వైకుంఠ ఏకాదశి వైశిష్ట్యం.........!!
వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని గురించి ఒక కథ చెప్పబడుతోంది. మహాప్రళయం జరిగింది. ప్రళయానంతరం, నీటి మీద తేలుతున్న విష్ణుభగవానుడు, మరలా సృష్టి చేయడాన్ని గురించి అఆలోచిస్తూండగా, ఆయన ముందు పంచభూతాత్మకమైన (ఆకాశం, అగ్ని, గాలి, నీరు, భూమి)
బ్రహ్మాండం గోచరించింది. అనంతరం ఆయన బొడ్డులో నుండి ఓ తామరపువ్వు ఉద్భావించగా, అందులో బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు. బ్రహ్మకు, విష్ణుభగవానుడు మంత్ర, తంత్ర, శాస్త్రాలను బోధించాడు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిశ్శాస్త్రం అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణువుతో
మొరపెట్టుకోగా, అప్పుడు స్వామి శ్రీరంగనాథుని రూపంలో, తన భార్యలతో, పరివారగణంతో ఓ విమానంలో దర్శనమిచ్చాడు. ఆ విమానం ఓంకార స్వరూపంలో ఉంది. అలా వచ్చిన స్వామి, బ్రహ్మకు జ్యోతిశ్శాస్త్రాన్ని బోధించి, తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు
మానవులు కోలుచుకునేందుకై స్వామిని ఇక్కడే ఉండమని ప్రార్థించగా, స్వామి విమానంతో పాటు విగ్రహాల రూపంలో కొలువైయ్యాడు

కొంతకాలం తరువాత ఆ విగ్రహాల విమానం సూర్యవంశ మూలపురుషుడైన ఇక్ష్వాకునికి బహుమతిగా ఇవ్వబడి, కాలక్రమాన శ్రీరామచంద్రునికి చేరింది. రామావతారాన్ని ముగించే ముందు, శ్రీరాముడు
ఆ విమాన విగ్రహాలను విభీషణుకి ఇచ్చి, తనకు చేసిన సహాయానికి గుర్తుగా తను ఆ విగ్రహాలను ఇస్తున్నట్లుగాను, వాటిని లంకకు తీసుకుని వెళ్ళి పూజాదులు చేయవలసిందిగాను, అయితే లంకకు చేరేవరకు విమానవిగ్రహాలను నేలపై పెట్టరాదని చెప్పాడు. చెప్పలేనంత ఆనందంతో విగ్రహాలను అందుకున్న విభీషణుడు,
లంకాద్వీపానికి బయలు దేరాడు. అయోధ్య నుంచి బయలుదేరిన విభీషణుడు, కావేరినదీ తీరాన్ని చేరుకునేసరికి సంధ్యావందనం చేయాల్సిన సమయమైంది. వెంటనే కావేరీతీరంలో స్నానం చేసి సంధ్య వార్చుకుందామనుకున్నాడు. అయితే విమాన విగ్రహాలను కిందపెట్టకూడదు కదా! ‘ఎలా?!’ అని అటూ ఇటూ చూసిన విభీషణుని
కంట్లో బాలబ్రహ్మచారి కనపడ్డాడు. విభీషణుడు ఆ బాలబ్రహ్మచారిని బ్రతిమాలి, తాను సంధ్య వార్చుకుని వచ్చేంతవరకు విమానాన్ని పట్టుకుని ఉండాల్సిందిగా చెప్పి, సంధ్యవార్చుకునేందుకై వెళ్లాడు. దానిని తీసుకున్న బాల బ్రహ్మచారి కొన్ని ఘడియలు మాత్రమే పట్టుకుంటానని, సమయం మించితే కింద పెట్టేస్తానని
చెప్పాడు. అలాగే విభీషణుడు తిరిగి వచ్చేసరికి సమయం మించిపోవడంతో బాలబ్రహ్మచారి విమానాన్ని కింద పెట్టేశాడు. అది అక్కడ భూమికి అతుక్కుపోయింది.

ఇంతలో విభీషణుడు పరుగెత్తుకుంటూ రావడాన్ని చూసిన బాలబ్రహ్మచారి అక్కడకు దగ్గరలోని కొండపైనున్న వినాయకుని గుడిలో దాక్కున్నాడు.
కోపంతో వూగిపోయిన విభీషణుడు, వినాయకుని గుడిలోకి వెళ్ళి, ఆ బాలబ్రహ్మచారి తలపై గట్టిగా ఒక్క మొట్టికాయ వేశాడు. ఆ దెబ్బకు బ్రహ్మచారి తలపై సొట్ట పడింది. ఇంతకీ ఆ బాలబ్రహ్మచారి సాక్షాత్తూ వినాయకుడే. ఇప్పటికీ వినాయకుని విగ్రహంపై సోట్టను చూడవచ్చు. బాలబ్రహ్మచారి కింద పెట్టిన
విమాన విగ్రహాలు కొలువైన ప్రాంత్రం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందగా, బాలబ్రహ్మచారి దాక్కున్న కోవెల తిరుచ్చిలోని ఉచ్చి పిళ్ళైయార్ కోవెలగా ప్రసిద్ధి చెందింది. వినాయకుడిని తలపై కొట్టిన విభీషణుడు, రంగనాథస్వామి పాదాలపై పడి లంకకు తనతో రమ్మని ప్రాధేయ పడ్డాడు. అయితే స్వామి అందుకు సమ్మతించక,
తాను అక్కడే ఉండిపోనున్నట్లు, సంవత్సరంలో ఒకసారి ఇక్కడకు వచ్చి తనను ఆరాధించ వచ్చని చెబుతాడు. విభీషణుడు స్వామికి ప్రణమిల్లి లంకా నగరానికి వెళ్ళిపోతాడు. ఇప్పటికీ శ్రీరంగం ఆలయంలోని సప్తప్రాకారాల్లోని మొదటి ప్రాకారంలో విభీషణుని ఆలయాన్ని చూడవచ్చు. అప్పట్నుంచి భూలోక వైకుంఠంగా
ప్రసిద్ధి చెందిన శ్రీరంగంలో వైకుంఠ ఏకాదశి ఆత్యంత వైభవంగా జరుపబడుతోంది.

వైష్ణవ దేవాలయాలలో మామూలు రోజులలో అయితే ఉత్తరద్వారాలను మూసి ఉంచుతారు. ముక్కోటి ఏకాదశిరోజున మాత్రం తెరచి ఉంచుతారు. మన రాష్ట్రంలోని తిరుపతి, భద్రాచలం మొదలైన క్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల
రద్దీ విపరీతంగా ఉంటుంది. తిరుపతిలో ఈరోజు శ్రీవారిసన్నిథిన రావత్తు తోడక్కం జరుగుతుంది. నమ్మాళ్వారు విరచితమయిన భగవద్విషయమనబడే దివ్యప్రబంధంలోని నాలుగవ ఆయిరం అధ్యయనం జరుగుతుంది. వేదపారాయణం తోడక్కం తరువాత జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దేవస్థానం చుట్టూవున్న చూళిక ద్వారాలు
తెరుబడుతాయి. భక్తులు ఈ చూళిక నుంచి ప్రదక్షిణలు చేస్తుంటారు.
ఏకాదశిరోజున ఉపవాసాన్ని పాటించాలి. ఈ రోజున ఉపవాసాన్ని పాటించడం వల్ల సూర్య, చంద్రగ్రహణ సమయంలో చేసే దానం, అశ్వమేథయాగం చేసిన ఫలితాలకంటే అధికపలం లభిస్తుంది. ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణం
, అదీ పాటించకలేకపోతే నీరు, పాలు, పండ్లను తీసుకోవచ్చు. అలా కుదరనప్పుడు ఒక్కపొద్దు అంటే, ఒంటిపూట భోజనం చేయవచ్చు. సుఖ సంతోషాలను పంచే పండుగ వైకుంఠ ఏకాదశి.🙏

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with రాధిక

రాధిక Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @Radhikachow99

13 Jan
స్త్రీ వైశిష్ట్యం–
55 ఏళ్ళు అన్నయ్యకు, 50 ఏళ్ళు తమ్ముడికి. అన్నయ్య ఇంటికి తమ్ముడెళ్ళడు, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళడు. ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరితోటే కదా. 55 ఏళ్ళు వస్తే నువ్వు మహా బతికితే 70 ఏళ్లు వచ్చేవరకే. ఆ తరువాత నీవు స్వతంత్రంగా తిరగలేవు. ImageImage
ఆ తరువాత మరో 15 ఏళ్ళు బతుకగలవేమో. అప్పుడప్పడూ వెళ్ళేది లెక్కేసుకున్నా ఈ శరీరం ఉండగా మహా అయితే బహు కొద్దిసార్లు మాత్రమే నీ తమ్ముడింటికి వెళ్ళగలవు. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టుకు చస్తారు? అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడెంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యి చెయ్యి పట్టుకుని, పాత జ్ఞాపకాలు
నెమరేసుకుంటూ సంతోషంగా కలిసి మెలగలేరా... నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా... పోగొట్టుకున్న తరువాత ఏడ్చి ఉపయోగం ఏమిటి ?
రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణ స్వామి, భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకు దింపుతుంటే...
Read 10 tweets
11 Jan
1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు. స్టేట్ ఫస్ట్....!
1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష ... స్టేట్ ఫస్ట్....!
ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే ...మళ్లీ స్టేట్ ఫస్ట్....!
1989 లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తిచేశాడు... బ్యాచ్ ఫస్ట్.....!
అదే ఏడాది 'GATE' పరీక్ష... మళ్లీ ఫస్ట్ రాంక్....!
ఐఏఎస్ పరీక్ష వ్రాశాడు... మళ్లీ ఫస్ట్ ర్యాంక్....!
ఐఏఎస్ శిక్షణలో.... మరోసారి ఫస్ట్....!

ఇన్నేసి ఫస్టులు వచ్చిన వ్యక్తిని అమెరికా ఎర్రతివాచీ పరిచి, గ్రీన్ కార్డు వీసాఇచ్చి, పచ్చజెండాఊపిమరీ మామెసాచుసెట్స్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోచేరమని సీటు ఇచ్చింది!

మరి.... మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే! మనవాడు మాత్రం 'నా చదువుకు నాప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది., ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు! ప్రజలడబ్బంటే పేదల చెమట... వాళ్ల రక్తం...
Read 15 tweets
9 Jan
తిరుమలలో వేంకటేశ్వరుని ఆగ్రహం... ఏం జరిగిందో తెలుసా ..?!!

👉 కలియుగ వేంకటేశ్వరస్వామి ఆగ్రహం చెందడమేంటి.. ఇదెప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారా.. దేవుళ్ళు ఆగ్రహం చెందితే ఏమి చేయగలము..
వారి ఆగ్రహాన్ని ఆపడం మానవ సాధ్యమా.?
అస్సలు సాధ్యం కాదు.
అలాంటి సంఘటనే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో జరిగింది.
👉 క్రీ.శ.1339లో జరిగిన స్వామివారి ఏకమూర్తి విగ్రహాన్ని ( ఉగ్ర శ్రీనివాసమూర్తి ) బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల మాడవీధుల్లో ఊరేగించారట.
అప్పుడు ఒక అపవిత్రమైన ఘటన చోటుచేసుకుందని పురాణాల్లో ఉన్నాయి. మాఢావీధుల్లో
ఒక చిన్న నిప్పు కణికగా ప్రారంభమైన అగ్ని, జ్వాలగా మారి తిరుమల మాఢా వీధుల్లో ఒకమూల అగ్నిగుండంలా ప్రత్యక్షమైందట.
ఆ తరువాత వేగంగా మంటలు విస్తరించాయట. భక్తులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మాఢావీధుల్లోని ఆస్తులను ధ్వంసం చేసేసిందట ఆ అగ్ని.
అప్పుడు అక్కడున్న రాజులు, భక్తులు, పూజారులు,
Read 10 tweets
8 Jan
🙏🌺పెద్ద పండగ వచ్చే నెల ఇదే🌺🙏

🌺ఇల్లంతా అలికి ముగ్గులెట్టుకునే పండగ

రైతుల లోగిళ్లు ఆనందంగా ఉండే నెల ఇదే

దాన్యం ఇంటికి వచ్చే నెల ఇదే

కొత్త లాగు చొక్కా కుట్టించుకొనే పండగ ఇదే

దర్జీ లకు చేతినిండా పని ఇచ్చే పండగ ఇదే

హరిదాసులు వచ్చే నెల ఇదే

అరిసెలు వండుకునే నెల ఇదే ImageImageImageImage
చలి మంటలు వేసుకొనే నెల ఇదే

సెలవులకి ఊర్లు తిరిగే నెల ఇదే

కొత్త సినిమాలు వచ్చే పండగ ఇదే

కోడి పందాలు వేసుకునే పండగ ఇదే

రంగవల్లులు రధం ముగ్గులు వేసుకునే పండగ ఇదే

ఆవు పేడతో గొబ్బమ్మ పెట్టి దానికి ముద్ద బంతి పూలు, కూరగాయలతో అలంకరించే నెల ఇదే🌺

🌺జూదం ఎక్కువ ఆడేది ఈ పండక్కే
అరిసెలు జాడీ లో పెట్టి అటక మీద దాసుకొనే రోజులు ఇవే

పిల్లలకు అంట కత్తెర వేసిన నాయిబ్రాహ్మణులకు అర బస్తా వడ్లు రైతులు ఇచ్చేది ఈ పండక్కే

ఇంటి బట్టలు ఉతికే రజకులకు బస్తా వడ్లు, పిండి వంటలు ఇచ్చేది ఈ పండక్కే

పిల్లలకి బోగిపళ్ళు పొసే నెలే ఇది
Read 4 tweets
7 Jan
నీ గెలుపే మా గెలుపు!
మాళవికా హెగ్డే కేఫ్ కాఫీ డే సిద్దార్థ్ భార్య. కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ ఎం కృష్ణ కూతురు. ఏడు వేల కోట్ల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక సిద్దార్థ్ తిరిగిరాని లోకాలను వెతుక్కుంటూ నీట మునిగాడు. భర్త పోయిన అంతులేని బాధలో, అప్పుల నడిసంద్రంలో
మాళవిక కేఫ్ కాఫీ డే సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. ఎక్కడ మొదలు పెట్టాలో? ఎలా మొదలు పెట్టాలో తెలియని అగమ్యగోచర స్థితిలో మాళవిక ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ మళ్లీ కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో పడింది. ఒకటిన్నర సంవత్సరం తిరగకుండా ఏడు వేల కోట్ల అప్పును మూడున్నర వేల కోట్లకు
తగ్గించగలిగింది. అంటే ఒకటిన్నర సంవత్సరంలో మూడున్నర వేల కోట్లు సంపాదించగలిగింది. ఇదే పనితీరుతో నడిస్తే బహుశా మరో ఒకటిన్నర సంవత్సరంలో మిగిలిన మూడున్నర వేల కోట్ల అప్పు కూడా ఆమె తీర్చేయగలదు. భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తానని, కేఫ్ కాఫీ డే ను లాభాల బాట పట్టించి ఉద్యోగులందరినీ
Read 10 tweets
7 Jan
ఓం నమశ్శివాయ🙏

కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు : వారణాసి వెళ్ళే వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి,సైకిల్ స్వామి ఆశ్రమంలో ఐతే మనిషికి 300నుంచి ఛార్జ్ చేస్తారు,తారక రామ ఆశ్రమంలో ఐతే రూం కి 150నుంచి మన కన్వీనెంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా
మనిషికి 20ఛార్జ్ చేస్తారు మధ్యాహ్నం భోజనం,ఈవెనింగ్ అల్పాహారం ఉంటుంది.
ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఉదయం 6గ" మీరు బయటకి వచ్చి మొదటగా కాల భైరవ స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి వరహి అమ్మ దర్శనానికి వెళ్ళండి ఉదయం 9గంటలలోపే వారాహి అమ్మ దర్శనం ,ఆ తర్వాత అమ్మ దర్శనం ఉండదు
,వారాహి అమ్మ గ్రామ దేవత ,అక్కడ నుంచి విశాలాక్షి అమ్మ గుడి దగరలో ఉంటుంది అమ్మ దర్శనం చేసుకొని ,విశాలాక్షి అమ్మ గుడి దగర నుంచి విశ్వనాథుని గుడికి 2 నిముషాలలో కాలి నడకన వెళ్లొచ్చు ,1వ నంబర్ గేట్ నుంచి వెల్లినట్లైతే సాక్షి గణపతి నీ దర్శించుకోవచ్చు, డుంది గణపతి గుడి లోపల ఉంటుంది ,
Read 14 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Too expensive? Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(