రాయలసీమలోని ప్రముఖ పట్టణాలలో అతి నూతనమైన పట్టణాలలో ఒకటి హిందూపురం (పుట్టపర్తి కూడా ఆ కోవలోకే వస్తుంది). హిందూపురం ఏర్పడేకంటే ముందు అక్కడ 'సూగూరు' అనే ఊరు ఉండేది. 18వ శతాబ్దంలో మరాఠా సర్దారు మురారి రావు గుత్తి కోట నుండి పరిపాలన చేసే కాలంలో,
వారికి, మైసూరు సుల్తానులకు నిత్యం యుద్ధాలు జరిగేవి. రాజ్యరక్షణకు, మైసూరు సుల్తానులను ఎదుర్కొనేందుకు మురారి రావు తండ్రి సిద్ధోజి నేతృత్వంలో పెద్ద సైనిక పటాలంతో ఈ సూగూరు పరిసరాల్లో చాలా కాలం ఉండేదట. సైనికులకు అవసరమైన సేవలు అందించేందుకు అనేక వృత్తుల వారు కూడా సూగూరుకు వచ్చి ఉండేవారు
సిద్ధోజీ, అతని సైన్యం సూగూరును వదిలిపెట్టి వెళ్లినా, వారు అక్కడే స్థిరపడినారు. తరువాత గుంతకల్ - బెంగళూరు రైల్వే లైను హిందూపురం మీదుగా వెళ్లడం వల్ల, బెంగుళూరుకు సమీపంగా ఉండటం వల్ల, కాలక్రమేణా హిందూపురం / సూగూరు వాణిజ్య కేంద్రంగా ఎదిగి, పెద్ద పట్టణం అయ్యింది.
సిద్ధోజీ కే 'హిందూ రావు' అనే మరో పేరు ఉండేది. ఆయన పేరు మీదనే సూగూరు వద్ద వెలసిన కొత్త పట్టణం హిందూపురంగా పిలువబడింది.
నేటికీ హిందూపురం పెద్దచెరువును ప్రజలు సూగూరు చెరువు అని, అక్కడ వెలసిన ఆంజనేయస్వామిని సూగూరు ఆంజనేయుడు అని పిలుచుకుంటున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఏకైక అదిశకంర పీఠం కడప జిల్లాలోని పుష్పగిరి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయ సముదాయం పుష్పగిరి. శైవమత కేంద్రంగా, నివృత్తి సంగమంగా, హరిహర క్షేత్రంగా, అదిశంకర పీఠంగా వెలసిల్లిన పుష్పగిరి
ఒకప్పుడు నిత్యం వేదపారాయణంతో మారుమోరోగిన అగ్రహారం. ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్ర చరిత్రలోనూ, శ్రీ పోతులూరి వీరబ్రహేంద్ర స్వామి జీవిత చరిత్రలోనూ పుష్పగిరి అగ్రహారం ప్రస్తావన ఉంది.
వీరబ్రహేంద్ర స్వామి తన ప్రియశిష్యుడు సిద్దయ్య తో కలిసి పుష్పగిరి మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు వారిని అవహేళన చేసిన పుష్పగిరి బ్రాహ్మణులు స్వామివారి ఆగ్రహానికి లోనయ్యి, వారి ఇళ్లు తగలబడ్డ తరువాత తమ తప్పు తెలుసుకుని స్వామికి శిష్యులుగా మారినట్టు బ్రహ్మంగారి చరిత్ర చెబుతుంది.
కంబదూరులోని కళ్యాణి చాళుక్య చక్రవర్తి నాలుగవ సోమేశ్వరుడి శాసనం
Sōmēśvara IV inscription from Kambaduru, Anantapur District, Andhra Pradesh
This inscription is found near the Akkamma temple in the village Kambaduru, Anantapur district, Andhra Pradesh.
It is written in Kannaḍa language and characters, dated in Śaka 1108, Viśvāvasu, Chaitra Śu 15, Monday (Irregular) = 1186 C.E. April 5, (However the week day was Saturday)
Records the gift of 6 Khanduga _ of wet land to the god Kamblēśvara of Kambadahola after laving the feet
of Yogiramadeva of Rumam, on the occasion of lunar eclipse by mahāmaṇḍalēśvara Tribhuvana Malla Bhōgadēva Cholamahārāja ruling from Henjēṛu under the Kalyāni Chālukya king Sōmēśvara IV.