వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే ఎన్నో చక్కటి విషయాలను సులభంగా అర్ధమయ్యే తెలుగులో చెప్పగలిగినందుకు అన్నమయ్యను 'ఆచార్య' అన్నారు. ప్రతి చరణంలో మంచికి, చెడుకి ఉదాహరణలిస్తూ ఏది ఎందుకు హానికరమో వివరిస్తున్నాడు ఈ కీర్తనలో @Sai_swaroopa@ivak99@Vishnudasa_@stellensatz
పల్లవి:
ఎంత విభవము గలిగె నంతయును నాపదని
చింతించినది గదా చెడనిజీవనము
పల్లవి భావం:
ఎంత సంపద కలిగితే అంత ప్రమాదమని చెప్తున్నాడు అన్నమయ్య. సంపదతో పాటుగా వచ్చే చెడ్డ గుణాలు ఎలా వినాశనానికి కారణమౌతాయో వివరిస్తున్నాడు చరణాల్లో.
చ1 భావం:
దురుసుతనం, కోపం తనని చంపే శత్రువులనీ, పరనింద చేయు గుణమే తన పాలిటి మృత్యువని తెలుసుకోవటమే వివేకము.
చ2 భావం:
లౌకిక సుఖాలని కలిగించే విషయాల మీద ఆసక్తి తన మెడ చుట్టూ బిగుసుకుంటున్న ఉరితాడనీ, ఎల్లలు లేక విస్తరించే ఆశ తనను పట్టుకునే భూతమని తెలుసుకునేదే విజ్ఞానం.
చ3 భావం:
సాటిలేని శ్రీ వేంకటేశ్వరుడే దైవమనీ, నిరంతరం అతని సేవ చేసుకోవటమే మనుషులకు జీవనం అని వివరిస్తున్నాడు అన్నమయ్య.
సందర్భం:
అమ్మవారు రాత్రి పడకగదిలో అయ్యవారితో రతిక్రీడలో మునిగి తేలుతూ, తెల్లవారిన సంగతి మరచింది. వారిని శయన మందిరంలో మేలుకొలపటానికి వచ్చిన చెలికత్తెలు అమ్మవారి కళ్యాణవదనం చూసి, మార్పులు గమనించి చర్చించుకుంటున్న మాటలు.
చ1 భావం:
ఇప్పుడే పొంగి వేడిగా ఉన్న పాలవి, పిల్లవాడు జాగ్రత్త, పక్కకు తియ్యండి. పరమాత్మ కాబట్టి కడుపులోని ఉంచుకున్న లోకాలన్నీ కదులుతాయి, మీరు ఈ బాలుని శరీరాన్ని ఎక్కువగా కదిలించొద్దు