ఈరోజు గురువారం (15-04-2021) రాశి ఫలితాలు
🌻🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀
👉మేషం
స్వయంకృషితో విజయాన్ని సాధిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.ఆందోళనలను దరిచేరనీయకండి. ఆంజనేయ ఆరాధన శ్రేయోదాయకం.
👉వృషభం
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అనవసర ప్రసంగాలు వద్దు. అకారణంగా కలహ సూచన. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మనోవిచారం కలుగకుండా చూసుకోవాలి. విష్ణు ఆలయ సందర్శనం శుభప్రదం.
👉మిధునం
బుద్ధిబలంతో పనులను పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మాట పట్టింపులకు పోకూడదు. సుబ్రహ్మణ్య ఆరాధన మంచిది.
👉కర్కాటకం
చేపట్టే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనవసర కలహాలతో కాలం వృథా చేసుకోకండి. విష్ణు సహస్రనామ పారాయణతో శుభం కలుగుతుంది.
👉సింహం
గ్రహబలం అనుకూలంగా ఉంది. పట్టువదలకుండా పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మీ మీ రంగాల్లో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. చేసే ప్రతిపని అనుకూలతను ఇస్తుంది. లక్ష్మీ ఆరాధన శుభప్రదం.
👉కన్య
మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త.
సమయం వృథా చేయకండి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
👉తుల
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఒక తీపి వార్త వింటారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన ఉంటుంది. ఇష్టదైవ ప్రార్థనతో మరింత శుభ ఫలితాలు పొందుతారు.
👉వృశ్చికం
నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం శుభప్రదం.
👉ధనస్సు
ప్రారంభించిన పనిలో విజయం సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉండాలి. అపార్థాలకు తావివ్వకండి. అనవసర విషయాలతో సమయం వృథా చేయవద్దు. శివారాధన శుభప్రదం.
👉మకరం
మీరు చేసే పనిలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అకారణ కలహసూచన ఉంది. వాదనలకు దూరంగా ఉండటమే మంచిది. దైవారాధన మానవద్దు.
👉కుంభం
మనోధైర్యంతో ముందుకు సాగి శుభ ఫలితాలను పొందుతారు. ఆత్మీయుల అండదండలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. దత్తాత్రేయ స్వామిని దర్శించండి.
👉మీనం
చేపట్టిన పనులు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగడానికి శివారాధన చేయాలి.
సేకరణ
🌻🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀
శ్రీ శ్రీనివాస జ్యోతిష్యాలయం
ప్రకాష్ నగర్, నరసరావుపేట
🌻🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with Saradhi

Saradhi Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @SaradhiTweets

16 Apr
ప్రభుత్వము ఆరోగ్య సేతు APP ఇన్స్టాల్ చేసుకోండి మీ చుట్టూ పక్కల ఎంత మంది positive వాళ్ళున్నారు, తద్వారా మీరు ఎంత రిస్క్ లో వున్నారో తెలుస్తుంది. ఇది basic గా ఉపయోగపడుతుంది అంటే మనము ఎన్నో conspiracy theory లు పెట్టాము దానికి; అదేదో మన సీక్రెట్ లన్ని ఎత్తుకుపోతుంది అని :)
ప్రజలు తమ ఫోన్ లోకి ఏవేవో app లు install చేయటానికి లేని ప్రాబ్లెమ్ ఆరోగ్య సేతు app వేసుకోవడానికి వచ్చింది. మన ఫోన్ లో వున్న అప్ ల కంటే అది ఇంకొకటి ఎక్కువా? ప్రజల ఆరోగ్యము ప్రజలకి ముందు;నేను నిర్లక్ష్యముగా ఉంటా ప్రభుత్వము చెప్పింది వినను అనుకుంటే వాళ్ళు చెప్పేది ఎలా తెలుస్తుంది?
ఈ రోజుకి 2 రోజులకు ఒక సారి IMGR ప్రెస్ మీట్ పెట్టి లేటెస్ట్ కోవిడ్ డేటా వాక్సిన్ information ఇస్తోంది. మనలో ఎంత మంది follow అవుతున్నాము? ఆరోగ్య సేతులో కోవిడ్ లేటెస్ట్ కోవిన్ అప్ లో vaccine latest info ఉంది.
Read 6 tweets
15 Apr
ఏనక్షత్రానికి ఏగణపతి స్వరూప ఆరాధన.

1. అశ్విని -- ద్వి ముఖ గణపతి ‌
2. భరణి -- సిద్ద గణపతి.
3. కృత్తిక - ఉఛ్ఛిష్ఠ గణపతి .

4. రోహిణి - విఘ్న గణపతి ‌
5. మృగశిర - క్షిప్ర గణపతి.
6. ఆరుద్ర - హేరంబ గణపతి .

7. పునర్వసు - లక్ష్మి గణపతి.
8. పుష్యమి - మహ గణపతి.
9. ఆశ్లేష - విజయ గణపతి
10. మఖ - నృత్య గణపతి.
11. పుబ్బ - ఊర్ధ్వ గణపతి.
12 ఉత్తర - ఏకాక్షర గణపతి.

13. హస్త - వరద గణపతి .
14. చిత్త - త్య్రక్షర గణపతి.
15. స్వాతి - క్షిప్రసాద గణపతి.

16. విశాఖ - హరిద్ర గణపతి.
17.అనూరాధ - ఏకదంత గణపతి.
18. జ్యేష్ఠ - సృష్టి గణపతి .
19 మూల ఉద్దాన గణపతి.
20.పూర్వషాఢ- ఋణ విమోచన గణపతి.
21. ఉత్తరాషాఢ - ధుండి గణపతి.
22. శ్రవణం - ద్వి ముఖ గణపతి.
23. ధనిష్ట - త్రిముఖ గణపతి.
24. శతభిషం - సింహ గణపతి.

25. పూర్వాభాద్ర - యోగ గణపతి.
26. ఉత్తరాభాద్ర - దుర్గా గణపతి.
27. రేవతి - సంకట హర గణపతి.
Read 4 tweets
15 Apr
శ్రీ ఆది శంకర - వేదాంతం

కామః క్రోధశ్చ, లోభశ్చ
దేహే తిష్ఠతి తస్కరాః
జ్ఞాన రత్నాపహారాయ
తస్మాత్ జాగ్రత జాగ్రత

తా : కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
ఆశయా బధ్యతే జంతుః
కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి
తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి.
సంపదః స్వప్న సంకాశాః
యౌవనం కుసుమోపమ్|
విధుఛ్చచంచల ఆయుషం
తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు. యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి
Read 11 tweets
15 Apr
అక్షరాల అధిదేవతలు:

వసినీన్యాది వాగ్దేవతలు: వశిని , కామేశ్వరి, మోదిని, విమల, అరుణా . జయని కౌళిని మరియ సర్వేశ్వరి మొదలగు తెలుగు భాషలో వాగ్దేవతల యొక్క వర్ణమాల

అంతర్నిర్మాణం :

"అ నుండి అః" వరకు ఉన్న 16 అక్షరాల విభాగాన్ని "చంద్ర ఖండం" అంటారు.
ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు అధిదేవత "వశిని" అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం.

"క" నుండి "భ" వరకు ఉన్న 24 అక్షరాల విభాగాన్ని " సౌర ఖండం " అంటారు.

"మ" నుండి "క్ష" వరకు ఉన్న 10 వర్ణాల విభాగాన్ని " అగ్ని ఖండం" అంటారు.
ఈ బీజ శబ్దాలన్నీ జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.

సౌర ఖండంలోని " క "నుండి "ఙ" వరకు గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి. అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.

"చ" నుండి "ఞ" వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత "మోదిని" అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.
Read 7 tweets
14 Apr
తెలుగు సంవత్సరాల పేర్లు వాటి అర్థాలు
1. ప్రభవ అంటే... ప్రభవించునది... అంటే... పుట్టుక.
2. విభవ - వైభవంగా ఉండేది.
3. శుక్ల... అంటే తెల్లనిది. నిర్మలత్వం, కీర్తి, ఆనందాలకు ప్రతీక.
4. ప్రమోదూత.... ఆనందం. ప్రమోదభరితంగా ఉండేది ప్రమోదూత.
5. ప్రజోత్పత్తి... ప్రజ ఆంటే సంతానం. సంతాన వృద్ధి కలిగినది ప్రజోత్పత్తి.
6. అంగీరస... అంగీరసం అంటే శరీర అంగాల్లోని ప్రాణశక్తి, ప్రాణదేవుడే అంగీరసుడు. ఆ దేవుడి పేరు మీదే ఈ పేరొచ్చింది అని అర్థం.
7. శ్రీముఖ... శుభమైన ముఖం. ముఖం ప్రధానాంశం కాబట్టి అంతా శుభంగా ఉండేదనే అర్ధం.
8. భావ.... భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు.
9. యువ.... యువ అనేది బలానికి ప్రతీక.
10. ధాత... అంటే బ్రహ్మ. అలాగే ధరించేవాడు, రక్షించేవాడు.
11. ఈశ్వర... పరమేశ్వరుడు.
Read 12 tweets
14 Apr
ఏప్రిల్ - పండుగలు/పర్వాలు/ఉత్సవాలు
8 అన్నమాచార్య వర్థంతి
13 శ్రీ ప్లవ ఉగాది
14 మత్స్య జయంతి / రమణ మహర్షి జయంతి
17 లక్ష్మీ పంచమి
18 శృంగేరీ జగద్గురు శ్రీ భారతీ తీర్థస్వామి జన్మోత్సవం
21 శ్రీరామ నవమి / భద్రాచల సీతారామ కల్యాణం, ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం (28 వరకూ) / ర్యాలి జగన్మోహనీ-కేశవస్వామి కల్యాణం / స్వామి నారాయణ్ జయంతి
22 భద్రాద్రి రామయ్య పట్టాభిషేకం
23 సింహాద్రి అప్పన్న / అరసవిల్లి సూర్యనారాయణ / వాడపల్లి వెంకటేశ్వర తీర్థం / కల్యాణం
24 మదురై మీనాక్షి కల్యాణం / తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు ప్రారంభం (26 వరకూ) / శ్రీ సత్యసాయి ఆరాధన
25 ఇంద్రకీలాద్రి కనకదుర్గ కల్యాణం / మహావీర్ జయంతి / మార్కాపూర్ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
26 ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యాణం / మండపాక యల్లారమ్మ జాతర.
Read 4 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal Become our Patreon

Thank you for your support!

Follow Us on Twitter!