా రెండు రోజులైనా ఇంటికి వెళ్ళి నాన్న అమ్మ ని కలవాలి అనుకుంటావు కదా, ఎందుకు ? ఎందుకంటే వాళ్లతో గడిపినపుడు నీకు ఆనందం వస్తుంది. వాళ్ల ప్రేమ నీకు హాయిని ఇస్తుంది. బహుషా నీ ప్రశ్న కి సమాధానం దొరికింది అనుకుంటున్నాను.*
*భగవంతుడిని నాన్న అమ్మ తో పోల్చిన వెంటనే ఒక్కసారిగా నాలో కమ్ముకున్న చాలా మేఘాలు తొలగిపోయినట్టు అనిపించింది.*

*నేను: భగవంతుడు అంతటా ఉన్నాడు అంటారు. కాని ఎందుకు గుడి కి వచ్చి దణ్ణం పెట్టుకుంటారు అందరు ?*

*కొత్త పూజారి గారు: నీ ప్రాణ స్నేహితుడు నీకు దూరం గా వేరే ఊరిలో ఉన్నాడనుకో,
నువ్వు ఫోన్ లో అతనితో మాట్లాడొచ్చు. కానీ అతడిని నేరుగా కలిస్తే వచ్చే ఆనందం ఇంకా ఎక్కువ వుంటుందా? లేదా?కొంత మందికి ఫోనులో మాట్లాడినా ఆనందం కలుగుతుంది, కొంత మందికి నేరుగా కలిస్తే ఆనందం కలుగుతుంది.*

*నేను: కోరికలు తీరితే కానుకలు ఇస్తా అంటారు కదండీ, కానుకలు ఇస్తారని భగవంతుడు
కోరికలు తీర్చడు కదా?*
*కొత్త పూజారి గారు: నీకు కొత్తగా ఉద్యోగం వచ్చిందనుకో, ఆ అనందం లో మీ కుటుంబ సభ్యులకి ఏదైనా కొనిపెట్టాలని నువ్వు అనుకుంటావా? అనుకోవా? నీ కుటుంబ సభ్యులు నీకు కొత్త ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తారా? నువ్వు ఏదైనా కొనిపెడతావని ఆశిస్తారా?
గుర్తుపెట్టుకో దేవుడు కానుకలు కోరుకోడు, నీ అభ్యున్నతి కోరుకుంటాడు. అందుకునే సత్యభామ వేెసిన వజ్ర వైఢూర్యాలకి కాకుండా, భక్తితో రుక్మిణి వేసిన తులసీ దళంకి తూగాడు శ్రీ కృష్ణుడు.*

*నేను: ఏదైనా పని మొదలు పెట్టే ముందు, దేెవుడికి దణ్ణం పెట్టుకోమంటారు కదండీ, దేవుడి అనుగ్రహం వలన పని
పూర్తయితే మానవ ప్రయత్నం లేనట్టే కదా?అలాకాకుండా మానవ ప్రయత్నం వలన పని పుర్తయితే, పని మొదలు పెట్టే ముందు దేవుడికి దణ్ణం పెట్టమనడంలో ఆంతర్యం ఎమంటారు?*

*కొత్త పూజారి గారు: నీ ఆఫీసులో కొంచం క్లిష్టమైన పని ఇచ్చారనుకో, సాధారణంగా ఏం చేస్తావు? కొంచెం నిశ్శబ్దమైన ప్రదేశానికి వెళ్ళి,
నీకు నచ్చిన కాఫీ అయినా, టీ అయినా, తాగుతూ,ఏకాగ్రతతో ఆలోచించి,పని పూర్తి చేస్తావు. అవునా, కాదా?ఇప్పుడు కాఫీ,నిశ్శబ్దమైన ప్రదేశం వీటి వలన పని పూర్తి అయ్యిందా? లేక నీ బుధ్ధి ఉపయోగించడం వలన పని పూర్తి అయ్యిందా?నిజానికి కాఫీ, నిశ్శబ్దమైన ప్రదేశం ఇవన్నీ నీ ఏకాగ్రతని పెంచి,
నువ్వు నీ పని పూర్తి చెయ్యడానికి నీ బుద్ధిని ఉపయోగించడంలో దోహదపడ్దాయి అంతే. దైవ దర్శనం కూడా, నీ పని చెయ్యడానికి కావలసిన ప్రశాంతతని పెంచి, నీకు కావలసిన శక్తియుక్తులని సరిగ్గా ఉపయోగించడానికి దోహదపడేది కాదంటావా?*

*నేను: మొక్కులు తీర్చకపోతే భగవంతుడికి కోపం వస్తుంది అంటారు.
అది ఎంతవరకు నిజం అంటారు?*
*కొత్త పూజారి గారు: మీ అమ్మగారి తో నువ్వు, “ఇవాళ సాయంత్రం తప్పకుండా కూరగాయల మార్కెట్ కి నిన్ను తీస్కుని వెళ్తా” అని చెప్పి, తర్వాత మర్చిపోయి నీ స్నేహితులతో కలిసి సినిమా కి వెళ్లి వచ్చావనుకో, అపుడు మీ అమ్మగారు ఏమంటారు ? స్నేహితులతో బయటకి వెళ్తే లోకం తెలీద
వెధవకి అని కోపం తో తిడతారా లేదా ? అలా ప్రేమగా కోప్పడతారు కానీ, అలా మర్చిపోయినందుకు నువ్వు కష్టాలు పడాలని ఆశించరు కదా..!! మీ తల్లితండ్రులకే ఇంత ప్రేమ ఉంటే, లోకాలు అంతటికి ఆ దేవుడిని తల్లి తండ్రీ అంటారు. తనకి ఇంకెంత ప్రేమ ఉండాలి ?*
*ఇవన్నీ విన్నాక ఎందుకో తెలియకుండానే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేసాను. నాకున్న ప్రశ్నలు సందేహాలు అన్నీ తొలగిపోయినట్టు అనిపించి ఆ ఆనందం లో కళ్లలో నీళ్ళు తిరిగాయి. ఆ పూజారి గారు నవ్వుతూ నా తల నిమిరి, సరే బాబు నైవేద్యానికి సమయం అయిందని చెప్పి వెళ్లిపోయారు.*
*తర్వాత తదేకం గా గర్భ గుడి లోని దేవుడిని అలా తన్మయత్వం తో చాలా సేపు చుస్తూ ఉండిపోయాను. ఇపుడు దేవుడిని చూస్తోంటే ఎందుకో తల్లితండ్రులను చూస్తున్నట్టు, ప్రాణ స్నేహితులను చూస్తున్నట్టు అనిపించింది. నేను నా భావాలని నా కళ్ళతోనే ఆయనతో పంచుకుంటున్నానేమో అనిపిస్తోంది.*
*ఆ కొత్త పూజారి గారిని కలవాలి అనిపించి, ఆ రోజు సాయంత్రం మళ్ళీ గుడి కి వెళ్లాను కానీ ఆయన కనిపించలేదు. కొత్త పూజారి గారిని కలవాలనే కోరిక ఆపుకోలేక ప్రతి వారం గుడిలో ఉండే పూజారి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను.*

*నేను: పొద్దున్న ఒక కొత్త పూజారి గారు ఉన్నారు కదండీ, ఆయన సాయంత్రం రాలేదా?*
గుడిలో ప్రతి వారం వుండే పూజారి గారు: కొత్త పూజారి గారా ? ఎవరు బాబు ? పొద్దున్న కూడా నేను ఒక్కడినే ఉన్నాను బాబు గుడిలో నాతో పాటు ఇంకో పూజారి ఎవరు లేరు బాబు.*

*నేను: లేదండి, నైవేద్యానికి ఇంకా సమయం ఉందని ఆయన నాతో మాట్లాడారు కూడా.*
అని అంటూ, ఆగిపోయాను నేను. నైవేద్యానికి సమయం ఉందని
అన్నారు కానీ, భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి సమయం ఉంది అనలేదు కదా.*

*ఈ విషయం స్ఫురించగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను, నాకేమి అర్ధం కాలేదు, అలా కూర్చుండిపోయాను. ఇంతలో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. గుడి నుంచి బయటకి వచ్చి ఫోన్ మాట్లాడాను.*
*అమ్మ: ఏరా ఏం చేస్తున్నావు ? ఇప్పుడే నాన్న నేను టీ తాగాము, నువ్వు భోజనం చేసావా ? పొద్దున్న గుడి కి వెళ్ళొచ్చావా ?*
*నేను: హా.. పొద్దున్న దేవుడిని కలిసొచ్చానమ్మా ..!!!*

*సేకరణ*

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Varaprasad Daitha

Varaprasad Daitha Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @daitha12

31 Mar
🌷🐥పలకరింపు 🐥🌷

మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది.*_

పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి,
కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.*_

నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు.
కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.*_

ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !*_

పలకరింపుకు అంత శక్తి వుంది. పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు
Read 13 tweets
31 Mar
*మ ని షి వి లు వ !!*
***********

ఒక కోటీశ్వరుడు నడుచు కుంటూ వస్తూఉండగా ఒక ఇంటి ముందుకు రాగానే తన కాలి చెప్పులు తెగిపోయాయి !
ఆ ఇంటిలోని యజమానిని పిలిచి
నా చెప్పులు తెగిపోయాయి ఇక్కడ వదిలి వెళ్తానండి
పారేయొచ్చు కానీ కొత్తవి !
అందుకే మనసు రావట్లేదు
రేపు పనివారిని పంపించి తీసుకువెళతాను అని అడిగాడు !

అందుకు ఆ ఇంటి యజమాని
అయ్యా మీరు ఎంత పెద్ద కోటీశ్వరులు మీ చెప్పులు మా ఇంటి ఆవరణలో ఉంటె మాకే గౌరవం అని చెప్పాడు !

ధనవంతుడు తన పనిలో పడి ఆ విషయాన్నీ మరిచిపోయాడు !!

ఒకరోజు హఠాత్తుగా ఆ ధనవంతుడు చనిపోయాడు !
అయన శవం ఊరేగింపు జరుగుతున్నది భారీ వర్షం మొదలయింది !

ఎవరూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి !

అయన ఆరోజు చెప్పులు వదిలిన ఇంటి ముందు శవాన్ని తీసుకొచ్చి ఆపి ఆ ఇంటి యజమానిని పిలిచారు !!

వర్షం ఎక్కువగా ఉందండి !
వర్షం ఆగే వరకు శవాన్ని
మీ ఇంటి ముంగిట కాసేపు ఉంచుకుంటాం అని అడిగారు!
Read 5 tweets
31 Mar
*💥జ్ఞన నేత్రం💥*

మనలో చాలామంది, కాశీ వెళ్ళినప్పుడు వారికిష్టమైన కాయనో, పండునో విడిచి పెట్టి రావాలంటారు. ఆమేరకు వారు వారికిష్టమైన ఏదో ఫలాన్నో
కాయనో వదిలేసి వస్తుంటారు.

ఇంక ఆతర్వాత నుండి
వాటిని తినడం మానేయడమేకాక,
"నేను జామపండు తిననండీ" ఎప్పుడో కాశీలో
వదిలేశాను,
"నేను కాకరకాయ తిననండీ" కాశీలో వదిలేశాను
అని చెప్పుకుంటూ ఉంటారు.

నిజానికి శాస్త్రప్రకారం పెద్దలు మనల్ని వదలమన్నది,
*"కాయాపేక్ష & ఫలా పేక్ష"*

👉🏽కాయాపేక్ష: కాయంఅంటే, దేహం పట్ల గల మమకారం. అది ప్రతి వ్యక్తికీకూడా ఉంటుంది. కనుక ఆశరీరం పట్ల అపేక్ష వదిలేయమనీ, ఆ శరీరానికి అందం కావాలీ,
సుఖం కావాలీ, ఏసీ కావాలీ, మెత్తని పరుపులు కావాలీ, తినడానికి
రుచికరమైన భోజనం కావాలీ వంటి కోరికలన్నీ
వదిలేసి, సాధువులా బతకమని అర్ధం.

👉🏽ఫలాపేక్ష : ఫలంఅంటే, ఏదైనా పనిచేసి దాని ద్వారాలభించే ప్రతిఫలం. ఆ ప్రతిఫలాపేక్షని వదిలేయమనే చెప్పేది.
Read 5 tweets
30 Mar
*64 కళలూ పండిన*
*మాయాబజార్ కు*
*64 ఏళ్లు నిండాయి!*

భళిభళిభళిరా దేవా
బాగున్నదయా నీ మాయ..
బహుబాగున్నదయా
నీ మాయ!

ఆ మాయే మాయాబజార్..
ప్రపంచ సినిమా చరిత్రలో పారాహుషార్..
మహాభారతంలో
శశిరేఖ పరిణయ ఘట్టం
హాస్యానికి పట్టం..
సావిత్రి అనే మొండిఘటం..
కెవిరెడ్డి చేతివాటం..
ఇంతకీ అది సినిమానా..
మన కళ్ళెదుటే జరుగుతున్న మహాభారతమా..
అపురూప దృశ్య కావ్యమా..?

అద్భుతమట స్క్రీన్ ప్లే..
ఘటోత్కచుడిగా
ఎస్వీఆర్ పవర్ ప్లే..
అంతటి మహానటుడి
అభినయానికి సావిత్రి రీప్లే..
కృష్ణుడిగా ఎన్టీఆర్
నట విశ్వరూపం..
అభిమన్యుడు అక్కినేని సమ్మోహన రూపం..
సుపుత్రా నీకిది తగదురా
అంటూ హిడింబిగా సూర్యకాంతం సరికొత్త రూపం..
ఓ చిన్నమయ..లంబు జంబు..
రేలంగి హాస్య విన్యాసం..
పక్కన శాస్త్రి,శర్మ కోరసం..
అంజిగాడి బాబాయిల పద్యం
చెప్పుల నాట్యాలు..
తివాచీ అల్లర్లు..
ఘటోత్కచుడి పదఘట్టనకు
విరిగి పడిన కొండ ముక్క..
పేరు చెప్పి
శరణు కోరమనే వైనం..
సుభద్ర రౌద్రం..
Read 11 tweets
30 Mar
🌞🌎🏵️🌼🚩

*_"మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం"_*

*_స్వామి వివేకానంద._*

📚✍️ మురళీ మోహన్

*_కానీ ఇప్పుడు చాలామంది,_*

*_వ్యక్తిత్వాలను నమ్ముకోవడం కన్నా,_*

*_ఆర్థిక, రాజకీయ, ఉద్యోగ ప్రయోజనాల కోసం,_*

*_అన్యుల పాదాక్రాంతం చేస్తూ,_*
*_అమ్ముకుంటూ, తాకట్టు పెడుతూ జీవిస్తున్నారు.!_*

*_శాశ్వతం కాని హోదాలను అనుభవించడమే జీవితం అనుకుంటున్నారు._*

*_మనం అసలైన ఆభరణాలము కాదు,_*

*_గిల్టు నగలమని తేలిపోవడం తప్పదు.._*

*_అప్పుడు సమాజమే కాదు,_*

*_మన అనుకునే వారు కూడా,_*

*_మనలను ఛీకొట్టే రోజులు వస్తాయి..._*
*_అందుకే వ్యక్తిత్వాన్ని చంపుకోవద్దు.._*

*_దాన్ని కాపాడుకుంటే అది మనలను మరణించినా,_*

*_మనుషుల్లో వారి మనసుల్లో శాశ్వతంగా నిలబెడుతుంది.._*

*_కొన్ని సందర్భాల్లో మంచి వాళ్ళు గా ఉండే కంటే,_*

*_ప్రశాంతంగా ఉండడానికే ప్రాధాన్యత ఇవ్వాలి.._*
Read 4 tweets
30 Mar
మనం మద్రాసు ఉమ్మడి రాష్ట్రం లోనే ఉంటున్నాం.

ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా పనిచేసి రాజాజీ రాజకీయానికి, తన అహంకారానికి పదవీచ్యుతుడయ్యాడు.

తెలుగువారంటే ఆరంభ సూరులు మాత్రమే నని పుకారు పుట్టించారు.

తమిళుల హేళనలు దౌర్జన్యాలు మితిమీరినా మనల్ని తెలుగువారు అని కాకుండా మద్రాసీయుల
ు అనే పిలిచేవారు . స్వాతంత్ర్యం వచ్చాక కూడా మనకు గుర్తింపులేదు.

మద్రాసు మొదలు తంజావూరు వరకు తెలుగువారితో నిండిపోయింది. కానీ తెలుగుకు ప్రాధాన్యత లేదు.

1952 వచ్చినా ఆంధ్రావాళ్లంటే తెలియదు మద్రాసు వాళ్లమే మొత్తం ప్రపంచానికి.

ఈ బాధ భరించలేక స్వామి సీతారాం అనే ఆయన గుంటూరులో
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రాజాజీ ప్రభుత్వం శిబిరాన్ని అణిచివేసి సీతారామ్ దీక్షను భగ్నం చేసింది. పైగా తెలుగువారు ఆరంభసూరులు అని హేళన చేసింది.

దిగమింగుకోలేని ఈ అవమానానికి శ్రీరాములు స్పందించారు. సర్కార్ ఎక్స్ ప్రెస్ లో గుడివాడలో ఎక్కి మద్రాసులో దిగి బులుసు సాంబమూర్తిగారి ఇంట
Read 18 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!