రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకైక అదిశకంర పీఠం కడప జిల్లాలోని పుష్పగిరి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయ సముదాయం పుష్పగిరి. శైవమత కేంద్రంగా, నివృత్తి సంగమంగా, హరిహర క్షేత్రంగా, అదిశంకర పీఠంగా వెలసిల్లిన పుష్పగిరి
ఒకప్పుడు నిత్యం వేదపారాయణంతో మారుమోరోగిన అగ్రహారం. ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర చరిత్రలోనూ, శ్రీ పోతులూరి వీరబ్రహేంద్ర స్వామి జీవిత చరిత్రలోనూ పుష్పగిరి అగ్రహారం ప్రస్తావన ఉంది.
వీరబ్రహేంద్ర స్వామి తన ప్రియశిష్యుడు సిద్దయ్య తో కలిసి పుష్పగిరి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని అవహేళన చేసిన పుష్పగిరి బ్రాహ్మణులు స్వామివారి ఆగ్రహానికి లోనయ్యి, వారి ఇళ్లు తగలబడ్డ తరువాత తమ తప్పు తెలుసుకుని స్వామికి శిష్యులుగా మారినట్టు బ్రహ్మంగారి చరిత్ర చెబుతుంది.
"పుష్పగిరి పుణ్యక్షేత్రం. స్మార్త పీఠాధిపతి అయిన పుష్పగిరి స్వాములవారు అక్కడ నివాసం చేయుచున్నారు. 18 బ్రాహ్మణ గృహములు ఉన్నవి. అక్కడి బ్రాహ్మణులు కొంత వేదాంత విచారణ గలవారుగా కనబడుతున్నారు" అని పుష్పగిరి అగ్రహారాన్ని / క్షేత్రాన్ని కాశీయాత్ర చరిత్ర లో ఏనుగుల వీరాస్వామి వర్ణించారు.
అయితే పుష్పగిరి మొదటినుండి అగ్రహారం కాదు. శ్రీకృష్ణదేవరాయలు పుష్పగిరి వద్ద గోటూరు(పుష్పగిరి సమీపంలోని గ్రామం) అగ్రహారీకులకు మరొక అగ్రహారం ఏర్పాటు చేశాడు. కృష్ణదేవరాయలు పుష్పగిరిలో బ్రాహ్మణ అగ్రహారం ఏర్పరచడం వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది.
ఒకనాడు శ్రీకృష్ణదేవరాయలు పుష్పగిరిని దర్శించి అక్కడ పంచ నదీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించి, స్వామివారిని సేవించాలని మందీ మార్బలంతో ఆ క్షేత్రం చేరుకున్నాడు. పుష్పగిరి అనాదిగా సుప్రసిద్ధ శైవ క్షేత్రం. అక్కడ ఆలయంలో అర్చకత్వం బ్రాహ్మణులు కాక తంబళ కులస్థులు(శివార్చన వారి వృత్తి) ఉండేవారు
ఈ తంబళ కులస్థులు కూడా బ్రాహ్మణులతో సమానంగా
సంధ్యావందనం, అనుష్టానములు వంటి ఆచారవ్యవహారాలు అన్నీ నియమనిష్ఠలతో పాటిస్తూ ఉండేవారు. పరిచస్తులకు తప్ప అన్యులంతా వీరు బ్రహ్మణులే అన్నట్టు వారి నడవడిక ఉండేది. కృష్ణదేవరాయలు పుష్పగిరిని దర్శించినపుడు
తక్కినవారి వలనే తంబళ వారు బ్రాహ్మణులు అని తలచి వారికి నమస్కరించాడు. అప్పుడు వారు 'ఈశ్వరార్పణము', 'మీకు అష్టైశ్వర్యాలు ఆ శివుడు సదా ఆనుగ్రహించు గాక అని ఆశీర్వదించారు'. సాధారణ బ్రాహ్మణుల దీవెనెలకి భిన్నంగా వీరి ఆశీర్వచనాలు ఉండటంతో, కృష్ణదేవరాయలు వారి గురించి ఆరా తీయగా
వారు బ్రాహ్మణులు కాదని, తంబళ జాతి వారు అని తెలిసింది. చక్రవర్తి నమస్కారానికి తాము అర్హులం కాకపోయినప్పటికీ, చక్రవర్తి నమస్కారాన్ని స్వీకరించటమే కాక, తమ అసలు కులాన్ని దాచిపెట్టి, బ్రాహ్మణుల మాదిరి తమను నమ్మింపచేసినందుకు శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహించి వారిని తగు విధంగా శిక్షించాడు.
పుష్పగిరిలో బ్రాహ్మణ అగ్రహారము ఏర్పరిస్తే బ్రాహ్మణులు పూజాపునస్కారాలతో పాటు ఆ క్షేత్రమందే వేదపారాయణం కూడా చేసుకుంటూ ఉంటారని తలచాడు. పుష్పగిరిలో దేవతామూర్తులను దర్శించి, పుష్పగిరి ఆలయానికి భూరి విరాళాలు ఇచ్చి సమీపంలోని గోటూరికి వచ్చి,
అక్కడి అగ్రహారీకులతో మీకు పుష్పగిరి వద్ద పెన్నా తీరంలో సర్వమాన్య అగ్రహారం ఏర్పరిచి ఇస్తున్నాము, గోటూరు అగ్రహారం మరియు పుష్పగిరి అగ్రహారం రెండూ అనుభవించుకోమని వారికి ధారాదత్తము చేసినాడు. అలా శ్రీకృష్ణదేవరాయల ఆగ్రహం నుండి పుష్పగిరి అగ్రహారం పుట్టింది.
శాలివాహన శకం 1436 భావ నామ సంవత్సరం చైత్ర శుక్ల పాడ్యమి (CE 1514 మార్చి 17) పుష్పగిరిలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం లోని ఒక స్తంభం పై శ్రీ కృష్ణదేవరాయలు వేయించిన శిలాశాసనం - పుష్పగిరి శ్రీ చెన్నకేశవస్వామి పూజాపునస్కార, నైవేద్యాల నిమిత్తం ములికినడులోని, చెన్నూరు సీమలో ఉన్న
చినమాంచుపల్లి (కడప సమీపంలోని చిన్నమాసుపల్లి)అన్న ఊరును రాయలు దానంగా ఇచ్చినట్టు తెలుపుతుంది. బహుశా అప్పుడే గోటూరి అగ్రహారీకులకి పుష్పగిరి అగ్రహారాన్ని శ్రీకృష్ణదేవరాయలు సర్వమాన్యముగా ఇచ్చి ఉండవచ్చు.
Sources:
Inscriptions of Andhra Pradesh - Cuddapah District - Volume II (Edited by Dr. PV Parabrahma Sastry)
Further Sources of Vijayanagara History - K.A. Nilakanta Sastry - హనుమద్గుండం కైఫీయత్తు
కంబదూరులోని కళ్యాణి చాళుక్య చక్రవర్తి నాలుగవ సోమేశ్వరుడి శాసనం
Sōmēśvara IV inscription from Kambaduru, Anantapur District, Andhra Pradesh
This inscription is found near the Akkamma temple in the village Kambaduru, Anantapur district, Andhra Pradesh.
It is written in Kannaḍa language and characters, dated in Śaka 1108, Viśvāvasu, Chaitra Śu 15, Monday (Irregular) = 1186 C.E. April 5, (However the week day was Saturday)
Records the gift of 6 Khanduga _ of wet land to the god Kamblēśvara of Kambadahola after laving the feet
of Yogiramadeva of Rumam, on the occasion of lunar eclipse by mahāmaṇḍalēśvara Tribhuvana Malla Bhōgadēva Cholamahārāja ruling from Henjēṛu under the Kalyāni Chālukya king Sōmēśvara IV.
విజయనగర సామ్రాజ్యాన్ని బుక్కరాయలు పాలించే కాలంలో నేటి నంద్యాల జిల్లా నందవరం గ్రామంలో నందవరీక బ్రాహ్మణ దంపతులు అయిన శింగప్ప, మేళమ్మ దంపతులకు నందవరం చౌడేశ్వరీ దేవి కృప చేత ఒక మగశిశువు జన్మించాడు. ఆ దంపతులకు చిక్కప్ప అని పేరు పెట్టారు.
ఆ బాలుడికి అయిదు సంవత్సరాల వయస్సు వచ్చే నాటికి శింగప్ప మరణించడంతో, నందవరంలో జీవనోపాది లేక చిక్కప్పను తీసుకుని మేళమ్మ విజయనగర రాజధాని హంపి చేరుకుంది. బాల చిక్కప్ప ఒకనాడు పంపా తీరంలోని కోదండరామ స్వామి ఆలయం సమీపంలో ఒక మర్రిచెట్టు వద్ద ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడే నిద్రకు ఉపక్రమించాడు.
ఆ మర్రిచెట్టు పక్కనే ఒక పాము పుట్ట ఉండేది. ఆ పుట్టలోని పాము బయటకు వచ్చి నిదురిస్తున్న చిక్కప్ప ముఖంపై ఎండ పడుతుండటంతో తన పడగను అడ్డుపెట్టి ఎండ పడకుండా ఆపింది. అటుగా వెళ్తోన్న పాములు అందించే నాగజోగి అనే వాడు ఈ దృశ్యం చూసి ఈ బాలుడు భవిష్యత్తులో గొప్పవాడు అవుతాడు అని తలచాడు.
ఈ ఫోటోలోని వ్యక్తి ముండ్లూరి గంగప్ప గారు. బళ్ళారి నియోజకవర్గం నుండి 1952లో మద్రాసు శాసనసభకు ఎన్నికయినవారు.
బళ్ళారిని మైసూరు రాష్ట్రంలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
1955లో మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ (ఫజల్ అలీ కమీషన్) బళ్లారిని, తుంగభద్రా
ప్రాజెక్టును ఆంధ్రాలో (సీమలో) కాలపాలని చెప్పినప్పటికీ నాటి కేంద్ర ప్రభుత్వం ఆ సిఫార్సును అంగీకరించక బళ్లారిని మైసూరు రాష్ట్రంలోనే కొనసాగించాలని నిర్ణయించడంతో, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బళ్ళారిని ఆంధ్రాలో కలపాలి అనే నినాదం మీద ఉపఎన్నికలకు వెళ్ళారు
ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ పాల్గొనలేదు. బళ్ళారిలో ఆంధ్రుల అభ్యర్థిగా గంగప్ప గారు, కన్నడిగుల అభ్యర్థిగా HS గౌడ తలపడ్డారు.
హోరాహోరీగా సాగిన ఆ ఎన్నికలలో గౌడగారికి 31708
వోట్లు రాగా, గంగప్ప గారికి 28917 ఓట్లు రాగా, స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో ఆంధ్రుల అభ్యర్థి గంగప్పగారు ఓడిపోయారు.