చందమామ పత్రిక ఎలాగైతే నా చిన్నతనంలో తెలుగు వైపుకు మళ్ళించి, ఊహకు రెక్కలు తొడిగిందో, అలానే కౌమారానికి, యౌవనానికి మధ్య కాలంలో నన్ను తీర్చిదిద్దడంలో ఎంతో పనికివచ్చినది ఈ హాసం పత్రిక. ఈ అక్టోబరుకు హాసం పత్రిక ప్రారంభమై 20 ఏళ్ళు నిండి 21 ఏడు ప్రారంభమైంది.
#అభిరుచి #తెలుగు #పత్రిక Image
ఇది ప్రారంభమైన ఏడాదికి కానీ నాకు పరిచయం కాలేదు. అప్పటికి నేను తొమ్మిదో క్లాసు చదువుతున్నాను. మా తాడేపల్లిగూడంలోని సత్యసాయి సేవాసమితిలో ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూంటే పాల్గొనడానికి వెళ్ళినప్పుడు, అక్కడ మా సీనియర్ ఒక అబ్బాయి (పదో తరగతి అన్నమాట అతను చదివేది) ఎదురుపడ్డాడు.
అతను ఆశ్చర్యపోయాడు నువ్వూ ఇక్కడికి వస్తావా అని. ఆ తర్వాత నన్ను కాసేపు ఇంటర్వ్యూ చేశాడు, ఇష్టమైన సినిమాలు, నచ్చే సంగీతం, పుస్తకాలేమైనా చదివావా అన్న టైపులో. అప్పుడు నాక్కూడా (అతనికి తన టైపు జనం ఉండరని గట్టి నమ్మకం కలిగినట్టుంది)
మంచి టేస్టు ఉందని హాచ్చెర్యపోయి బహుమతిగా ఆ నెల హాసం పత్రిక సంచిక ఇచ్చి, చదివి వారంలో ఇచ్చెయ్యమన్నాడు. చదివి చూస్తే ఇంకేముంది, అది తేనె ఊరే బావిలో దిగడమే అయింది. ఇక లేవలేదు. Image
పాటలు పాడే బాలసుబ్రహ్మణ్యం, విలన్ వేషాలు వేసుకునే తనికెళ్ళ భరణి - ఒకరు బాపు రమణల గురించో, సినిమా పాటల్లో తెలుగు పదాల గురించో రాస్తూ, మరొకరు తేనె సోనల్లాంటి వాక్యాలతో ఎందరో మహానుభావులంటూ సంగీత విద్వాంసులను పరిచయం చేస్తూ పుంభావ సరస్వతుల్లా దర్శనమిచ్చారు. ImageImage
సినిమాలను వెండితెర నవలల్లా సెలబ్రేట్ చేయడం ఎదురయింది. Image
డాక్టర్ డూ లిటిల్ మొదలుకొని వూడ్‌హౌస్ నవలల వరకూ పలు ఆంగ్ల హాస్య క్లాసిక్స్ పరిచయం కావచ్చాయి. ImageImage
తెలిసుననుకున్న బాపురమణల్లోనూ, జంధ్యాలలోనూ పలు కొత్త కోణాలు కనిపించసాగాయి. సాలూరి రాజేశ్వరరావు వంటివారు లెజెండ్సనీ, అది కూడా ఇందుకు లెజెండ్సనీ తెలియవచ్చేది. ImageImageImageImage
నవ్వుటద్దాలు అన్న చక్కని శీర్షికలో ఆచార్య తిరుమల చమత్కారాన్ని పుట్టించే పద్యాలెన్నిటినో ఏరుకువచ్చి గుదిగుచ్చి అందించేవారు. కరాజు కథలు పేరుతో మంచి ఆసక్తికరమైన జానపద కథలను రాసేవారు సింగీతం శ్రీనివాసరావు. ImageImage
పత్రికలో వచ్చే హిందీ పాటల విశేషాలు, కొత్త సినిమా పాటల విశ్లేషణ వంటివన్నీ చాలా బావుండేవి. మా నాన్నగారికి హిందీ పాత పాటలు ఇష్టం. ఈ పత్రికలో ఆ పాటలు చూసి, రాగవరుస తెలియక ఆయనను అడిగితే చాలావరకూ టకీమని పాడి వినిపించగలిగేవారు. Image
ఇది వారపత్రికా కాదు, మాసపత్రికా కాదు. పక్షపత్రిక. 15 రోజులకు ఒకసారి వచ్చేది. చందా కట్టగలిగేవాళ్ళం కాదు. ఏ పక్షానికి ఆ పక్షం, ఊరు మొత్తానికి ఒకే ఒక కిళ్ళీ కొట్టు ఉంటే వెళ్ళి కొని తెచ్చుకునేవాళ్ళం. నేనూ, నాన్నగారూ, మా చెల్లెలూ, మిగతా కుటుంబసభ్యులూ కూడా చదివేవాళ్ళం.
ఒక సంచిక దొరక్కపోతే ఎంతో బాధపడేవాళ్ళం. ఏం మిస్సవుతున్నామో తెలియదు కదా.

హాసం క్లబ్బులు అని వెలిసాయి అక్కడక్కడా, వాటి వివరాలు హాసం పత్రికలో వచ్చేవి. నేనూ మా నాన్నగారూ కలిసి తాడేపల్లిగూడెంలో ఓ హాసం క్లబ్బు నడపాలని (అవును, 10 తరగతి వయసుకే) నాకు ఎంతో ఉండేది. పడలేదు. Image
2004లో ఒక చెడ్డరోజున పత్రిక ఆగిపోతున్నట్టు ప్రకటించారు. నేనూ, నాన్నగారూ, చెల్లాయి, ఇంటిల్లిపాదీ చాలా బాధపడ్డాం. నెలనెలా సంచిక కొన్నా కూడా చందా అంటే ఏడాదికి ఒకేసారి కమిట్ అవడం కదా, నాలాంటివాళ్ళు చందా కట్టకపోవడం వల్లనే ఆగిపోయిందేమో అనిపించేది ఆ చిన్నతనంలో! Image
కానీ, నా రెక్కలు చిన్నవి. నాన్నగారి బాధ్యతలు పెద్దవి. క్రమేపీ, తెలుగువారి నిర్లక్ష్యం వల్లనే ఆగిపోయిందనీ, మరోటనీ అనిపించింది. చాలా చాలా బాధ కలిగింది, ఆ బాధ చాన్నాళ్ళు అలాగే సలిపింది!
హాసం పత్రిక నిర్వహించిన వరప్రసాదరెడ్డి గారు తన తల్లిగారి పేరిట శాంతా బయోటిక్స్ అన్న సంస్థ ద్వారా టీకాలు రూపొందించి తక్కువ ధరకు అందిస్తున్నారనీ, ఆయనే అభిరుచి మేరకు ఈ హాసం నడిపారనీ తెలుసుకున్నాను. నా వరకూ నాకు ఆయన కృష్ణదేవరాయలు, భోజరాజు వంటివారి అంశతో పుట్టినవారు అనిపించేది. Image
తర్వాత ఏడాది వరప్రసాద్ రెడ్డి గారికి పద్మభూషణ్‌ అవార్డు వచ్చిందని వార్తలు చదివి కూడా సంతోషించాను. సంపాదకులు రాజా గారూ, మేనేజింగ్ ఎడిటర్ ఎమ్బీయస్ ప్రసాద్ గారూ వివిధ శీర్షికలు నిర్వహించేవారు. వీరందరినీ ఎంతగానో అభిమానించాను. అబ్దుల్ కలాం నుంచి పద్మభూషణ...హాసం సంపాదకుడు 'మ్యూజికాలజి...హాసం మేనేజింగ్ ఎడిటర్, రచయి...
వరప్రసాద రెడ్డి గారు హాసం పబ్లికేషన్స్ తీసుకువస్తున్నామనీ, ఈ శీర్షికలన్నిటినీ పుస్తకాలుగా వేస్తామనీ రాశారు. ఆ పుస్తకాలను క్రమేపీ కొనుక్కోగలిగాను. కానీ, నా బాధ పోలేదు. ImageImage
హాసం నిలిపివేసిన కొన్నాళ్ళు తమవద్ద ఉన్న హాసం పత్రిక ఆర్కైవ్స్ అన్నిటినీ అమ్ముతామని రాశారు. కొనుక్కోలేకపోయాను. అది చాన్నాళ్ళు నా మనసులో లోటుగానే ఉండిపోయింది.
ఓ పదో పరకో హాసాలు నా దగ్గర ఉండేవి. తోచనప్పుడు, తోచినప్పుడు కూడా తెరిచి చదివి ఆనందించేవాడిని. తర్వాత్తర్వాత హాసం ఆఖరు సంచికలో ఆర్కైవులు అన్నీ అమ్ముతాం, వీపీపీ ద్వారా తెప్పించుకోవచ్చు అన్న ప్రకటన చూసినప్పుడల్లా గుండె కలుక్కుమనేది. ఏదోకటి చేసి అప్పుడే కొనుక్కోవాల్సింది అనిపించేది.
2016-17 కాలంలో మనసున్న మిత్రులు ఒకరి దగ్గర హాసం పత్రికల కాపీలన్నీ కనిపించాయి. ఎవరివి ఇవి అని అడిగాను - "మనవే, మీకు కావాలంటే ఇకనుంచీ మీవే, పట్టుకుపోవచ్చు. కావాలా?" అన్నారు.
"ఇంతకన్నా ఆనందమేమీ.. ఓ రామ రామా" అనుకుని ఆలస్యం అమృతం విషం అన్నారు కదా అని అర నిమిషంలో అన్నీ మూటకట్టేసి, బ్యాగులో పెట్టేసి నమస్కారం చేశాను. అప్పటి నుంచీ నా వద్ద అన్ని హాసాలూ ఉన్నాయన్నమాట. గొప్ప సంతృప్తి కలిగింది.
వరప్రసాదరెడ్డి గారిని అనుమతి అడిగి పీడీఎఫ్‌ రూపంలో ఆర్కైవ్‌.కాంలో హాసం సంచికలన్నీ పెట్టించాడు నాకు తెలిసిన ఒక మిత్రుడు. చాలా ఆనందం కలిగింది. (ఈ లోకోపకారం చేసిన మిత్రుని పేరు చెప్పాలనే ఉంది కానీ ఆయనో కాదో అన్న అనుమానం పీకుతోంది అందుకే చెప్పట్లేదు)
archive.org/details/HasamT…
కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో మ్యూజికాలజిస్టు రాజా గారు పరిచయం అయ్యారు. ఫోన్‌లో గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం. ఆయన Quora తెలుగులో రాయడం ప్రారంభించారు. దురదృష్టవశాత్తూ నా ఆనందం ఎంతో కాలం నిలవలేదు. 2021 ఏప్రిల్లో ఆయన పరమపదించారు.
సంగీతం పట్ల నాకున్న అభిరుచికి లోతు పెంచి, నేను చూడాల్సిన సినిమాల జాబితాను విస్తరించి, చూసినవాటిలో కొత్త కోణాలు చూపించి, మహనీయుల పేర్లు, కృషీ తెలిసేలా చేసిన నిధి హాసం. ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించిన బోలెడంతమంది మహానుభావులను వేలుపెట్టి చూపిన చదువులమ్మ హాసం. Image
అలాంటి హాసం ఆగిపోవడం అప్పట్లో బాధ కలిగినా, వెనుదిరిగి చూస్తే అసలంటూ అది నడవడమూ, నాకు నా సీనియర్ పరిచయం చేయడమూ, నా అభిరుచిని అది పాదుపెట్టి పెంచడమూ తలచుకుంటే ఆనందంగానే ఉంటుంది. జరగని వాటి పట్ల ఆవేదనేనా ఎప్పుడూ, జరిగినదానికి సంతృప్తి కూడా ఉండాలి కదా మనిషికి?! బాపు గారు హాసానికి వేసిన లోగో

• • •

Missing some Tweet in this thread? You can try to force a refresh
 

Keep Current with పవన్ సంతోష్ (Pavan Santhosh)

పవన్ సంతోష్ (Pavan Santhosh) Profile picture

Stay in touch and get notified when new unrolls are available from this author!

Read all threads

This Thread may be Removed Anytime!

PDF

Twitter may remove this content at anytime! Save it as PDF for later use!

Try unrolling a thread yourself!

how to unroll video
  1. Follow @ThreadReaderApp to mention us!

  2. From a Twitter thread mention us with a keyword "unroll"
@threadreaderapp unroll

Practice here first or read more on our help page!

More from @santhoo9

Oct 24
"కించిత్ భోగే భవిష్యతి" అని డాక్టర్ వేమూరి వెంకటేశ్వరరావు గారు ఒక అరవై ఏళ్ల క్రితం రాసిన కథను వి.బి.సౌమ్య గారు ఇంగ్లీష్ లోకి అనువదించారు.
సైన్స్ ఫిక్షన్ + హాస్యం కలగలిసి ఉండడమే కాదు కథలో ఉండే మలువు కోవిడ్ చూసొచ్చిన మనకు గొప్ప ఆశ్చర్యం కలిగిస్తుంది.
Dr. వేమూరి వెంకటేశ్వరరావు గారు తెలుగులో పాపులర్ సైన్స్ విషయంలో చేస్తున్న కృషి అనన్య సామాన్యం. 1960ల్లోనే ఈయన కంప్యూటర్ల గురించి తెలుగులో రాశారంటే నమ్ముతారా? తెలుగులో తెలుగువారు సైన్స్ గురించి చదువుకోవాలి అన్న ఆశయంతో ఎంతో చక్కని ఆసక్తికరమైన పుస్తకాలు రాశారు.
ఈయన రచనా శైలి ఎలా ఉంటుందో మచ్చు కోసం "రామానుజన్ నుండి అటూ ఇటూ" అన్న రచనలో పేజీలు ఇక్కడ పెడుతున్నాను చూడండి:
(ఇది ఎవరైనా పంచుకోగల విధంగా ఆయనతో నేను వికీసోర్సులో పెట్టించిన పుస్తకం) ImageImageImageImage
Read 6 tweets
Oct 9
సినిమా రంగంలో అవసరం తీరగానే మరచిపోతారని, విలువలు ఉండవని ఎందరో చెప్తారు. అయితే, కృతజ్ఞత అన్న పదం తలుచుకున్నప్పుడు నాకు గుర్తుకువచ్చే సంఘటన సినిమా రంగంలోనే జరిగింది. ఎన్టీ రామారావుకు, కె.వి.రెడ్డికి మధ్య జరిగిన ఈ సంఘటన కృతజ్ఞత అన్న పదానికే నిర్వచనంగా నిలిచిపోతుంది.
#NTR
కె.వి.రెడ్డి - అలనాటి సినిమాలు ఇష్టపడేవారికే కాక, మాయాబజార్ దర్శకునిగా చాలామందికి, మహానటి, కథానాయకుడు సినిమాల ద్వారా ఈమధ్య ఇంకొందరికీ ఈయన పేరు, తీరు కొంత తెలుసు.
మాయాబజార్, పాతాళ భైరవి, జగదేక వీరుని కథ వంటి సినిమాలు తీసిన దిగ్దర్శకుడు - కెవి రెడ్డి. తెలుగు సినిమా రంగానికి 1940లు, 50ల్లో స్వర్ణయుగాన్ని చవిచూపించిన బ్యానర్‌లలో అగ్రతాంబూలం అందుకునే వాహినీ, విజయా సంస్థలకు ఆయనొక మూలస్తంభం. ఎందరో రచయితలు, నటులను తెరపై వెలిగించిన వ్యవస్థ ఆయన.
Read 26 tweets
Oct 7
మాయాబజార్ సినిమా అంతటా "CGI లేకుండా ఇదెలా చేశారబ్బా!" అనిపించే వర్క్ కోకొల్లలు. మనకే కాదు, ఆ సినిమాకు అప్రెంటిస్‌గా పనిచేసి, తర్వాత ప్రసిద్ధ దర్శకుడైన సింగీతం శ్రీనివాసరావు గారికి కూడా ఒకటీ అరా సందేహాలు అలానే ఉండిపోయాయట.
అందులో ఒకటి -
కంబళి గింబళి ఎలా అయింది?
2000 మొదట్లో ఈ సందేహం వచ్చిందట సింగీతం గారికి. ఆ సీన్ తీసిన రోజు తనకు వేరే పని అప్పగించి ఉంటారనీ, పోనీ తర్వాత అయినా ఎవరినీ అడిగి తెలుసుకోలేదనీ చాలా గుంజాటన పడిపోయారు. సినిమా దర్శకుడు కె.వి.రెడ్డి గారు, సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ట్‌లే, కళాదర్శకుల్లో ఒకరైన మా.గోఖలే మరణించారు.
మాయాబజార్ సినిమాకు పనిచేసిన కళాదర్శకులు ఇద్దరిలో గోఖలే గారు మరణించినా కళాధర్ గారు ఇంకా అప్పటికి జీవంచే ఉన్నారు. సమయం ఉదయం 6 గంటలు అయింది, చకచకా కళాధర్ గారికి ఫోన్ కలిపారట. "కళాధర్ గారూ! ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండీ. మీరు ఎప్పుడు తీరిగ్గా ఉంటారు." అని అడిగారు సింగీతం గారు.
Read 9 tweets
Aug 6, 2019
కాశ్మీర్ మీద మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకు? ఈనాడు కాశ్మీర్ ఒక ఉగ్రవాద సమస్యగా మారడానికి కారణం నెహ్రూ కాదు, షేక్ అబ్దుల్లా అంతకన్నా కాదు.
ఉత్తరాన మంచు కొండలు మండిపోవడానికి, కాశ్మీరీ పండిట్లు జీవితాలు కోల్పోవడానికి, అంతా జటిలం కావడానికి కారణం..
రాజీవ్ గాంధీ
1/n
1986లో జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం నడిచేది. 1982లో కాశ్మీర్ నాయకుడు షేక్ అబ్దుల్లా చనిపోయాక కొడుకు ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యాడు. రెండేళ్లకు ఫరూక్ బావమరిది (షేక్ అబ్దుల్లా అల్లుడు) గులాం మహమ్మద్ షా దెబ్బవేసి దించి తానే ముఖ్యమంత్రి అయ్యాడు. 2/n
కాశ్మీరులో ఉగ్రవాదం, దక్షిణ కాశ్మీరులో అల్లర్ల కారణంగా 1986లో ప్రభుత్వం పడిపోయింది. 1986-87 గవర్నర్ పాలన సాగింది.
3/n
Read 11 tweets

Did Thread Reader help you today?

Support us! We are indie developers!


This site is made by just two indie developers on a laptop doing marketing, support and development! Read more about the story.

Become a Premium Member ($3/month or $30/year) and get exclusive features!

Become Premium

Don't want to be a Premium member but still want to support us?

Make a small donation by buying us coffee ($5) or help with server cost ($10)

Donate via Paypal

Or Donate anonymously using crypto!

Ethereum

0xfe58350B80634f60Fa6Dc149a72b4DFbc17D341E copy

Bitcoin

3ATGMxNzCUFzxpMCHL5sWSt4DVtS8UqXpi copy

Thank you for your support!

Follow Us on Twitter!

:(