'సరే.. పోనీ.. నేనే చచ్చిపోయేననుకో.. అప్పుడు ఏమవుతుందంటావు?'
ఏమీ అవ్వదు..
నిన్ను ఇష్టపడేవాళ్ళు ఓ రెండ్రోజులేడుస్తారు.. స్విగ్గీ వాడూ, డొమినోస్ వాడూ 'అయ్యో.!.
మంచి బేరం పోయిందే.!. సారు మంచిగా టిప్పులిచ్చేవాడు' అని బాధపడతారు.'
'నీకసలే డాన్సులంటే బోరు కదా..
మరి నువ్వెళ్ళి ఏం చేస్తావు.?'
'పుణ్యం చేస్తే అక్కడ మనకోసం రంభా, ఊర్వశి, మేనకా వెయిటింగన్నారు.?'
రంభా, ఊర్వశి, మేనకా
ఏవైనా కామపిశాచులేవిటీ.?
పైకొచ్చే మగ వెధవలందరి కోసం కాసుక్కూచోడానికి.?
అయినా నువ్వు పుణ్యం చెయ్యడానికి కారణం, ఎవరో తెలీని ఆడదానితో సరసాలాడటానికా.?'
'మరి పుణ్యం చేసి ప్రయోజనమేంటీ అని.?'
సరే.. మీ ఆవిడ పుణ్యం చేసిందనుకో.. ఆవిడ కోసం ఇంద్రుడూ, వరుణ దేవుడూ కాసుక్కూచునుంటారా.? '
'ఛఛ...
మా ఆవిడ పతివ్రత.!.'
'అంటే..
నువ్వు వెధవ్వన్నమాట.?'
సర్లే.. నువ్వు మరీ పచ్చిగా మాటాడేస్తున్నావు..
స్వర్గం సంగతి పక్కనెడదాం..
పోనీ పాపం చేసి పోయేననుకో.. యమధర్మరాజు నన్ను నూన్లో వేయిస్తాడా.?'
ఇదిగో తినండర్రా అంటూ నిన్ను తలో పీసూ కింకరులకివ్వడానికి నువ్వేమీ మేక మటనూ కాదు.. కోడి చికినూ కాదు కదా..'
'అంటే వేయించడంటావా.?'
'ఆ యముడు గారేమైనా వంటల మేస్టరా.?
చచ్చి ఒచ్చినాళ్ళందరినీ వేయించడానికి.?
అయినా పాపులందర్నీ వేయించడానికి సరిపడా నూనె సప్లై చెయ్యడానికి.. పైనేమైనా నూనె సముద్రముందా.?'
'అంటే.. స్వర్గం, నరకం లేవంటావు.?'
'ఎందుకు లేవూ.?.
స్వర్గం, నరకం చస్తే ఉండవు. బతికుండగానే ఉంటాయి....
ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా,
నీ పని నువ్వు చేసుకున్నావనుకో..
ఆ రాత్రి హాయిగా నిద్దరడుతుంది.. అది స్వర్గం..
అలాక్కాకుండా ఎవర్నో ఏదో ఇబ్బందెట్టాలనే ఎదవాలోచన చేసేవనుకో.!...
అదే ఆలోచన నిన్ను నిద్దర్లో కూడా తినేస్తుంది.. అది నరకం.😬
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
Moon nd the Lake
- #PureHeart.💫
(- Anonymous Author)
ఆకాశం నలుపైనా చందమామ తెలుపైనా నిత్యం కలుస్తూనే ఉంటారు!
ప్రశాంత సరస్సు వినిపించని గుసగుసలతో చంద్రుడిని తనలో దాచుకుంటుంది
చంద్రుడు తళతళలాడుతూ వెలుగుని
జగమంతా నింపుతాడు!
చెరువు గుండెను తడుతూ పిల్లగాలులు వీస్తాయి
చెరువు మధ్యలో దాగిన జాబిల్లి చెక్కులను ముద్దాడుతూ!
అల్లరి గాలి చిలిపి తాకిడులకి పులకిస్తూ చెరువు ఊగుతుంది
చెరువు గుండెల్లో దాగిన చంద్రుడు అలల ఊపులకి చెదురుతాడు!
గువ్వలు గుసగుసలాపి రాగాలు అందుకుంటాయి
ఆకుల గలగలలు వాయులీనాలు పక్కవాద్యాలుగా!
జలచరాలన్నీ తమ గొంతులనూ కలుపుతాయి ఆ ప్రేమగీతానికి!
చెరువమ్మ ప్రేమంతా తనకేనని ఆనందంగా జాబిల్లి
చెరువు కౌగిట్లో తలదాచుకుంటాడు
కానీ, అతడికి తెలుసు...
మాములుగా ఈ శ్లోకం అర్థాన్ని చూస్తే అది పూర్ణం, ఇదీ పూర్ణమే, పూర్ణం నుండి పూర్ణం ఉద్భవిస్తుంది.
పూర్ణం నుండి పూర్ణం తీసివేసినా పూర్ణమేమిగులుతుంది ఇది భగవంతుని పూర్ణ తత్వాన్ని చెప్పే శ్లోకం.
భగవంతుని నుండి ఈ ప్రపంచమంతా ఉద్భవించినా ఆయన యొక్క పూర్ణత్వానికి ఏ లోటు లేదని చెపుతుంది. కానీ ఈ శ్లోకం మామూలుగా మనకు అర్థం చేసుకోవటం కొంచం కష్టం.
ఒక దీపాన్ని తీసుకుంటే. ఆ దీపం నుండి ఎన్ని దీపాలైనా వెలిగించు కోవచ్చు. ఒక దీపం నుండి ఇలా వెలిగించబడిన మిగిలిన దీపాలు కూడా అంతే కాంతిని కల్గిఉంటాయి. కానీ ఇలా ఎన్ని దీపాలు వెలిగించినా మొదటి దీపానికి వచ్చే ఇబ్బంది లోపం ఏదీ లేదు. అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది
అందరికి చేతులెత్తి దండం పెట్ట కూడదా?🙏🏻
నమస్కారం…భారతీయ సంస్కారం. కాదు, సంస్కృతిలో భాగం. ఇది ఒక గౌరవసూచకం. మనషులందరిలోనూ దైవత్వము ఉంటుందని హిందువులు నమ్ముతారు.దీనినే ఆత్మ అంటారు. నమస్కారం పెట్టడం అంటే మన ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను గుర్తించి దానికి విధేయత ప్రకటించడం
కానీ, ప్రతి నమస్కరానికి ఒక విధానం ఉంది. అందరికీ చేతులెత్తి దండం పెట్ట కూడదట. ఎవరికీ ఏ విధంగా నమస్కారం చేయాలి అనే అంశాలను పరిశీలిద్దాం
- తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా
ఆ పరమాత్మకు నిత్యం నమస్కారం చేస్తాం.
- దేవుళ్లకు చేసే నమస్కారాలు ఒక విధంగా ఉంటాయి
గౌరవపూర్వకంగా మనుషులకు చేసే నమస్కారం మరో రకంగా ఉంటుంది. - శివకేశవులకు నమస్కరించేటపుడు తల నుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి. అంటే చేతులెత్తి నమస్కరించాలి హరిహరులకు తప్ప మిగతా దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదు.
గబ్బిలం...ఓ అశుభ సూచకం చాలామందికి. శుభసూచకం చైనా వాళ్ళకి. ఎక్కడనో గుహలలోపల దాగున్నా గుహలబయటి వాతావరణాన్న పసిగట్ట గలిగే నైపుణ్యం దాని ప్రత్యేకత.
వీటిలో ఐదడుగుల పొడవున్న రెక్కలను దుప్పటిగా కప్పుకునే ఫ్లయింగ్ ఫాక్స్ గబ్బిలాలతో కలుపుకొని 950 రకాల గబ్బిలాలున్నాయి ప్రపంచంలో. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా సైన్యం ఈ గబ్బిలాల రెక్కలకు బాంబులను కట్టి ..
సాయం సమయం ఆసన్నమౌతున్న సమయంలో వాటిని విమానాల ద్వారా శత్రువుల భవనాలపై, స్థావరాలపై ఒక్కదుటున జారవిడిచేవారు. అవి చీకటి పడే వేళ రెక్కలు విప్పగానే బాంబులు పేలేవి. అంటే ఆత్మాహుతి దళాలుగా గబ్బిలాలను వాడుకున్నారు.
#ఆరోజుపాఠం లో #శ్లోకం
ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే”
అనే శ్లోకం .
పాఠం చెప్పడం పూర్తైన తర్వాత అందర్నీ పుస్తకం చూసి శ్లోకాన్ని నేర్చుకొమ్మని చెప్పారు గురువుగారు.
కొద్దిసేపటితరువాత నైవేద్యంగూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకువెళ్ళి నేర్చుకున్నావాఅనిఅడిగారు. నేర్చుకున్నానని వెంటనేఅప్పచెప్పాడు శిష్యుడు శ్లోకంసరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు తల అడ్డంగాఆడించారు
దానికి ప్రతిగా శిష్యుడు, పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు.
ఒక #పత్రికకు ఒకాయన ఇలా #ఉత్తరం రాశారు.
" నేను 30 సంవత్సరాల నుండి ప్రతి రోజూ గుడికి వెళ్తున్నాను,
ఈకాలంలో నేను ఒక 3000 మంత్రాలు విన్నాను . ఒక్కటీ గుర్తు లేదు. నేను నా సమయాన్ని వృధా చేసుకున్నాను అనిపిస్తోంది .
గురువులు వారి సేవలు కూడా వృధా అయ్యాయి . అందువలన గుడికి వెళ్ళడం అనవుసరం అని నేను చెబుతున్నా "
లెటర్స్ టు ది ఎడిటర్ -- లో ఈ చర్చ ఒక పెద్ద చర్చగా అనేక వారాల పాటు సాగింది . చివరికి ఒకాయన ఇలా రాశారు
నేను 30 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాను . అప్పటి నుండి ఇప్పటికి మా ఆవిడ 32000 మీల్స్ వండి ఉంటుంది . ఏరోజు ఏమి వండిందో నాకు ఒక్కటీ గుర్తు లేదు . కానీ నాకు ఒకటి తెలుసు .
నేను ఈ రోజు ఇలా ఉండడానికి కారణం ఆ వంటలే ...