స్త్రీ వైశిష్ట్యం–
55 ఏళ్ళు అన్నయ్యకు, 50 ఏళ్ళు తమ్ముడికి. అన్నయ్య ఇంటికి తమ్ముడెళ్ళడు, తమ్ముడింటికి అన్నయ్య వెళ్ళడు. ఒక్క అమ్మ కడుపున పుట్టిన వాళ్ళమనే భావన ఈ జన్మకు ఆ ఇద్దరితోటే కదా. 55 ఏళ్ళు వస్తే నువ్వు మహా బతికితే 70 ఏళ్లు వచ్చేవరకే. ఆ తరువాత నీవు స్వతంత్రంగా తిరగలేవు.
ఆ తరువాత మరో 15 ఏళ్ళు బతుకగలవేమో. అప్పుడప్పడూ వెళ్ళేది లెక్కేసుకున్నా ఈ శరీరం ఉండగా మహా అయితే బహు కొద్దిసార్లు మాత్రమే నీ తమ్ముడింటికి వెళ్ళగలవు. ఆ మాత్రం దానికి ఎందుకు కొట్టుకు చస్తారు? అన్నదమ్ములిద్దరూ చిన్నప్పుడెంత ప్రేమగా మెలిగారో అలా చెయ్యి చెయ్యి పట్టుకుని, పాత జ్ఞాపకాలు
నెమరేసుకుంటూ సంతోషంగా కలిసి మెలగలేరా... నిజానికి ఏ ఒక్కరి శరీరం పడిపోయినా ఆ బంధం తాలూకు మాధుర్యం జీవితంలో మళ్ళీ వస్తుందా... పోగొట్టుకున్న తరువాత ఏడ్చి ఉపయోగం ఏమిటి ?
రాముడు పుష్పక విమానంలోంచి దిగుతుంటే లక్ష్మణ స్వామి, భరత శత్రుఘ్నులు ఎదురెళ్ళి పాదుకలు తొడిగి కిందకు దింపుతుంటే...
విభీషణుడు పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు...‘‘నా అన్న రావణుడు కూడా మహానుభావుడు. సమస్త శాస్త్రాలను చదువుకున్నవాడు. పది తలలున్నవాడు. ఘోరమైన తపస్సు చేసినవాడు. కాంచన లంకాధిపతి. లోకాలను గడగడలాడించినవాడు. నేనే చంపించేసాను. కుంభకర్ణుడు సామాన్యుడు కాడు. నేనే చంపించేసాను.
అన్నయ్య కనపడితే పాదాల దగ్గర అన్నయ్యా అని నమస్కరిద్దామంటే ఏడీ? అన్నయ్యా! చెప్పులేసుకో అని ఇలా చెప్పులు తీసి అన్నయ్య కాళ్ళదగ్గర పెడదామంటే ఏడీ? చంపించేసాను.’’ అని తలచుకుని ఆవేదన చెందాడు. సుగ్రీవుడు కూడా పక్కకు తిరిగి కళ్ళొత్తుకున్నాడు. ‘‘నా అన్న వాలి.
ఎదుటివారి బలం సగం లాగగలడు.
అప్రమేయ పరాక్రమవంతుడు. నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేయగలడు. అంతటి బలవంతుడు. నేనే ఈ రాముడితోటే బాణం వేయించి చంపేసాను. నాకు అన్న లేడు.. నేనిలా చెప్పులు తొడగలేను. నేనిలా కౌగిలించుకోలేను. అన్నయ్యా! అని చెయ్యివ్వలేను... అన్నను పోగొట్టుకున్న దురదృష్టవంతుణ్ణి’’
అని వేదనా భరితుడయినాడు.
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ చెయ్యి చెయ్యి పట్టుకుని బతికారు జీవితాంతం.. కానీ ఆ గొప్ప వాళ్ళదికాదు. అలా బతకగలిగారంటే.. వాళ్ళు అలా బతికేటట్టుగా మాట్లాడి... బతకడానికి అవకాశమిచ్చిన వారు – శాంతి స్థానంలో ఉన్న వాళ్ళ భార్యలు.
‘‘మీ అన్న రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు... అంటే మీ నాన్న దశరథ మహారాజుగారు వరమడిగారు, వెడుతున్నాడు. మీ వదిన సహధర్మచారిణి కాబట్టి వెడుతోంది.. 14 ఏళ్ళు నువ్వెందుకయ్యా వెళ్ళడం..?’’ అని లక్ష్మణ స్వామి భార్య ఊర్మిళ భర్తను అడగవచ్చు కదా! అడగలేదు. అంటే ఆయన ధర్మాత్ముడు.. అన్నగారి కోసం
వెళ్ళిపోయాడు. అటువంటి భర్తకన్నా నాకేం కావాలి ?’’ అనుకుని ఊర్మిళ ప్రశ్నించలేదు.
ఆ నలుగురు అన్నదమ్ములు అలా సఖ్యతతో ఉండడానికి కారణం సీతమ్మ, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి సహకరించడం. స్త్రీ తాను ఎంత శక్తిమంతురాలో తెలుసుకోవడం ఒక ఎత్తు, అది తెలుసుకున్న తరువాత తన కుటుంబ శాంతి కోసం
శీలవైభవాన్ని పొందడం ఒక ఎత్తు. అది ఆచరణాత్మకమైన నాడు పదిమంది ప్రశాంతంగా జీవనం చెయ్యగలిగిన అవకాశం కలుగుతుంది.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు.
(సేకరణ)
జై శ్రీరామ్
🙏సర్వేజనా సుఖినోభావంత్🙏
• • •
Missing some Tweet in this thread? You can try to
force a refresh
వైకుంఠ ఏకాదశి వైశిష్ట్యం.........!!
వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని గురించి ఒక కథ చెప్పబడుతోంది. మహాప్రళయం జరిగింది. ప్రళయానంతరం, నీటి మీద తేలుతున్న విష్ణుభగవానుడు, మరలా సృష్టి చేయడాన్ని గురించి అఆలోచిస్తూండగా, ఆయన ముందు పంచభూతాత్మకమైన (ఆకాశం, అగ్ని, గాలి, నీరు, భూమి)
బ్రహ్మాండం గోచరించింది. అనంతరం ఆయన బొడ్డులో నుండి ఓ తామరపువ్వు ఉద్భావించగా, అందులో బ్రహ్మ ఆసీనుడై ఉన్నాడు. బ్రహ్మకు, విష్ణుభగవానుడు మంత్ర, తంత్ర, శాస్త్రాలను బోధించాడు. బ్రహ్మకు అన్ని శాస్త్రాలు అర్థమైనప్పటికీ జ్యోతిశ్శాస్త్రం అర్థం కాలేదు. ఈ విషయాన్ని బ్రహ్మ విష్ణువుతో
మొరపెట్టుకోగా, అప్పుడు స్వామి శ్రీరంగనాథుని రూపంలో, తన భార్యలతో, పరివారగణంతో ఓ విమానంలో దర్శనమిచ్చాడు. ఆ విమానం ఓంకార స్వరూపంలో ఉంది. అలా వచ్చిన స్వామి, బ్రహ్మకు జ్యోతిశ్శాస్త్రాన్ని బోధించి, తిరిగి వైకుంఠానికి వెళ్లేందుకు సమాయత్తమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు
1983లో ఆ కుర్రాడు పదో తరగతి పరీక్ష వ్రాశాడు. స్టేట్ ఫస్ట్....!
1985 లో ఇంటర్మీడియట్ పరీక్ష ... స్టేట్ ఫస్ట్....!
ఐఐటి ఎంట్రన్స్ పరీక్ష వ్రాస్తే ...మళ్లీ స్టేట్ ఫస్ట్....!
1989 లో చెన్నై ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్సు కోర్సు పూర్తిచేశాడు... బ్యాచ్ ఫస్ట్.....!
అదే ఏడాది 'GATE' పరీక్ష... మళ్లీ ఫస్ట్ రాంక్....!
ఐఏఎస్ పరీక్ష వ్రాశాడు... మళ్లీ ఫస్ట్ ర్యాంక్....!
ఐఏఎస్ శిక్షణలో.... మరోసారి ఫస్ట్....!
ఇన్నేసి ఫస్టులు వచ్చిన వ్యక్తిని అమెరికా ఎర్రతివాచీ పరిచి, గ్రీన్ కార్డు వీసాఇచ్చి, పచ్చజెండాఊపిమరీ మామెసాచుసెట్స్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోచేరమని సీటు ఇచ్చింది!
మరి.... మామూలు వాడైతే ఎగిరి గంతేసేవాడే! మనవాడు మాత్రం 'నా చదువుకు నాప్రభుత్వం డబ్బు ఖర్చు చేసింది., ప్రభుత్వం డబ్బంటే ప్రజల డబ్బు! ప్రజలడబ్బంటే పేదల చెమట... వాళ్ల రక్తం...
👉 కలియుగ వేంకటేశ్వరస్వామి ఆగ్రహం చెందడమేంటి.. ఇదెప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారా.. దేవుళ్ళు ఆగ్రహం చెందితే ఏమి చేయగలము..
వారి ఆగ్రహాన్ని ఆపడం మానవ సాధ్యమా.?
అస్సలు సాధ్యం కాదు.
అలాంటి సంఘటనే పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో జరిగింది.
👉 క్రీ.శ.1339లో జరిగిన స్వామివారి ఏకమూర్తి విగ్రహాన్ని ( ఉగ్ర శ్రీనివాసమూర్తి ) బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల మాడవీధుల్లో ఊరేగించారట.
అప్పుడు ఒక అపవిత్రమైన ఘటన చోటుచేసుకుందని పురాణాల్లో ఉన్నాయి. మాఢావీధుల్లో
ఒక చిన్న నిప్పు కణికగా ప్రారంభమైన అగ్ని, జ్వాలగా మారి తిరుమల మాఢా వీధుల్లో ఒకమూల అగ్నిగుండంలా ప్రత్యక్షమైందట.
ఆ తరువాత వేగంగా మంటలు విస్తరించాయట. భక్తులు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మాఢావీధుల్లోని ఆస్తులను ధ్వంసం చేసేసిందట ఆ అగ్ని.
అప్పుడు అక్కడున్న రాజులు, భక్తులు, పూజారులు,
నీ గెలుపే మా గెలుపు!
మాళవికా హెగ్డే కేఫ్ కాఫీ డే సిద్దార్థ్ భార్య. కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎస్ ఎం కృష్ణ కూతురు. ఏడు వేల కోట్ల అప్పు ఎలా తీర్చాలో దిక్కుతోచక సిద్దార్థ్ తిరిగిరాని లోకాలను వెతుక్కుంటూ నీట మునిగాడు. భర్త పోయిన అంతులేని బాధలో, అప్పుల నడిసంద్రంలో
మాళవిక కేఫ్ కాఫీ డే సారథ్య బాధ్యతలు తీసుకున్నారు. ఎక్కడ మొదలు పెట్టాలో? ఎలా మొదలు పెట్టాలో తెలియని అగమ్యగోచర స్థితిలో మాళవిక ఒక్కొక్క ఇటుకను పేరుస్తూ మళ్లీ కాఫీ సామ్రాజ్యాన్ని నిర్మించే పనిలో పడింది. ఒకటిన్నర సంవత్సరం తిరగకుండా ఏడు వేల కోట్ల అప్పును మూడున్నర వేల కోట్లకు
తగ్గించగలిగింది. అంటే ఒకటిన్నర సంవత్సరంలో మూడున్నర వేల కోట్లు సంపాదించగలిగింది. ఇదే పనితీరుతో నడిస్తే బహుశా మరో ఒకటిన్నర సంవత్సరంలో మిగిలిన మూడున్నర వేల కోట్ల అప్పు కూడా ఆమె తీర్చేయగలదు. భర్త సిద్దార్థ్ కలలను నిజం చేస్తానని, కేఫ్ కాఫీ డే ను లాభాల బాట పట్టించి ఉద్యోగులందరినీ
కొత్తగా వారణాసి వెళ్లేవారికి సూచనలు : వారణాసి వెళ్ళే వాళ్ళు ట్రైన్ దిగిన తర్వాత ఆంధ్ర ఆశ్రమాలు చాలా ఉన్నాయి,సైకిల్ స్వామి ఆశ్రమంలో ఐతే మనిషికి 300నుంచి ఛార్జ్ చేస్తారు,తారక రామ ఆశ్రమంలో ఐతే రూం కి 150నుంచి మన కన్వీనెంట్ బట్టి ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా
మనిషికి 20ఛార్జ్ చేస్తారు మధ్యాహ్నం భోజనం,ఈవెనింగ్ అల్పాహారం ఉంటుంది.
ఆశ్రమానికి వెళ్లిన తర్వాత ఉదయం 6గ" మీరు బయటకి వచ్చి మొదటగా కాల భైరవ స్వామి దర్శనం చేసుకొని అక్కడ నుంచి వరహి అమ్మ దర్శనానికి వెళ్ళండి ఉదయం 9గంటలలోపే వారాహి అమ్మ దర్శనం ,ఆ తర్వాత అమ్మ దర్శనం ఉండదు
,వారాహి అమ్మ గ్రామ దేవత ,అక్కడ నుంచి విశాలాక్షి అమ్మ గుడి దగరలో ఉంటుంది అమ్మ దర్శనం చేసుకొని ,విశాలాక్షి అమ్మ గుడి దగర నుంచి విశ్వనాథుని గుడికి 2 నిముషాలలో కాలి నడకన వెళ్లొచ్చు ,1వ నంబర్ గేట్ నుంచి వెల్లినట్లైతే సాక్షి గణపతి నీ దర్శించుకోవచ్చు, డుంది గణపతి గుడి లోపల ఉంటుంది ,