గబ్బిలం...ఓ అశుభ సూచకం చాలామందికి. శుభసూచకం చైనా వాళ్ళకి. ఎక్కడనో గుహలలోపల దాగున్నా గుహలబయటి వాతావరణాన్న పసిగట్ట గలిగే నైపుణ్యం దాని ప్రత్యేకత.
వీటిలో ఐదడుగుల పొడవున్న రెక్కలను దుప్పటిగా కప్పుకునే ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలాలతో కలుపుకొని 950 రకాల గబ్బిలాలున్నాయి ప్రపంచంలో. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా సైన్యం ఈ గబ్బిలాల రెక్కలకు బాంబులను కట్టి ..
సాయం సమయం ఆసన్నమౌతున్న సమయంలో వాటిని విమానాల ద్వారా శత్రువుల భవనాలపై, స్థావరాలపై ఒక్కదుటున జారవిడిచేవారు. అవి చీకటి పడే వేళ రెక్కలు విప్పగానే బాంబులు పేలేవి. అంటే ఆత్మాహుతి దళాలుగా గబ్బిలాలను వాడుకున్నారు.
నా రచనలన్నీ కాలగర్భంలో కలిసి పోయినా #గబ్బిలం మాత్రం బ్రతికి వుంటుంది అని చెప్పిన నవయుగ చక్రవర్తి జాషువా గారి పుణ్యతిథి
ఈ రోజు. (28 సెప్టెంబర్ 1895 - 24 జూలై 1971)
కులమతాలు గీచుకున్న గీతలజొచ్చి
పంజరాన గట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు
తరుగులేదు విశ్వనరుడ నేను -
తలిదండ్రులది వర్ణాంతర వివాహం కావడంతో అటు కులవివక్ష, ఇటు మతఛాందసుల మధ్య నలుగుతూ యెదిగిన జీవితం జాషువాది. ఆయన జీవితం వినుకొండ నుండి విశ్వనరునిగా ఎదిగిన వైనం ఎందరికో స్ఫూర్తి నిచ్చింది.
అందరికీ తెలిసిన కవి జాషువా బాల్యం కేవలం కష్టాలతోనే నిండిపోలేదు. చిననాటి చిలిపిచేష్టలూ వున్నాయి. అల్లరి చిల్లరగా తిరుగుతూ బాలకృష్ణుని లీలలను తలపింపజేసేవాడు.
పసిప్రాయం నుండే జీవకారుణ్య లక్షణాలు యెదనిండా నింపుకున్నవాడు.
ఆ భావాలు ఆయన కైతలల్లడం ఆరంభించాక సాలీడు మీద, కుక్క మీద ఇలా అన్ని ప్రాణులమీదా పద్యాలల్లేలా చేసాయి. అసలు ఆయనలో పద్యరచనకు మూలకారకుడు తండ్రియైన వీరయ్య. ఆయన జాషువాకి బాల్యంలో చెప్పిన పలనాటి వీరగాథలు జాషువాలో వీరరసాత్మక రచనలకు ప్రేరణ కలిగించాయి.
ఎలాంటి కష్టాలలోనూ పద్యరచన మానలేదు. ఓ వైష్ణవుడు జాషువాతో -
"పృథివిసురులు దక్క నితర జాతులు కైత
లల్లరాదు నేరమండ్రు బుధులు" -
అని అన్నా తన ధోరణిలో మార్పు తెచ్చుకోలేదు సరిగదా కవితారచనని పంతంగా కొనసాగించాడు.
ఓసారి తనకు ఆతిథ్యం ఇచ్చిన ఓ రైతుమీద కందపద్యం రాశాడు. ఒక బ్రాహ్మణ కవి అందున్న దోషాలను ఎత్తి చూపడం తొలుత జాషువా మనస్సుకి చివుక్కుమనిపించినా, అందులో నిజం ఉందని గ్రహించి సాధనతో పద్యంపై పట్టు సాధించాడు జాషువా.
తెలుగునేలపై యే కవికీ జరగని రీతిలో వెయ్యికి పైగా సన్మానాలందుకున్న అపర సరస్వతీమూర్తిగా భాసిల్లిన కవిగా నిలచిపోయాడు.
కవితా రచన సాగుతున్న సమయం స్వతంత్రపోరాట సమయం. ఆ పరిస్ఠితుల్లో గాంధీ ప్రభావం జాషువా మీద బాగా పడి 'బాపూజీ' లఘుకావ్య రచనకు ప్రేరణ కలిగింది. సుభాష్ బోస్ పై కూడా రచన చేసారు. ఆ కవితలు స్వతంత్ర పోరాట కాలంలో వారనుసరించిన పంథాలను తెలియజేస్తాయి.
తన పాండిత్యంతో ఆనాటి మహామహులైన పండితుల ప్రశంసలతో పాటు "పెద్దవారి" ఆదరణకూ నోచుకున్నాడు. సరస్వతీ కటాక్షంతో అన్నివర్గాలవారి ఆదరణ కూడా లభించింది. తననాదరించిన ప్రతి సాహితీప్రియునికీ తన కావ్యాలను అంకితమిచ్చి ఋణం తీర్చుకున్నారు..
అలాగని తన సాహితీసేద్యం అంత సజావుగా సాగలేదు. తుమ్మల సీతారామమూర్తివంటి పండితుల తీవ్రవిమర్శలూ, అప్పటి బ్రాహ్మణపండితుల శల్యపరీక్షలూ ఎదుర్కోవలసివచ్చింది.
జాషువా గారిని శ్రీనాథునితో పోల్చుతూ..
రోదసిలో ప్రయాణించిన తొలి జీవి 'లైకా' అన్న కుక్క. అది భూమికి చేరాక ఎన్నాళ్ళో బ్రతకలేదు. ఆ సంఘటన జాషువాని కదలించింది. వేదన పద్యమై పెల్లుబికింది....
గుండెలు లేవు మానవులకున్ నినుబోలి యనంత రోదసీ
మండల యాత్ర సేయ యజమానుల యాజ్ఞ శిరాన మల్లెపూ
దండగ దాల్చి
కృత్రిమ సుధాంశునితో పయనించి యీ జగ
త్కాండనుతుల్ గడించితివిగా, లయికా, శునకాంగనామణీ...
అంటూ!
అలాగే సంస్కృతంలోని 'విద్వాన్ సర్వత్ర పూజ్యతే...' అన్న శ్లోకానికి దగ్గరగా వుండే మరో ఆణిముత్యం వంటి పద్యం -
రాజు మరణించె నొక తార రాలి పోయె
కవియు మరణించె నొక తార గగన మెక్కె
రాజు జీవించు రాతి విగ్రహములందు
సుకవి జీవించు ప్రజల నాల్కలందు - అని రాశారు.
ఓ గబ్బిలం, ఓ ఫిరదౌసి, ఓ ముంతాజ్ మహల్, ఓ క్రీస్తు చరిత్ర... ఎన్నో ఆయన కలం నుండి సాహితీ జాహ్నవిగా స్రవించాయి.
పద్య రూపంలోని హరిశ్చంద్రనాటకంతో ప్రసిద్ధుడైన బలిజేపల్లి వారికి సమాన స్థాయిలో జాషువా రాసిన 'శ్మశాన వాటి'
పద్యాలు తెలుగు సాహిత్యంలో న భూతో న భవిష్యతి.
కుల మత వివక్షలను నిరసించడమే కాదు బాల్యవివాహాలనూ తీవ్రస్వరంతో నిరసించేవారు.
ఆఖరికి తన ముచ్చటలు తీర్చుకునేందుకు ఆడబిడ్డకు బాల్యవివాహం చేసే తల్లి "తల్లి గాదు జంగుబిల్లిగాని...అంటూ నిరసించారు..
విద్యా ప్రతిభలతో ఎనలేని గౌరవం సంఘంలో పొందవచ్చు, అట్టి మానసిక పరిపక్వత రానంతవరకూ సాంఘిక వైషమ్యాలు తొలగిపోవడం సాధ్యంకాదని జాషువా అనేవారు. జీవితంలో యెన్ని యిడుము లెదురైనా క్రుంగిపోకుండా నవ్వుతూ..
వాటినెదుర్కోవాలన్నది జాషువా ప్రబోధం!
ఈ మహనీయునికి సవినయ నివాళులు.
💐💐💐
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
#ఆరోజుపాఠం లో #శ్లోకం
ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే”
అనే శ్లోకం .
పాఠం చెప్పడం పూర్తైన తర్వాత అందర్నీ పుస్తకం చూసి శ్లోకాన్ని నేర్చుకొమ్మని చెప్పారు గురువుగారు.
కొద్దిసేపటితరువాత నైవేద్యంగూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకువెళ్ళి నేర్చుకున్నావాఅనిఅడిగారు. నేర్చుకున్నానని వెంటనేఅప్పచెప్పాడు శిష్యుడు శ్లోకంసరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు తల అడ్డంగాఆడించారు
దానికి ప్రతిగా శిష్యుడు, పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు.
ఒక #పత్రికకు ఒకాయన ఇలా #ఉత్తరం రాశారు.
" నేను 30 సంవత్సరాల నుండి ప్రతి రోజూ గుడికి వెళ్తున్నాను,
ఈకాలంలో నేను ఒక 3000 మంత్రాలు విన్నాను . ఒక్కటీ గుర్తు లేదు. నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను అనిపిస్తోంది .
గురువులు వారి సేవలు కూడా వృధా అయ్యాయి . అందువలన గుడికి వెళ్ళడం అనవుసరం అని నేను చెబుతున్నా "
లెటర్స్ టు ది ఎడిటర్ -- లో ఈ చర్చ ఒక పెద్ద చర్చగా అనేక వారాల పాటు సాగింది . చివరికి ఒకాయన ఇలా రాశారు
నేను 30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాను . అప్పటి నుండి ఇప్పటికి మా ఆవిడ 32000 మీల్స్ వండి ఉంటుంది . ఏరోజు ఏమి వండిందో నాకు ఒక్కటీ గుర్తు లేదు . కానీ నాకు ఒకటి తెలుసు .
నేను ఈ రోజు ఇలా ఉండడానికి కారణం ఆ వంటలే ...