#రమణమహర్షి#జయంతి#శుభాకాంక్షలు. 🍁
"బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి"-బ్రహ్మమును ఎవరు అనుభవించాడో వాడే బ్రహ్మము అవుతాడు. పరబ్రహ్మమును
అనుభవించిన కారణం చేత ఆయనే పర బ్రహ్మము. అందుకే "గురుర్బహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః!
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః!!"
గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనబడే మూడు రూపములు
పొందినటువంటి వాడై ఉంటాడు. అటువంటి గురువు జ్ఞానమును పొందినప్పటికీ, సమున్నతమైన స్థాయిలో నిలబడినప్పటికీ సామాన్యమైన లోకులు శాస్త్రాన్ని ఎలా ఆచరిస్తారో అలా ఆయన కూడా ఆచరించాలని నియమం లేదు.
ఆయన అలా ఆచరించలేదు కాబట్టి ఆయన స్థాయి తక్కువైంది అని చెప్పడం సాధ్యంకాదు.
భగవాన్ రమణులు మహా పురుషులు. వారు బ్రహ్మము యొక్క స్థాయిని చేరిపోయిన వారు.
అంతటి అద్వైతానుభూతి
యందు ఓలలాడుతూ ఉండేవారు.
శరీరాన్ని చూపించి ఎప్పుడూ ఇది అని వేలు చూపించి తను సాక్షిగా
ఉండేవారు. అటువంటి పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి, గురుస్వరూపుడైన రమణమహర్షి సంధ్యావందనం చేయాలనీ,
యజోపవీతం వేసుకోవాలనీ,
గోచీపోసి పంచె కట్టుకోవాలనీ,
వేదం ఎలా చెప్పిందో అలా ఆయన ప్రవర్తించాలనీ, అలా ఆయన ప్రవర్తించకపోతే దోషం వస్తుందనీ, చెప్పడం సాధ్యం కాదు.అది అగ్ని హోత్రం వంటిది. ఆస్థాయికి
చేరినటువంటి మహాపురుషులు కర్మాచరణను శాస్త్రీయంగా చేశారా?
చేయలేదా?
అన్న విషయంతో సంబంధం
ఉండదు. వారు ఎప్పుడూ జ్ఞానమునందు ఓలలాడుతూ ఉంటారు. జ్ఞానిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు.
అజ్ఞానిని ఎప్పుడూ అనుకరించకూడదు. అనుకరణవల్ల మహాత్ముల స్థాయిని చేరలేరు.
పరమభక్తితో కర్మాచరణము
చేయగా చేయగా అనుగ్రహించిన భగవంతుని కారుణ్యమే ఒక నాడు జ్ఞానము కలగడానికి అవకాశం ఇస్తుంది. ఒక సారి జ్ఞానము కలిగిన తరువాత అదే మోక్షమునకు హేతువు.
జ్ఞాని శరీరముతో ఉన్నప్పటికీ నేను ఆత్మ అని దానియందు రూఢియై అద్వైతాను భూతియందు ఓలలాడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి శరీరం పడిపోతున్నప్పుడు
కూడా సాక్షిగా చూస్తాడు శరీరాన్ని, శరీరంతో తాదాత్మ్యత పొందడు.
అందుకే అందరూ ఇలా ప్రవర్తిస్తున్నారో ఎలా
వైదికమైనటువంటి ప్రవర్తనకు కట్టుబడుతున్నారో అలా కట్టుబడాలి అని భావించడం పొరపాటు.
గురువు యొక్క లీల, మాట పరమశక్తివంతములు. గురువు లోకోద్ధరణకొరకే నోరువిప్పుతాడు. గురువు యొక్క సహజస్థితి మౌనం.
భగవాన్ రమణులకు అందుకే మౌనయోగి అని పేరు. అలా మౌనంగా ఉండి పరబ్రహ్మముగా అనుభవములో ఎప్పుడూ రమిస్తూ ఉంటారు. అటువంటి స్థాయి పొందిన మహాపురుషులు. 🙏🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
'సరే.. పోనీ.. నేనే చచ్చిపోయేననుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?'
ఏమీ అవ్వదు..
నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో.!.
మంచి బేరం పోయిందే.!. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు.'
Moon nd the Lake
- #PureHeart.💫
(- Anonymous Author)
ఆకాశం నలుపైనా చందమామ తెలుపైనా నిత్యం కలుస్తూనే ఉంటారు!
ప్రశాంత సరస్సు వినిపించని గుసగుసలతో చంద్రుడిని తనలో దాచుకుంటుంది
చంద్రుడు తళతళలాడుతూ వెలుగుని
జగమంతా నింపుతాడు!
చెరువు గుండెను తడుతూ పిల్లగాలులు వీస్తాయి
చెరువు మధ్యలో దాగిన జాబిల్లి చెక్కులను ముద్దాడుతూ!
అల్లరి గాలి చిలిపి తాకిడులకి పులకిస్తూ చెరువు ఊగుతుంది
చెరువు గుండెల్లో దాగిన చంద్రుడు అలల ఊపులకి చెదురుతాడు!
గువ్వలు గుసగుసలాపి రాగాలు అందుకుంటాయి
ఆకుల గలగలలు వాయులీనాలు పక్కవాద్యాలుగా!
జలచరాలన్నీ తమ గొంతులనూ కలుపుతాయి ఆ ప్రేమగీతానికి!
చెరువమ్మ ప్రేమంతా తనకేనని ఆనందంగా జాబిల్లి
చెరువు కౌగిట్లో తలదాచుకుంటాడు
కానీ, అతడికి తెలుసు...
మాములుగా ఈ శ్లోకం అర్థాన్ని చూస్తే అది పూర్ణం, ఇదీ పూర్ణమే, పూర్ణం నుండి పూర్ణం ఉద్భవిస్తుంది.
పూర్ణం నుండి పూర్ణం తీసివేసినా పూర్ణమేమిగులుతుంది ఇది భగవంతుని పూర్ణ తత్వాన్ని చెప్పే శ్లోకం.
భగవంతుని నుండి ఈ ప్రపంచమంతా ఉద్భవించినా ఆయన యొక్క పూర్ణత్వానికి ఏ లోటు లేదని చెపుతుంది. కానీ ఈ శ్లోకం మామూలుగా మనకు అర్థం చేసుకోవటం కొంచం కష్టం.
ఒక దీపాన్ని తీసుకుంటే. ఆ దీపం నుండి ఎన్ని దీపాలైనా వెలిగించు కోవచ్చు. ఒక దీపం నుండి ఇలా వెలిగించబడిన మిగిలిన దీపాలు కూడా అంతే కాంతిని కల్గిఉంటాయి. కానీ ఇలా ఎన్ని దీపాలు వెలిగించినా మొదటి దీపానికి వచ్చే ఇబ్బంది లోపం ఏదీ లేదు. అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది
అందరికి చేతులెత్తి దండం పెట్ట కూడదా?🙏🏻
నమస్కారం…భారతీయ సంస్కారం. కాదు, సంస్కృతిలో భాగం. ఇది ఒక గౌరవసూచకం. మనషులందరిలోనూ దైవత్వము ఉంటుందని హిందువులు నమ్ముతారు.దీనినే ఆత్మ అంటారు. నమస్కారం పెట్టడం అంటే మన ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను గుర్తించి దానికి విధేయత ప్రకటించడం
కానీ, ప్రతి నమస్కరానికి ఒక విధానం ఉంది. అందరికీ చేతులెత్తి దండం పెట్ట కూడదట. ఎవరికీ ఏ విధంగా నమస్కారం చేయాలి అనే అంశాలను పరిశీలిద్దాం
- తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా
ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేస్తాం.
- దేవుళ్లకు చేసే నమస్కారాలు ఒక విధంగా ఉంటాయి
గౌరవపూర్వకంగా మనుషులకు చేసే నమస్కారం మరో రకంగా ఉంటుంది. - శివకేశవులకు నమస్కరించేటపుడు తల నుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి. అంటే చేతులెత్తి నమస్కరించాలి హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు.
గబ్బిలం...ఓ అశుభ సూచకం చాలామందికి. శుభసూచకం చైనా వాళ్ళకి. ఎక్కడనో గుహలలోపల దాగున్నా గుహలబయటి వాతావరణాన్న పసిగట్ట గలిగే నైపుణ్యం దాని ప్రత్యేకత.
వీటిలో ఐదడుగుల పొడవున్న రెక్కలను దుప్పటిగా కప్పుకునే ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలాలతో కలుపుకొని 950 రకాల గబ్బిలాలున్నాయి ప్రపంచంలో. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా సైన్యం ఈ గబ్బిలాల రెక్కలకు బాంబులను కట్టి ..
సాయం సమయం ఆసన్నమౌతున్న సమయంలో వాటిని విమానాల ద్వారా శత్రువుల భవనాలపై, స్థావరాలపై ఒక్కదుటున జారవిడిచేవారు. అవి చీకటి పడే వేళ రెక్కలు విప్పగానే బాంబులు పేలేవి. అంటే ఆత్మాహుతి దళాలుగా గబ్బిలాలను వాడుకున్నారు.