సందర్భం:
అమ్మవారు రాత్రి పడకగదిలో అయ్యవారితో రతిక్రీడలో మునిగి తేలుతూ, తెల్లవారిన సంగతి మరచింది. వారిని శయన మందిరంలో మేలుకొలపటానికి వచ్చిన చెలికత్తెలు అమ్మవారి కళ్యాణవదనం చూసి, మార్పులు గమనించి చర్చించుకుంటున్న మాటలు.
పల్లవి భావం:
ఏమిటే ఇది? లేత చిగురు వంటి అమ్మవారి పెదవుల మీద ఈ కస్తూరి? అయ్యవారికి తన అంగీకారం తెలుపుతూ వ్రాసిన పత్రికేమో! అయ్యవారు తన పెదవులకు చేసిన గాయం తాంబూలం లోని కస్తూరితో కప్పినది కాబోలు.
చ1 భావం:
చకోరము వంటి ఎఱ్ఱని అందమైన కను సన్నులున్నాయి ఈ తల్లికి. ఏమయ్యుంటుందో? అమ్మవారు అందంగా అయ్యవారిపై నాటిన ఆ చూపులను మనం పిలిచి నిద్రలేపినప్పుడు బలవంతంగా నిలువునా లాగినందుకు ఏర్పడిన నెత్తురేమో!
చ2 భావం:
ముద్దులొలికే ఆ తల్లి పయ్యద తెల్లని కాంతులు పైటచెఱగు నుంచి వెలువడుతున్నాయి. ఏమయ్యుంటుందో? అయ్యవారు ఆనందంలో తన గోర్లతో అమ్మవారి చనుగవల మీద అద్దిన ముద్రలు, శశిరేఖల వలె వెలుగి, వేసవి కాలపు వెన్నలలాగా ఇంకా ప్రకాశవంతంగా హాయిగొల్పుతున్నాయేమో!
చ3 భావం:
సౌందర్యవతియైన ఆ తల్లి చెక్కిళ్ళకు అతుక్కున్నవి - అవి ముత్యాల సరులా? దిట్టమైన ఆ తిరు వేంకటపతితో రతిసల్పినపుడు ఏర్పడిన అందమైన చెమట బిందువులు కాబోలు!
.
.
.
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
చ1 భావం:
ఇప్పుడే పొంగి వేడిగా ఉన్న పాలవి, పిల్లవాడు జాగ్రత్త, పక్కకు తియ్యండి. పరమాత్మ కాబట్టి కడుపులోని ఉంచుకున్న లోకాలన్నీ కదులుతాయి, మీరు ఈ బాలుని శరీరాన్ని ఎక్కువగా కదిలించొద్దు